*గాయత్రి మంత్రం.....*
*జూన్ 06 శుక్రవారం గాయత్రి ఆవిర్భావం సందర్భంగా... `శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా...*
*ఓం భూర్భువస్వః* *తత్సవితుర్వరేణ్యమ్*
*భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్*
*తాత్పర్యం:* ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.
*గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి*
*ఓం =* పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
*భూః =* సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
*భువః =* చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
*స్వః =* ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు)
*తత్ =* అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
*సవితుః =* ఈ సృష్టి కర్త.
*వరేణ్యం =* సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
*భర్గః =* శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
*దేవస్యః =* అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
*ధీమహి =* హ్రుదయాన్తరాలలొ (అత్మలో ఏకమై)
*యః =* ఆ పరమేశ్వరుడు.
*నః ద్యః =* మా బుద్ధులను.
*ప్రచోదయాత్ =* సత్కర్మలయందు ప్రేరేపించి అభ్య్దయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment