Tuesday, September 2, 2025

 *_మాట ఇవ్వడానికి తొందరపడకు.ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు._*

*_మనం మనలాగే ఉండాలి తప్పు లేదు..కానీ మనలాగే ఇతరులు ఉండాలి అనుకోవడమే అసలైన తప్పిదం._*

*_అన్ని నాకు తెలుసు, ఎవరితో నాకు పని లేదు. అని విర్రవీగాకు. నీకు తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంత ఉంటుంది._*

*_నీకు నువ్వే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం నలుగురు గొప్పగా చెప్పుకోవాలి._*

*_మన భావాలే ఇతరులు ఆచరించాలి..అనుసరించాలి..అనుకోవడం సరికాదు..మనకు మనమే కరెక్ట్ అనుకుంటే మనం ఒక్కరిమే మిగులుతాం.._*

*_అందరితో మమేకం కావాలి అనుకుంటే ఇతరుల భావాలను అర్ధం చేసుకోవాలి.స్నేహం లోనైనా..ఇతర ఏ బంధంలోనైన ఇదే వర్తిస్తుంది.._*

*_మన భావాలను ఇతరులపై రుద్దడం వివేకం కాదు..ఎదుటి వారినుండి ఎక్కువ ఆశిస్తే భంగపడతాం..మనం ఎదుటి వారికి అందించింది ఏమిటి అనే ఆలోచిస్తే ప్రశాంతతను పొందుతాం.._*

*_అంగీకరించడం నేర్చుకోగలిగితే ఆనందం మన స్వంతం..ఎదుటి వారి మనసెరిగి మసలుకుంటు మన సిద్ధాంతాలకు రాజీ పడకుండా ఎదుటి వారి మనసును గెలవగలిగితే అదే నిజమైన విజయం..వాళ్లదే నిజమైన వ్యక్తిత్వం.._*

*_మన అన్న వారితోనే కాదు.అందరితోనూ కలసి మెలసి ఉండాలంటే..నీటిలో పంచదారలా కరగాలి మెలగాలి..స్నేహంలోను ఇతర బంధం లోను షరతులు పెట్టి మనసులను గెలవలేం.☝️_*


*_✍️మీ.తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment