Monday, June 23, 2025

 *యోగా దినోత్సవం రోజు ఫోటోకు ఫోజులు ఇచ్చి, సోషల్ మీడియా ప్రచారానికి మాత్రమే కాకుండా... యోగా అనేది నిత్యజీవితంలో భాగమైపోవాలి.*

*ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు, ఆరోగ్యానికి మూలం యోగా. యోగా అనేది ఐక్యతకు నిదర్శనంగా భావించవచ్చు. ఒకరిని మరొకరితో కలుపుకొని జీవించే వసుదైక కుటుంబానికి నిలువెత్తు నిదర్శనం యోగా సారాంశం. యోగాలోని పలు ఆసనాల వల్ల అనేక లాభాలు మన శరీరానికి, మనసుకు లభిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే "లోక కళ్యాణం కోసమే యోగా" అనుకోవచ్చు. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఓ కళ. ఆ కళకు నిలయం యోగా, యోగాకు పుట్టినిల్లు భారత్, ప్రపంచం మొత్తం కూడా యోగా పరమార్ధాన్ని గ్రహించి ప్రపంచ దేశాలు యోగాను ఆచరించడం ప్రారంభించాయి.* 

*మనిషి తన ప్రయాణం ఎటు వెళ్తున్నప్పటికీ, ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఏది సాధిస్తున్నప్పటికీ యోగా తప్పనిసరి చేసుకుంటే మంచిది. యోగాను ప్రతి ఒక్కరూ నిబద్ధతతో* *అలవాటు చేసుకోవాలి. అదే విధంగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు, స్నేహితులు అందరికీ ప్రచారం చేయాలి. యోగ విశిష్టత వివరించాలి. ఆరోగ్యాన్ని, ఆయుష్షును, ఆనందాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలి.*

*మన శ్వాస మీద ధ్యానం ఉంచి మనసును కేంద్రీకృతం చేసి, శరీరాన్ని మనసును అదుపు పట్టి మేదస్సును పెంచి సాధనం యోగా, రకరకాల ఆసనాలు, ప్రక్రియలు, భంగిమలు శరీరాన్ని విల్లు మాదిరి వంచి నరాలను ఉత్తేజపరిచే ఎన్నో రకాల ఆసనాలు యోగాలో మనకు కనిపిస్తుంటాయి. అందుకే ఉరుకులు పరుగుల జీవితంలో యోగా అనేది తప్పనిసరి మన సనాతన ధర్మం చెబుతున్నటు వంటి విషయం.*

*┅━❀꧁•శ్రీమద్భగవద్గీత•꧂❀━┅*
                      *{గ్రూప్స్}*
        *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍁🧘‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘‍♀️🍁

No comments:

Post a Comment