🌿నీరు ఎంతటి మలినాన్నైనా శుభ్రం చేస్తుంది.
ఎలాంటి వాసన అయినా నీటితో పోతుంది.
🌸అలానే శాస్త్రాలు, పురాణములు, కావ్యాలు మున్నగు వాటి అధ్యాయనం ఎంతటి నాస్తికతత్వాన్ని అయినా పోగొట్టి భగవంతుని యందు చెదరని బెదరని విశ్వాసాన్ని ప్రేరేపిస్తాయి.
🌿అజ్ఞానమను చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాయి.
🌸దుర్గుణములతో నిండిన మనో బుద్ధులను సుగుణములతో నింపి, భగవంతుని చెంతకు చేరుకొనుటకు మార్గాన్ని సుగమం చేస్తాయి.
🌿కనుకనే ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేయాలి.
🌸వాటి యందలి సారాన్ని గ్రహించి, ఆచరించాలి. తాము ఆచరిస్తూ మరింత మంది ఆచరించేలా ప్రోత్సహించాలి.
🌿తద్వారా అందరూ తరించాలి. మోక్షమును వరించాలి...🚩🌞🙏
No comments:
Post a Comment