*SELFLESS LIFE IS IDEAL LIFE!*
*🌺🌼 భగవాన్ ఉవాచ 🌼🌺*
*స్వార్ధ రహితమైనటువంటి సేవకు ముందంజ వేయాలి!*
*వృక్షములు స్వార్ధరహితమైనటువంటి సేవ సలుపుతున్నాయి. తమను మెచ్చుకున్నటువంటి వారు కానీ, తమను ద్వేషించినటువంటి వారు కానీ తమ ఛాయన వచ్చి కూర్చొన్నప్పుడు, చల్లని నీడను అందించి హాయిని చేకూర్చుతున్నవి వృక్షములు. నదులు కూడను స్వార్ధరహితమైనటువంటి సేవలు సలుపుతున్నాయి. గోవులు కూడను స్వార్ధరహితమైనటువంటి యొక్క జీవితాన్ని అందిస్తున్నాయి సమాజమునకు.*
*వృక్షములు, గోవులు, నదులు ఈ మూడునే లేకుండిన, మానవుడు క్షణ కాలమైన కూడను జీవించుటకు వీలుకాదు. స్వార్ధ రహితమైనటువంటి యొక్క జీవుల ద్వారా అనుభవిస్తున్నటువంటి మానవుడు, కేవలము స్వార్ధుడై జీవిస్తున్నాడంటే, ఇది కేవలము మానవత్వానికే ఒక అగౌరము.*
*కనుక మానవుడు అర్జించినటువంటి యొక్క విద్యాధనమును కానీ, ఇంకేవిధమైన ఐశ్వర్యమును* *కానీ, స్వార్ధ రహితమైనటువంటి యొక్క కార్యముల యందు ప్రవేశ పెట్టడం ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం.*
*అధ్యాపకుల యొక్క ఆస్తి విద్య! ఈ విద్యను సక్రమమైన మార్గములో, స్వార్ధ రహితమైనటువంటి భావముతో, జన సంబంధమైనటువంటి యొక్క గుణముల పోషణ నిమిత్తమై, విద్యార్ధుల హృదయాలకు చేర్చడానికి అధ్యాపకులు సంసిధ్ధుడై ఉంటుండాలి.*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment