Wednesday, July 29, 2026

శివుడి నేషనాలిటీ ఏమిటి..! | Exclusive Interview with Shatavadhani Lalithadithya | Sringeri

Author Name:Reflection Bharat

Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uQiUYXg9SU0



Transcript:
(00:00) భగవత్పాదులు శరీరం వదిలేరు అని చెప్పాను అంతరిహిత అది శివుడి యొక్క రూపం కాబట్టి ఆ రూపం కనబడకుండా అక్కడ వెళ్ళిపోయింది అందుకనే మనకి మాధవ శంకర్ దిగ్విజలో కూడా విద్యాలు ఏం రాశారు వారు అక్కడి వరకు వెళ్ళగా దేవతలందరూ వచ్చి ఇంకా తమ కార్యం అయిపోయింది కదా అవతార కార్యం అయిపోయింది తమరు కైలాసానికి దయచేయండి అన్నప్పుడు మళ్ళీ తన రూపం మార్చుకోండి జటలు త్రినేత్రాలు వ్యాగ్ర చర్మం అటువంటి రూపాన్ని ధరించి నంది మీద బ్రహ్మ చేయుతనివ్వగా నంది వాహనాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళారు అని ఉంది [సంగీతం] స్వామి [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(00:45) అయితే కనకధారా స్తోత్రాన్ని వారు పటించినప్పుడు దాని ద్వారా ఈరోజు సమాజానికి ఏం చెప్పాలి అనే ఉద్దేశంలో వారు చెప్పారు బ్రహ్మచారి గాని యతి గాని ఇంటి ముందుకు వచ్చి భిక్షని అర్థిస్తే ఇంట్లో ఆహార పదార్థం ఉండి ఇవ్వకపోతే ఆ గ్రహస్తుడికి ఘోరమైన పాపం వస్తుంది అని ఓకే కాబట్టి ఇల్లాలో ఉసిరికాయలు ఇచ్చిందంటే ఏమని చెప్ప అర్థం వేరే పదార్థం ఉంటే ఇది ఇవ్వదు గా అంతే కదా అంటే ఇది తప్ప ఇంకేమీ లేదు అయినప్పటికీ అడిగినప్పుడు ఉన్నది ఇచ్చేయాలి అనుకొని తనకేమీ లేకపోయినా కూడా ఆ ఉసిరికాయని ఇచ్చేసింది ఆవిడ ఇల్లో ఇక్కడ ఈ ఇల్లాలు చూపించిన స్వధర్మ నిష్టకి చాలా గొప్ప
(01:17) ఫలితం ఉండాలి మరి ఆ ఫలితమే ఆవిడకి భగవత్పాదుల ద్వారా కనకధార రూపంలో వచ్చింది. అంగం హరే పులక భూషణమాశ్రయంతి [పాడటం] [సంగీతం] శాంకర భాష్యం చదివితే ఉండ ఆరోగ్య సమస్యలు పోతాయా అంటే నీకు ఆరోగ్య సమస్య వచ్చింది నీకు శరీరం రావడం వల్ల అసలు నీకు ఇంకా ఎప్పటికీ శరీర సమస్యలు నీకు రాకూడదు అంటే శంకర భాష చదువు మోక్షానికి తద్వారా ఇంకా అసలు ఆరోగ్య సమస్యలు రావడానికి శరీరం లేని స్థితిని నువ్వు పొందగలవు కాబట్టి మనం ముందు చెప్పుకోవాల్సింది ఏమిటంటే భగవత్పాదులు మోక్షానికి మార్గం వేశరు తాత్కాలిక తేలిపోయింది [సంగీతం] తెలిసిపోయింది తెలియని నిదేదో ఉందని మనసా
(01:55) భగవంతుని [అరుస్తున్న ముఖం] ఏదో ప్రయోజనం కోసం పూజించకుండా జ్ఞానం కోసం లేదా జ్ఞానంతో పూజించినప్పుడు అది పరిపూర్ణమైన భక్తి అనిపించుకుంటుంది కాబట్టి ఆత్మజ్ఞానమే అసలైన భక్తి మాయ [సంగీతం] మాయ మాయ [సంగీతం] కామాత అందరికీ తల్లి ఎవరు ధేను గోమాతే ఈ ప్రపంచానికి మాత [సంగీతం] ఒక మనిషి మనిషిలా బ్రతకడానికి ఒక మనిషి మనిషిలాగా బ్రతకడానికి మనీషి అవ్వడానికి అవ్వడానికి సో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా చూడాలి అర్థం చేసుకోవాలి అండ్ ప్రత్యేకంగా వారి మాటలు విన్న తర్వాత మనం ఏదో అర్థం చేసుకోవాలి అని ఉండదు ఇంకా డైరెక్ట్ గా ఆ మాటలు అర్థమైపోతాయి సో
(02:39) అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కాబట్టి మీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి పెద్ద సంఖ్యలో పెద్ద స్థాయిలో అవసరం నాకు ఇష్టదేవ నరసింహ స్వామి భగవత్పాదులు అన్నీ కూడా విష్ణువేండి [నవ్వు] నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోగ్ దేశపతి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో గతంలో మనం మన అదృష్టవశాత్తు ఒక ఇంటర్వ్యూ కూడా మనం చేసాం వీరితో ఆ ఇంటర్వ్యూను చాలా మంది చూశారు చాలా పెద్ద సంఖ్యలో అయితే చూసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా దీని పైన అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఒక సిరీస్ చేస్తాను అన్నారు అప్పుడు
(03:18) లేదా కొన్ని ఇంటర్వూ చేస్తాను అన్నారు ఏంటి ఇప్పటికి ఆరు నెలలు ఎనిమిది నెలలు దాటిపోతుంది ఇప్పటివరకు మళ్ళీ ఇంటర్వ్యూ రాలేదు అన్నారు. అంటే సిరీస్ చేస్తాము అన్న వారికి ఉండేటటువంటి షెడ్యూల్ ని బట్టి సంవత్సరానికి ఒక ఎపిసోడ్ మనం చేసినా కూడా సిరీస్ చేసినట్టే ఎందుకంటే నిజంగా చెప్తున్నాను ఈ దేశం నాది అని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు.
(03:40) అండ్ ఈ దేశం కోసం బ్రతకాలి అనుకునే వాళ్ళు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటారు. అండ్ ఈ దేశం కోసం ధర్మం బాగుండాలి ఈ దేశం కోసమే కాదు లోకా సమస్త సుఖినోభవంతు ఈ విశ్వమంతా చల్లగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే నా సనాతన ధర్మం అద్భుతంగా ఉండాలి దాన్ని గ్రౌండ్ లెవెల్ లో ప్రతి ఒక్కరికి చేర్చాలి అనేటటువంటి తపనతో నేను అనేటటువంటి భావనని పక్కన పెట్టి నేను అంటే నేను కాదు నేను అంటే మనం అనేటటువంటి స్థితిలోకి రావాలంటే ఎంతో తపస్సు కావాలి ఎంతో సాధన కావాలి దాని గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రకంగా వారు నేను అంటే అంటే ఈ సమాజము అని ప్రతి క్షణం ఆ
(04:16) ప్రయత్నిస్తూనే ఉన్నారు పని చేస్తూనే ఉన్నారు ఆ శంకరుల వారి వారసత్వాన్ని చాలా అద్భుతమైనటువంటి స్థితిలో మనందరికీ కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు వారి లలితాదిత్య గారు అయ్యా నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారు స్వామి బ్రహ్మాండంగా ఉన్నారు అండ్ మరొకసారి ముందుగానే ధన్యవాదాలు చెప్తున్నాను నేను అండ్ తెలుసు నాకు ఈ త్రీ డేస్ స్కెడ్యూల్ మీది ఎంత బిజీగా ఉందో ఎంత హెక్టిక్ గా ఉందో బట్ దీంట్లో మేము అడగగానే మన రిఫ్లెక్షన్ కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు.
(04:43) అదే ఎస్ అయితే నిన్నే అవధానం కూడా పూర్తి చేసుకున్నారు మీరు అండ్ అంటే చాలా నేను చాలా ప్రవచనాలు చూస్తున్నాను అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు అటు స్వామి వారి సేవలో ఇటు మళ్ళీ తర్వాత అవుట్డోర్ సెషన్స్ అండ్ ముఖ్యంగా మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది జెన్జీ మీరు మనం మొదటిసారి మాట్లా ఈ తరం ఈ తరం ఎస్ ఈ తరం ఈ తరానికి మనం ఎలా చేర్చాలి అనేటటువంటి ఒక శ్రమ మీరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
(05:09) రైట్ అయితే ముఖ్యంగా శంకరుల వారి యొక్క సిద్ధాంతాలను మ్ చెప్పాలి అనేటటువంటి ఒక ఆలోచనతో మీరు ఇంట్రో చెప్పలేదు బట్ అప్పుడు తెలుసు మీకు పాత ఇంటర్వ్యూలో యుఎస్ ని వదిలేసి కూడా ఇక్కడికి వచ్చేసారు. రైట్ దీంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ ప్రయాణంలో ఎంత మేర ఆ ముందుకు వచ్చారు? ఆ అంటే ఇక్కడ ముందుగా జగద్గురువులకి సవక్తికంగా నమస్కరించుకుంటూ మీరు మొదట్లో ఏ మాటైతే అన్నారో ఈ లోకం బాగుండాలంటే ధర్మం బాగుండాలి ఈ ధర్మం బాగుండాలంటే మీరు ఏ మాటైతే అన్నారో నేనంటే నేను కాదు నేనంటే మనము అని ఏ సిద్ధాంతం అయితే ఉందో అదే అద్వైతం యొక్క హృదయం అదే అద్వైతం యొక్క హృదయం భగవత్పాదులు ఎన్నో
(05:54) స్తోత్రాల్లో ఎన్నో ప్రకరణాల్లో చెప్పింది అదే నేను అంటే ఈ శరీరాదులు కాదు నేను అంటే అందరిలో ఉండే చైతన్యం అనేదే నిజమైన నేను అని చెప్పడం కాబట్టి భగవత్పాదుల యొక్క సిద్ధాంతం మనం సమాజానికి ఎంత అందివ్వగలిగితే మీరు అన్నట్లుగా అంత ధర్మ పరిపుష్టి ఉంటుంది. అదే ఈ చతురామనాయ పీఠాల యొక్క జగద్గురువుల యొక్క లక్ష్యం కూడా అదే కాబట్టి తదనుసారంగా ఇప్పుడు శృంగేరిలో జగద్గురువుల సేవలో ఉంటూ వారు నిర్దేశించిన కార్యక్రమాలలో శాంకర తత్వ ప్రసారం చేయడం అనేదే ప్రధాన లక్ష్యంగా ఉంది.
(06:28) అలాగే మీరు నిన్న అవధానం ప్రస్తావించారు అలాగే అవధానాల్లో కూడా ఏవో పద్యాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో కొన్ని అద్వైత పరమైన విషయాలు సిద్ధాంతపరమైన విషయాలు ఎక్కడైనా కుదిరితే భగవత్పదల వర్ణన చేయడము వారు చెప్పిన విషయాలని తెలియజెప్పడము అందుకనే అవధానాలు రకరకాల అంశాలు ఉంటాయి సమస్య దత్తపది వర్ణన అని చాలా మంది పురాణ పఠనం అని చెప్పి పెట్టుకుంటారు అంటే పాత కావ్యాల నుంచి ఒక పద్యం చెప్తే దాన్ని వ్యాఖ్యానించడం అని చెప్పి ఇప్పుడు అవధానం ద్వారా మనం శంకర తత్వాన్ని ఎలా చెప్పడం కాబట్టి కాబట్టి నేను అక్కడ శాంకర స్తోత్ర పఠనం అని చెప్పి పెట్టుకున్నా పాత పురాణాల నుంచి కావ్యాల
(06:59) నుంచి కాకుండా భగవత్పాదులు మనక ఇచ్చిన వాంగ్మయ సంపద నుంచి ఒక శ్లోకం చెప్పడం దాన్ని నేను యథాశక్తిగా వ్యాఖ్యానించడం కాబట్టి ఈ రకంగా ఏ పని చేసినా కూడా వీలైనంత వరకు శంకరాచార్యులు అద్వైతం అలాగే ఈ పరంపరలో శృంగేరి పీఠం జగద్గురువులు వీటి యొక్క పరిచయాన్ని చేసి వీటిలో నుండి విలువని చెప్పడం జగద్గురువుల ఆదేశం ప్రకారం వీటిని చెప్పడం అనేదే నా యొక్క లక్ష్యం అద్భుతం అద్భుతం అయితే ఇప్పుడు ఒకటి ఆ శంకర భగవత్పాదుల వాంగ్మయం నుంచి ఏదైనా ఒక్కటి మాకోసం ఆ దాంట్లో మనం మొదలు పెడదాం మొదట్లో ఏమైనా చెప్పాలంటే అయ్యా ఇప్పుడు ప్రకృతంగమైన విషయం ఇదే
(07:37) కాబట్టి అందరికీ తెలిసిన శ్లోకమే అయినప్పటికీ అందరికీ చాలా ఇష్టమైన శ్లోకమే మాతామే పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాంధవ శివభక్తాస్చ స్వదేశో భవనత్రయం ఇంతకంటే విశాలమైన భావం ఇంకొటి ఉండదు ప్రపంచాన్ని పుట్టించినవాడే నా తండ్రి ఆయన యొక్క శక్తియే నా తల్లి ఆయన యొక్క సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా మా చుట్టాలే మా స్వదేశం ఏమిటంటే ఆయన యొక్క దేశమే మా స్వదేశం ఆయన యొక్క ఇప్పుడు తండ్రి యొక్క నేషనాలిటీ కదా పిల్లడికి ఉండేది అంతే కదా కాబట్టి మా తండ్రి యొక్క నేషనాలిటీ ఏమిటి తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే భువనమే కాబట్టి నా స్వదేశం ఏమిటంటే ఈ
(08:13) భువనమే అని విశాల భావం అంటే ఇది ఇది విశాల భావం ఇంతకు మించినటువంటి విశాల భావం అసల స్వదేశం భువనత్రయ అంటే భువనత్రయన కంటే విశాలమైనది ఇంకేముంది ఇంకేముంది భువనత్రయన దగ్గరికి వచ్చిన తర్వాత అంత ఇంత ఆలోచించాలంటే మొదలుగా నేను చెప్పినట్టుగా [గొంతు సవరించుకోవడం] ఇంట్రోలో అండ్ మీరు కూడా ఎంతో శక్తి కావాలి ఎంతో సాధన కావాలి ఎంతో ఆ దైవ కృప కావాలి గురువుల అది కావాలి అన్నీ మీకు సంపూర్ణంగా ఉన్నాయి.
(08:36) అండ్ మీరు అనుకున్నది చేస్తున్నారు ఇంకా ఎంతో ఎంతో చేయాలి అయితే ఈరోజు మన ఇంటర్వ్యూలో ముఖ్యంగా శంకరుల వాంగ్మయం గురించి చాలా చాలా ఇవన్నీ రాసుకొని వచ్చాను నేను చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏది చదివినా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వారి రచనలే ఈరోజు అన్ని అందించారు మనకు అద్భుతమైనటువంటి వాంగ్మాన్ని అందించారు అయితే అంతకుమించి ఒక విధంగా ఈ ఇంటర్వ్యూలో మీ ద్వారా శంకరుల వారి గురించి సంక్షిప్తంగా ఎందుకంటే నిజంగా ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి.
(09:04) అవును [నవ్వు] సో వాటి గురించి ఒక్కసారి మీ ద్వారా అలాగే తప్పకుండా భగవత్పాదుల సంక్షిప్త చరిత్ర అంటే మనకి ప్రాచీనంగా ఒక శ్లోకం వస్తుంది అవతీరణస్చ కాలట్యం కేదారేంతర్హితస్యః చతుష్పీఠ ప్రతిష్టాత జయత శంకరో గురుహు అని ఒక శ్లోకం ఉంది. వారు కాలటిలో అవతరించారు. కాలటిలో అవతరించారు అంటే ఇక్కడ కొంతమందికి మీరు సందేహాలు అన్నారు కాబట్టి ఒక సందేహం ఏమిటంటే తల్లి ఎప్పుడైనా పుట్టింట్లో కదా పురుడు పోసుకుండేది కాలడు అంటే శివగురువు యొక్క ఊరు అది అయితే ఇక్కడ ఏమిటంటే అవి ప్రాంతీయమైన ఆచారాలు ఉంటాయి ఇప్పుడు రామ జన్మభూమి కౌశల దేశంలో అంటే కౌసల్య యొక్క మాతృభూమిలో
(09:42) లేదుగా రాముడి యొక్క జన్మభూమి దశరథ నగరంలోనే ఉంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ నంబూతిరి బ్రాహ్మణుల యొక్క సంప్రదాయం ఏమిటంటే ఒక స్త్రీమూర్తి మెట్టిని ఇంటికి వచ్చాక అత్తగారి ఇంటికి వచ్చాక అక్కడే పురుడు పోసుకోవడం తన భర్త గతించాక కూడా అక్కడే కాలం గడపడం అనేది ఆ నంబుదిరి బ్రాహ్మణుల యొక్క ఆచారం వాళ్ళకి ఆ తెగకి ఉండే ఒక విశేషమైన ఆచారం అది కాబట్టి ఆర్యాంబ ఆ కాలటిలోనే మనకి ఆ జగద్గురుమూర్తిని ప్రసాదించింది వైశాఖ శుక్ల పంచమి నాడు ఓకే కాబట్టి మన శృంగేరి పీఠం యొక్క 33వ జగద్గురువులు అయిన శ్రీ సచ్చిదానంద శివా నరసింహ భారతీ మహాస్వామి వారు ఆ చాలా అంటే
(10:21) కాలటి అనేది జన్మభూమి అని అందరికీ తెలుసు అయితే కాలటి అనే పేరుతో మూడు గ్రామాలు ఉన్నాయి వారంతా బాగా పరిశోధన చేసి అలాగే వారి యొక్క తపస్శక్తితో కూడా వారు ఇది భగవత్పాదుల జన్మభూమి అని వారు నిర్ధారించారు. ఓకే అక్కడ ఇంకో విశేషం ఏందంటే వారు ఆ కాలటికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి అక్కడ మఠం చేసి కుమాభిషేకం చేసి అన్ని ఏర్పాట్లు అయ్యాయి.
(10:42) వారు అక్కడికి శృంగేరి [గొంతు సవరించుకోవడం] నుంచి కాలటికి ప్రయాణం చేస్తుంటే కాలటికి సమీపంలో పిరుంబా ఊరు అని ఒక చోటు ఉంది. ఓకే అక్కడ వారు రాత్రి విశ్రమిస్తున్న కాలంలో వారికి స్వప్నంలో ఆర్యంబ దర్శనం అయింది. స్వప్నంలో ఆర్యంబ దర్శనం అయ్యి తమరు మా ఊరికి వస్తున్నారు కాబట్టి స్వాగతం చెప్పడానికి మీకు నేను కనపడ్డాను అని ఆర్యాయంబ స్వయంగా ఆ స్వప్నంలో ఆవిడ వారితో అట్లా ఇచ్చినట్టుగా వారికి ఆ అనుభవం కలిగింది.
(11:07) ఉమ్ దానితో వారికి ఇంకా సంతోషం వేసింది కాబట్టి వారు ఆ విధంగా వెళ్లి అక్కడ ఆ కుంభాభిషేకాలన్నీ చేశారు ఇప్పుడు మనకి కాలటిలో శంకర జన్మభూమి క్షేత్రంగా ఏది ఉందో అది వారి యొక్క అనుగ్రహంతో ఆస్తికులందరికీ లభించింది. కాబట్టి అది కాలటి మనం దేశం గురించి మాట్లాడుకున్నాం దేశ కాలాలు అంటే భగవత్పాదుల కాలం మీద ఆ అలాగే చాలా మందికి స్పష్టతలు ఉన్నాయి.
(11:29) ముఖ్యంగా మనకి రెండు కాలాలు కనబడుతుంటాయి. ఒకటి 500 బిసి ఒకటి 788 ఏడి అంటే ఎనిమిదవ శతాబ్దం ఇవి ఇప్పుడు చతురామనాయ పీఠ పరంపరలో పీఠ పరంపరలని ప్రశ్నించడానికి మనం ఎవరం కాబట్టి ఏ పీఠం ఏది చెప్పినా నాలుగు పీఠాల్లో ఏ జగద్గురువులు ఏ మాట చెప్పినా కూడా దాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు దాన్ని స్వీకరించడమే పైగా చతురానాయ పీఠాల మధ్యలో కూడా ఎటువంటి వివాదాలు ఏమీ లేవు అభిప్రాయ భేదాలు ఉన్నాయి వాటిలో వాటి వల్ల పెద్ద భేదాలు ఏమీ లేవు కాబట్టి అది మనం పక్కన పెడితే చరిత్రకారులు చరిత్రకారుల యొక్క అభిప్రాయానుసారంగా మనం భగవత్ భగవత్పాదుల గ్రంథానుసారంగా వారి
(12:07) యొక్క కాలమానాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ కాలంనాటి రాజశాసనాలు ఏం లేవు అలాగే దో వారు వాడిన వస్త్రం వారు వాడిన పాదకులు అట్లాంటివి కూడా మనక ఏం లేవు కాబట్టి వారి గ్రంథాల ఆధారంగా మనం కాల నిర్ణయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా నిర్వివాదంగా భగవత్ పాదుల గ్రంథమే అని ఒప్పుకునే గ్రంథం ఏందంటే బ్రహ్మసూత్ర భాష్యం కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదులు చెప్పిన ఉదాహరణలు ఉటంకించిన పంక్తులు వాటి ప్రకారం కాలి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది.
(12:39) దాంట్లో ఉదాహరణకి భగవత్పాదులు ధర్మకీర్తిని ఉదాహరించారు. హ ధర్మకీర్తిని ఉటంకించారు అంటే భగవత్పాదులు ఉటంకించారు అలాగే భగవత్పాదులకి సమకాలీనులైన సురేశ్వరాచార్యులు కూడా బృహదారణ్య వార్తికాలు బ్రహదారణ్య భాష్యానికి వారు వార్తికాలు రాశారు దాంట్లో వారు ఏమన్నారంటే యదుక్తం ధర్మకీర్తిన ప్రత్యజ్ఞాయ ప్రతిజ్ఞేయం హియేతాసోన సంశయః అని వారు సురేశ్వరాచార్యులు స్పష్టంగా ధర్మకీర్తి పేరు ఎత్తారు ధర్మకీర్తే ఆరో శతాబ్దానికి చెందినవాడు అని ఇంచుమించుగా చరిత్రకారులు చెప్పారు ఆరో శతాబ్దం చివర ఏడవ శతాబ్దం మొదలుకి చెందినవారు అని చెప్పి చెప్పేది కాబట్టి
(13:16) తప్పకుండా ఆరో శతాబ్దం ఏడి తర్వాతనే బ్రహ్మసూత్ర భాష్యం వ్రాయబడింది అని చెప్పాలి. అలాగే భగవత్పాదులు దిగ్నోగుడి యొక్క పంక్తిని ఉదాహరించారు. అతను విజ్ఞానవాది అంటే బౌద్ధుల్లో ఒక పక్షం యద అంతర్జ్ఞేయ రూపం తద్ బహిర్వదవభాసతే అని దిగ్నోగుడి యొక్క కారికల్లో ఒక పంక్తి అది భగవత్పాదులు ఆ విజ్ఞానవాదాన్ని బౌద్ధ విజ్ఞానవాదాన్ని ఖండన చేస్తూ ఉండే క్రమంలో ఈ పంక్తిని ఉదాహరించారు.
(13:42) దిగ్నాగుడు ఐదవ శతాబ్దానికి చెందినవాడు. ఓకే ఐదవ శతాబ్దం ఏడి కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదుల పంక్తి రాయడం తప్పకుండా ఐదవ శతాబ్దం ఏడి తర్వాత తిరిగి ఉండాలి అని తెలుస్తాం. అలాగే భగవత్పాదులు సంస్కారాణం త్రయాదన్యత అని ఇంకో పంక్తి ఉదాహరిస్తారు. ఆ పంక్తి ఏమిటి అంటే గుణమతి అనే ఒక విద్వాంసుడు ఆ అభిధర్మ కోశ వ్యాఖ్యానంలో రాసింది.
(14:05) అతను ఏ కాలమానం చెందివాడు అంటే అబౌట్ 630 ట 650ఏడి అని చెప్తారు. కాబట్టి దాని తర్వాతనే ఈ సూత్రభాష్యం వచ్చిఉండాలి అని ఈ రకంగా రకరకాల ప్రమాణాలతో అలాగే ఇప్పుడు కుమారుల భట్టు కుమారుల భట్టు తర్వాతనే భగవత్పాదులు అని చెప్పాలి వారికి ఏదో 600 మొదలు అని చెప్తారు ఇట్లాగా చూసుకుంటే తప్పకుండా సూత్రభాష్యం 657 తర్వాతనే వచ్చిఉండాలి అని మనకి స్పష్టంగా తెలుస్తుండే విషయం కాబట్టి ఇది దీని తర్వాత దీనికంటే ముందు అని చెప్పంటే భగవత్పాదుల సూత్రభాష్యం మీద వచ్చిన తొలి పరిపూర్ణమైన న వ్యాఖ్యానము భామతీయ గ్రంథం వాచస్పతి మిశ్రలో రాసింది భగవత్పాదుల శిష్యులైన సురేశ్వరులు
(14:46) దక్షిణామూర్తి స్తోత్రానికి బ్రహదారణ్యోపనిషత్ భాష్యానికి తైత్రీయోపనిషత్ భాష్యానికి వార్తికలు రాశారు. సూత్ర భాష్యానికి మాత్రం పద్మపాదులు పద్మపాదాచార్యులు అంటే ద్వారక పశ్చిమానాయ ద్వారకా పీఠానికి తొలి అధిపతిగా ఉండే పద్మపాదులు ఆ ఈ సూత్రభాష్యానికి పంచపాదికా వ్యాఖ్యానం అని చెప్పి రాశారు. అంటే వారు నిజానికి మొత్తం రాశారు అది నష్టమైంది కానీ మొదటి ఐదు పాదాలు మాత్రమే గుర్తున్నాయి అనే దానితో దాన్ని పంచపాదిక అన్నారు అంటే బ్రహ్మసూత్రం యొక్క మొదటి అధ్యాయంలో నాలుగు పాదాలు రెండో అధ్యాయంలో మొదటి పాదం ఈ ఐదు పాదాలకు కలిపి భగవత్పాద భాష్యానికి
(15:22) వ్యాఖ్యానం రాశారు వారు కాబట్టి ఇది అపరిపూర్ణము అంటే ఇంతవరకే ఉంది పరిపూర్ణ పూర్తి వ్యాఖ్యానం సూత్ర భాషానికి పూర్తి వ్యాఖ్యానం అంటే భామతి భామతి వ్యాఖ్యానం భామతి వ్యాఖ్యానాన్ని వ్రాసిన విద్వాంసులు వాచస్పతి మిశ్రులు కాబట్టి ఆయన కాలం మనం ఎందుకంటే ఇది ఎందుకు మనకు కావాలంటే అపరిపూర్ణ భగవత్పాదుల ఇటువంటి సూత్ర భాష్యం మీద విద్వాంసులందరూ నేటికే నెత్తి మీద పెట్టుకునే సూత్ర భాష్యానికి కొన్ని వందల ఏళ్ల పాటు అసలు వ్యాఖ్యానమే రాలేదు అని అనడం అంత సంగతం కాదు కదా కాబట్టి తప్పకుండా ఆ మొదటి పరిపూర్ణమైన వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి కనీసం ఒక 100 100 150
(16:00) ఏళ్ల లోపన్న భగవత్పాదులు ఉండుండాలి అని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఆ వాచస్పతి మిశ్రులు అనే వారి యొక్క కాలం ఏమిటంటే ఆయన చాలా గ్రంథాలు రాశారు వాటిలో ఈ న్యాయసూచి నిబంధము న్యాయసూచి నిబంధం అని చెప్పి ఒక గ్రంథం రాశారు. దాంట్లో చివరిలో ఒక శ్లోకం రాశారు న్యాయసూచి నిబంధోయం అకారి విదుషాముదే శ్రీ వాచస్పతి మిశ్రేణ వసు అంక వసువత్సరే వస్వంక వసువత్సరే అని చెప్పి రాశరు అంటే మీకు తెలిసిందే మన భారతీయ గ్రంథాల్లో కాలం చెప్పేటప్పుడు మనం శకాల ప్రకారం వెళ్తాం కాబట్టి ఇది శక సంవత్సరం అలాగే సంఖ్యలు చెప్పేటప్పుడు మనం నేరుగా ఒకటి రెండు మూడు అని చెప్పి అనం దానికి
(16:38) కొన్ని సంకేతాలు ఉన్నాయి ఉదాహరణకి ఏదో ఒకటి అనడానికి చంద్రుడు అంటారు ఒకటే చంద్రుడు కాబట్టి కాబట్టి ఎనిమిది అనడానికి వసు సంఖ్య అని చెప్పి అంటారు. అలాగే ఏదో ఎనిమిది అంటాలంటే దిక్ సంఖ్య లేదా గజ సంఖ్య అని చెప్పి అంటారు అలాగా కాబట్టి ఇక్కడ ఏమన్నారు వస్వంక వసు వత్సరే వసువ అంటే ఎనిమిది అంక అంటే అంకెలు ఎన్ని ఉన్నాయి తొమ్మిది అంకెలు తొమ్మిది వసు అంటే మళ్ళీ ఎనిమిది అంటే 898 సంఖ్యానం వామతో గతిహి కాబట్టి అటునుంచి చూసినా కూడా 898 ఇది 898 విక్రమ సంవత్సరం అంటే మనకి ఈఏడిబిసిలో 841 లేదా 842 ఆ రెండిటి మధ్యలో వస్తుంది కాబట్టి వాచస్పతి మిశ్రులు 841
(17:17) ఏడి లో ఈ వారి యొక్క గ్రంథ రచనలు ఇవన్నీ జరిగాయి కాబట్టి భగవత్పాదులు యొక్క బ్రహ్మసూత్ర భాష్యానుసారంగా 650ఏడి తరువాత అలాగే 841ఏడి కంటే ముందు తప్పకుండా ఉండి ఉండాలి అని మనం తేల్చాలి ఇదైతే కరాఖండేగా గ్రంథంతో చెప్పే విషయం అలాగే ఇతర కొన్ని ప్రజల్లో కూడా ఉండే కొన్ని మాటలు చూసుకుంటే ఈ శకాల్లో శకాలలో ఈ విక్రమ శకం యుధిష్టర శకం శాలివాహన శకం లాగానే మనకి కేరళలో చూస్తే కొల్లమాండు అని ఒకటి ఉంది
(18:00) ఓకే కొల్లమాండు అంటారు ఆ శకాన్ని కొల్లమాండు అంటారు. ఆ ఆండు అంటే వాళ్ళ భాషలో కేరళ భాషలో సంవత్సరం అనుకుంటా అది ఒక శకం ఉంది. ఆ శకము ఏమంటారంటే కేరళ రాజుకి భగవత్పాదులకి మంచి సంబంధం ఉంది వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఆ రాజు కాలటికి రావడం భగవత్పాదులు పెరిగి పెద్దవారి యాత్ర చేస్తుంటే కూడా అక్కడికి వస్తే వారు రాసిన నాటకాలని భగవత్పాదులు గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం ఇట్లా కేరళ రాజుకి భగవత్పాదులకి ఒక మంచి సంబంధం ఉండింది.
(18:27) కాబట్టి శకాలు ఎప్పుడు కూడా దేశ ప్రగతిని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మహాపురుషుల మీద శకాలు ఏర్పడతాయి. అందుకని యుధిష్టర శకం గౌరవాలని సంహరించే ధర్మ పరిపాలన భారతదేశాన్ని తీసుకొచ్చారు అలాగే శాలివాహన శకం అంత పెద్ద భారతదేశం అంతా ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన శాలివాహనులు అలాగే విక్రమాదిత్యుడు వీళ్ళందరూ ఏమిటంటే ఒక భారతదేశానికి ఐక్యత తీసుకొచ్చి ఒక ఐక్యం తీసుకొచ్చి దేశాన్ని బాగా ప్రగతిలోకి తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి అదే దృష్టితో ఆ రాజుగారు భగవత్పాదులు చేసింది కూడా అదే దేశ ఐక్యం దేశ ప్రగతి కాబట్టి వారి యొక్క కాలానికి సంబంధించిన
(19:05) ఒక శకం ఉంటే బాగుండు అనుకొని ఈ కొల్ల పల్లమండని మొదలు పెట్టారు అని చెప్పి ఒక మాట ఉంది దీనికి చాలా కారణాలు చెప్తారు చరిత్రకారులు ఇది ఒక కారణంగా కూడా గణిస్తారు కాబట్టి మనం ఏమనుకో భగవత్పాదుల యొక్క సమాధి తర్వాత మలయాల భగవత్పాదుల ఆ అవతార సమాప్తి తర్వాత ఈ శఖన్ని మొదలు పెట్టారు అని చెప్పి ఒక మాట ఉంది. కాబట్టి ఈ రకంగా భగవత్పాదుల కాలం గురించి ఇటువంటి చాలా విచారాలు ఉన్నాయి.
(19:28) ఇంకొక మాట ఇప్పుడు శివానంద లహరి మనం దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు తర్వాత శివానంద లహరి తప్పక భగవత్పాదుల స్తోత్రమే అని ఒప్పుకోవాలి అంటే నిర్వివాదంగా ఒప్పుకోవాలి. దాంట్లో భగవత్పాదులు కన్నప్పను ఉదాహరించారు కన్నపను ఉదాహరించ వనచర్వ భక్తావతంసాయతే అన్నప్పుడు అలాగే నతిభిర్ నతిస్తమేష పూజావిధిర్ ధ్యాన సమాధిభిర్ నతుష్టః ఓ పరమేశ్వర నేను పూజలు చేసిన స్తోత్రాలు చేసిన నువ్వు ప్రసన్నుడివి అవ్వట్లేదు నీ చరిత్ర చూస్తే వేరే పూజలే నీకు ఇష్టం ఉన్నట్టుగా ఉన్నాయి ధనుష ముసలేన అశ్వభిర్వ వదతే ప్రీతికరం తథా కరోమి ఒకడు నిన్ను ధనుస్సు పెట్టి కొట్టాడు నువ్వు వాడికి
(20:03) పాశపతిస్త్రం ఇచ్చేసావు అర్జునుడు ముసలేన ఒకడిని నువ్వు ముసలం పెట్టి కొట్టాడు నువ్వు వాడిని అనుగ్రహించావు అశ్వభి ఒకడు నిన్ను రోజు రాళ్ళు పెట్టి కొట్టాడు వాడిని అనుగ్రహించావు అయితే ఈ పూజలా నన్ను చేయమనేది నువ్వు అని చెప్పి అంటారు భగవత్పాదులు అక్కడ సరదాగా వీళ్ళందరూ నాయనారులు ఈ ముసలంతో అశ్మతో రాళ్ళతో భగవత్ శివుడిని కొట్టిన వాళ్ళు ఈ రాళ్ళతో చేసిన ఆయన అయితే శాఖ్య నాయనార్ అని పేరు అంటే ఆయన బౌద్ధుడు బౌద్ధ మతంలో నుంచి పాశుపత మతంలోకి అంటే శైవ మతంలోకి వచ్చారు అని అందుకని ఆయన శాక్య శాక్యులు అంటే బుద్ధ బౌద్ధులు కదా కాబట్టి శాఖ్య నాయనారు అది
(20:37) శాఖ్య నాయనారు అయింది ఈయన ఈయన ఎప్పటి కాలం వాడు అని చెప్పంటే ఈయన జ్ఞానస తిరుజ్ఞాన సంబంధరికిను అప్పరికి ముందు ఆయన అంటే ఈయన కూడా ఇంచుమించు ఐదవ శతాబ్దం అట్లా చెప్తారు. కాబట్టి ఈయనని ఈయన యొక్క కథని అలాగే కన్నప్ప వీళ్ళ ఈ నాయనారుల కథలని ఉదాహరించారంటే తప్పక భగవత్పాదులు ఆ ఐదవ శతమానం తర్వాత అంటేఫిఫ్త్ సెంచురీ ఏడి తర్వాతనే వారు ఈ శివానంద లహరిని రాసి ఉండాలి ఇత్యాది వారి గ్రంథ ముఖంగా మనం చూసుకుంటే గ్రంథ ముఖంగా చూసుకుంటే ఇటువంటి కాలం ఒకటి మనకి నిర్ణయం అవుతుంది.
(21:08) కాబట్టి ఇది వారు జన్మించిన దేశకాలాలు అలాగే వారు మనం అనుకున్నట్లుగా అవతీరణశ కాలట్టాం చతుష్పీఠ ప్రతిష్టాత దేశ నలుమూలల అంటే ఎక్కడెక్కడి నుంచి అయితే మనకి భారతదేశంలోకి ఇతర సంస్కృతులు రావచ్చో అక్కడక్కడ కోటల్లాగా సంస్కృతికి కోటల్లాగా దేశాన్ని ఇంకోటి భారతదేశం ఉండేది కూడా చతుష్కోణాకారంలో కదా పక్కకి కొంచెం తిప్పిన చతుష్కోణాకారంలో ఉంటుంది.
(21:32) అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పీఠాన్ని పెట్టి దేశాన్ని నాలుగు భాగాలుగా విభాజన చేసి వారు ఆ మఠంనాయన శాసనంలో ఈ దేశాలు ఈ పీఠానికి ఈ దేశాలు ఈ పీఠానికి ఈ దేశాలు ఈ పీఠానికి అని చెప్పి ఆ పీఠాలని విభజించి ధర్మ రక్షణ జరగాలంటే ఎప్పటికప్పుడు ఈ సంప్రదాయాన్ని చెప్పేవాళ్ళు ఉండాలి సంప్రదాయం నమ్మకంగా ఉండాలంటే గురు శిష్య పరంపర ఉండాలి కాబట్టి ఈ పీఠాల్లో ఎవరో కాదు మా పరంపరనే ఉండాలి అనుకొని వారు ఆ నాలుగు పీఠాల్లో వారి యొక్క శిష్యు పెట్టారు అంటే వారి యొక్క వైరాగ్యం అటువంటిది వారు మరి నా శిష్యులందరూ బాగా మంచిగా పీఠాలు పెట్టుకోంటే మరి నాకు అని చెప్పవారు అనుకోలేదు
(22:08) మా పరంపర కొనసాగాలి నాలుగు పీఠాలు ఉన్నాయి నేను దేశ సంచారం చేస్తాను నాకు ప్రత్యేకించి ఏమ అక్కర్లేదు అనుకొని వారు ఆ రకంగా దేశాన్ని నాలుగు భాగాలుగా విభాగం చేసి నాలుగు భాగాలకు విభాగం అయిపోయాక ఇంకా మళ్ళీ వారికి ఏం పని ఉంది దాంట్లో మా శిష్యులని తయారు చేసాము శిష్యుల్ని పెట్టాము వాళ్ళందరూ గౌరవ భావంతో భగవత్పాదులే మొదట ఆ పీఠాన్ని అధిష్టించారు అని చెప్పి భావిస్తుంటారు కాబట్టి కాబట్టి ఆ శిష్యులు అక్కడ మొదటి పీఠాధిపతిగా ఉన్న పూజ్యస్థానం ప్రతి పీఠంలోన భగవత్పాదులదే కాబట్టి ఆ రకంగా ఈ పరంపరని నాలుగు పీఠాలుగా వారు ప్రవర్తింపచేసి
(22:40) ఆ రకరకాల ధర్మ కార్యాలు చేసి వారు ఎన్నో దేవాలయాలను సంస్కరించారు. బదరిలో నారాయణుని చూస్తున్నావ అంటే భగవత్పాదుల దయ కంచి కామాక్షిలో ఈరోజు పూజలు అవుతున్నాయ అంటే భగవత్పాదుల దయ అఖిలాండేశ్వరి దగ్గర సాత్విక పూజలు అంటే భగవత్పాదుల దయ శ్రీశైలంలో తామస పూజలు లేవంటే భగవత్పాదుల దయ ఇట్లా దేశవ్యాప్తంగా రోజు ప్రతిసారి జగన్నాథుడిని ఆ దారుమయ మూర్తిని తయారు చేయాలంటే ఆ పద్ధతిని ప్రవేశపెట్టింది భగవత్పాదులు కాబట్టి దేశవ్యాప్తంగా భగవత్పాదుల వల్లనే మనకి దేవాలయ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది.
(23:15) ఇప్పుడు అలాగే కంచలో శ్రీ చక్ర ప్రతిష్ట చేశారు శ్రీశైలంలో మనకి బ్రమరాంబిక దేవి ముందు ఒక శ్రీ చక్రం ఉంటుంది అది భగవత్పాదుల ప్రతిష్ట కాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక దేవి ముందు ఒక శ్రీ చక్రం ఉంటుంది అది భగవత్పాదుల ప్రతిష్ట ఇలా దేశవ్యాప్తంగా పండితులతో వాదన చేసి సిద్ధాంతాన్ని ప్రతిష్టాపించి ధర్మ రక్షణ కోసం పీఠస్థాపన చేసి భగవత్ ఆరాధన వ్యవస్థని దృఢం చేస్తూ దేవాలయ వ్యవస్థని పుష్టం చేసి కొన్ని వందల ఏళ్లకి సరిపడా ధర్మ జాగృతిని ఈ జాతికి అందించి వారు కాశ్మీరంలోనే సర్వజ్ఞ సింహాసనం దాన్ని అధిష్టించి అక్కడ నుండి వారు ఆ కేదార క్షేత్రంలో కేదారనాథ క్షేత్రంలో
(23:56) వారు వారి యొక్క అవతారాన్ని సమాప్తి చేశారు ఎలాగైతే శృంగేర జగద్గురువులు వారి జన్మస్థానంలో ఒక స్మారకంగా ఒక మఠాన్ని నిర్మాణం చేసి వారి ప్రతిష్ట అక్కడ చేశారో ద్వారకా పీఠాధిపతులు ద్వారకా శంకరాచార్యులు ఇది భగవత్పాదుల యొక్క సమాధి స్థలంగా మనం అందరం తప్పకుండా గుర్తించాలి అనుకొని అక్కడ ఒక స్మారకమైన మందిరాన్ని వారు ప్రతిష్టించారు అలాగే ఇప్పుడు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి కూడా ఆ కేదారా క్షేత్రంలో చాలా సుందరమైన ఆ భగవత్పాద మూర్తిని వారు నెలకొలిపారు కాబట్టి ఈ రకంగా అవతేరణస్చ కాలట్య కేదారే అంతరిహితస్చయః చతుష్పీఠ ప్రతిష్టాత అందుకని మనం భగవత్పాదులు శరీరం వదిలేరు
(24:33) అని చెప్పాం అంతరిహితః అది శివుడి యొక్క రూపం కాబట్టి ఆ రూపం మనకు కనపడకుండా అక్కడ వెళ్ళిపోయింది. ఆ రూపం కనబడకుండా అక్కడ వెళ్ళిపోయింది అందుకనే మనకి మాధవ శంకర్ దిగ్విజలో కూడా విద్యాలు ఏం రాశారు వారు అక్కడి వరకు వెళ్ళగా దేవతలందరూ వచ్చి ఇంకా తమని కార్యం అయిపోయింది కదా అవతార కార్యం అయిపోయింది తమరు కైలాసానికి దయచేయండి అన్నప్పుడు మళ్ళీ తన రూపం మార్చుకొని జటలు త్రినేత్రాలు ఆ వ్యాగ్ర చర్మం అటువంటి రూపాన్ని ధరించి నంది మీద బ్రహ్మ చేయోతనివ్వగా నందివాహనాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళారు అని ఉంది కాబట్టి భగవత్పాదులు శరీరాన్ని త్యజించారు
(25:06) అని చెప్పి మనం అన్నాం భగవత్పాదులు అంతర్హితులయ్యారు భగవత్పాదులు వారి యొక్క ఆ రూపాన్ని మార్చుకొని వారు స్వస్థానమైన కైలాసాన్ని చేరుకున్నారు. కాలడి శంకరులు మళ్ళీ కైలాస శంకరులు అయ్యారు అని అనుకుంటాం మనం అందుకనే ఈ శ్లోకంలో కేదారి అంతర్హితష్టయః అన్నారు. అలాగే జయతాత్ శంకర చతుష్పీఠ ప్రతిష్టాత జయతాత్ శంకరో గురుహు అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి ఈ రకంగా భగవత్పాదుల దేశకాల నిర్ణయం అయింది అయితే అక్కడ ఒక విషయం ఏందటంటే దేశకాల నిర్ణయం మనం చరిత్రకారుల కోసం చేస్తాం కానీ నిజమైన సాధకులకి జిజ్ఞాస జిజ్ఞాసువులకి ఈ దేశకాలాలతో పెద్ద సంబంధం లేదు. అందుకనే
(25:47) ఇప్పుడు మనం అనుకున్నట్లుగా చతురమనాయ పీఠాల్లో ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మరి అది విభేదాలకు ఎందుకు దారి తీయలేదు అందరి చతురామనాయ పీఠాల్లో ఐకమనస్యం ఉంది ఏకమనస్కత ఉంది ఐక్యం ఉంది అందరూ కలిసి పని చేస్తున్నారు చతురామయ పీఠాధిపతులు అందరూ కలిసి పని చేస్తున్నారు. మరి ఈ రెండు అభిప్రాయ భేదాలు మరి ఎందుకు ఐక్యాన్ని పోగొట్టలేకపోతున్నాయి అంటే అది విషయమే కాదు కాబట్టి వాస్తవం ఎందుకంటే చతురామనాయ పీఠాలకి ఏం కావాలి భగవత్పాదుల తత్వం భగవత్పాదుల సందేశం భగవత్పాదుల మార్గం ఈ విషయంలో అందరికీ ఐకమత్యంగా ఉంది.
(26:16) అరే ఈ మధ్య కొన్ని వితండవాదలే వచ్చే భగవత్ గీతా భాష్యం ఎవరో రాశారు అంటే తర్వాత అభినవ శంకరులు అన్నారు ఆదిశంకరులు బ్రహ్మసూత్ర భాష్యం అభినవ శంకరులు ఈ భాష్యం నూతన శంకరులు ఆ భాష్యం అభినూత్న శంకరుల ఆ భాష్యం ఇంకా భాగ శంకరులు పిక శంకరులు శోక శంకరులు ఏవేవో చెప్పి భగవత్పాదులు చేసే పని చీలికలు పీలికలు చేస్తున్నారు. అది మన చతురమనాయ పీఠాలు ఎప్పుడు చేయలేదు గీతా భాష్యం రాసింది ఆదిశంకరులే బ్రహ్మసూత్ర భాషను రాసింది ఆదిశంకరులే ఉపనిషత్ భాషను రాసింది ఆదిశంకరులే శంకరులు చేసిన ఉపకారాల్ని మనం డైల్యూట్ చేయడానికి లేదు పాలల్లో నీళ్లు కలపడానికి లేదు అంటే భగవత్పాదులు ఏ మహా
(26:49) కార్యాలను సాధించారో ఏ మహా తత్వాన్ని బోధించారో ఏ ధర్మ మార్గాన్ని చూపించారో అది మనకు ప్రధానం కాలభేదం అవన్నీ మనకి దొరికే ఆధారాలలో బట్టి ఒకళ్ళు ఒక కాలం చెప్తారు ఇంకోళ్ళు ఒక కాలం చెప్తారు దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమ లేదు దాంట్లో ఇబ్బంది లేదు దాంతో పాటుగా ఈ రోజు దాని అవసరము లేదు దాని అవసరమో లేదు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ తత్వాన్ని వారు మనకి ఏం చెప్పాలఅనుకుంటున్నారు అనే విషయాన్ని జనాల్లో పడికి తీసుకెళ్ళాలి అది తెలుసుకోవాలి అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి గాని అవును అందుకనే కొంతమంది ఏమంటారు ఇప్పుడు మీ శృంగేరియ పీఠం యొక్క రికార్డ్స్ లో
(27:15) పాతకాలంలో ఏదో 44 బిసి అని చెప్పి ఉండేది ఇప్పుడు మరి పీఠం ఎట్లా చెప్తుంది అని చెప్పంటే అది మన పాత శ్రీముఖాలు కూడా చూసుకున్నా కూడా అక్కడ ఏం రాసి ఉంటుందంటే ఉపద్విసహసేభ్య ప్రాక్ అని ఉంటుంది. 200 సంవత్స 2000 సంవత్సరాలకు లోపుగా అని ఉంటుంది. ఎందుకని చెప్పంటే ఈ కాల నిర్ణయం ఇంతప్పుడు జరగలేదు పరంపరగా ఏది వస్తుందో అదే వస్తుంది అయితే ఈ మాట ఎక్కడి నుంచి పుట్టింది అని చెప్పంటే భగవత్పాదులు విక్రమాదిత్యుడి పాలనలో 15వ శతాబ్దం 15వ సంవత్సరంలో అట్లా లేదా 12వ సంవత్సరంలో పుట్టారు అని ఒక మాట ఉంది.
(27:52) ఏ విక్రమాదిత్యుడు అనే దాంట్లో అభిప్రాయ భేదం వచ్చింది. అంటే ఉజ్జైనీ విక్రమాదిత్యుడు అని పెట్టుకుంటే అది 44 బిసి కి అట్లా దగ్గరగా వస్తుంది. కానీ చలుక్ర విక్రమాదిత్యుడు పెట్టుకుంటే ఇప్పుడు మనం చరిత్ర కాల అనుసారంగా ఏ కాలం అయితే వస్తుందో ఆ కాలంతో సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఆ రెండు మాటలు ఉండని కారణం అది అప్పుడు ఆ చాలా మంది ఆ మాట చెప్పారు అది ఎందుకంటే ఏ విక్రమాదిత్యుడు అనే ఒక తీర్మానం కాక అది అయింది.
(28:16) కాబట్టి ఆ 33వ జగద్గురువుల కాలంలో ఎలాగైతే ఆ దేశ నిర్ణయం అయిందో అప్పటివరకు మనం అనుకున్నట్లు కాలం మీద అసలు ఎవరికీ దృష్టి లేదు కాలం ఎందుకు ఏదో పరంపర అయితే ఉంది అవిచ్చిన పరంపర ఉంది నాలుగు పీఠాల్లోన పరంపర ఉంది తద్వారా చేయాల్సిన కార్యాలు స్పష్టంగా ఉన్నాయి భగవత్పాదుల అవతార కార్యాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి కాలం మీద అంత దృష్టి పెట్టలేదు.
(28:36) అయితే ప్రస్తుత సమాజంలో మళ్ళీ అది వచ్చేసరికి జేష్ట మహాసన్నిధానం వారి కాలంలో వారు ఈ శాస్త్రీయమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా లౌకికమైన శాస్త్రాల్లో కూడా మంచి పట్టు ఉంది వారికి శృంగేరిలో ఆ విద్యాతీర్థ సేతు అని చెప్పి ఉంటుంది. దానికి డిజైన్ గీసింది వారు బ్రిడ్జ్ డిజైన్ వారు ఒక డిజైన్ గీస్తే అక్కడ ఆర్కిటెక్ట్స్ అందరూ వచ్చి అన్నారు ఇది కొంచెం అవుతుందో అవ్వదో నాకు సందేహం ఉందంటే పర్వాలేదు ఇట్లా దాన్ని చేయండి అది అవుతుంది.
(29:04) డిజైన్ వారు గీశారు ఇప్పటికి దాని మీద రోజు ఏనుగులు నడుచుకుంటూ వెళ్తా అద్భుతంగా ఉంటుందండి రెండు ఏనుగులు నడుచుకుంటూ వెళ్తాయి రోజు చెక్కు చెదరకుండా హాయిగా ఉంది అలాగే ఒక మంచి పుస్తకం కూడా ఉంది సైన్స్ అండ్ శాస్త్రాలు అని చెప్పి ఒక పుస్తకం ఉంది వారు చిన్నగొన్నప్పుడు ఆ శాస్త్రధ్యయనం చేస్తూనే సైంటిఫిక్ విషయాలను ఎంత కుషాగ్ర బుద్ధితో పరిశీలించారో మీకు మాక్స్వెల్ యొక్క డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది.
(29:26) అది వారు రెప్లికేట్ చేశారు వారి యొక్క గదిలో కాబట్టి వారు అట్లాంటి కుషాగ్రమైన బుద్ధి లౌకిక విషయాల్లో కూడా అప్రతిహతమైన ప్రజ్ఞను కలిగినవారు కాబట్టి వారి కాలంలో ఈ భగవత్పాదుల సరైన కాల నిర్ణయం జరగాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రమాణాలతో అలాగే పీఠం యొక్క పరంపర యొక్క రికార్డ్స్ తో కూడా చూసుకుంటే ఇది సరిగ్గా సరిపోయింది. కాబట్టి శృంగేరి పీఠం యొక్క పరంపరలో ఇది ఇట్లా ఉంది ఈ పరంపర యొక్క ఉన్న రికార్డ్స్ ప్రకారం చరిత్ర రికార్డ్స్ ప్రకారం ఇట్లా ఉంది.
(29:53) మిగతా మూడు పీఠాలు వాళ్ళ పరంపర ప్రకారం వాళ్ళ దగ్గర ఉండే విషయాల ప్రకారం వాళ్ళు వాళ్ళ పరంపర చెప్తున్నారు. కానీ ఇది అభిప్రాయ భేదాన్ని ఎందుకు కలిగించట్లేదు అంటే ఐక్యమత్యాన్ని పోగట్లేదు ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు కాబట్టి అనవసరంగా కాలం గురించి మనం బుర్రపాడు చేసుకోవాల్సిన అవసరం లేదు వారు చెప్పిన జ్ఞాన మార్గంలో మనం నడుచుకుంటూ వారిని గురుమూర్తిగా పూజించుకుంటే సరిపోతుంది అనే వాస్తవం మీరు చెప్పినట్టుగా అనవసరమైనటువంటి చర్చ తప్ప దాని ద్వారా [గొంతు సవరించుకోవడం] వచ్చేది ఏమ లేదు కాలం గురించే మాట్లాడితే వారు ఇచ్చినటువంటి సంపద జ్ఞాన సంపద
(30:23) పోనీ ఎంత కాలానికి ఎంత కాలానికి తరిగిపోతుది అది ఇది కాలకారులుడి యొక్క అవతారం ఆ కాలం ఏం చేస్త కాలం గురించి మనమే మాట్లాడేది నీలకంటే దీక్షలో మంచి మాట అంటారు కలివిడం అని చెప్పి ఒకటి రాశారు అంతా కలికాలం ఎంత ఘోరంగా ఉంటుంది ఎన్ని విపరీతాలు జరుగుతాయి అని చెప్పి చాలా వ్యంగ్యంగా రాసుకుంటూ వస్తూ చివరిలో కాలకాలం ప్రపన్నానాం కాలకిన్నకరిషతి అని చెప్పి అంటాడు ఆయన మేము కాలకాలుడిని ఆశ్రయించి ఇంకా కాలం మమ్మల్ని ఏం చేస్తుంది అని చెప్పి అంటాడు కాబట్టి భగవత్పాదులు ఆ కాలకాలుడి యొక్క అవతారమే కాబట్టి వారి యొక్క అవతార కార్యాలు ఉపదేశాలకి కాల సంబంధం లేదు
(30:55) అయినా కూడా చరిత్రపరంగా ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి ఇంత కాలం అనుకోవడం ఇదే అద్భుతం అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి మాలాంటి వాళ్ళకి ఇదంతా విన్నప్పుడు ఒకటి చాలా సామాన్యమైన ప్రశ్న ఇంత జ్ఞాపక శక్తి [నవ్వు] ఏ రకంగా అని అది చాలా సామాన్యమైన ప్రశ్న దానికి కూడా సమాధానం కావాలి నిజంగా ఎందుకంటే ఎంతో [నవ్వు] మందికి అవసరం రెండవది ఇప్పుడు మొదలుగా ఈ నాలుగు పీఠాలకు సంబంధించి ఆ గురువులను అంటే వారు ఎన్నుకున్నప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఒకసారి అంటే ఏ విధంగా ఎన్నుకున్నారు ఎలా అనేది కాబట్టి భగవత్పాదుల యొక్క ప్రధానమైన
(31:30) నలుగురు శిష్యులు ఈ పీఠలో అన్నారు అంటే హస్తామకులు తోటకులు పద్మపాదులు సురేశ్వరులు నిజానికి దీని మీదనే ఒక భాగం చేర్చాము భగవత్పాదులకే శిష్యులకు ఉండే సంబంధం వారి చరిత్రలో చాలా విషయాలు తెలుస్తాయి మనకి ఆ పద్మపాదులు అంటే పూర్తి జిజ్ఞాస నాకు తత్వం తప్ప మరొక్కటి అక్కర్లేదు అని వచ్చి శరణాగతి చేసిన శిష్యులు పద్మపాదులు తోటకాచార్యులు నాకు జీవితంలో ఒకటే పని తమరి శుశ్రోష చేయడం తమరి మరి చెప్పే పాఠం వినడం ఈ రెండు తప్ప నాకు జీవితంలో ఇంకోటి వద్దు అనుకున్నవారు తోటకాచార్యులు గురుసేవని పరమ లక్ష్యంగా పెట్టుకున్నవారు హస్తామలకులు జ్ఞాని
(32:07) భగవత్పాదులు నువ్వు ఎవరు అని చెప్పంటే ఈ చైతన్య స్వరూపమైన ఆత్మను నేను స నిత్యోపలబ్ది స్వరూపోహమా ఆత్మ అని చెప్పి అన్నారు. జ్ఞాని అయినప్పటికీ భగవత్పాదులకి పరమ విధేయులుగా శిష్యులుగా ఉన్నారంటే ఎంత జ్ఞానం ఉన్నా అసలు పూర్తి బ్రహ్మజ్ఞాని అయినా సరే గురువు దగ్గర మాత్రం తలవంచి ఉండవలసిందే అని నీతి అక్కడ తెలుస్తుంది. సురేశ్వరులు అసలు పూర్తి ప్రతిపక్షి వాదం చేసి గెలుచుకోవాల్సి వచ్చింది.
(32:31) సురేశ్వరాచాల వారు పూరాశ్రంలో మండలన మిశ్రులు మండ్రులు మహిష్మతి నగరంలో ఉండేవారు వారిని గెలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అక్కడ మనక ఏం తెలుస్తుంది అంటే వారికి ఎంత మనస్వచ్ఛత ఉండాలి ఇప్పుడు మనం పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం జ్ఞానమే మోక్షం అంటే కాదు కర్మ వల్లనే మనకి పరమఫలం అని చెప్పి అనడంలో అట్లాంటి సిద్ధాంతంలో ఉన్నప్పుడు ప్రతివాది మనల్ని జయించినప్పుడు అతని యొక్క సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి కాలంలో ఎట్లా ఉందంటే వాదనలు ఓడిపోయానంటే నా దగ్గర అంత సామగ్రి లేదు ఈసారి గెలుస్తా అన్నట్టు
(33:09) ఉంటుంది ఓడిపోవడాన్ని అంగీకరించేవాళ్ళు ఎవరు ఓడిపోవడాన్ని అంగీకరించారు కానీ అట్లా కాదు అవతలి వారి పట్ల వారి పక్షంలో సత్యం ఉంది అని తెలిసినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించి గౌరవించడం నిజం అంటే గురువు మనక ఒకటి చెప్పినప్పుడు ఇదఎందుకు ఇది ఎట్లా ఎందుకు ఉంది అని ప్రశ్నించకుండా గురువు చెప్పిందని ఓపెన్ మైండ్ అంటారు చూడండి అట్లా ఒక విశాలమైన దృక్పథంతో సత్యం ఉన్నప్పుడు దాన్ని స్వీకరించడం అట్లాంటివా వాళ్ళు శిష్యులుగా బాగా రాణిస్తారు అట్లాంటి వాళ్ళకి బాగా విషయం వంటపడుతుంది కాబట్టి ఆ నీతి మనకి సురేశ్వరాచార్యుల యొక్క చరిత్రలో
(33:38) కనబడుతుంది కాబట్టి వీళ్ళు భగవత్పాదులకి నలుగురు ప్రధానమైన శిష్యులు అని చెప్పి ఉంటుంది. వారి యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. పీఠాధిపతిని ఎన్నుకునేటప్పుడు భగవత్పాదులు చెప్పిన లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోవడం అనేదే పరిపాటి కాబట్టి భగవత్పాదులు ఏం చెప్పారంటే శుచిర్ జితేంద్రియః వేద వేదాంగాది విచక్షణః యోగజ్ఞః సర్వశాస్త్రజ్ఞః సహ మదాస్థాన అర్హతి నా పీఠం ని అధిష్టించడానికి ఎవరికి అర్హత ఉందంటే శుచిహి త్రికరణ శుద్ధిగా ఉండేవాళ్ళు జితేంద్రియః ఇంద్రియ నిగ్రహం ఉండేవాళ్ళు వేద వేదాంగాది విచక్షణః స్పష్టమే యోగజ్ఞ యోగానుష్టానం ఉన్నవాళ్ళు సర్వశాస్త్రజ్ఞః
(34:17) అన్య శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈ పీఠం చెల్లు అని వారు చెప్పిన మాట ఆ పరంపరలు అట్లానే కొనసాగుతున్నాయి మన శృంగేరుల పీఠంలో కూడా అట్లానే ఉంది. శృంగేరి పీఠంలో విశేషం ఏమిటంటే అమ్మవారు అనుజ్ఞస్తుంది శిష్య స్వీకారానికి మనం మహా సన్నిధానం వారిని ఉత్తరాధికారిగా నియమించిన జేష్ట మహా సన్నిధానం వారు జగద్గురు శ్రీ అభినవ విద్య తీర్థ మహాస్వామి వారి యొక్క చరిత్ర చూసిన లేదే మన కళ్ళ ముందు సన్నిధానం వారి యొక్క శిష్య స్వీకారం జరిగింది అప్పుడు మహా సన్నిధానం వారు శ్రీమత్ భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్పిన మాటలు విన్నా కూడా వారు ఏమంటారంటే
(34:52) మాకు అమ్మవారి యొక్క అనుజ్ఞ అయింది వారు ఆ అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్తారు అక్కడ కూర్చుంటారు ధ్యానం చేస్తారు అమ్మవారి యొక్క అనుజ్ఞ వచ్చాక వీరిని ఉత్తరాధికారిగా మేము ప్రకటిస్తున్నాము మా పీఠాన్ని కొనసాగించేవారు కొనసాగించే జగద్గురువులు వీరు అని నిర్ణయం చెప్పడం జరుగుతుంది కాబట్టి శృంగేరి పీఠంలో శారదాంబ సంకల్పంతో ఉత్తరాధికారి యొక్క నిర్ణయం జరుగుతుంది.
(35:20) మహా అద్భుతం మహా అద్భుతం ఇది ఇంతకుముందు నేను అడిగిన మీరు చెప్పినట్టు కాదు స్వామి ఇక్కడ అంటే శంకరుల వారికి శరీరం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట మీరు మాట్లాడారు నిజంగా అంటే ఎనిమిది సంవత్సరాల వయసులో నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను అవును అవును ఆ ఎనిమిది సంవత్సరాల వయసులో ఈరోజు కావచ్చు గత 100వ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక పిల్లాడు మామూలుగా మనలాగా పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అడిగితే ఎవరైనా చెప్తారు అట్లాంటిది వారు ఏకంగా నిర్వాణ శటకం అంటే అసలు దాంట్లో ఉండేటటువంటి తత్వంిని అర్థం
(35:52) చేసుకోవడానికి కొన్ని జీవితాలు పడుతుంది అవును అవును సాధన చేస్తే చేస్తే చేస్తే తప్ప అది అర్థం అవ్వడం అవును అట్లాంటిది ఎనిమిది సంవత్సరాల వయసులో వారు దాన్ని రచించిడం అనేటటువంటిది ఇక మనం శరీరాంతో ఏ రకంగా చూస్తాం వారు అవును అవును కాబట్టి వారు శరీరాతీతులు మహాపురుషులు అవతార పురుషులు అనుకోవడం తప్ప దానికి ఇంకో మార్గం లేదు.
(36:13) కాబట్టి మీరు అన్నట్టు నిర్వాణ శట్కం పరమాద్భుతమైన స్తోత్రం కానీ భగవత్పాదుల మొదటి స్తోత్రం అది కాదు మొదటి స్తోత్రం కనకధార కనకధార స్తోత్రం బ్రహ్మచారి దశలో రాసింది ఇది వారు ఆతుర సన్యాసం తీసుకొని గోవింద భగవత్పాదుల ముందు చెప్పిన స్తోత్రం నిర్వాణ నిర్వాణం కాబట్టి నిర్వాణ శట్కంలో ఇది కూడా మనం మొదట్లో అనుకున్న విషయమే అయ్యా వారు కాలటిలో ఆతుర సన్యాసం తీసుకున్నారు ఆర్య అంబాదేవి అనుమతించింది వారు కాలి నడకన కాలటి నుంచి ఓంకారేశ్వరం వరకు వెళ్ళారు.
(36:42) అది ఎంత పెద్ద విషయం ఎందుకు వెళ్ళారు వారు సర్వజ్ఞులేగా శివావతారులే కదా శివావతారులు కదా కాబట్టి ఎందుకు వెళ్ళారు అంటే విద్యారణ్యమ చక్కగా రాశారు సంప్రదాయ పరిపాలన బుద్ధ్య గురు శిష్య ప్రవాహం అనేది సంప్రదాయము దాన్ని పాటించాలి ఎంతవాడైనా సరే గురువు దగ్గరే విద్యను గ్రహించాలి కాబట్టి రాముడు అదే చేశడు కృష్ణ పరమాత్మ అదే చేసినప్పుడు భగవత్పాదులు మాత్రం ఆ సంప్రదాయాన్ని ఎందుకు పోంచుకుంటారు అంటే వారు కూడా సంప్రదాయానుసారం అది కూడా ఇంకో నీతి కూడా ఉంది.
(37:13) ఇప్పుడు సంప్రదాయానుసారంగా సన్యాసాన్ని గ్రహించాలంటే కాలటికి ఓంకారేశ్వరునికి మధ్యలో ఇంకెవరు సన్యాసులు దొరకలేదా కానీ ఏమిటంటే ఇక్కడ మనక చెప్పేది ఏంటంటే గురువు విషయంలో రాజీ పడకూడదు అద్భుతం మనక ఇంకెవరు లేరులే ఈయనే గురువు అని చెప్పి మనక ఇంకెవరు దొరకరు మా ఊరిలో ఈయన పెద్దాయన ఉన్నారు ఈయనే మాకు గురువు లేకపోతే ఇంకా మాకు ఇంకెవరు తెలియదు ఈయనే గురువు అని గురువుని ఎంపిక చేసుకోకూడదు గురువు అంటే మనకి ఉపనిషత్ చెప్పిన శ్రోత్రియం బ్రహ్మనిష్టం శ్రోత్రియం అంటే శృతి సంపన్నం బాగా అధ్యయన సంపత్తి కలిగినవారు బ్రహ్మనిష్టం అంటే అంటే బ్రహ్మానుభవాన్ని
(37:44) పొందిన వారు ఇది ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. ఈ విషయంలో రాజీ పడకూడదు అంటే నిజంగా బ్రహ్మజ్ఞానం కావాలంటే విషయాలు తెలుసుకోవాలంటే మనం అందరినీ స్వాగతిస్తాం. దత్తాత్రేయ మహర్షి భాగవతంలో చెప్పినట్టుగా పశు పక్షిదుల నుంచి కూడా మనం విషయాలు నేర్చుకోవచ్చు కానీ ఇది చెప్పేది దేని గురించి అంటే బ్రహ్మజ్ఞానం రావడం గురించి తత్వజ్ఞానం రావాలంటే మాత్రం ఇటువంటి గురువు తప్పనిసరి అని మనకి ఉపనిషత్తు చెబుతుంది.
(38:07) కాబట్టి ఇట్లాంటి గురువు విషయంలో మనం రాజేయ పడకూడదు అనే దృష్టితో ఆ అటువంటి గురువు ఎక్కడున్నారు అని చెప్పంటే మనకి గోవింద భగవత్పాదులు నర్మదా తీరంలో తపస్సులో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం వారి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకు వారే ఎందుకంటే ఒకటి ఈ లక్షణాలు వారిలో ఉన్నాయి రెండోది వారిది సాక్షాత్ వ్యాసమహర్షి యొక్క పరంపర నారాయణం పద్మభవంట బ్రహ్మ వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుఖం గౌడ పదం మహాంతం గోవింద యోగేంద్రం అది పరంపర కాబట్టి వ్యాస మహర్షి శుఖ మహర్షి గౌడ భగవత్పాదులు గోవింద భగవత్పాదులు కాబట్టి వేదాంత దర్శనానికి సూత్రకారులైన వ్యాస మహర్షి యొక్క పరంపరలో వచ్చిన
(38:47) వారికంటే గొప్ప గురువులు ఎవరు ఉంటారు కాబట్టి అదే అదే పరంపరలో కూడా మనం వెళ్ళాలి అనే దృష్టితో కూడా భగవత్పాదులు ఆ గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్లి నమస్కరించారు. అక్కడ కూడా ఏం రాశరంటే శంకర దిగ్విజలో ఆ గుహ వారు తపస్సు చేసిన గుహ ప్రాదేశ మాత్ర వివరంగా ఉందంట ప్రాదేశం అంటే అరచేయి ఆ గుహకి ముఖ భాగం లో ఉండే రంధ్రము అరచేయ అంతే ఉందంట వారు దాని లోపల తపస్సు చేసుకుంటున్నారు అంటే యోగశక్తి యోగశక్తితో వారు లోపలికి వెళ్లి తపస్సు చేసుకుంటున్నారు.
(39:18) వారు భగవత్పాదులు ఆ గుహకి ప్రదక్షణ చేసి వారు వచ్చినట్టుగా విన్నవించుకున్నారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఎవరు ఎవరు వచ్చారు అని చెప్పి అడిగారు. దానికి ఎవరు నువ్వు ఎవరు అనే ప్రశ్నకి సమాధానము నిర్వహణ శట్కం అదే చిదానంద రూప శివోహం శివోహం చైతన్య స్వరూపుడైన శివ స్వరూపాన్ని ఇక్కడ శివుడు అంటే మూడు కళ్ళతో ఉండే కైలాసి కైలాసవాసి అని కాదు ఇక్కడ భగవత్పాదులు శివ శబ్దాన్ని ఏ అర్థంలో వాడారుఅంటే ఉపనిషత్తు వాడిన అర్థంలో చెప్పారు.
(39:48) ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అన్యంతేస ఆత్మస విజ్ఞేయః అదృశ్యం అది నీ కంటికి అందదు అవ్యవహార్యం నువ్వు దాని మాటల్లో చెప్పలేవు అగ్రాహ్యం అలక్ష్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యేసారం జీవ బ్రహ్మక్యంతో తెలియబడేది ప్రపంచోపశమం అసలు ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేనిది శాంతం ఎటువంటి వికల్పాలు లేనిది అద్వైతం అసలు భేదమే లేనిది అది శివమైనది అంటే మంగళ స్వరూపమైనది కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం అంటే ఈ అర్థంలో వాడారు శుద్ధమైన చైతన్యము అనే అర్థంలో వాడారు దీన్ని దీన్ని చెప్పడంలో అర్థం ఏమిటంటే ఏం చెప్పారు దాంట్లో నమే జాతి భేదః నమే ద్వేష రాగో నమే లోభమోహో అలాగే
(40:29) ఏమన్నారు ఈ పంచభూతాలు నేను కాదు నాకు లింగము లేదు జాతి లేదు వర్ణము లేదు అంటే ఏమిటి నా నిజ స్వరూపం ఏందంటే సమస్త ప్రపంచంతో నన్ను కలిపేదే నా నిజ స్వరూపం ఒకళ్ళకొకళ్ళకి విభేదం పెట్టేది నా నిజ స్వరూపం కాదు ఇప్పుడు ప్రపంచంలో భేదం ఎలాగో ఉంటుంది. ప్రపంచంలో భేదాన్ని అద్వైతం ఎప్పుడు కాదనిలేదు అందుకనే దీన్ని ఉపనిషత్ అద్వైతం అయింది.
(40:53) అద్వైతం అనడం ఎందుకు ఐక్యం అనొచ్చుగా అద్వైతం ఎందుకంటే మన కళ్ళ ఎదుట ఉండే ద్వైతం అది వ్యవహారంలో ఉండనే ఉంటుంది దాన్ని ఎవ్వరు కాదనలేరు. వ్యవహారంలో ద్వైతం ఉంది దీని పైనది ద్వైతం కంటే కూడా పైనది ఒకటి ఉంది దాంట్లో ద్వైతం లేదని చెప్పడానికి అద్వైతం అని పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు శరీరం ఒక ప్రాంతానికి చెందేది శరీరానికి ఒక లింగం ఉంటుంది స్త్రీ పురుష భేదం ఉంటుంది కాబట్టి ఈ భేదాలన్నీ ఉన్నాయి కానీ భేదాలన్నీ వ్యవహారం కోసమే నిజ స్వరూపం కాదు కాబట్టి నిర్వాణ శట్కంలో భగత్పాదులు ప్రతిపాదించిన విషయం ఏమిటంటే నాకు ఒకళ్ళకి భేదం కలిగించే ఉపాధి నా నిజ
(41:30) స్వరూపం కాదు కానీ అందరిలో ఉండే చైతన్యమే నా నిజ స్వరూపము కాబట్టి ప్రపంచాన్ని ఒకటిగా చూడగలిగే పదార్థం ఏదైతే ఉందో అది నేను అందుకనే భజగోవిందంలో కూడా అంటారు త్వమైతాన్య త్రీకో విష్ణు అదే అడగబోతున్నాను సర్వవ్యాపకమైన చైతన్యం అన్నిటిలో ఉండేది ఒకటే కాబట్టి వ్యర్థం కుప్యసి నువ్వు నా మీద ఎందుకు కోపిస్తున్నావు నా శరీరం ఏదో చేసిందనో నా మాట ఏదో చేసిందనో అని నీకు కోపం వస్తుంది కానీ నీ యదార్థ స్వరూపం నా యదార్థ స్వరూపం ఒకటే ఆ చైతన్యం ఒకటే మన శరీరాలకు ఉండే వ్యవహారం పట్టి నువ్వు కోపమో ప్రేమనో చూపిస్తున్నావు తప్ప మనలో ఉండే ఆత్మ ఒకటే కాబట్టి ఆ భావం ఆ విశాలమైన
(42:10) దృక్పతం మనమంతా ఒకటే శరీరాలు మాత్రమే వేరు శరీరాలు మనసులు ఉపాధులు వేరు అనేది భగవత్పాదులు అక్కడ ప్రకటించిన నిర్వహణ అద్భుతం అద్భుతం అద్భుతం అండి అండ్ ఇక్కడ మరొక విషయం కూడా ఇప్పుడు భజగోవిందం గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇప్పుడు కాశీ క్షేత్రంలో భజగోవిందని యొక్క రచన జరిగింది అని చెప్పేసి అంటారు అయితే అక్కడ స్వామివారు అంటే శంకర్ భగవత్పాదుల వారు చెప్పడం అంటే కేవలం శాస్త్రజ్ఞానము అంటే మోక్షం మనం చేరువ అవ్వాలి అంటే కేవలం పాండిత్యం సరిపోదు సరిపోదు అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనం గీతా భాష్యానికి ఒకసారి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ మోక్షంకి నువ్వు
(42:47) వెళ్ళడానికి ఇప్పుడు కర్మ జ్ఞానము ఇవన్నీ చాలా చాలా రకాలుగా ఉన్నాయి రకరకాల మార్గాలు ఉన్నాయి. అవును అయితే అసలు భగవత్పాదుల ప్రకారం మోక్ష సాధనకు ఉండేటటువంటి మార్గం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు నేను చెప్పడందు భగవత్పాదులు వారు చెప్పిందే కాబట్టి భగవత్పాదులు ఏమన్నారు వదంతు శాస్త్రాని యజంతు దేవాన్ దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఇవన్నీనా చేసుకోండి మీరు యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి జపాలు చేయండి తపాలు చేయండి కానీ ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం జన్మ శతంలో కూడా రాదు అని చెప్పారు.
(43:26) దీన్ని ఇంకో రకంగా చెప్పాలని చెప్పంటే వారు ఏమన్నారు వివేక చూడడామణలోనే అన్నారు మళ్ళీ మోక్ష సాధన సామగ్రియం భక్తిరేవ గరియసి అన్నారు మోక్ష సాధనంలోకి వెళ్ళ గొప్ప సాధనం సాక్షాత్ సాధనం ఏమిటంటే భక్తి అన్నారు అదేంటి ఇప్పుడే అన్నారు కదా దేవతోపాసన వల్ల మోక్షం రాదంటే భక్తి అంటే అసలైన నిర్వచనం ఒకటి ఉంది ఏమిటంటే దాన్ని రెండో పంక్తి స్వస్వరూపానుసంధానం భక్తి రిత్య విధీయతే నీ యొక్క నిజ స్వరూపాన్ని వెతకడం అనేది భక్తి కాబట్టి స్వస్వరూప జ్ఞానం వల్ల మోక్షం మరి దేవతా భక్తి అంటాం కదా అది నిజమైన భక్తి ఎప్పుడు అవుతుంది అంటే ఆ దేవత ద్వారా నీ యదార్థ స్వరూపాన్ని
(44:04) తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ఆ దేవతను ఆశ్రయిస్తావో అది అసలైన భక్తి అదే కృష్ణుడు మీరు గీత అన్నారు కదా కృష్ణుడు అందుకనే జ్ఞాన భక్తి శ్రేష్ట భక్తి అని చెప్పి అన్నాడు గీతలో భగవంతుని ఏదో ప్రయోజనం కోసం మనం పూజించకుండా జ్ఞానం కోసం లేదా జ్ఞానంతో పూజించినప్పుడు అది పరిపూర్ణమైన భక్తి అనిపించుకుంటుంది కాబట్టి ఆత్మజ్ఞానమే అసలైన భక్తి అనే సిద్ధాంతాన్ని గీతాముఖంగా కూడా భగవత్పాదులు చెప్పారు కాబట్టి నిర్వివాదంగా జ్ఞానమే మోక్ష సాధనం మనం గీత గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాము.
(44:36) మరి భగవత్పాదులు కర్మని ఉపాసనని కాదన్నారు అంటే కాదు ఆ రెండు కూడా తప్పనిసరి అని చెప్పారు. దేనికి తప్పనిసరి నీకు జ్ఞానానికి యోగ్యత రావడానికి యోగ్యత రావడానికి అవి తప్పనిసరి కాబట్టి ఈ కాలంలో మనం చాలా మంది ఒక మాట అంటుంటారు ఆ మాట నిజం ఏమిటంటే ఎంత జ్ఞానం ఉన్నా భక్తి లేకపోతే వ్యర్థం అని ఎంత జ్ఞానం ఉన్నా భక్తి లేకపోతే వ్యర్థం అని నిజం ఈ మాట నిజం అయితే జనాలు ఇది ఎట్లా చెప్తున్నారు అంటే జ్ఞానం అక్కర్లేదు భక్తి చాలన్నట్టు చెప్తున్నారు [నవ్వు] అట్లా చెప్తున్నారు అంటే దాని అర్థం ఇట్లా తీసుకుంటున్నారు ఈ మాట మనకు పురాణాల్లో ఉండేదే దీని యొక్క యదార్థమైన అర్థం
(45:10) ఏమిటంటే అంటే నువ్వు జ్ఞాన మార్గంలో ఎంత ప్రయత్నం చేసినా భక్తి లేకపోతే అది ఫలించదు. జ్ఞాన మార్గంలో నువ్వు ఎంత ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా నీకు భక్తి లేకపోతే అది పండదు. ఇది ఎట్లాంటిది ఒక రకంగా మనం ఎట్లా చెప్పాలంటే పిహెచ్డి మాస్టర్స్ డిగ్రీ లేకుండా వ్యర్థము అని చెప్పి అన్నట్టు అంటే ఏమిటి నువ్వు ఎన్ని పిహెచ్డి కోర్సులు చేసినా ముందు మాస్టర్స్ చేస్తే 10ెత్ సర్టిఫికెట్ లేకపోతే ఇప్పుడు 10ెత్ సర్టిఫికెట్ పిహెచ్డి 10ెత్ సర్టిఫికెట్ లేకుండా వ్యర్థము అని అనే మాటకు అర్థం ఏంటి పహెచ్డి అక్కర్లేదు 10ెత్ సర్టిఫికేట్ చాలు అని ఇక్కడ మనం ఏం చెప్తాము నువ్వు
(45:48) పిహెచ్డి కోర్సులు నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు కనీసం 10త్ సర్టిఫికెట్ లేకపోతే నీకు పిహెచ్డి ఇవ్వరు ఎవరు ఇవ్వరు కాబట్టి కాబట్టి నీకు పిహెచ్డి కావాలంటే ముందుటెన్త్ సర్టిఫికేట్ 10ెత్ సర్టిఫికేట్ తప్పనిసరి అన్నట్లుగా భక్తి అంటే ద్వైత భక్తి ద్వైత భక్తి లేకపోతే నీకు జ్ఞానానికి యోగ్యత రాదు అద్వైత భక్తి రాదు ద్వైత భక్తి లేకపోతే అద్వైత భక్తి జ్ఞానం రెండు పర్యాయ పదాలే అద్వైత భక్తి అంటే జ్ఞానమే కాబట్టి నీకు ద్వైత భక్తి లేకపోతే అద్వైత భక్తి నీకు రాదు అనేది సిద్ధాంతం భగవత్పాదులు ఈ విషయాన్ని రకరకాల విధాలుగా చాలా దగ్గరలో చెప్పారు
(46:21) చాలా చాలా చాలా అద్భుతంగా చెప్పారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మనం ఇప్పుడు గీతా భాష్యం దగ్గరికి వచ్చేసరికి కూడా దగ్గరికి వద్దాం ఎస్ గీతా [గొంతు సవరించుకోవడం] భాష్యం విషయానికి వచ్చేసరికి కూడా మీరు అన్నారు కదా కనకధార స్తోత్రం గురించి అని అసలు కనకధారా స్తోత్రం అంటే మొదలు రాసింది కనకధార స్తోత్రం అన్నారు.
(46:37) అవును అంటే దీనికంటే ముందు ఇది ఎనిమిది సంవత్సరాల వయసులో అంటే అది ఎన్ని సంవత్సరాల వయసులో కనుకార స్తోత్రం అంటే భగవత్ ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం భగత్వా చరిత్ర గురించి వాత గురించి ఇంకో శ్లోకం కూడా ఉంది ఓకే అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత షోడషే కృతవాన్ భాష్యం ద్వాత్రింషే మునిరభ్యగత్ ఇదొక శ్లోకం ఉంది ఎనిమిదవ ఏట వేదాధ్యంనం అయిపోయింది నాలుగు వేదాల అధ్యయనం అయిపోయింది ఎనిమిదవ ఏట ఎనిమిదవ ఏట 12వ సంవత్సరానికి శాస్త్రధ్యయనం పూర్తయింది 16వ ఏటకి భాష్య రచన అయిపోయింది 32 ఏళ్లకి మిగతా అవతార కార్యాలన్నీ అయిపోయాయి. కాబట్టి భగవత్పాదులు
(47:12) ఎనిమిదఏళ్ల లోపే గురుకులంలో ఉన్నారు ఎనిమిదో ఏట గురుకుల నుంచి తిరిగి వచ్చేశరు. ఎనిమిదో ఏట గోవింద భగత్పాదుల దగ్గరికి వెళ్లి 12వ ఏట లోపు శాస్త్ర అధ్యయనం మొత్తం పూర్తి చేశారు. కాబట్టి అట్లా మనం అనుకోవాలి. కాబట్టి ఇది ఎనిమిదో ఏట లోపే ంటే మనం ఒక ఆరు ఏడు సంవత్సరాలు అనుకోవచ్చు. ఉమ్ ఎందుకంటే ఉపనయనం వారికి ఐదో ఏట అయింది అంటే ఐదో ఏటో మూడో ఏటో అట్లా రకరకాల పక్షాలు ఉన్నాయి వారికి చాలా చిన్ననాడే ఉపనయనం అయింది.
(47:38) కాబట్టి ఒక ఐదేళ్లకి ఎనిమిద ఏళ్లకు మధ్యలో అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు కనకధారా స్తోత్రంలో అంటే నార్మల్ గా ఏంటంటే ఈరోజు వాడకలో ఏముంది అంటే మనం ఏదైనా డబ్బు కావాలన్నా సంపాదన కావాలన్నా ధనం అర్జించాలంటే ముఖ్యంగా మీరు కనకధార స్తోత్రాన్ని పటించండి. అని చెప్పే చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తారు అండ్ లో కూడా మనం ఎక్కడ చూసినా అదే అండ్ ముఖ్యంగా ఆకాంక్ష కూడా అదే ఉంటుంది కనకధార స్తోత్రం చదివే వారి యొక్క ఆకాంక్ష కూడా ఇది మనం ఈరోజు 11 సార్లు చదువుదామా లేకపోతే ఈ వారం అంతా చదవగానే మనక ఏదో రావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ
(48:08) స్థితిలో స్వామి వారు కనకధారా స్తోత్రాన్ని అక్కడ పటించడం వెనకాల అక్కడ ఏంటంటే ఆ ఉసిరికాయ చెట్టు నుంచి బంగారు ఉసిరికాయలు పడింది అనేటటువంటి ఒక అది ఉంది అయితే కేవలం దాని ద్వారా అంటే మనకు అంటే వారు చెప్పినటువంటి ప్రతి దాంట్లో లో ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాలకి ప్రసరించేటటువంటి జ్ఞానం ఉన్నది.
(48:28) అవును కచ్చితంగా ఒక త్వాన్ని ప్రతి విషయంలో చెప్పారు తప్పకుండా అయితే కనకధారా స్తోత్రాన్ని వారు పటించినప్పుడు దాని ద్వారా ఈరోజు సమాజానికి ఏం చెప్పాలి అనే ఉద్దేశంలో వారు చెప్పారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కనకధార స్తోత్రం ఎందుకు చెప్పారు అనే దాంట్లో ఒక ఉపదేశం ఉంది అలాగే స్తోత్రంలో చాలా విశేషాలు విశేష అద్భుతం మనం ఏమనుకుంటాం మనకు తెలిసిన కథ ఏమిటి వారు బ్రహ్మచారి ధర్మంగా భిక్షాటనకి వెళ్లారు అవును ఒక ఇంట్లో ఒక ఆవిడ ఇంకేం లేక సిరికాయ ఇచ్చింది అది చూసి వీరికి మనసు కరిగిపోయింది మనసు కరిగిపోయి అయ్యో ఈ వీడికి డబ్బుని ఇవ్వాలి అని చెప్పి
(49:00) లక్ష్మీదేవిని ప్రార్థించారు ఈ స్తోత్రం చెప్పారు అమ్మవారు వెంటనే బంగారం రాల్చేసింది. అయిపోయింది కథ అయిపోయింది. ఒకవేళ ఇదే ఉద్దేశం అయి ఉంటే మరి మిగతా పేద వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళందరి కథ ఏమిటి మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా కనకధార చెప్పొచ్చు కదా అంటే ఈ కథలో చాలా ధార్మికమైన ఒక విషయం ఉంది. భగవత్పాదులో కరుణ ఉంది ఎలాగో ఆలయం కరుణాలయం అంటాం మనం పురాణం ఆలయం కరుణాలయం కాబట్టి కరుణ ఎలాగో ఉంటుంది కానీ ఆ కరుణ ఎందుకు వచ్చింది ఆ కరుణ ఎందుకు వచ్చింది కరుణ ఎలాగో ఉంటుంది అందరూ బాగుపడాలిఅనే విషయంలో కరుణ ఉంటుంది కానీ ఆ కరుణని ఇక్కడ ఈ విధంగా
(49:36) అభివ్యక్త పరచాలి అని ఎందుకు అనిపించింది అంటే ఆ ఆ ఇల్లాలి యొక్క ధర్మ నిష్ట చూసి ఎందుకంటే శాస్త్రంలో నియమం ఏమిటంటే బ్రహ్మచారి గాని యతి గాని అని ఇంటి ముందుకు వచ్చి భిక్షని అర్థిస్తే అడిగితే ఇంట్లో ఆహార పదార్థం ఉండి ఇవ్వకపోతే ఆ గ్రహస్తుడికి ఘోరమైన పాపం వస్తుంది అని ఉంది. ఓకే ఎందుకంటే సన్యాసి బ్రహ్మచారి ఇద్దరూ వాళ్ళు స్వయంపాకం చేసుకోవడానికి లేదు.
(50:05) అంటే ఇతను చదువుకుంటూ ఉండేవాడు ఇతను చదువుకోవడం మానేసి వంటలు చేసుకుంటుంటే ఎక్కడ చదువుకుంటాడు. సన్యాసం అన్నీ వదిలేసిన అతను కాబట్టి ఆయన ఎప్పుడు వంటి చేయాలంటే గిన్నెలు పదార్థాలు వంటిల్లు ఇవి కొనుక్కోవడానికి డబ్బులు ఇవన్నీ ఆ వ్యవస్థ అంతా సన్యాసికి అనవసరం కాబట్టి సన్యాసికి బ్రహ్మచారికి స్వయంపాకం లేదు అని చెప్పింది మరి ఎట్లాగంటే సమాజం మొత్తానికి ఆధార స్తంభం స్తంభం గ్రహస్థాశ్రమం కాబట్టి గ్రహస్తుడే వీళ్ళద్దరిని పోషించాలి అని ఉంది కాబట్టి సన్యాసి గాని బ్రహ్మచారి గాని ఇంటికి వచ్చినప్పుడు భిక్షని అడిగినప్పుడు ఇంట్లో ఆహార పదార్థం ఉండి
(50:36) కూడా ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పు అని ధర్మశాస్త్రంలో లో ఉంది కాబట్టి ఇల్లాలో ఉసిరికాయ ఇచ్చిందంటే ఏమని చెప్ప అర్థం వేరే పదార్థం ఉంటే ఇది ఇవ్వదు గా అంతే కదా అంటే ఇది తప్ప ఇంకేమీ లేదు అయినప్పటికీ ఈ ధర్మశాస్త్రానుసారంగా ధర్మం నా స్వధర్మాన్ని అనుసరించి అడిగినప్పుడు ఉన్నది ఇచ్చేయాలి అనుకొని తనకేమీ లేకపోయినా కూడా ఆ ఉసిరికాయని ఇచ్చేసింది ఆవిడ ఆ ఇల్లాలు ఇది మనకి భాగవతంలో రంతి దేవుడు లాంటి కథ రంతి దేవుడు ఏం చేసాడు ఉపవాసం ఉన్నా ఇంకా ఏం లేకపోయినా ఎవరో వచ్చి అన్నం అడిగారు ఇచ్చేసారు ఇంకోళ్ళు వచ్చారు నీళ్ళ అడిగారు నీళ్ళలో సగ ఇచ్చేశరు మళ్ళీ ఇంకోళ్ళు
(51:10) వచ్చారు మిగిలిన నీళ్ళు కూడా ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి నాకు మిగలకపోయినా పర్వాలేదు పెట్టడం నా ధర్మం అక్కడ ఆయన రాజ ధర్మంతో చేశారు ఇక్కడ ఈవిడ గ్రహస్థ ధర్మంతో చేశారు కాబట్టి అక్కడ రంతి దేవుడి దగ్గర అతను అట్లాంటి త్యాగం చేయగానే త్రిమూర్తులు వచ్చారు అక్కడికి మేము చేసిన పని సామాన్యమైనది కాదు కోరుకో అని చెప్పి అన్నారు అంటే ఆ స్వధర్మానికి అది ఫలితం అదేవిధంగా ఇక్కడ ఈ ఇల్లాలు చూపించిన స్వధర్మ నిష్టకి చాలా గొప్ప ఫలితం ఉండాలి మరి ఆ ఫలితమే ఆవిడకి భగవత్పాదుల ద్వారా కనకధార రూపంలో వచ్చింది. కాబట్టి ఆవిడ ధర్మనిష్టకి
(51:43) సంతోషించి భగవత్పాదులు ఇంత ధర్మనిష్ట ఉండే వాళ్ళకి తప్పకుండా సత్ఫలితం ఉంటుంది అనుకొని అమ్మవారిని ప్రార్థించారు దీనికి రెండో భాగం కూడా ఉంది అమ్మవారు మరి వచ్చి అడుగుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పేదలుగా అన్నారంటే అది కారణం లేకుండా కాదు కదా ఇప్పుడు ఏదైనా సరే కర్మానుసారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ధనం ఉండే ప్రారబ్ధం వాళ్ళకి లేదు ధనయోగం వాళ్ళకి లేదు వాళ్ళకి కర్మ లేనప్పుడు మరి నేను మాత్రం ఏం చేయగలను ఎందుకంటే ఈశ్వరుడు లేని పుణ్యాన్ని ఇస్తున్నాడు అంటే ఈశ్వరుడు కూడా రాగద్వేషాలు ఉన్నట్టు అంటే ఈశ్వరుడు లేని కర్మలు మనకేమ ఇవ్వడు ఉన్న కర్మల
(52:14) నుంచే మనకి ఏది ఎలా రావాలఅనేది నిర్ణయిస్తాడు. కాబట్టి ఆ ఈశ్వరి అయిన అమ్మవారు మరి నన్ను ఏం చేయమంటావ్ ఇప్పుడు అని చెప్పి అడిగింది. భగవత్పాదులు అన్నారు వాళ్ళ ప్రారబ్ధంలో లేకపోవచ్చు కానీ ఆవిడ ఇప్పుడు ఒక కర్మ చేసింది కదా ఒక యోగ్యుడైన బ్రహ్మచారి యొక్క చేతిలో వేదాధ్యాయనం చేస్తున్న ఒక విద్యార్థి యొక్క చేతిలో ఒక ఉసిరికాయ పెట్టింది అసలు అది కాదు ఒక బ్రహ్మజ్ఞాని చేతిలో ఒక ఉసిరికాయ పెట్టింది.
(52:38) దీనికి ఎంత ఫలితమో దానికి అనుసారంగా ఇవ్వు అని చెప్పి అన్నారు. అంటే కర్మలు ఉంటాయి కదా ఆ కర్మల యొక్క రిలీజ్ డేట్ మనం మూవ్ చేయొచ్చు కర్మని సంచరించి ఉంటే అది ఈశ్వర నిర్ణయం ప్రకారం అది ఎప్పుడు రావాలనేది ఉంటుంది కాబట్టి అది నీ నిర్ణయమే కాబట్టి ఉన్న కర్మ ఉంది నువ్వు పూర్వ ప్రారబ్ధం లేదని చెప్పవచ్చు కానీ ఇప్పుడు చేసిన కర్మల్లో ఒక ఫలితం ఉందిగా ఆ ఫలితాన్ని ఏదో ఇప్పుడే ఇచ్చేయి అని చెప్పి అన్నారు కాబట్టి యోగ్యుడైన బ్రహ్మజ్ఞానికి ఒక ఉసిరికాయ ఇవ్వడం యొక్క ఫలితం ఎంతో అంత ధనం ఇవ్వు కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానికి వడలిపోయి పోయిన ఎండిపోయిన ఒక ఉసిరికాయ యొక్క దానం యొక్క
(53:14) ఫలితం ఏమిటంటే బంగారు ఉసిరికాయల యొక్క వృష్టి ఎందుకు అంటే పాత్రత బట్టి దానం ఉంటుంది. పాత్రత బట్టి దానం ఉంటుంది. ఎందుకంటే మనకి లోకంలోనే ఉంది గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్లో ఎందుకు చేస్తాం అంతే కదా మనం కూరగాయలు అదే డబ్బుని మనం కూరగాయల మీద పెడితే ఆ కూరగాయల తిండంతా దాని ప్రయోజనం అయిపోతుంది. నిజం అదే మనం ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క ప్రయోజనం పెరుగుతుంది కాబట్టి ఎలాగైతే డబ్బుని మనం పెట్టే చోటు పట్టి డబ్బు విలువ ఒకటైనా మనక వచ్చే ప్రయోజనం ఎలాగైతే మారుతుందో దానం చేసేటప్పుడు కూడా ఎక్కడ చేస్తున్నామో అనేదాన్ని బట్టి దాని ప్రయోజనం మారుతుంది. అందుకనే దానం చేయడం
(53:52) మంచిది అని చెప్పి అన్నారు. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఇచ్చింది బ్రహ్మజ్ఞానికి అలాగే ధర్మశాస్త్రంలో ఇంకో మాట ఉంది యతిహస్తే జలం ద్యాత్ భైక్ష్యం ద్యాత్ పునర్జలం తజ్జలంధనం తద్భైక్ష్యం మేరునా తుల్యం తజ్జలం సాగరోపం అని ఒక మాట ఉంది. యతికి ఒక యతీశ్వరులు మన ఇంటికి వచ్చి భిక్ష చేసినప్పుడు పద్ధతి ఏమిటంటే ముందు వారికి చేతికి నీళ్ళ ఇచ్చి వారికి భిక్షణ సమర్పించి మళ్ళీ చేతికి నీళ్ళు ఇవ్వాలి.
(54:16) తద్వైక్ష్యం మేరునా తుల్యం వారిచ్చి పెట్టే ఆ పట్టెడు అన్నము బంగారు పర్వతమైన మేరువుతో సమానము వారి చేతిలో పోసిన కొద్దిపాటి నీళ్ళు సాగరోపమం సముద్రంతో తుల్యము అంటే ఏమిటి అక్కడ ఒక యతికి అంటే ఎంతో మందికి మోక్షాన్ని ఇవ్వగలిగిన ఒక జ్ఞానికి మనం ఏదైతే సమర్పిస్తామో తద్వారా ఆ బ్రహ్మజ్ఞాని రకరకాల సమాజ ఉద్ధార కార్యాలు చేస్తారు కాబట్టి ఆ దానానికి అంత ఫలితం ఉంటుంది కాబట్టి ఆ న్యాయానుసారంగా భగవత్పాదులు ఏమన్నారంటే నాకు చేసిన దానానికి బ్రహ్మజ్ఞాని అయిన వాడికి చేసిన దానానికి యోగ్యమైన ఫలితం ఏమిటో అది ఇవ్వు అని చెప్పి అన్నారు. తదనుసారంగా దానికి
(54:56) బంగారు ఉసిరికాయల యొక్క వర్షం దానికి తగిన ఫలితం అంటే బ్రహ్మజ్ఞాని యొక్క చేతిలో పెట్టిన ఉసిరికాయ ఒకవైపు బంగారు ఉసిరికాయల యొక్క వర్షం ఒకవైపు పెడితే అవి సమతూగులుతాయి. సమంగా తోలుతాయి అవి ఇది కనకధార స్తోత్రం వ్రాయడం వెనకాలు ఉండే సందేశం ధార్మికమైన సందేశం ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కదా ఖచ్చితంగా చాలా ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను మీరు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడిగిన రెండో భాగం ఏందంటే కనకధారలో వారు ఏ ఉపదేశాలు చేశారు అని చాలా విషయాలు ఉన్నాయి చాలా తత్వమైన విషయాలు ఉన్నాయి అమ్మవారిని చెప్తూ కామప్రదా భగవతోపి కటాక్షమా అమ్మవారి చోప భగవంతుడిలో
(55:30) కూడా ఆ ప్రేమని పుట్టించగలదు అనేది మామూలు మాట కానీ భగవంతుడిని నేను సృష్టి చేయాలి అని సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు అని అర్థం దాంట్లో కూడా అర్థం అలాగే ఒక మంచి శ్లోకం దాంట్లో శృత్య నమోస్తు శుభకర్మ ఫల ప్రసోత్యే రత్యే నమోస్తు రమణీయ గుణారణవాయే శక్తియే నమోస్తు శతపత్ర నికేతనాయే పుష్టియే నమోస్తు పురుషోత్తమ వల్లభాయే అని ఉంది ఏమంది అవును మామూలు శ్లోకాలే కదా అనిపిస్తుంది కానీ దీంట్లో అమ్మవారి యొక్క నాలుగు స్వరూపాలు ఆ స్వరూపం వల్ల మనకు వచ్చే ప్రయోజనం అవి చెప్పబడి ఉన్నాయి ముందు అమ్మవారి యొక్క స్వరూపం ఏందంటే శృతి వేదమే వారి యొక్క
(56:06) స్వరూపం శృతే నమోస్తుతే శృతి ఏం చేస్తుంది శుభ కర్మ ఫల ప్రసుతే శుభమైన కర్మ ఏమిటో ఆ కర్మని ఆచరించడం వల్ల మనకి మంచి ఫలాలని ఇవ్వడానికి దారి తీసేది ఏంటంటే వేదం కాబట్టి అటువంటి ప్రయోజనాన్ని కలిగించే వేదము అమ్మవారి యొక్క స్వరూపము రత్యే నరమోస్తు రమణీయ గుణార్ణవాయే రతి అంటే ఆనందం ఆనందం అమ్మవారి యొక్క స్వరూపం అది దేని వల్ల వస్తుందంటే రమణీయ గుణ అంటే రమణీయ అంటే శాస్త్రంలో రమణీయ చరణః రమణీయమయోనిమా పద్యంత మొదలైన మంత్రాలో రమణీయం అంటే ధార్మికము అని చెప్పి అర్థం కాబట్టి ధార్మికమైన గుణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అది అమ్మవారి యొక్క స్వరూపము
(56:42) శక్తిమస్త రమణీయ గుణమాయి అలాగే శక్తి శక్తి అయిన మోస్తుతో ఎట్లాంటిది శతపత్రనికేతనాయ శతపత్రం అంటే పద్మం పద్మంలో కూర్చున్నది అమ్మవారు పద్మంలో కూర్చుండేది అంటే దీంట్లో ఇంకా తత్వం ఉంది మన శరీరానికి శక్తి ఎందుకు ఉందంటే దానికి ఆరు పద్మాలు కారణం అవే షట్చక్రాలు షట్చక్రాలను పద్మాలుగా చెప్పడం ఉంది చక్రాలుగాను చెప్పడం ఉంది అందుకనే సహస్రారాంబుజారడ మూలాధారేక నిలయ స్వాధిష్టానాంబుజ గత స్వాధిష్టానం అంబుజ గత కాబట్టి స్వాధిష్టాన పద్మంలో ఉండేది ఎందుకంటే రేకులు అనుకుంటే పద్మం అవి కొసలు అరలు అనుకుంటే చక్రం అంతే రెండిటిని ఒకటే రకంగా
(57:22) చూసేది ఉంది శాస్త్రంలో కాబట్టి ఆరు చక్రాల్లో ఉండి శరీరానికి శక్తి అందించే ఆ కుండలిని ఇడా పింగళ సుషుమ్నా ద్వారా ఏ శక్తి అయితే ప్రసరించి ఆరు చక్రాల ద్వారా శరీరానికి శక్తి అందిస్తుందో అట్లా షట్చక్రాల్లో ఉండి శరీరానికి శక్తి అందించే స్వరూపం అమ్మవారు శక్తి అనస్తే శతపత్రి కేతనాయి అలాగే ఆమె పురుషోత్తమ వల్లభ పురుషోత్తముడు అంటే మహావిష్ణువు ఈశ్వరుడు నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఆయన ఎవరంటే ఈ సమస్త సృష్టిని ఆ సృష్టించి పోషించి లయింప చేస్తున్నవాడు ఆయన యొక్క వల్లభ అంటే ఆయన చేసే కార్యక్రమాల్లో శక్తిగా ఆయనకి ఆ ఆసరాన్ని అందించేది
(58:00) మ్ ఆసరాన్ని ఎలా అందిస్తుందిఅంటే పుష్టిగా ఆయన స్థితికారకుడు ప్రధానంగా స్థితికారకుడు కాబట్టి స్థితి చేసేటప్పుడు ఏం కావాలి లోకాన్ని పోషించాలి కాబట్టి స్థితికారకుడి యొక్క పోషణ శక్తి అమ్మవారు అని ఈ శ్లోకానికి ఇంత అర్థం ఉంది మనం చదివేసుకుంటూ వెళ్ళిపోతూఉంటాం ఇంత అర్థం ఉంది దీంట్లో అద్భుతమైనటువంటి ఆ రకంగా ఈ ఈ కనకధార స్తోత్రంలో రకరకాల విశేషాలు ఉన్నాయి కొంతమంది దేవతా స్వరూపాన్ని అంటూంటారు అమ్మవారు మామూలుగా లక్ష్మీదేవి మామూలుగా ఎర్ర వస్త్రాలతో అట్లా ఉంటుంది.
(58:31) ఇక్కడ ఏం చెప్పారంటే సంపత్కరాణి సకల అది కాదు దిగ్గస్తి కనక కుంభ ముఖావసష్ట స్వర్వాహిని విమల చారుజలపృతాంగిం ఇది అలాగే ధవళాంబరం శ్వేతాంబరం ధరించి ఉన్నది ఇదంతా మనకి అమ్మవారి యొక్క ఉపాసనలో కమలాత్మిక అన ఒక విద్య ఉంది ఆ కమలాత్మిక దేవికి సమానమైన రూపం అంటే అది కూడా లక్ష్మీదేవే లక్ష్మీదేవి కమలాత్మిక అన్నా కూడా లక్ష్మీదేవే ఆ లక్ష్మీ మంత్రంలో కూడా కమలాత్మికే అనే పదం వస్తుంది కాబట్టి ఆ కమలాత్మిక అంటే లక్ష్మి కానీ ప్రత్యేకించి ఆ రూపానికి కమలాత్మిక అని పేరు కాబట్టి ఆ రూపాన్ని వారు దృష్టిలో పెట్టుకొని వర్ణించి ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఈ కనకధారని ప్రపంచం పట్ల తమ వాంగ్మయమైన
(59:11) అనుగ్రహానికి తొలి అడుగ్గా వారు ఎందుకంటే మనం ముందు అనుకున్నట్లుగా మన పీఠాలు పెట్టి ఒక అనుగ్రహం చేశారు దేవాలయాలు సంస్కరించి ఒక అనుగ్రహం చేశారు వాదాలు చేసి సిద్ధాంతపరమైన కొన్ని అనుగ్రహాలు చేశారు కానీ నేటికి కూడా మనం ప్రయోజనం పొందేటట్టు ఒక పక్క పీఠాలు ఒక పక్కల వామయం ఆ రెండు కాలాన్ని అతిక్రమించి మనకు వస్తుండేవి ఏమిటంటే ఈ రెండు కాలానికి అతీతంగా వస్తే ఈ రెండు కాబట్టి వారు వాంగ్మయ రూపంగా మనకు చేసిన అనుగ్రహంలో తొలి అడుగు ఏమిటంటే ఈ కనకధార స్తోత్రం మహా అద్భుతం మహా నాకు వైయక్తికంగా వారు రాసిన స్తోత్రాలు అన్నిటిలోకి ఇష్టమైన స్తోత్రం ఇదే వా
(59:44) కనకధార అద్భుతం నిజంగా మీరు చెప్తుంటే అంటే ఒక ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అది కానీ దానికి నేను అడుకున్నానే సమాధానం దొరికేసింది బట్ ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న నార్మల్ గా చాలా మందిలో ఉండేటటువంటి ఒక డౌట్ ఎందుకంటే కర్మను నమ్మేటటువంటి అంటే కర్మ నమ్మేదే మన ధర్మం అయితే ఏది ప్రారబ్ధ కర్మని ఎవరు మార్చలేరురా అయిపోయింది అనేటటువంటి దాంట్లో చాలా మంది బ్రతుకుతా ఉంటారు.
(1:00:06) కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఈ దీంట్లో మీరు చెప్పడం జరిగింది అంటే కర్మని మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు అంటే ఆ కర్మ ఎప్పుడు వస్తుందో మార్చుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే ఏమంటే మనకు సంచితం అనేది ఒక మూట లాగా ఉంది దాంట్లో ఒక గుప్పిడి తీసుకొని ఈ శరీరానికి ఈ కర్మ అని చెప్పి ప్రారబ్ధ కర్మ వచ్చింది.
(1:00:24) కాబట్టి మనం ఇప్పుడు అనుకుంటాం కాబట్టి ఈ శరీరానికి ఏ కర్మ నిర్ణయం అయిపోయింది గా ఇంకేం చేస్తాం మనం అన్నప్పుడు శాస్త్రం ఒకటి చెప్పింది అక్కడ ఇప్పుడు ఒకవేళ ఇదే పరిస్థితి అయితే ఇంకా శాస్త్రంలో కర్మలు చెప్పడం ఎందుకు మీకు ఇది కావాలంటే ఇది చేయండి అని చెప్పడం ఎందుకు అది చెప్పడానికి కారణం ఏమిటంటే త్రిభిర్ వర్షైహి త్రిభిర్మాసేహి త్రిభి పక్ష త్రిభిర్ దినేహి అత్యుత్కటై పుణ్య పాపై రహైవ ఫలమస్మతే అని ఉంది ఆ పాప పుణ్యాలు బాగా తీవ్రంగా ఉంటే మూడు సంవత్సరాలకు గాని మూడు నెలలకు గాని మూడు పక్షాలకు గాని మూడు రోజులకు గాని ఆ ఫలితాన్ని అతను ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాడు అని ఉంది. కాబట్టి
(1:01:00) శాస్త్రాలు ఎక్కడెక్కడైతే ఈ ప్రయోజనానికి ఈ కర్మ అని చెప్పి ఉందో ఈ జన్మలోనే అది ఫలితం ఇచ్చేంత తీవ్రంగా ఆ కర్మని మనకు ఉపదేశించారు అని చెప్పి అర్థం అలాగే మనం మామూలుగా ధర్మ కార్యాన్ని మనం చాలా గట్టి సంకల్పంతో తీవ్రత అనేది ఎప్పుడు వస్తుంది సంకల్పం వల్ల వస్తుంది సంకల్పం కాబట్టి చాలా గొప్ప నమ్మకంతో శ్రద్ధతో చాలా శ్రద్ధతో చాలా భక్తితో చాలా ధర్మనిష్టతో మనం ఒక మంచి పని చేసామంటే మనం ఈశ్వర నిర్ణయానుసారంగా దాని యొక్క ఫలితం మనకి ఈ జన్మలో తప్పకుండా రావచ్చు విపరీతం కూడా మనం చాలా చాలా క్రౌర్యంతో చాలా కోపంతో చాలా కామంతో ఏమన్నా చేస్తే దాని
(1:01:34) యొక్క దుష్ఫలితం ఈ జన్మలోనే రావచ్చు కాబట్టి ప్రారబ్ధానికి కర్మలని జత చేసుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్ అది అది ఉంది శాస్త్ర అది ఉంది అండ్ చాలా అద్భుతంగా చాలా మందికి చాలా ప్రశ్నలకి సమాధానం ఇది కనకధార స్తోత్రం అండ్ కేవలం పటించడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి త్వాన్ని కూడా తీసుకొని మనం ఏం చేయొచ్చు మనం ఏం చేస్తే మనక ఏమ వస్తుంది మనకు ఉన్న దాంట్లో అనేటటువంటి ఒక అద్భుతాన్ని మనకు చాలా చక్కగా మీరు వివరించారండి అయితే ఇక్కడ మరొకటి ఇప్పుడు కాశీ క్షేత్రం విషయంలో ఇంకొకటి అంటే సినిమాల ద్వారా చాలా ఎక్కువగా పాపులర్ అయినటువంటి ఒకటి నేను మిమ్మల్ని
(1:02:06) అడుగులనుకుంటున్నాను శంకర్ల వారికి సంబంధించింది అయితే ఇది చండాలుడు చండాలు వచ్చినప్పుడు తొలుగు తెలుగు అని చెప్పేసి అది సినిమాలో ఏందంటే ఇంకా విపరీతంగా ఆ చూపించడం జరిగింది ఏ సినిమా అది ఆదిశంకరాచార్యుల వారి పైన ఎందుకంటే తెలుగులో ఇటీవలలో ఒక సినిమా వచ్చింది. పరమ దారుణంగా ఉంది ఆ సినిమా అసలు శంకరాచార్యుల యొక్క గాంభీర్యానికి అసలు వాళ్ళు చెప్పిన నిజే విషయాలకి అసలు దగ్గరగా లేదు అన్నిటికంటే మంచిది ఏమిటంటే సంస్కృతంలో వచ్చిన సినిమా అన్ని సినిమాల్లో కంటే మేలు అది దయచేసి మీరు సంస్కృతంలో వచ్చిన సినిమాని చూసే ప్రయత్నం చేయండి దానికి ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి
(1:02:40) అర్థం కాకపోయినా పర్లేదు నిజంగా నాకు కూడా చాలా మేలు చాలా మేలు దీనికంటే నాకు అది అనిపించింది అది చూసినప్పుడు అసలు అంటే వారి తత్వానికి ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కి ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు నాకు లేదు లేదు నాకు ఎక్కడా సింక్ అవ్వలేదు లేదు అసలు అసలు బట్ ఏంది అంటే ఈ సినిమాని ఎక్కువ మంది జనాల లోపటికి వెళ్లేటటువంటి కాలం కదా ఇది సో దానికి సంబంధించి ఒకసారి మీ ద్వారా ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది అక్కడ మనీషా పంచకాన్ని కూడా వారు చెప్పారు బ్రహ్మజ్ఞానం అన్నిటికంటే ముఖ్యమైనది బ్రాహ్మణుడు చండాలుడు ఇవన్నీ కాదు నువ్వు మోక్షాన్ని చేరుకోవాలంటే
(1:03:09) బ్రహ్మజ్ఞానం కావాలనేటటువంటి అద్భుతమైనటువంటి అది అక్కడ వచ్చింది. అసలు దాని గురించి ఒకసారి మీ ద్వారా భగవత్పాదులకి కాశీ క్షేత్రం చాలా ఇష్టమైనది. ఇది మనక ఎలా తెలుస్తుంది అంటే వారి స్తోత్రాల ద్వారా వారు సాక్షాత్తు కాశీ పంచం అని చెప్పి ఒకటి రాశారు అలాగే అన్నపూర్ణదేవి గురించి రాస్తూ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి అని చెప్పి అన్నారు.
(1:03:31) అలాగే కాలభైరవుడి మీద అష్టకం రాస్తూ కాశికాపురాధినాథ కాలభైరవజ దాంట్లో కాశివాసి లోక పుణ్య పాపశోధకం విభ కాశీలో నివసించే వాళ్ళకి పుణ్య పాపాల యొక్క లెక్కలన్నీ చూసి వాళ్ళకి కావాల్సిన కావల్సినట్టుగా ఇచ్చి తీసి చేసేవాడు ఇట్లాంటి మాటలు ఉన్నాయి దాంట్లో అలాగే మనకి విశ్వనాథుడి మీద ప్రత్యేకించే శ్లోకం ఉంది జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ రకంగా చాలా దగ్గరల భగవత్పాదులు గంగాష్టక గంగా స్తోత్రాలు రెండు రాశారు.
(1:03:57) గంగ స్తోత్రాలు రెండు రాశారు దాంట్లో స్పష్టంగా ఏ గంగ అంటే కాశీ ప్రాంత విహారిణి అని ఉంది. కాబట్టి అక్కడ కూడా కాశీలో ఉండే గంగని వారు చాలా ప్రత్యేకించి సంభావించారు కాబట్టి భగవత్పాదులకి కాశీ క్షేత్రం మీద చాలా అభిమానం ఉంది. అంటే అది కాశీ క్షేత్రం అట్లాంటిది విశ్వనాథ క్షేత్రం అవిముక్త క్షేత్రం ఆనందం మహాస్మశానం ఓ చాలా పేర్లు ఉన్నాయి దానికి చాలా గొప్ప క్షేత్రం అది భారతదేశానికి హృదయస్థానంలో ఉంది కాబట్టి ఆ క్షేత్రం అంటే భగవత్పాదులకి చాలా అభిమానం అని అనడంలో ఎటువంటి సంశయం లేదు కాబట్టి అక్కడ జరిగిన వృత్తాంతం ఇది మీరు అన్నట్టుగా అది
(1:04:32) ఆ కథ నిజానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఏదో వర్ణ వివక్షలు అసలు వర్ణాలు కులాలు సంఘాలు అసలు పూర్తిగా తీసేయాలి అని ఒక పక్షం దీన్ని పెట్టుకొని ఒక పక్షం లేదు లేదు అవన్నీ తప్పకుండా ఉండాల్సిందే అని ఒక పక్షం ఈ రెండు పక్షాలు ఈ కథను పెట్టుకొని మాట్లాడుతుంటే అసలు ఆ కథకి ఈ రెండు వాదాలకి సంబంధమే లేదు సంబంధమే లేదు అద్భుతం దీన్ని ఈ విషయాన్ని నిన్న అవధానంలో చెప్పడం అయింది మీ ముఖంగా కూడా ఈ ఛానల్ ఖచ్చితంగా కావాల్సింది దాని అవసరం ఉంది ఇక్కడ ఏం జరిగింది ఇలాగ మనం అనుకున్నట్టుగా రేఖ మాత్రంగా కథను చెప్పుకొని దాని లోతుల్లోకి వెళ్దాం
(1:05:03) భగవత్పాద స్నానానికి వెళ్తున్నారు లేదా స్నానా నుంచి వస్తున్నారు ఎదురుగా ఒక చండాలుడు కనపడ్డాడు పక్కకు జరుగు నాయన అని చెప్పి అన్నారు. అతను శరీరాన్ని జరగమంటారా దేహాన్ని శరీరాన్ని జరగమంటారా ఆత్మను జరగమంటారా అని చెప్పి అడిగారు. భగవత్పాదులు ఆ మాట విని ఓహో ఈయనకి చాలా బ్రహ్మజ్ఞానం ఉన్నట్టుంది కాబట్టి వీరికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి అన్నారు. ఇంతవరకు కథ ఉంది.
(1:05:30) అసలు ముందు ఇది ఎక్కడ మొద జరగమడం ఎందుకు ఎందుకు జరగాలి నేను ముట్టుకోకూడదా అస్పృష్యత ఇవన్నీ వస్తాయి దాంట్లో అసలు దానికి సంబంధించిందే కాదు ఎందుకంటే ఆ చండాలుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన ఆయన కాటి కాపరి చండాలుడిని పక్కన ఇప్పుడు నేను మాత్రం కాటి నుంచి వస్తే మా అమ్మేయ ముట్టుకోదు నన్ను అంతే కదా ఒకవేళ నేను అక్కడికి వెళ్లాల్సిన ఏదో పరిస్థితి వచ్చిందంటే మా తల్లిదండ్రులే నన్ను ముట్టుకోరు.
(1:05:54) కాబట్టి ఎవ్వరైనా సరే వాడు అగ్నిహోత్ర అయినా సరే సోమయాజ అయినా సరే కాటికి వెళ్ళవచ్చారంటే ముందు చేయాల్సింది స్నానం దాని తర్వాత ఇంకా సొంత పిల్లలనైనా తల్లిదండ్రులనైనా చుట్టాలి ఎవ్వరినైనా ముట్టుకుండేది స్నానం చేశకే కాబట్టి అసలు ముందు స్నానం చేస్తే కానీ ఎవ్వరిని ముట్టుకోకూడని అవసరం ఆ చెండాలడి వైపు నుంచి ఉంది.
(1:06:15) భగవత్పాదుల వైపు నుంచి ఏంటంటే సన్యాసులు అందరినీ ముట్టుకోరు ముట్టుకోకూడదు ముట్టుకోరు ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి వేరు వారు శౌచనలో ఉంటారు వారి యొక్క మడియం విషయం అది వేరు వారు నేను అన్నట్టుగా ఇప్పుడు ఇట్లా ఏ పరిస్థితే కాదు అగ్నిహోత్ర వచ్చినా కూడా వాళ్ళు ముట్టుకోరు అందుకనే మనం చూడండి జగద్గురువుల విజయాత్రకి వచ్చినప్పుడు వారు ఆసీనులై ఉంటారు ఆసనం మీద వారి ముందు పాదుకులు ఉంటాయి మనం ఆ పాదుకులకు నమస్కారం చేసుకుంటాం అంతేగాన ముట్టుకొని పట్టుకొని పాదాలు ముట్టుకొని అట్లా చేసే పద్ధతి లేదు సన్యాసులకు అది లేదు.
(1:06:42) అప్పుడు మనం చూస్తూ ఉంటాం అయితే కొంతమంది అడగొచ్చు నేను కూడా ఈ మాట చెప్పా కాదండి కొంతమంది సన్యాసులు సీఎం ని ఖర్చుకున్నారు ముద్దు పెట్టుకున్నారు అంటే వాళ్ళ గురించి మనకు తెలియదు. నిజమైన సన్యాసులు అయితే అట్లా చేయరు అట్లా చేయకూడదు కాబట్టి సన్యాసికి ఎవరిని ముట్టుకోకూడని అవసరం సన్యాసికి ఉంది. స్నానం చేస్తే తప్ప ఎవరిని ముట్టుకోకూడని అవసరం కాటికి వెళ్లి వచ్చిన వాళ్ళకి ఉంది స్మశానానికి వెళ్లి వచ్చిన వాళ్ళకి ఉంది కాబట్టి ముట్టుకోకపోవడమే ధర్మ సమ్మతం ఇక్కడ మరి వస్తుండేది శంకరాచార్యులు కదా ఆయన్న ఎందుకు జరగమండం ఈయనే జరగొచ్చు కదా అంటే సన్యాస ఆశ్రమానికి
(1:07:10) ఉండే మర్యాద అది అలాగే మన సోమయాజ అయినా సరే సన్యాసి ఎదురుగా వచ్చారంటే నమస్కారం చేసి పక్కక వెళ్ళాలి. అదే ఎందుకంటే సన్యాస ఆశ్రమానికి ఉండే మర్యాద అది అన్ని ఆశ్రమాల కంటే ఎత్తి ఆశ్రమానికి మర్యాద ఎక్కువ కాబట్టి యతి వస్తుంటే మిగతా వాళ్ళే దాన్ని దారి ఇవ్వడం కాబట్టి శంకరాచార్యులు అయ్యా కొంచెం పక్కకు జరగండి అని చెప్పి అన్నారు వెంటనే ఇక్కడి వరకు కాబట్టి పక్కకు జరగమని చెప్పి అడగడంలో అనోచిత్యం ఏమీ లేదు స్పష్టమే బాగానే ఉంది.
(1:07:35) అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న శరీరాన్ని జరగమంటారా ఆత్మను జరగమంటారా అన్నమయాద అన్నమయం అవా చైతన్యమేవ చైతన్యం ఇతివర దూరేకర్తమంచికిం అని చెప్పి అడిగారు. ఇది మనకి వినంగానే చాలా పెద్ద ప్రశ్న అడిగారుని చెప్ప అనిపిస్తుంది నా దృష్టిలో చాలా ప్రాథమికమైన ప్రశ్న ఇప్పుడు మీరు నన్ను ఈరోజు ఇక్కడికి రమ్మన్నారు మీరు రమ్మన్న ఆత్మనా శరీరాన్న అయ్యా నేను రాలేను మా ఆత్మ వస్తుంది మా శరీరం ఇంట్లో ఉంటుంది మా ఆత్మ వస్తుంది తీసుకెళ్ళండి అని చెప్పి అంటామా [నవ్వు] అయ్యా మీరు భోజనానికి రండి అంటే నాకు ఈరోజు ఖాళీ లేదండి శరీరం ఇంట్లోనే ఉంటుంది ఆత్మ పంపిస్తది భోజనం ఇప్పుడు మనం ఆత్మలకి
(1:08:08) ప్రేతాత్మలకి భోజనం పెట్టంగా మనం కాబట్టి ఈ ప్రశ్న చాలా చిన్నది అయితే అక్కడ అభిప్రాయం ఏందంటే ఒకవేళ శరీరాన్ని అయితే ఎందుకంటే ఆత్మ కదలదు గా ఆత్మ సర్వవ్యాపకమైన ఎక్కడ కదులుతుంది కాబట్టి ఆత్మ కదలదు. మరి శరీరాన్ని అడగడంలో అభిప్రాయం ఏందంటే నా శరీరము పాంచభౌతికమే నీ శరీరం పాంచభౌతికమే కాబట్టి కాబట్టి వాటి యొక్క కలయకలో అంటే స్పర్శలో ఇబ్బంది ఏముంది అనేది ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే పాంచభౌతికమైనంత మాత్రాన అన్ని ఒకటేనా ఇప్పుడు కార్బన్ ఒకటే బొగ్గు కార్బన్ే డైమండ్ కార్బన్ే మనం రాసే పెన్సిల్లో ముల్లు కూడా కార్బన్ే ఈ మూడిటిని ఒకటేలాగా వాడుకోగలుగుతామా
(1:08:51) కుదురుతుందా ఇప్పుడు మనం తినే ఆహారంలో కార్బన్ ఉంది అందుకని నేను ఈరోజు బొగ్గులు తినేస్తా అని చెప్పి అంటామా అది కుదరదు ఆ విషయం పక్కన పెట్టండి మన శరీరానికే మనం అసలు స్నానం ఎందుకు చేస్తాం ఈరోజు శరీరానికి చెమట పట్టకముందు పట్టిన తర్వాత ఒక తేడా ఉందనే కదా స్నానం చేసేది కొంతమంది మహానుభావాలు స్నానం చేస్తే ఆ తేడా ఉండకపోవచ్చు మామూలుగా స్నానం చేసేవాళ్ళ గురించి అయితే మనకి శరీరం ముందు కొంచెం చమటపట్టి ఏదో ఉంది స్నానం చేస్తే అది మారుతుంది కాబట్టి స్నానం చేయకముందు చేసిన తర్వాత మనం శరీరానికి కి ఉండే మర్యాదలోనే తేడా ఉంది కదా ఎస్ ఇప్పుడు మనం అట్లానే చెమట ఉండే బట్టలతో
(1:09:24) కొంచెం మట్టి ఉన్న బట్టలతో మనం నేరుగా వచ్చి ఎందుకు పడుకోవట్లేదు ఇంట్లో బట్టలు మార్చుకొని ఎందుకు పనుకుంటున్నాము లేదా స్నానం చేసే దేవుడి గదిలోకి ఎందుకు వెళ్తాం ఎందుకు స్నానం చేయకూడ దేవుడి గదిలోకి వెళ్ళిపోవచ్చు గా ఎందుకు చేస్తున్నామ అంటే మన శరీరానికి ఒక మర్యాద ఉంది అది పాంచభౌతికమైన దానికి ఉండే పరిస్థితుల బట్టి కొన్ని మర్యాదలు ఉంటాయి కాబట్టి ఆ శరీర మర్యాదను తప్పకుండా పాటించాలి అనేదే అక్కడ సమాధానం అందుకనే ఆయన ఆ చండాలుడు ఈ ప్రశ్న అడగగానే భగవత్పాదులు నిజమేనయ్యా అని చెప్పి కర్చుకోలేదు అతన్ని నిజమే అని చెప్పి శేఖరణ ఏమి ఇవ్వలేదు నమస్కరించారు
(1:09:56) బ్రహ్మజ్ఞానం ఎక్కడున్నా సరే దానికి జాతి లింగ కుల మత పురుష స్త్రీ పురుష భేదం లేదు జ్ఞానం ఎక్కడున్నా సరే వాళ్ళు గురస్థానీయులు వాళ్ళకి నమస్కారం చేయాల్సిందే అది ఉపనిషత్తు చేసే విధి తస్మా ఆత్మజ్ఞం హర్చయ్ భూతికామః అని ముండకోపనిషత్ మనక చెబుతుంది కాబట్టి తప్పకుండా బ్రహ్మజ్ఞానం ఎక్కడ కనపడితే అది కనబడే చోటుతో కనబడ్డ వ్యక్తితో సంబంధం లేదు గురుస్థానంగా భావించి నమస్కరించవలసిందే అదే భగవత్పాద చండాలోస్తు సతుద్విజోస్తు గురుహు ఇత్యేష మనీష మమ ఇది నా నిశ్చయము ఇటువంటి బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో మనీష పంచకంలో మీరు మొదలు మూడు పాదాల్లో చెప్పిన జ్ఞానం ఎవరికైతే
(1:10:33) ఉంటుందో వాళ్ళు నాకు గురుతుల్యులు అని నమస్కరించారు. శరీర మర్యాదని పాటించారు ఎందుకు అని చెప్పంటే ఒక మాట ఉంది మాధవ దిగ్విజన్లో అది ఆ చండాలుడు మామూలు మానవుడు కాదు భగవత్పాలని పరీక్షించడానికి వచ్చిన విశ్వనాథుడే అని చెప్పి ఒక మాట ఉంది నిజానికి చండాలుడైనా ఈ కథలో ఇబ్బంది ఏమ లేదు విశ్వనాథుడు అయితే పరీక్ష దీంట్లో పరీక్ష ఏముంది అని చెప్పంటే ఈ కాలంలో ఏమంటుంటారు కొంతమంది అంతా జ్ఞానమేగా కర్మలక ఏం సంబంధం ఉంది అంతా ఆత్మ కదా ఇంకా భేదాలు ఏమున్నాయి అని కొంతమంది అంటుంటారు.
(1:11:09) ఇక్కడ పరీక్ష ఏమిటంటే పారమార్థికంగా అంతా ఒకటైనప్పుడు నువ్వు వ్యావహారికమైన మర్యాదను పాటిస్తావా లేదా అనేది పరీక్ష పారమార్థికంగా అంతా ఒకటే ఆత్మ ఒకటే ఎందుకంటే పారమార్క పారమార్థికంగా జగత్తు పారమార్థికంగా లేదు వ్యవహారంలో మాత్రమే ఉంది ఆత్మ పరమార్థికంగా ఉంది ఆత్మ ఒకటే కాబట్టి పరమార్థంలో ఒకటే వ్యవహారంలో చాలా ఉన్నాయి పరమార్థం తెలుసుకున్నాక వ్యవహారంలో కూడా ఒకటే అనే వ్యవహారం చేయాలా వద్దా అనేది పరీక్ష కొంతమంది ఏమంటారంటే అంతా ఒకటేగా అయితే భేదం లేదు అంటే మరి కొడుకుకి తండ్రికి తేడా ఉంది తల్లికి భార్యకి తేడా ఉంది ఈ తేడాలుఏమ పాటించక్కర్లేదు అయితే అని
(1:11:46) చెప్పి అనగలుగుతామా అనలేము కదా కాబట్టి శిష్యుడు గురువు ఈ తేడాలు పాటించక్కర్లేదా అని చెగలుగుతామా లేదు కాబట్టి పారమార్థికంగా అంతా ఒకటయినప్పటికీ వ్యవహారంలో ఏ ధర్మ మర్యాదలు అయితే ఉన్నాయో అవి పాటించాలి అని నిర్ణయం భగవత్పాదులు చేస్తారా లేదా అనేది పరీక్ష దాంట్లో భగవత్పాదులు స్పష్టంగా ఉత్తీర్ణలు అయ్యారు ఎందుకంటే వ్యావహారికమైన మర్యాదని పాటించారు పారమార్థికమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా గౌరవించారు.
(1:12:13) కాబట్టి మనీషా పంచక వృత్తాంతంలో జరిగింది ఇది ఒకవేళ భగవత్పాద నిజానికి ఆ చండాలుడిని ముట్టుకున్న కూడా ఇబ్బంది ఏమ లేదు ఎందుకు ఒకవేళ చండాలుడు జ్ఞాని అయితే శారీరకమైన పుణ్య పాపాలు శుద్ధులు అశుద్ధులు అంటవు కాబట్టి ఏ అశుద్ధి అయితే శంకించి మనం కాటికి వెళ్ళవచ్చిన వాళ్ళని ముట్టుకోమో ఆ అశుద్ధి జ్ఞానికి వర్తించదు వర్తించదు కాబట్టి అట్లయితే పర్వాలేదు జ్ఞాని జ్ఞాని ముట్టుకోవడం ఇబ్బంది ఏం లేదు అయితే ఏమిటంటే చూసేవాళ్ళకి ఆ విషయం తెలియదుగా కృష్ణుడు చెప్పినట్టు లోక సంగ్్రహం చేయాలి కాబట్టి చూసే వాళ్ళకి ఏ ప్రవర్తన అయితే ధర్మోపదేశాన్ని అందిస్తుందో
(1:12:47) ధర్మాదర్శాన్ని చూపిస్తుందో అటువంటి ప్రవర్తనని కలిగి ఉండాలి కాబట్టి భగవత్పాదులు వారి ప్రవర్తన ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే ఎంత అద్వైత జ్ఞానం ఉన్నా సరే శరీరంతో వ్యవహారం సాగించేటప్పుడు వ్యావహారికమైన మర్యాదను తప్పకుండా పాటించాల్సిందే గురువుని గురువుగానే గౌరవించాలి నీ ఆత్మ నా ఆత్మ ఒకటేగా అని మాట్లాడకూడదు ఇది ఒక ఉపదేశం రెండో ఉపదేశం ఏందంటే జ్ఞానం ఎక్కడున్నా సరే దానికి నమస్కరించాలి అక్కడ కుల వివక్షలు పనికి రావు మత వివక్షలు పనికి రావు లింగ వ్యవక్షలు పనికి రావు జ్ఞానానికి వేటి వేటితో సంబంధం లేవు మోక్షానికి వేటి వేటితో సంబంధం లేదు దాన్ని ఎక్కడ ఉన్నా
(1:13:20) సరే దేహాభిమానంతో దాన్ని వ్యతిరేకించకూడదు దేహాభిమానం అంటే కులాభిమానం జాతీయ అభిమానం లింగాభిమానం ప్రాంతభిమానం అన్ని వచ్చేస్తాయి దాంట్లోకి ఎందుకంటే అవన్నీ ఉండేయి దేహానికే అంతే కాబట్టి దేహాభిమానంతో ఇట్లా చులకన చేయకూడదు జ్ఞానాన్ని గౌరవించాలి దాంట్లో రెండో మాట లేదు అనే ఉపదేశం మనకి మనీషా పంచకవృత్తాంతంలో భగవత్పాదులు మనక అందించారు.
(1:13:41) అద్భుతం ఇక్కడ జ్ఞానం అనే పదాన్ని చాలా ఆ చాలాసార్లు చెప్పారు అదే ఆ జ్ఞానం ఉన్నప్పుడు చాలా సందేహాలు రావు. [నవ్వు] అయితే ఇక్కడ స్వామి అయితే మళ్ళీ సినిమాకి వస్తాను ఆ సినిమాలో మరొక డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది అందుకోసం ప్రత్యేకంగా మిమ్మల్ని అడిగారు ఎందుకంటే అక్కడ ఇదే చండాలుడు వారు ఎవరైతే ఉన్నారో వారు వీరు శంకర్ భగవత్పాదుల వారి ఇద్దరి మధ్యలో ఆ ఇది అహం బ్రహ్మాస్మి అన నా అహాన్ని గెలిచావు అనేటటువంటి ఒక అది వచ్చింది అదేంటి చాలా పొరపాటు మాట అది దానికి సంబంధించి ఎందుకంటే ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయింది అంటే నార్మల్ వ్యక్తులు కూడా
(1:14:18) చాలా సందర్భాల్లో దీన్ని వాడే అంత ఫేమస్ అయింది వాడుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకునేది ఏంటి అంటే విపరీతమైనటువంటి అహం ఉండేటటువంటి ఒక భగవత్పాదుల వారి యొక్క దాన్ని ఈయన గెలిచాడు అని నార్మలైజ్ చేసినప్పుడు అదే ఆ మీనింగ్ వెళ్తది అండ్ చాలా ఫేమస్ అయింది. ఈ డైలాగ్ అయితే ఈ అహం బ్రహ్మాస్మి గురించి అండ్ ఆ విషయం గురించి ఒకసారి మీ ద్వారా ఇట్లా ఈ వితండవాదం చేసేవాళ్ళు అయితే మరి ఉపనిషత్తులు కూడా చాలా అహంకారం ఉంది పరమాత్మ కూడా చాలా అహంకారం ఉంది అని చెప్పి అనాలి ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పింది ఉపనిషత్తులు ఉపనిషత్తులు
(1:14:46) మనక ఇచ్చింది పరమాత్మ కాబట్టి భగవత్పాదులు మీ దగ్గర అది అక్కడ పడుతుంది వెళ్లి కాబట్టి ఉపనిషత్తులు అంహ బ్రహ్మాస్మి అని చెప్పడం దాన్ని అర్థం చేసుకోవడంలో అహంకారం అసలు స్థానం ఏది పైగా మనం ఇదివరకు అనుకున్నట్లుగా అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అసలు శరీరానికి సంబంధం లేదు శరీరానికి మనసుకి సంబంధమే లేదు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మం అంటే శుద్ధ చైతన్యము అది నేను అనేది అక్కడ ఉండి దాంట్లో అహంకారానికి ఎందుకంటే అహంకారం అంటే ఏమిటి నేను ఇంకో దానికంటే గొప్ప అనేది అహంకారం నా ముందు ఇంకొకటి ఎంత దాని ముందు నేనే గొప్ప అనేది కదా అహంకారం అంటే
(1:15:20) అసలు రెండో పదార్థం పరమార్థికమైన రెండో పదార్థం లేదు నేను ఆత్మ స్వరూపాన్ని అదే ఆత్మ అందరిలో ఉంది అనుకున్నప్పుడు అసలు అహంకార ఇట్లాంటి అహంకారానికి అసలు చోటు ఎక్కడఉంది ఇప్పుడు భగవత్పాదులు ఆచ చండాలుండి నేను నీకంటే గొప్ప అనాలంటే నా ఆత్మ వేరు నీ ఆత్మ వేరు నా ఆత్మ నీ ఆత్మ కంటే గొప్ప అని చెప్పి అనాలి. స్పష్టంగా ఈ మనీషా పంచక వృత్తాంతంలో చెప్పింది ఏంటో అది లేదు అని కదా చెప్పింది.
(1:15:45) ఈ రెండు ఆత్మలు ఒకటే అని చెప్పి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి నమస్కారము అని చెప్పి అన్నారు. కాబట్టి అసలు ఆ అహంకార ప్రసక్తి లేదు ఇక్కడ. ఇప్పుడు అహం బ్రహ్మాస్మ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఇది ఉపనిషత్తులో ఎక్కడ వస్తుందంటే దేవతలందరూ కూడా జ్ఞాన సాధన చేయగా తేదేవా ప్రత్యుద్ధ్యంత ఆ దేవతలు ఒక్కొక్కళ్ళకి వచ్చిన అనుభవం ఏమిటంటే అహం బ్రహ్మస్మితి ఒక్కొక్క దేవత జ్ఞాన సాధన చేయగా ఆ దేవతకు వచ్చిన అనుభవం ఏమిటంటే నేను బ్రహ్మని అంటే ఏమిటి నేను ఈ శరీరాన్ని కాదు అదే మనోబుద్ధి అంకార చిత్తానాహం నచోత్రజే నచగ్రణ నేనేత్రే నచవభూమ నతేజో నవాయోహో
(1:16:18) చిదానంద రూప శివోహం శివోహం అది [గొంతు సవరించుకోవడం] ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు వీటలన్నిటి లోపల గూఢంగా ఉండి వీటిలన్నిటిని ప్రవర్తింపజేస్తున్న చైతన్యమే నేను అనేది ఇప్పుడు చూడండి ఇది జగద్గురువులు కూడా చాలాసార్లు సెలవిచ్చారు అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడిని అని చెప్పి అర్థం కాదు నేను దేవుడిని అనే మాటకి అహం బ్రహ్మస్మి అనే మాటకి తేడా ఉంది.
(1:16:41) ప్రతిసారి కూడా ఈ మాట అనుకున్నట్టు ఇప్పుడు నేను దేవుడిని అంటే అది ఈశ్వరుడు అంటే ఏమిటంటే చైతన్యము రెండు విధాలుగా అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు చైతన్యం ఒకటే అది రకరకాలుగా అభివ్యక్తం అవుతుంటుంది. అది రెండు విధాలుగా అభివ్యక్తం అవ్వడమే ఈశ్వరుడిగా జీవుడిగా ఈశ్వరుడిగా జీవుడిగా ఆ చైతన్యము తనకి సహజమైన మాయా శక్తి ఉపయోగించి ప్రపంచాన్ని నడుపుతున్నప్పుడు దాన్ని ఆ రకంగా అభివ్యక్తమైనప్పుడు అంటే తన యొక్క మాయా శక్తి ద్వారా అభివ్యక్తమైనప్పుడు దాన్ని ఈశ్వరుడు అన్నాము.
(1:17:15) అదే చైతన్యం మనసులో ప్రతిబింబించినప్పుడు మనసులో ప్రతిబింబించి మనసు ద్వారా అభివ్యక్తమైనప్పుడు దాన్ని మనం జీవుడు అని చెప్పి అన్నాం ఇది ఒక ఒక ఉదాహరణ ఇవ్వాలంటే సూర్యుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మనం చూడడం వల్ల చూడకపోవడం వల్ల సూర్యుడు యొక్క ఉనికిలో తేడా ఏం లేదు అయితే సూర్యుడు తన యొక్క స్వప్రకాశంతో కనపడడం ఒకటి అద్దంలో ప్రతిబింబించి కనపడడం ఒకటి రెండు సూర్య ప్రకాశం ఇప్పుడు అద్దంలో ప్రతిఫలించి వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు అద్దం అని చెప్పంటామా అది కూడా సూర్యుడి యొక్క ప్రకాశమే అద్దం ద్వారా వస్తుంది.
(1:17:51) లేదా తన యొక్క సహజమైన ప్రకాశం ద్వారా ప్రకాశం మనకు వస్తుంది. సూర్యుడు సూర్యుడే అవును అయితే ఇప్పుడు నేను దేవుడిని అనడం ఎట్లాంటిది అంటే ఈ అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడు ఆకాశం నుండి సూర్యుడు ఒకటే అన్నట్టుగా ఈ రెండు ఒకటి అవుతాయా తప్పకుండా అవుతాయి ఎలా అవుతాయి ఆ సూర్య ప్రకాశం ఈ సూర్య ప్రకాశం ఒకటే అని చెప్పి అవుతాయి సూర్యబింబము అద్దము ఒకటి అవ్వవు సూర్యబింబము అద్దం ఒకటి అవ్వవు కానీ ఏ సూర్య ప్రకాశం అయితే నాకు ఆకాశంలో కనబడుత ుందో ఆ సూర్య ప్రకాశం ఇక్కడ అద్దంలో ఉంది ప్రతిఫలిస్తుంది అని అనుకోవడంలో తప్పులేదు అది తత్వమసి అన్నప్పుడు
(1:18:33) తత్వమసి అంటే తత్ అంటే ఏమిటి ఆ ఉపనిషత్తులో చూసుకుంటే జగత్తును సృష్టించిన పరమాత్మ సూర్యుడు మ్ త్వం అంటే ఏమిటి ఇదంతా వింటున్న జీవుడు అంటే ఏమిటి మనసులో పరిమితమై ఉన్న ప్రతిబింబించిన చైతన్యము ఈ రెండు ఒకటే అని చెప్పి అన్నారు. మరి ఎలాగ అయితే రేపటి నేను కూడా సృష్టి స్థితి లైలు చేసేస్తూ ఉండాలి అంటే ఆ రెండుకి ఐక్యం చెప్పింది ఆ రకంగా కాదు ఐక్యం చెప్పింది.
(1:18:57) అందుకనే అద్వైత సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అక్కడ లక్షణ చేయాలి అని చెప్పి అది శాబ్ధికమైన ప్రక్రియ కాబట్టి అక్కడ ఏమంటామ అంటే దేవుడు అంటే సూర్యబింబంలో ఉండే ప్రకాశము అంటే మనం ఉపమానంగా చెప్పాలి తత్ అంటే సూర్యబింబంలో ఉండే ప్రకాశము త్వం అంటే అద్దంలో ఉండే ప్రతిబింబం యొక్క ప్రకాశము ఇప్పుడు ఏం చేయాలి సూర్యుడిలో ఉండే ప్రకాశం అద్దంలో ఉండే ప్రకాశం ఎంతవరకు ఒకటి అవ్వవు బింబము అద్దాన్ని చూస్తున్నంతవరకు అవ్వవు కానీ ప్రకాశంగా ఒకట ఒకటే కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మాయాశక్తి ద్వారా అభివ్యక్తమైన చైతన్యం ఈశ్వరుడు మనసు ద్వారా అంతఃకరణం ద్వారా అభివ్యక్తమైన
(1:19:37) చైతన్యం జీవుడు నువ్వు మాయని అంతఃకరణాన్ని పక్కకు పెట్టి మ్ మిగిలేది అదే చైతన్యం అప్పుడు ఇది మనం సిద్ధాంతంలో చెప్పింది. సరే ఈ సిద్ధాంతం అర్థం కాక చాలా మంది చాలా వాదాలు చేశారు అది పక్కన పెడితే ఇది సిద్ధాంతం చాలా స్పష్టమైన సిద్ధాంతం పైగా భగవత్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అద్వైత సిద్ధాంతంలో భగవత్పాదులు మాట్లాడినప్పుడు ఉపనిషత్ వాక్యం లేకుండా మాట్లాడరు భగవత్పాదులు ఎక్కడ ఏ పంక్తి రాసినా ఆ పంక్తిలో వచ్చే అర్థాన్ని చెప్పి ఉపనిషత్ వాక్యం ఉంటుంది ఇది సవాలు అనుకోండి ఏమనా అనుకోండి ఎవరైనా సరే భగవత్పాదులు లేని మాట చెప్పారు అని చెప్పంటే దానికి వెంటనే ఒక
(1:20:13) ఉపనిషత్ వాక్యం స్పష్టంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే భగవత్పాదులు పరమ ప్రమాణంగా దాన్నే పెట్టుకున్నారు మాది ఉపనిషత్ మతము ఉపనిషత్ మతము కాబట్టి భగవత్పాదులు ఇట్లాంటి సిద్ధాంతాన్ని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఉపనిషత్తులో మాట ఒకటి ఉంది నరసింహ తాపని ఉపనిషత్తులో మాట ఉంది ఒక ఉపనిషత్తు ఉంది దాంట్లో నరసింహ ఉపాసన గురించి చాలా విషయాలు ఉన్నాయి పూర్వ భాగానికి భగవత్పాదులు భాష్యం రాశారు ఉత్తర భాగానికి విద్యార్లు రాశరు పూర్వ భాగంలో నరసింహోపాసన గురించి అలాగే ఆ నరసింహ ఉపాసననే బ్రహ్మ విద్యగా ఎలా చూడాలని చాలా విషయాలు ఉన్నాయి ఉత్తర భాగంలో చాలా మంచి
(1:20:45) మంచి వేదాంత విషయాలు ఉన్నాయి అందుకని తర్వాత కూడా విద్యారణ్యలో పంచదశ రాసినప్పుడు అప్పయ దీక్షతలో రకరకాల ఇతర గ్రంథాలు రాసినప్పుడు కూడా ఈ ఉపనిషత్తులో ఉండే చాలా మాటలు ఉదాహరిస్తారు. దాంట్లో ఉండే ఒక మాట ఏమిటంటే జీవేషా వాభాసేన కరోతి మాయాచావిద్యాచ స్వయమేవ భవతి అని ఒక మాట ఉంది ఈ మాయా శక్తి ఏదైతే ఉందో అది మాయగా అవిద్యగా పనిచేస్తూ జీవుడిని ఈశ్వరుని కల్పిస్తుంది అనింది అదే స్పష్టం జీవేషౌ జీవుడిని ఈశ్వరుడిని ఆభాసేన తన యొక్క ప్రకాశం ద్వారా లేదా ప్రతిఫలం ద్వారా కరోతి చేయుచున్నది ఎలా చేయుచున్నది మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి స్వయంగా తానే
(1:21:24) ఆశక్తే మాయగా అవిద్యగా ఉన్నది. ఇది ఉపనిషత్తులో వాచ్యంగా ఉందన్నమాట. భగవత్పాదులు ఉపనిషత్తుని పక్కన పెట్టలేరుగా కాబట్టి ఈ సిద్ధాంతాన్ని తీసుకున్నారు. అయితే వెంటనే చాలా మంది అతారు అయితే ఈశ్వరుడు కల్పితుడా అంటే ఈశ్వరుడు కూడా క్షణికమైన పదార్థమే ఎప్పుడు ఈశ్వరుడు జగత్తు లాగానే జగత్తు కల్పితం ఈశ్వరుడు కూడా కల్పితమా అని చెప్పంటే సూర్య ప్రకాశం కల్పితం అన్నట్టు ఉంటుంది.
(1:21:47) ఎందుకంటే మనం ఏమనుకున్నాము సూర్య ప్రకాశము సూర్య బింబం ద్వారా వచ్చినప్పుడు అది ఈశ్వరుడు అని చెప్పి అన్నాం. అంతే కాబట్టి ఈశ్వరుడు కల్పితం కాదు మనం ఏమనుకున్నాం స్వాభావికమైన మాయా శక్తి ద్వారా ప్రకటితమైనప్పుడు మనం జీవుడే పరబ్రహ్మ అని చెప్పి అంటుంటే ఈశ్వరుడు పరబ్రహ్మ కాకుండా ఎందుకు పోతాడు జీవుడు బద్దుడు పైగా ఈశ్వరుడు ముక్తుడు జీవుడికి అది ఆ చైతన్యం అంతఃకరణం ద్వారా అభివ్యక్తమైనప్పుడు బద్ధం అవుతుంది.
(1:22:10) కానీ ఆ చైతన్యం తన సహజమైన మాయాశక్తి ద్వారా అభివ్యక్తమైనప్పుడు బద్ధం కాదు ఎందుకు జీవుడు అంతఃకరణంలో చిక్కుకున్నాడు. ఈశ్వరుడు మాయాశక్తిని వాడుతున్నాడు ప్రయోగిస్తున్నాడు కాబట్టి ప్రయోగించేవాడు ఎప్పుడు ప్రయోగించేదానికి చిక్కడుగా జాలరి ఆ జాలంలో చిక్కడుగా అంతేగా వలలో చిక్కడు కదా కాబట్టి ఈశ్వరుడు కల్పితం కాదు అని చెప్పి మేమం ఈశ్వరత్వము కల్పితము ఎందుకు ఈశ్వరుడు అంటే ఎవడు మనం అనుకున్నాం ప్రపంచాన్ని నడిపించేవాడు ప్రపంచం కల్పితం అయినప్పుడు ఆ ప్రపంచం పై ఉండే అధికారం కూడా కల్పితం అని చెప్పాలి కదా అధికారం ఎంత కాలం ఉంటుంది ప్రపంచం
(1:22:42) ఉన్నంత కాలం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈశ్వరత్వం కల్పితం అని చెప్పి మన అర్థం కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు జీవేష వాభాసిన కరోతి ఆ మాయ తన ద్వారా చైతన్యం అభివ్యక్తమైనప్పుడు ఆ చైతన్యాన్ని ఈశ్వరుడిగా మనకు చూపిస్తుంది. అదే మాయ రకరకాల పదార్థాలను పుట్టించి పుట్టించి దాంట్లోనే మనసుని కూడా పుట్టించి అవిద్యగా జీవుడికి ఉపాధి అయినప్పుడు చైతన్యాన్ని అభివ్యక్త పరుస్తూ జీవుడు అనేవాడిని మనకి చూపిస్తుంది ఆ చైతన్యాన్నే మనకు జీవుడిగా చూపిస్తుంది.
(1:23:11) ఈయ అంటే అంతఃకరణంగా పరిణమించిన మాయ అవిద్య అనే నామంతో జీవుడికి ఉపాధిగా మారి ఆ చైతన్యాన్ని మనకు జీవుడిగా చూపిస్తుంది. అదే మాయాశక్తి ఆ చైతన్యం ద్వారా జగన్ నిర్వహణ కోసం వాడబడినప్పుడు ఆ మాయాశక్తి ద్వారానే ఆ చైతన్యం చైతన్యం మనకి ఈశ్వరుడిగా కనబడుతుంది. కాబట్టి శంకరాచార్యుల సిద్ధాంతంలో చాలా స్పష్టంగా జీవుడు ఈశ్వరుడు వేరు జీవుడు ఎన్నటికి ఈశ్వరుడు కాదు అయితే జీవ చైతన్యం ఈశ్వర చైతన్యం ఒక్కటే ఆ చైతన్యానికి పేరు పరబ్రహ్మము అని స్పష్టంగా చెప్పారు ఇది భగవత్ పాదుల సిద్ధాంతం కాదు ఇది ఉపనిషత్ సిద్ధాంతం భగవత్ పాదులు దానికి స్పష్ట పరిచయం మనకి కాబట్టి భగవత్పాదులు ఎక్కడ ఏ మాట చెప్పినా
(1:23:50) ఉపనిషత్ వాక్యం లేకుండా చెప్పరు స్వామి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు భగవత్ పదులు వారు ఏది చెప్పినా కూడా ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో అదే వారు చెప్పారు అని చెప్పేసి కానీ ఇప్పుడు వారు చెప్పినటువంటి అనేక సిద్ధాంతాల్లో ఇది కాదు అది కాదు అనే ఖండనలు కూడా మనం వింటా ఉన్నాం. అయితే ఉపనిషత్తులను ఖండించినట్టుగా అనుకోవచ్చు అసలు దీన్ని ఎందుకు వచ్చింది అంటారు ఇదంతా అసలు ముందు ఒక మాట మనం చెప్పుకోవాలంటే ఏ ఏ సిద్ధాంతాలైతే అద్వైత సిద్ధాంతాన్ని ఖండన చేద్దాం అనుకున్నాయో అసలు ఆ సిద్ధాంతాలు రాగలిగిందే భగవత్పాదుల వల్ల ఇది నేను అతిశయక్తగా అభిమానంగా చెప్పట్లేదు చరిత్ర
(1:24:22) చూసుకుంటే బ్రహ్మ సూత్రాలు ఎలా ఉంటాయి అంటే చాలా సంక్షిప్తంగా ఉంటాయి బ్రహ్మ సూత్రాలు ఎలా ఉంటే వ్యాస మహర్షి రాసిన సూత్రాల్లో ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం ఏం చేస్తుందంటే ఉపనిషత్తులో ఉండే ఒక విష విషయాన్ని తీసుకొని దాంట్లో ఒక నిర్ణయాన్ని చెప్పి మనకు చూపిస్తుంది. అది బ్రహ్మసూత్రాల యొక్క పద్ధతి కాబట్టి ప్రతి అధికరణానికి ఒక విషయ వాక్యం అని చెప్పి ఉంటుంది అంటే ఈ సూత్ర సముదాయము ఈ ఉపనిషత్ వాక్యం గురించి మనకి స్పష్టతని ఇస్తుంది అని ఉంటుంది.
(1:24:53) ఆ తీర్మానం మనకి స్పష్టంగా ముందు చేసి ఇచ్చింది భగవత్పాదులు ఏ అధికరణం ఏ సూత్రాల యొక్క గుత్తి ఏ ఉపనిషద్ వాక్యాన్ని విచారిస్తోంది అని అసలు లోకానికి చెప్పిందే భగవత్ పాదులు కాబట్టి తరువాత వచ్చిన సిద్ధాంతకారులు కూడా ఎవరైతే బ్రహ్మసూత్ర భాషలు ఇట్లాంటివి రాశారో భగవత్పాదులు ఏ సూత్రాలకి ఇది విషయ వాక్యాన్ని పెట్టుకొని వాళ్ళు రాసింది భగవత్పాదులో ఈ సూత్రాలకి ఇది విషయ వాక్యం చెప్పకపోయి ఉంటే వీళ్ళు అది రాయగలిగి ఉండేవాళ్ళు కాదు ఉదాహరణకి ఒక సూత్రం మీకు చెప్తా కంపనాత్ అనే సూత్రం ఉంది మ్ కంపనాత్ అని సూత్రం ఉంది.
(1:25:31) ఈ సూత్రం ఏ వేద వాక్యం గురించి చెప్తుందండి ఏం చెప్తాం కంపనాత్ అంటే కంపిస్తుంది కనుక మ్ ఏ వాక్యం దీనికి భగవత్పాదులు తెలుసుకున్నారు ఇక్కడ ఇక్కడ మనం అభిమానంతో ఏమనొచ్చు అంటే భగవత్పాదులు ఎలా తెలుసుకున్నారంటే ఏ సూత్రాలు అయితే ఏ వ్యాస మహర్షి అయితే సూత్రాలు రాశారో వారి యొక్క సాక్షాత్ పరంపరలు వచ్చారు కాబట్టి ఆ సూత్రాలు యొక్క విషయం వారికి తెలిసి ఉంటుంది.
(1:25:53) గురువు నుంచి శిష్యుడి వరకు ఆ విషయాలు వస్తున్నాయి కాబట్టి వారికి తెలిసి ఉంటుంది అని [గొంతు సవరించుకోవడం] మనం అనుకోవాలి అలాగే వారి సత సిద్ధమైన పాండిత్యం ఈశ్వర తేజస్సు అవన్నీ కలిపి కాబట్టి కంపనాత్ అంటే ఏమిటంటే ఉపనిషత్తులో ఏజతి అని ఉంది. ఓకే ఏజతి అని ఉంది ధాతువు పాణని మహర్షి ఈ ధాతువుగా అర్థం చెప్తూ ఏజ కంపనే అని చెప్పి అన్నారు. కాబట్టి ఏ వేదవాక్యంలో అయితే ఏజతి అనే ప్రయోగం ఉందో ఆ విషయం గురించి కంపనాత్ అనే సూత్రం చెబుతుంది.
(1:26:22) అని తీర్మానం చేసి అక్కడి నుంచి చెప్పారు. అలాగే ఆ ఇంకొకటి ఏముందంటే ఉదాహరణకి సహకార్యంతరి విధి పక్షేణ తృతీయం తద్వతః విద్యాదివత అని ఒక సూత్రం ఉంది. దీనికి నేరుగా అసలు వాక్యర్థం రాయమంటే కూడా కష్టం ఈ పదానికి ఇది అర్థం చెప్పి దానికి సమన్వయం చేయాలంటే కూడా కష్టం అయితే దీనికి విషయ వాక్యం ఏమిటంటే ఈ తృతీయేన అని ఉంది దానికి భగవత్పాదులు ఒకటి పట్టుకున్నారు బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య మౌనేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్య నిర్విద్య అతమునిహి అని ఉంది.
(1:26:54) అంటే సాధన చేసేటప్పుడు ముందు బాల్యం తర్వాత పాండిత్యం తర్వాత మునిత్వము బాల్యం అంటే శ్రవణం చేయడం మౌనం అంటే మననం చేయడం మునిత్వం అంటే నిదధ్యాసనం చేయడం అని చెప్పి అక్కడ విషయం కాబట్టి ఈ సూత్రానికి ఇది విషయ వాక్యము అని భగవత్పాదులు చెప్పకపోతే అసలు మామూలు దృష్టితో ఆ సూత్రాన్ని చూసేవాడికి తెలిసే అవకాశమే లేదు అయితే భగవత్పాదులు చూపించే వేద వాక్యం చూపిస్తేనే అసలు ఆ సూత్రం సరిగ్గా సరిపోతుంది.
(1:27:16) ఈ సూత్రానికి సరిైన అర్థం రావాలంటే ఆ వేద వాక్యం తీసుకుంటే తప్ప ఈ సూత్రానికి తీర్మానం అవ్వదు కాబట్టి అసలు తర్వాత వచ్చే సంప్రదాయకారులందరికీ కూడా ఈ సూత్రాలు ఈ ఉపనిషత్ వాక్యాన్ని విచారిస్తున్నాయని మార్గ నిర్దేశం చేసింది భగవత్పాదులు మిగితా వాళ్ళందరూ దాన్ని ఉపజీవించారు. భగవత్పాలు తీసుకున్నదాన్ని వాళ్ళు ఉపజీవించారు సరే సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలు ఎప్పటికీ ఉంటాయి మరి మన భారతీయ సంపద అభిప్రాయ భేదాలు తప్పకుం ఉండవచ్చు ఆక్షేపాలు చేయవచ్చు అయితే ఆక్షేపం చేయడం కూడా భగవత్పాదుల్లాగా చేయాలి భగవత్పాదులాగా చేయాలి ఎందుకంటే మనక ఏం
(1:27:51) కనబడుతుందింటే భగవత్పాదులు ఇతర సిద్ధాంతాలని ఖండించినప్పుడు రాగద్వేషాలు లేకుండా చేస్తారు అందుకనే బ్రహ్మ సూత్రా భాషలో దగ్గర అంటారు కిమస్మాకం పరమత నిరాకరణేన పరద్వేషకరేణ ఊరికనే వేరేవాళ్ళని కాదు కాదు కాదు కాదు కాదు అనుకోవడంలో వాళ్ళ మీద ద్వేషం పెరగడం తప్ప ఇంకేమ ఉంటుంది దాని వల్ల మ్ అయితే మీరు ఎందుకు ఖండనం చేయడం అని చెప్పంటే అట్లా కాదు ఈ సాంఖ్యాది శాస్త్రాలు బ్రహ్మజ్ఞానానికి తప్పనిసరి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద శాస్త్రాలు పెద్దవాళ్ళు కూడా దీంట్లో పెద్దవాళ్ళ హస్తం కూడా వీటిలో ఉంది కదా కాబట్టి
(1:28:21) బ్రహ్మజ్ఞానం పొందడానికి మోక్షం పొందడానికి ఇవి కూడా అవసరం అవుతాయి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు మోక్షానికి వీటి అవసరం లేదు అని చూపించడానికి మాత్రమే నేను రాస్తున్నాను తప్ప వాళ్ళ మీద ద్వేషం పెంచడానికి నీక కాదు అని స్పష్టంగా భగవత్పాదులు రాశారు ఖండన చేస్తే ఇలా చేయండి అద్భుతం హిందుత్వాన్ని ఆక్షేపించే వాళ్ళకు కూడా ఆక్షేపం చేసే మార్గదర్శనాన్ని చేసింది భగవత్పాదులు చేస్తే ఇలా చేయండి ఆక్షేపం మీ రాగద్వేషాలతో ఆక్షేపం చేయడానికి లేదు మీ ఆక్షేపం ద్వేషాన్ని పంచకూడదు విషయం బట్టి మాట్లాడండి వ్యక్తిని ఖండించన అవసరం లేదు అభిప్రాయం
(1:28:54) మీద ఎన్ని చర్చలైనా యుక్తి యుక్తంగా జరగాలి. కాబట్టి భగవత్పాదులు ఎక్కడ చేసినా అట్లా ఉంది. ఇవన్నీ వాటి యొక్క ఉనికిని చాటుకోవడానికి ముందు భగవత్పాదుల్ని కాదనాల్సి వచ్చింది అది సరే అప్పటికల్లా అద్వైతమే సర్వజన సిద్ధాంతంగా ఉండింది దాన్ని కాదని ఇంకో సిద్ధాంతం పెట్టాలి సరే పర్వాలేదు ఇబ్బంది ఏమ లేదు దానివల్ల అద్వైతాన్ని ఖండించడంలో ఇబ్బంది ఏమ లేదు ఖండించే పద్ధతిలోనే విచారం జరపాలి.
(1:29:18) మనం ఉదాహరణకి విశిష్టద్వైత గీత భాష్యంలో చూసుకుంటేనత్వవాహం జాతునాసం నత్నేమే జనాధిప నచేవన భవిష్యమ సర్వేవైమతపరం అనే దగ్గర అక్కడ భగవంతుడు ఏమన్నాడు మనమందరము భవిష్యత్తులో ఉండకుండా ఉండము అని చెప్పి అన్నారు దానికి అక్కడ విశిష్టద్వైత భాషలో అలాగే ఇతర సిద్ధాంతాల్లో కూడా ఏం చెప్పారంటే బహువచనం భవిష్యత్ కాలీనంగా వాడారు కదా అంటే ఏమిటి బహుత్వం అంటే అంటే భేదము ఎప్పటికీ ఉండేదే అని కదా చెప్పింది దీనివల్ల కాబట్టి అద్వైతం కుదరదు అని అక్కడ అద్వైత ఖండన అక్కడ విశిష్ట అద్వైత భాషలో అక్కడ ఉంటుంది.
(1:29:59) అక్కడ రకరకాల ఆక్షేపాలు ఉన్నాయి దాంట్లో చాలు ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకటే అని చెప్పంటే జీవుడికి సంసారం ఉంది జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటే ఈశ్వరుడికి కూడా సంసారం వస్తుంది ఇదొక ఆక్షేపం అలాగే జ్ఞాని అంతా ఒకటే అని తెలుసుకున్నాక అసలు లోకంలో ఎలా పని చేయగలుగుతాడు అంతా ఒకటే వ్యవహారం ఎలా కుదురుతుంది ఇదొక ప్రశ్న అలాగే ఇంకొకటి ఏమిటంటే అసలు గురు శిష్య పరంపరే పోతుంది ఎందుకంటే గురువు జ్ఞాని ఉండాలి జ్ఞాని అయితే శిష్యుడికి ఉపదేశం కుదరదు కాబట్టి సంప్రదాయం అనేది పోతుంది ఇదొకటి తర్వాత శిష్యుడు ప్రాతిభాసికం తెలుసుకున్నా న్నాక అసలు ఈ గురువు ప్రాతిభాసికమైన దానికి ఉపదేశం చేస్తాడా
(1:30:30) అక్కడ ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఎవరైనా వాళ్ళ అద్దంలోనే ప్రతిబింబానికి ఉపదేశాలు చేస్తారా లేదుగా కాబట్టి ఇత్యాది కారణాల వల్ల అద్వైతం కుదరదు అని చెప్పి అన్నారు బాగుంది మంచి ప్రశ్నలే అయితే ఆక్షేప పద్ధతి ఇక్కడ ఎందుకు సరిగా లేదని చెప్పి అంటున్నారు అంటే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం శాంకర గీత భాష్యంలో ఉన్నాయి మ్ క్షేత్రజ్ఞాపిమా విద్య దగ్గర ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు ఒకటి ఎలా అవుతారు కానీ ఈశ్వరుడికి సంసారం లేదు లేదు అని ఎలా చెప్పారో భగవత్పాద మొత్తం ప్రక్రియ అక్కడ రాశారు.
(1:31:01) ఉపదేశాలు చేయడం ఉపదేశం చేసేది జ్ఞానిక అజ్ఞానిక శాస్త్రం ప్రయోగానికి ప్రయోజనానికి వస్తుందా రాదా ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు శాస్త్రం వ్యావహారికమే అంటే మీ అద్వైత భాషలో మిథ్య అంటే మిథ్య అయిన శాస్త్రంతో మీకు పరమార్థ ప్రయోజనం ఎలా ఉంటుంది అని చెప్పి అన్నారు దానికంతో భగత్పాదులు అక్కడ సమాధానం చెప్పారు చాలా మంచి సమాధానం చెప్పారు. నీ సిద్ధాంతంలో మాత్రం మోక్షం వచ్చాక వేదానికి ఉపయోగం ఉందా మోక్షం ఇప్పుడు ఎవరికో వైకుంఠానికి వెళ్ళడం మోక్షం అక్కడ నిరంతర విష్ణు సాన్నిధ్యాన్ని పొందడం మోక్షం అక్కడికి వెళ్లారు వాడికి అప్పుడు వేదంతో పని ఏమిటి లేదా శైవ సిద్ధాంతంలో వాళ్ళు కైలాసంలో
(1:31:34) ఉండి నిరంతర శివ సాన్నిధ్యాన్ని అనుభవించడం మోక్షం వాళ్ళు అక్కడికి వెళ్లారు అక్కడ శివ సాన్నిధ్యాన్ని అనుభవించేవాడికి శాశ్వతంగా ఇంకా అనుభవించేవాడికి వేదంతో సంబంధం ఏముంది ఇంకా కాబట్టి ఎక్కడైనా సరే బంధం ఉండేవాడికే శాస్త్రం ముక్తుడైన వాడికి శాస్త్రం అక్కర్లేదు. కాబట్టి మా సిద్ధాంతంలో కూడా అంతే అజ్ఞానం ఉన్నంతవరకు శాస్త్రం కావాలి జ్ఞానం వచ్చాక మోక్షం వచ్చింది కాబట్టి శాస్త్రంతో అవసరం లేదు ఇది ఆక్షేపం ఎలా అవుతుంది అని చెప్పి భగవత్పాదులే ఈ పూర్వ పక్షాలన్నీ లేవదీసి సమాధానం చెప్పారు ఇప్పుడు ఈ సిద్ధాంతాల్ని ప్రవర్తింపచేసిన చాలా
(1:32:09) వాళ్ళు గౌరవనీయులు పెద్దవాళ్ళు ఇప్పుడు రామానుచార్యులు గౌరవనీయులు మద్వాచార్యులు గౌరవనీయులు వీళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సత్యవాదులు అనే మనం విశ్వసించాలి అలాగే వాళ్ళు చిత్తశుద్ధి కలిగి వాళ్ళు అని చెప్పి కూడా అనుకోవాలి కాబట్టి వాళ్ళు ఊరికనే ద్వేషంతో చేశారు అని చెప్పి అనడానికి లేదు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే వారు ఆ భాష్యాన్ని చూడకుండానే వారు ఖండనలు రాశారు.
(1:32:31) కాబట్టి ఇక్కడ భగవత్పాదుల సిద్ధాంతాన్ని ఇప్పటి వరకు సరిగ్గా ఖండన చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంకొంతమందికి మరీ దూరం వెళ్ళిపోయింది ఎట్లా అంటే ఇంకా భగవత్పాదులు చెప్పారు కాబట్టి దాన్ని మేము కాదంటాం చెప్పారు కాబట్టి దాన్ని కాదంటాం కొంతమంది పరిస్థితి అంత దూరం వెళ్ళిపోయింది ఉదాహరణకి మధ్వాచార్యులు భగవద్గీతకి భాష్యాన్ని రాశారు వారు ఆ వారి శైలి ఎట్లా ఉండిందంటే కొన్ని కొన్ని దగ్గర అసలు వాక్యాలు కూడా పూర్తిగా ఉండవు.
(1:32:56) వారికి ఎక్కడైతే వివరణ కావాలని చెప్పి అనుకున్నారో వారు అక్కడ కొన్ని దగ్గర వాక్య భాగాలే రాసి వదిలేశారు. కాబట్టి దాన్ని కొంచెం సమన్వయం చేసి దాని యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి జయతీర్థులు అనే ఒక ద్వైత విద్వాంసులు దీనికి ఉపవ్యాఖ్యానాన్ని రాశారు. ఇక్కడ వాళ్ళు ఒక చిన్న ఆక్షేపం చేశారు. ఏమిటంటే భగవత్పాదులు గీతా భాష్యాన్ని ఎలా మొదలు పెట్టారు అసలు ఆ గీతా భాష్యం ఉపోద్ఘాతం యొక్క సౌందర్యం.
(1:33:21) ఎందుకంటే భగవత్ పాపాదులు ఏం చేశారంటే భగవద్గీతకి అవతరణకి ఇవ్వడానికి భగవద్గీతలో ఉండే మాటల్ని వాడారు మ్ భగవంతుడు చెప్పిన మాటలతోనే గీతా భాష్యని అవతరణ ఇచ్చారు మనం కావాలంటే దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ అక్కడి నుంచి మొదలు పెట్టారంటే ముందు నారాయణ స్మరణ చేసి నారాయణ పరోవ్యక్త దండమవ్యక్త సంహం అండస్య అంతస్తులోక సప్తద్వీపాచ మేదిని నారాయణుడు మాయకు అతీతుడు ఆ మాయ నుండి ఈ బ్రహ్మాండం పుట్టింది బ్రహ్మాండంలో ఈ భూమి ఉంది ఈ భూమిలో సప్తద్వీపాలు ఉన్నాయి అని చెప్పి చెప్పి సకలు భగవాన్ నారాయణః సృష్ట్వేదం జగత్ తస్య స్థితించకీర్షుహు అని ఇట్లా మొదలు పెట్టారు ఆ నారాయణుడు ఈ
(1:33:58) ప్రపంచాన్ని సృష్టించి నేను ఈ స్థితి చేయడానికి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గాన్ని ప్రజాపతులకి సనకాదులకి ఇచ్చారు. అలాగే దీర్ఘకాలంతో రకరకాల దోషాలు మనుషుల్లో మనుషుల్లో ఉండడం వల్ల ఆ ధర్మ మార్గం దెబ్బ తిన్నప్పుడు అధర్మ మార్గం పెరిగినప్పుడు దేవక్యాం వాసుదేవాత్కిల సంభువకి దేవకి నుండి వాసుదేవుడి వల్ల దేవక్యం వసుదేవాకిల సంభువ దేవకీ వసుదేవుల కుమారుడిగా అవతరించాడు ఆ నారాయణుడు కృష్ణ పరమాత్మగా అతను ఈ ఆ నారాయణుడు ఈ గీతని కృష్ణ రూపంగా ఉపదేశించాడు.
(1:34:34) అని భగవత్పాదులు అట్లా గీతా భాష్యానికి అవతరణకి ఇచ్చారు చాలా బాగుంది కదా ఇప్పుడు చెప్పినది పరమాత్మ అయినప్పుడు అసలు ఈ గీతని చెప్పిన పరమాత్మ ఎవరు ఏ పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది అనేదాన్ని వివరించడం అయింది బాగుంది మధచార్యులు వారు కూడా మంగళాచరణ రాశారు వారి గీతా భాష్యానికి అక్కడ వారు కూడా చాలా చక్కగా వ్యాస మహర్షిని స్తుతించారు ఇప్పుడు వ్యాస మహర్షి లేకపోతే మనకు భగవద్గీత లేదుగా వ్యాస మహర్షి లేకపోతే మహాభారతం లేదు మహాభారతం లేదంటే గీత లేదు కాబట్టి వ్యాస ప్రార్థనతో వారు వారి గీతా భాష్యాన్ని ప్రారంభించారు రు ఇక్కడ ఆ జయతీర్థులు
(1:35:06) వ్యాఖ్యానం రాస్తూ ఒక మాట అన్నారు కొంతమంది కొంతమంది అంటే అద్వైతులే కొంతమంది కృష్ణ ప్రార్థనతో కృష్ణ స్మరణతో గీతా భాష్యాన్ని మొదలు పెట్టారు అది అసంగతం అని చెప్పడానికి మధచార్యులు వ్యాస ప్రార్థనతో మొదలు పెట్టారు. ఎవరన్నారు ఇది జయతీర్థులు వ్యాఖ్యానంలో అన్నారు అసలు మధవాచార్యులకి ఉద్దేశం ఉందో లేదో మనకు తెలియదు కానీ జయతీర్థులు ఈ మాట అన్నారు.
(1:35:28) అదేంది మనకు వెంటనే అసలు మామూలు అసలు ఆలోచించే వాడికి ఎవడికైనా అదేంటి కృష్ణుడికి ప్రార్థన చేయడం గీతా భాష్యానికి సరికాదా గీతా భాష్యం రాస్తూ కృష్ణ ప్రార్థన సరికాదని చూపించడానికి వ్యాస ప్రార్థన ఉంది అని చెప్పి అన్నారా ఏమిటి విపరీతం అంటే ఆయనక ఏదో ఆయన ఒక యుక్తి చెప్పారు ఏమిటంటే కృష్ణుడు అంట అసుర సంహారానికి వచ్చిన అవతారం అంట బల ప్రధాన అవతారత్వాత్ అని అన్నారు కృష్ణుడు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు జన్మలు ఉన్నాయిగా ఆ శిశుపాల దంత భవక్తులని చంపడానికి కృష్ణుడు వచ్చాడు అసుర సంహారం చేయడానికి వచ్చినవాడు సంహార ప్రధానమైన అవతారము బల ప్రధానమైన అవతారము
(1:36:01) గీత ఉపదేశం కదా కాబట్టి వ్యాసమహర్షి జ్ఞాన ప్రధాన అవతారం కదా విష్ణుమూర్తికి కాబట్టి కృష్ణ స్మరణ యుక్తం కాదు వ్యాసస్మరణే చేయాలి గీతా భాష్యాదిలో కాబట్టి ఇక్కడ వ్యాసస్మరణ చేశారు అని చెప్పి అన్నారు ఎంత విడ్డూరం ఇది అసలు యాస్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిర్గత అని చెప్పి అంటున్నప్పుడు ఆ ఈ గీతా భాష్యానికి దీనికి భగవద్గీత అని పేరున్నప్పుడు భగవంతుడే కృష్ణుడు అయినప్పుడు ఆ కృష్ణుడే ఈ గీతను ఉపదేశించినప్పుడు గీతా మహాత్మం కూడా నారాయణుడే స్వయంగా పద్మపురాణంలో చెప్పినప్పుడు కృష్ణావతార రూపంగా చెప్పినప్పుడు అర్జునుడు కూడా మధ్యలో భగవంతుడిని కృష్ణ
(1:36:41) అచ్యుత అని కృష్ణ నామాలతో మధ్య మధ్యలో సంబోధించినప్పుడు యత్ర యోగేశ్వర కృష్ణః అని గీత ముగించినప్పుడు కృష్ణ ప్రార్థన సరికాదు అని చెప్పడానికి వ్యాస ప్రార్థన చేశారు అనే మాట వెనకల ఉద్దేశం ఏమిటి అబ్బా వాళ్ళకి కృష్ణుడు వ్యాసుడు విషయం కాదు శంకరాచార్యులు కృష్ణుడితో మొదలు పెట్టారు. మనం దాన్ని ఏదో ఒక కారణం చెప్పి కాదనాలి.
(1:37:06) ఎందుకు ఈ మాట చెప్పాల్సిన అవసరం వ్యాస మహర్షి భగవంతుడి యొక్క అవతారము వారు మనకి ఈ మహాభారతాన్ని అనుగ్రహించి తద్రూపంగా భగవంతుడి మాటయన గీతా భాష్యన్ని అనుగ్రహించారు కాబట్టి వ్యాస ప్రార్థన ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి వ్యాస ప్రార్థనతో మొదలు పెట్టారు చేసింటే అయిపోయింది కదా కృష్ణ ప్రార్థన భగవద్గీతకి కృష్ణ ప్రార్థన అయుక్తము అనేది అని చెప్పడానికి ఏమిటి అంటే ఎంత దూరం పోయిందంటే మేము కృష్ణుడిని పూజిస్తాం కృష్ణ కృష్ణుడే మాకు పరమదేయం అని చెప్పి అంటాం కానీ భగవత్పాదులు మాత్రం కృష్ణుడి పేరు ఎత్తారంటే ఆయన కృష్ణుడిని కూడా మేము పక్కన పెట్టేస్తాం. భగవత్పాదులు కృష్ణుడు
(1:37:42) ఎత్తారంటే మేము కృష్ణుడిని కూడా పక్కన పెట్టేస్తాం మేము అన్నంత దూరం వెళ్ళింది ఇప్పుడు ఒకటి నేను ఏ మతాన్ని దోషించడానికి ఈ మాట అనట్లేదు గ్రంథంలో ఇట్లా ఉంది ఈ మాట గ్రంథస్థంగా ఉంది ఇప్పుడు ఈ మాటని ఎలా సమన్వయించుకోవాలి కృష్ణ ప్రార్థన అయుక్తము కాబట్టి వ్యాస ప్రార్థన చేశారు పైగా దాంట్లో పోనీ ఇంతవరకు అన్నా పర్వాలేదు కొంతమంది కృష్ణ ప్రార్థనతో మొదలుపెట్టారు అది అయుక్తం అని చూపించడానికి వ్యాస ప్రార్థన అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా మధ్వాచార్యుల వారు వారు వారి ఆలోచన మద్దాచార్యులు ఇది రాయలేదు రా నే అనేది అదే వారి ఆలోచన ఏంటి అనేది
(1:38:15) వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసి ఆ అంటే నేను అనేది ఏంటంటే ఈ ఖండన చేయాలనే కండూతి ఈ ఖండన కండూతి ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే వీళ్ళకి నిజానికి కృష్ణుడే పరబ్రహ్మం సగుణమైన బ్రహ్మమే నారాయణుడు ఆయనని కూడా కాదనుకునే అంత దూరం పోయింది భగవత్పాదులని ఖండం చేయాలనే ఆ కాంక్ష కాబట్టి నేను అనేది ఏమిటంటే ఇటువంటి ఖండనల వల్ల ఏం ప్రయోజనం ఖండన చేస్తే నిజమైన ఖండన చేయాలి.
(1:38:42) కొంతమంది ఇంకా దూరం వెళ్ళారు ఈరోజు భగవద్గీత అనంగానే ఏ వ్యాఖ్యానం చూస్తారు అందరూ ఏ వ్యాఖ్యానం ఇస్తారు మీరు చెప్పండి శంకర భాష్యన్నే చూస్తారు శంకర భాష్యం చూస్తారు కానీ లోకంలో ఏ పుస్తకాలు రోడ్డు మీద పంచుతూ ఉంటారు ఎక్కువ మందికి పంచిపెట్టే ఇస్కాన్ పుస్తకం దానికి వ్యాఖ్య రాసింది ఎవరు వారి తాత్పర్యం చెప్పింది ఎవరు ప్రభుపాద ప్రభుపాద గారు రాయండి మంచిదే అది గౌడీయ సిద్ధాంతం అంత్య భేదాభేదం సిద్ధాంతం ఉంది దానికో సంప్రదాయం ఉంది తప్పకుండా రాయండి.
(1:39:09) దాంట్లో ఏం రాశారు ప్రభుపాదులు అద్వైతన్ రాస్కల్స్ అన్నారు ఇఫ ఇఫ్ యు రీడ్ ద భాష్య ఆఫ్ ది అద్వైతి యు విల్ గో టు హెల్ నరకానికి పోతారు అద్వైత భాష్యం చదివితే అంటే వీళ్ళకి ఇంటలెక్చువల్ డిస్కషన్ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో చూడండి దీనికి పూర్తి విరుద్ధం భగవత్పాదులు పూర్తి విరుద్ధం ఇప్పుడు ఎలాగైతే అక్కడొక చెప్పానో భగవత్పాదులు ఏమన్నారు ద్వేషం పెంచడాన్ని నేను ఖండన చేయట్లేదు దీనికి అవసరం ఉందా లేదా అని చెప్పడానికి మాత్రమే నేను ఖండన చేస్తున్నాను ఎలాగైతే అక్కడ అన్నారు ఇక్కడ కూడా ఈ ఇదే పద్ధతిలో ఇదే ఈ పద్ధతి కాదండని భగవద్దు ఒక పంక్తి రాశారు తైత్రీయ
(1:39:44) భాష్యంలో ఇదమేవమే స్వస్త్యయనం యన్మాం ఏకయోగినం అనేక యోగి ప్రతిపక్షమాతమే స్వస్తీయనం నా అదృష్టం నేను ఒక్కడిని ఈ సిద్ధాంతం ఒక్కటే ఈ సిద్ధాంతానికి అనేక యోగి ప్రతిపక్షం చాలా పూర్వ పక్షులు ఉన్నాయి చాలా చాలా పూర్వ పక్షాలు ఉన్నాయి చాలా ప్రతిపక్షులు ఉన్నారు ఇది నా అదృష్టం అని చెప్పన్నారు భగవత్పాదులు ఇంతమందితో సంవాదం చేయగలం నా అదృష్టం ఎందుకంటే అందరూ నాతో వంతపాడేస్తే విచారం ఎట్లా జరిగేది నేను చెప్పిన దానికి అందరు తల ఊపేస్తే విచారం జరగాలి కదా కాబట్టి ఇది నా అదృష్టం ఎందుకంటే నేను విచారం చేద్దాము జిజ్ఞాసతో సత్యాన్ని తేలుద్దాము అని నేను వ్యాఖ్య
(1:40:22) రాయడానికి కూర్చున్నప్పుడు నా ఎదురుగుండా ఇంతమంది భిన్నాభిన్న సిద్ధాంతాలు భిన్న భిన్న సిద్ధాంతాలు ఉండడం నా అదృష్టం కాబట్టి అతః జేష్యామి సర్వాన్ ఆరభేచ చింతాం అన్నారు వీళ్ళందరికీ తప్పకుండా సమాధానాలు చెప్పి వారివాద నేను ఓడిస్తాను దానికోసం ఆరభేచ చింతాం విచారాన్ని నేను మొదలు పెడుతున్నాను అని అన్నారు భగవత్పాదులు ఎంత ఉదారమైన మాట ఇది నా అదృష్టం ఇంతమందితో సంవాదం జరపగలగడం నా అదృష్టం కాబట్టి వీళ్ళందరికీ తప్పకుండా సమాధానాలు చెప్తాను ఎలా చెప్తానుఅంటే తిట్టడం వల్ల కాదు విచారం వల్ల ఎక్కడ మీరు చూడండి అద్వైత గ్రంథాలలో ఇతర సిద్ధాంతాలని
(1:41:00) నిందించే మాటలు లేవు కానీ ఇట్లా నిందాపరమైన వాక్యం అంటే మనిషిని తిట్టే మాట మనిషిని తిట్టే మాట భగవత్పాద భాష్యంలో ఒక్కటి చూపించండి అది భగవత్పాదుల పంథానే కాదు మనకి వ్యక్తి దోషణతో సంబంధమే లేదు మనది విచ మనకి ఉపనిషత్తులు కావాలి సిద్ధాంతాలు కాదు మనకి కాల్సిన ఉపనిషత్తులు కావాలి తత్వం కావాలి కాబట్టి ఆ తత్వం తేలడానికి ఎటువంటి వాదన చేయాలో అటువంటి వాదన చేయడం భగవత్పాదుల యొక్క నైజం వారి యొక్క స్వభావం అదే ఇకపై కూడా ఎవరైతే హెల్తీ అకాడమిక్ డిస్కషన్ చేద్దాం అనుకుంటారో సమాజానికి ఉపయోగకరమైన ఒక తాత్విక చింతన చేద్దాం అనుకుంటారో
(1:41:44) భగవత్పాదులు భగవత్పాదులు ఇచ్చిన ఈ మార్గ నిర్దేశం అందరికీ గ్రాహ్యమైనది. కాబట్టి చాలా మంది ఖండనలు చేశారు అయితే ఆ ఖండనల పద్ధతి ఇట్లా ఉంది ఒకటి చెప్పేసిన ప్రశ్నలకే సమాధానం చెప్పారు సమాధానం చెప్పేసిన ప్రశ్నలని మళ్ళీ లేవనెత్తారు లేదా అసలు సంబంధం లేని విషయాలు ఎత్తారు ఇంకొక పద్ధతి ఉంది ఇప్పుడు మనకు అద్వైతంలో మనం అనుకున్నట్లుగా పారమార్థికం వ్యవహారిక అని చెప్పి ఉన్నాయి చాలామంది ఖండన చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏంటంటే పూర్వ పక్షాన్ని అనువదించి అప్పుడు ఖండన చేయాలి పూర్వ పక్షులు ఇట్లా చెబుతున్నారు కాబట్టి దీనిలో ఉండే అనుపత్తి ఇది అని
(1:42:19) చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారంటే పారమార్థికంగా అనువదిస్తారు వ్యావహారికంగా ఖండిస్తారు. అంటే పారమార్థికమైన పరిస్థితిని చెప్పి వ్యవహారంలో కుదరదు కదా అని చెప్పి అడుగుతారు. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రా మన్ ఫాలసీ అని చెప్పి అంటారు. అంటే సిద్ధాంతం కాని దాన్ని సిద్ధాంతంగా చూపించి దాన్ని ఖండించి మేము ఖండించేసామ అని చెప్పి అండం.
(1:42:43) ఇప్పుడు అనుకున్నట్లుగా ఇప్పుడు ఉదాహరణకి అంతా ఒకటే ఆత్మ అయినప్పుడు గురు శిష్య పరంపర ఎలాగా అవును అంతా ఒకటే అనేది ఎక్కడ పరమార్థంలో వ్యవహారంలో గురు శిష్యులు వేరు అనేగా మా సిద్ధాంతం వ్యవహారంలో గురు శిష్యులు వేరనేగా కాబట్టి ప్రశ్న ఎక్కడ అంతా ఒకటే అద్వైత సిద్ధాంతంలో అంతా ఒకటే ఒకటే ఆత్మ ఉండేది దానికి బంధ మోక్షాలు లేవు అని చెప్పారు వెంటనే ఏమన్నారు కాబట్టి గురు శిష్య పరంపర వ్యర్థము అసలు శాస్త్రధ్యం చేయడమే వ్యర్థం ఆత్మకు బంధ మోక్షాలు లేవు కాబట్టి అన్నారు అంటే ప్రశ్న అడిగింది అంటే అనువాదం చేసింది పారమార్థిక దశలో ప్రశ్న అడిగింది వ్యవహార దశలో ప్రశ్న అక్కడ అడిగితే అక్కడ అడగాలి ప్రశ్న
(1:43:23) పారమార్థికంగా అడిగినప్పుడు ఆక్షేపం కూడా పారమార్థిక దశలో చేయాలి. లేదా వ్యావహారికంగా ప్రశ్న అడిగి వ్యావహారికమైన అనుభవతులు చూపించాలి. అక్కడ అడిగి ఇక్కడ చూపిస్తే ఏం లాభం దాని వల్ల కాబట్టి ఇట్లాంటి ఖండలు భగవత్పాదుల గ్రంథాల మీద ఉన్నాయి. ఓకే ఎవరైనా నిజంగా సరైన పద్ధతిలో కుందం చేస్తే స్వాగతిస్తాం దాన్ని ఇబ్బంది ఏమీ లేదు.
(1:43:44) ఒకటి రెండో కొన్ని మా విషయాలు కూడా ఉండొచ్చు నిజంగానే నిజమైన విచారం చేసే అనుభవ్యలు చూపించిన సందర్భాలు ఉండకపోవు తప్పకుండా ఇన్ని శతాబ్దాల భారతీయ తాత్విక చరిత్రలో తప్పకుండా కొన్ని దగ్గర నిజమైన ఆక్షేపాలు ఉండిఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఇట్లాంటివే ఉన్నాయి. తర్వాత కూడా ఎలాగో సమాధానాలు ఇప్పుడు చాలా ద్వైతులు చేసిన ఆక్షేపాలకి ఇంచుమించుగా మధుసోదన సరస్వతులు అప్ప దీక్షితులు సమాధానాలు చెప్పారు చాలా దగ్గరల అలాగే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం వాళ్ళు లేవనెత్తిన చాలా ప్రశ్నలకి బెల్లంకొండ రామరాయ కవి అనే ఆయన అలాగే కొన్ని దగ్గరల అపయ దీక్షితులు కూడా సమాధానాలు చెప్పి
(1:44:20) ఉన్నారు కాబట్టి సంవాదం అనేది ఎప్పుడూ ఉంది ఈ ఈ మతాల మధ్యలో సంవాదం జరుగుతూనే ఉంది అయితే మనం చెప్పేది ఏమిటంటే ఆ సంవాదం ఆరోగ్యకరమైన సంవాదమై ఉండాలి అటువంటి ఖండంలో ఉంటే బాగుండు. ఎస్ ఎస్ తప్పకుండా కచ్చితంగా అండి సంవాదం అనేది ఎప్పుడూ ఉంది ఉండాల్సిందే అంతెందుకు మీరు ఇప్పుడు మనం గీత గురించే మాట్లాడుతున్నాం భగవద్గీత గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కృష్ణుడు నేను చెప్పింది నువ్వు విను నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు ఆయన ఆయన చెప్పేది చెప్పిండు తర్వాత నీకు నచ్చింది నువ్వు చెయ అన్నాడు మధ్యలో ప్రశ్నిస్తూనే ఉన్నాడు అడుగుతూనే
(1:44:47) ఉన్నాడు సందేహాలు తీర్చుకుంటాడు కాబట్టి ఇక్కడ నేను అనే ఒక్క చిన్న విషయం ఏంటంటే నేను ఇక్కడ ఈ సిద్ధాంతాల రకరకాల మనక ఇచ్చిన మహాత్ములు నేను అనట్లేదు ఎందుకంటే వాళ్ళు వారి స్వసిద్ధాంతాన్ని చూపించినప్పుడు వారు చాలా చక్కగా వారి యుక్తులతో వారి యొక్క భాష్యాలని మనకు అందించారు ఆ మహాత్ములు ఏమ అనట్లేదు ఏమంటంటే ఖండన పద్ధతిని మాత్రమే నేను ఇంకొంచెం వేరేగా ఉంటే బాగుండు అని చెప్పి చెబుతున్నాను అంతంటే ఏమ లేదు అండ్ తప్పకుండా మరొక విషయం కూడా అండి అంటే ఈ రోజు ఈ రోజు ఉన్నటువంటి సిచువేషన్ లో అందరం కలిసికట్టుగా ఉండ కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం 100కు
(1:45:17) 100 శాతం ఉంది దాంట్లో 0.00 ఎక్కడో కూడా అక్కడే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ వివిధ మతాల మధ్యలో ఈ కలిసికట్టుతనాన్ని దెబ్బతీసే భావాలు మీకు శాంకర భాషలో అయితే దొరకవు. ఎస్ ఈ వివిధ సంప్రదాయం కలిసికట్టు భావాన్ని దెబ్బ తీసే మాటలు వేరే దగ్గర నుంచి వస్తాయి కానీ శాంకర సంప్రదాయం నుంచి అయితే మాత్రం అట్లాంటి మాటలు మనకి రావు. అంటే ఎక్కడి నుంచి కూడా ఈ రోజు ఉన్నటువంటి సిచువేషన్ లో ఎక్కడి నుంచి కూడా రాకూడదు.
(1:45:39) ఎందుకంటే ఈ దేశము ముఖ్యంగా మన ధర్మం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం. అవును అంటే విదేశాల్లో వేరే దేశాల్లో చాలా అద్భుతంగా పెరుగుతుంది సనాతన ధర్మము అక్కడ దేవాలయాలు కడుతున్నారు అని ఒకవైపు మనం వార్తలు చూస్తున్నప్పటికిని మన దేశంలో హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజుకు హిందువుల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మనం చూస్తున్నాం అవును అవును ఆ కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో ఇట్లాంటి అంతఃకలహాలు అది కూడా చిన్న చిన్న అంతఃకలహాలు ఆ పరిస్థితుల్లో మనకి దౌర్బల్యాన్ని కలిగించకూడదు అస్సలు కలిగించకూడదు కచ్చితంగా అందరం ఒకవేళ మీరు అన్నట్టుగా కచ్చితంగా ఉంటుంది
(1:46:12) ఒక ఏదైనా ఒక లేవనెత్తినప్పుడు దీనిపై సందేహాలు ఉంటుండొచ్చు నివృత్తి చేసుకోవాలి అనుకుండచ్చు అర్థం అవుతుండొచ్చు అర్థం కాకపోతుండొచ్చు వేరే వస్తుండొచ్చు కానీ ఎక్కడ మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాలు కచ్చితంగా మనకు తెలియాలి కొన్ని ఆంతరంగికంగా జరిగేటటువంటివి అంతరంగి జరగాలి అది ఆంతరంగికంగా జరగాలి జరగాలి రచ్చగర్చకూడదు రచ్చక నువ్వు బహిరంగంగా మాట్లాడే విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదు అది వేరు కానీ ఈ రోజు ఏందంటే ముఖ్యంగా హిందుత్వానికి భారత దేశానికి శత్రువులు ఎక్కడనో లేరు నిజంగా మనం ఒకసారి చూస్తే బయట దేశాల గురించి చూస్తే శత్రువు బయట ఉంటాడని వాడు
(1:46:41) గర్వంగా చెప్పగలుగుతారు వాడి దేశంలో వాడు స్వేచ్ఛగా తిరగలుగుతారు కానీ మన దేశం విషయానికి వచ్చేసరికి మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. కాబట్టి అసలైన శత్రువులు ఎవరో మనం కొంత గుర్తెెరిగి వారితో పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కాబట్టి మనం విడిపోకుండా మనం కలిసిగట్టుగా సాంప్రదాయకమైన పరంపరలో ఏ మతానికి చెందినా సరే కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది ఉంది అద్భుతం అయితే మరొక విషయం అదే కదా మనందరం పూజించేది ఒకటే భగవంతుడిని కాబట్టి భగవత్ భక్తులంగా అదే భగవంతుడిగా అందరం భక్తులంగా కలిసికట్టుగా అదే ధర్మానికి కట్టుబడాల్సిన అవసరం ఉంది
(1:47:12) అవసరం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు గీత భాష్యం విషయానికి వస్తే ఒకసారి ఇప్పుడు జ్ఞానము కర్మ వీటిని శంకరుల వారు ఏ విధంగా ఆ వారు చెప్పారు కాబట్టి గీతలో భగవంతుడు చాలా మార్గాలు చెప్పాడు మోక్ష మార్గానికి మోక్ష మార్గానికి మోక్షాన్ని పొందడానికి మోక్షం అనే లక్ష్యానికి చాలా దారులు చెప్పాడు భగవంతుడు ఒకటి ఆ జ్ఞాన యోగం ఉంది మనకు గీతలో అలాగే ధ్యాన యోగం ఉంది గీతలో కర్మ యోగం ఉంది కర్మ సన్యాస యోగం ఉంది విభూతి యోగం ఉంది రకరకాల మార్గాలు చెప్పాడు భగవంతుడు కర్మ చేయడం అదొకటి యోగానుష్టానం చేయడం అదొకటి భక్తి యోగం భక్తి భగవంతుడి పట్ల భక్తి కలగడం
(1:47:53) ఒకటి జ్ఞాన యోగం అదొకటి ఈ రకరకాల మార్గాలు భగవంతుడు చెప్పగా భగవత్పాదలో వారి భాష్యంలో చాలా చక్కగా సమన్వయించారు. సమన్వయించ చక్కగా సమన్వయించడ సమన్వయించారు అనడానికి కారణం ఏమిటంటే వారు కృష్ణుడు చెప్పిందన్నే చెప్పారు కాబట్టి ఎలాగైతే మనం ఇందాక అనుకున్నామో ఆ భగవత్పాదులు ఉపనిషత్తుల్లో ఉన్న మాటల్నే వారి మాటలు చెప్పారు గీతా భాషలో కూడా చాలా దగ్గరలో మనక ఏం కనబడుతుంది అంటే దీనికి ఇదే అర్థం అని చెప్పడానికి భగవంతుని మాటలనే వాడతారు భగవత్పాదులు అవే అవే మాటలు వాడతారు కాబట్టి ఆ పంతాలో భగవత్పాదులు కృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనకు
(1:48:32) తెలియజేయడానికి చక్కని స్పష్టమైన భాష ని రాశరు దాంట్లో ముఖ్యంగా గీతని చూసుకుంటే మనకి చాలా అర్థంఅవుతుంది. జ్ఞానము వల్లనే మోక్షము అనే విషయాన్ని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అని చెప్పంటే సర్వం జ్ఞానప్లవేనైవ విజనం సంతరిష్యసి ఇదొకటి ఉంది జ్ఞానంతోనే అసలు మొత్తం అన్ని దోషాలని నువ్వు అధిగమిస్తావు జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్ కుతర్జున జ్ఞానం వలనే అన్ని కర్మలు భస్మ అయిపోతాయి కర్మ భస్మ అయిపోతే ఇంకా సంసారం కూడా పోయినట్టేగా కాబట్టి ఏవైతే అలాగే తతోమాం తత్వతో జ్ఞాత్వ విషతే తదనంతరం నన్ను తెలుసుకొని ఆ ముందుకు వెళ్తాడో జ్ఞాని సత్ మేధావే చిన్న
(1:49:14) సంశయః సత్జ్ఞాని ఇట్లా జ్ఞాని జ్ఞాని అనే పదం కూడా ఆ ముక్తుడిని చెప్పడానికి చాలా దగ్గరలో వాడారు కాబట్టి భగవంతుడు చాలా దగ్గరలో స్పష్టంగా జ్ఞానం వల్ల మోక్షము అని చెప్పారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది మరి భగవంతుడు ఏం చెప్పాడు మొదట్లో లోకేస్మిన్ ద్విధానిష్ట నేను రెండు మార్గాలు చెప్పాను జ్ఞాన యోగేన సాంఖేనం కర్మయోగ యోగినం అవును జ్ఞాన మార్గం కర్మ మార్గం రెండు ఉన్నాయి అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు భగవంతుడు యత్ సాంఖే ప్రాప్త స్థానం అంటే జ్ఞాన మార్గం వల్ల ఏ స్థానం అయితే వస్తుందో తద్ యోగరపిగమ్యతే కర్మ మార్గం వల్ల కూడా అదే లభిస్తుంది అని చెప్పి అన్నారు. అంటే
(1:49:51) ఇప్పుడు మనకు సందేహం వస్తుంది అంటే జ్ఞానం కర్మ విడివిడిగా ప్రత్యేకంగా మోక్ష మార్గాలా లేదా రెండు కలిపితే మోక్ష మార్గమా అంటే ఏమంటే జ్ఞానం స్వతంత్రంగా మోక్ష మార్గం కర్మ స్వతంత్రంగా మోక్ష మార్గం లేదా జ్ఞాన కర్మలు కలిసితే అంటే సమకాలంగా ఉంటేనే మోక్ష మార్గం అనేది ఈ మూడు ఈ రెండిటిలో ఏదో ఒకటి అయి ఉండాలి ఈ కర్మమార్గ కర్మ జ్ఞానాలు ఒకటేసారి కలిసి మోక్ష మార్గం అవుతాయి అనేదే భగవత్పాదులు గీతా భాషలో చూపిన ప్రధానమైన ప్రతిపక్షి అతన్ని జ్ఞాన కర్మ సముచ్చయవాది అని చెప్పి అంటారు.
(1:50:25) భగవత్పాదులు వారం వారం అతని యొక్క పక్షనే ఖండిస్తుంటారు ఎందుకంటే భగవంతుడు స్పష్టంగా ఏమన్నాడు ఈ ఆత్మని తెలుసుకున్నవాడు కథంస పురుషపార్థకం ఘాతయతహంతికం ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు [గొంతు సవరించుకోవడం] ఎవరిని చంపుతాడు ఎవరిని చంపిస్తాడు అంటే చంపడం అంటే చంపడమైనా మాట్లాడడం చూడ అన్ని కర్మలు దాంట్లో వచ్చేస్తాయి కాబట్టి జ్ఞానానికి కర్మకి సమకాలీనత్వం కుదరదు అని భగవంతుడు చూపించాడు [గొంతు సవరించుకోవడం] గీతలో కాబట్టి మరి ఎలాగ ఎందుకంటే జ్ఞానానికి ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు జ్ఞానం వల్ల మోక్షం జ్ఞానము వల్ల ఏదైతే వస్తుందో కర్మ వల్ల అదే వస్తుంది జ్ఞానం కర్మ ఒకటేసారి కుదరవు
(1:51:02) వీటికి సమన్వయం ఎట్లాగా అంటే అక్కడ చక్కగా భగవత్ చెప్పారు భాష్యంలో యత్ సాంఖే ప్రాపితే స్థానం తద యోగేరపి గమ్యత అంటే జ్ఞాన మార్గం వల్ల నేరుగా వచ్చేది కర్మ మార్గం ద్వారా పరంపరగా వస్తుంది. కర్మ మార్గం ద్వారా చిత్తశుద్ధిని పొంది జ్ఞాన మార్గం ద్వారా మోక్షం వస్తుంది అని చెప్పి అన్నారు. ఇక్కడ కొంతమంది అంటారు ఇదంతా సరే కానీ భక్తి కదా గీతలో ప్రధానంగా చెప్పింది భక్తి అందుకనే భగవంతుడు ఏమన్నాడు నాహం వేదేహి నతపసా నదానేన నచ ఇజ్యయ శక్యం ఏవం విధృష్టం విశ్వరూపాన్ని చూపించి యజ్ఞాలు చేసిన దానాలు చేసిన తపస్సులు చేసినా ఏది చేసినా ఎన్ని వేదాధ్యయనం చేసిన ఎంత
(1:51:38) వేదాధ్యం చేసినా కూడా నా ఈ యొక్క నా నిజస్వరూపమైన విశ్వరూపాన్ని తెలుసుకోలేరు అని చెప్పి అన్నారు తర్వాత ఏమన్నాడు భక్త్యాత్వనన్య శక్యః ఆ అనన్య భక్తితో మాత్రం తప్పకుండా కుదురుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఏమని చెప్పి తేలింది భక్తియే భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడానికి నిజమైన మార్గము అని తేలింది కొంతమంది అంటారు.
(1:52:01) పైగా మనం అనుకున్నట్లు కొంతమంది ఇంత చెప్పి ఆపేస్తారు. కొంతమందిని బాగా అద్వైత దేశం పొట్టనిండ పెట్టుకొని ఉంటారంటే కాబట్టి అద్వైతులకి జ్ఞానాహంకారం జ్ఞానం అసలు భక్తికి చాలా తక్కువైనది భక్తే ప్రధానం అని ఇది చెప్తారు. ఇక్కడ మనం మిగతా శ్లోకాన్ని చూడాలి. భక్త్యాత్న్య శక్య అహమేవం విదర్జున ఇట్లాంటి నా స్వరూపం భక్తితో జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేషంచ పరంతప భక్తితో నన్ను తెలుసుకోగలుగుతాడు శాస్త్రముఖేన అది జ్ఞాతం ద్రష్టుం అంటే నన్ను అనుభవించగలుగుతాడు అటుపై ప్రవేష్టుం నాలో లీనమ అవ్వగలుగుతాడు ఏంటి అహం పైగా అక్కడ కూడా జీవ బ్రహ్మక్యం స్పష్టంగా
(1:52:41) చెప్పారు అహం ప్రవేష్టుం శక్యః నాలో అతను ప్రవేశించగలడు నాలో లో ఐక్యము కాగలడు అని స్పష్టంగా అక్కడ భగవంతుడు చెప్పాడు అలాగే మళ్ళీ తర్వాత 18వ అధ్యాయంలో కూడా భక్త్యామా అభిజానాతి భక్తితో నన్ను తెలుసుకుంటాడు యావాన్ యశచాస్మి తత్వతః నేను నిజంగా ఎలా ఉంటాను నా నిజ స్వరూపం ఏమిటిని భక్తితో తెలుసుకుంటాడు అంటే భక్తి వల్ల జ్ఞానం అక్కడ కూడా తతోమాం తత్వతో జ్ఞాత్వ విషతే మాం జ్ఞాత్వ తత్వతః జ్ఞాత్వ నన్ను నిజంగా తెలుసుకొని మాం విషతే నన్ను ప్రవేశిస్తాడు కాబట్టి ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా ఏం చెప్పారు భక్తి భక్తి వల్ల జ్ఞానము జ్ఞానము వల్ల జీవ బ్రహ్మైక్యము భగవదైక్యము
(1:53:25) అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ రకంగా ఈ మార్గాల సమన్వయం చెప్పారు ఇది కూడా ఇప్పుడు భగవత్పాదులు చెప్పిన ఈ సమన్వయం ఏంటి ఏది భక్తి కర్మలో జ్ఞానానికి జ్ఞానార్హత రావడానికి సాధనాలు తప్ప మోక్ష సాధనాలు కావు అనేది భగవత్పాదుల సొంత అభిప్రాయం కాదు ఎందుకంటే భగవంతుడు చెప్పాడుగా ఏం చెప్పాడు భగవంతుడు ఆరు వరుక్షోర్ మున యోగం కర్మకారణ ముచచ్యతే యోగారుడస్యతస్యవశమఃకారణ ముచచ్యతే భగవంతుడు ఏం చెప్పాడు అక్కడ యోగ మారుక్షోహ జ్ఞాన యోగాన్ని ప్రవేశిద్దాం అనుకుంటూ ఉండేవాడికి సాధకుడికి కర్మ కారణం ముచ్యతే వాడికి ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశం రావాలంటే దానికి కారణం కర్మ
(1:54:04) కర్మానుష్టానము యోగారడస్య తస్యవ అదే సాధకుడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాక షమః అంటే అన్ని ఆపేయడం కర్మ యొక్క సన్యాసమే అక్కడ ఉంది అని ఉంది. ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది భగవంతుడు కర్మ సన్యాసం నిజంగా గీతలో చెప్పాడా ఏమంటే పూర్తి కర్మ సన్యాసం అద్వైతంలో మాత్రమే ఉంది. కాబట్టి సన్యాసం చెప్పాడు ఎందుకంటే అర్జుడు ఏమన్నాడు సన్యాసం అంటే ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు అని చెప్పంటే కామ్యానాం కర్మణం న్యాయాన్సం సన్యాసం కవయ కామ్య కర్మలను వదిలేయడం సన్యాసం నిత్య నైమిత కాలని కాదు అనే కదా అర్థం వచ్చేది కాబట్టి కర్మ సన్యాసం అంటే కర్మలను
(1:54:41) వదిలేయడం జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం ఎలా అవుతుంది అని చెప్పంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి యొక్క ఉపదేశము వినే అధికారిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఉపదేశం చేస్తుండేది అర్జునుడికి అర్జునుడు నేను ధనుర్బాణాలు పాడేసి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంటే కాదు పట్టుకొని యుద్ధం చెయి అని చెబుతున్నాడు.
(1:54:59) కాబట్టి అర్జునుడు సన్యాసం అంటే ఏమిటి అని చెప్పి అడగగా కర్మ మార్గంలో ఉండే అర్జునుడికి యోగ్యమైన సన్యాసాన్ని చెప్పారు. కాబట్టి కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఏమిటంటే నువ్వు కామ్య కర్మ చేయకు అంటే ఏమిటి నీ యొక్క రాగద్వేషాల ప్రకారం ఏ కర్మలు అయితే ఉంటాయో వాటిని చేయకు నీ విధిగా ఏ కర్మలు ఉంటాయో అవి చేయ నిత్య నైమితికాలు విధిగా చేయాల్సినవి కామ్యమైన కర్మలు మనకి కోరిక ఉంటే చేసేవే నువ్వు కోరికతో కర్మ చేయకు విధి ప్రకారమే కర్మ చేయి కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే నా విధి కాబట్టే ఇది చేయడం అనేది కదా భగవంతుడు చెప్పింది నిష్కామంగా చేయాలంటే ఇదే కాబట్టి నిష్కామ కర్మాచరణ గ్రహస్తుడికి
(1:55:34) యోగ్యమైన సన్యాస స్వరూప అని చెప్పాడు సర్వకర్మ సన్యాసం ఎక్కడఉంది అని చెప్పంటే సర్వారంభ పరిత్యాగే ఇట్లాంటి ఇట్లాంటి దగ్గరల భగవంతుడు అన్ని కర్మలను వదిలిపెట్టాడం జ్ఞాని యొక్క లక్షణం ఉంది. మరి ఇంకొక మార్గం కూడా ఉంది. ఇంకొక మార్గం శరణాగతి మార్గం అదే భక్తి మార్గంలోకి వస్తుంది భగవంతుడు చివరి మాట అదే చెప్పాడు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహంత సర్వపాపి మోక్షామి మోక్ష శబ్దం స్పష్టంగా ఉంది కాబట్టి నువ్వు అన్య ధర్మాలని వదిలేసి నన్ను ఆశ్రయించు నాకు శరణాగతి చేయి నేను నీకు మోక్షం ఇస్తాను ఇది క్రమం కాబట్టి సర్వధర్మ పరిత్యాగము
(1:56:14) భగవత్ శరణాగతి అలాగే మోక్షం ఇది భగవంతుడు చెప్పిన క్రమం నిజమైన క్రమం ఇదే చాలా చాలా మంది ఈ శ్లోకాన్ని రకరకాలుగా తీసుకున్నారు కాబట్టి అసలు కర్మే అక్కర్లేదు కొంతమంది కాబట్టి ఏం ధర్మలు అక్కర్లేదో మనం భక్తిగా ఉంటే చాలని కొంతమంది కాదు ధర్మంగా ఉండి భక్తిగా ఉంటే కావాలని కొంతమంది రకరకాల వాళ్ళు రకరకాలుగా దీన్ని వ్యాఖ్యానించారు.
(1:56:34) ఇక్కడ భగవత్పాదులో చూపించిన వ్యాఖ్యానం ఏందంటే సర్వధర్మన్ పరిత్యజ్య శాస్త్రంలో ధర్మ శబ్దానికి అర్థం ఏమిటంటే వేదము విధించిన అన్ని కర్మలు మీమాంస సూత్రం ఉంది చోదనా లక్షణర్థో ధర్మః వేదము ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి అంటే ఒక సత్ఫలితాన్ని ఉద్దేశించి ఏం ఇబ్బందులు లేవు అనే పరిస్థితిలో దేన్నైతే చోదన చేసిందో అంటే విధించిందో అది ధర్మము కాబట్టి సర్వ ధర్మాన్ పరిత్యజ్య అంటే వేద విహితమైన కర్మల యొక్క సన్యాసము చేసి స్పష్టంగా అదే అర్థం వస్తుంది సర్వధర్మాన్ ధర్మం అంటే వేదం విధించిన కర్మలు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం శరణం వ్రజ ఇక్కడ మామ అంటే నేను నేను అంటే ఎవరు
(1:57:15) భగవంతుడి ప్రకారం నేనుఅంటే ఎవరో తెలుసుకోవాలి అర్జునుడు ఇదేగా అడిగింది కథం చింత్యోసి భగవన్మయ నేను నిన్ను ఎలా తెలుసుకోవాలిఅంటే భగవంతుడు మొదట ఏం చెప్పాడు అహం ఆత్మ గుడాకేష సర్వభూతాశయస్తితః నేను సర్వజీవుల యొక్క ఆత్మ స్వరూపుడనై ఉన్నాను అంటే ఎలాగా మనం మొదట్లో అనుకున్నట్టుగా ప్రతి అద్దంలో ప్రతిబింబించిన ఆ సూర్యుడిని నేనే అని కాబట్టి మామేకం శరణం వ్రజ అంటే సర్వభూతాలకు ఆత్మ స్వరూపంగా నన్ను పొందు శరణం వ్రజ అంటే ఏ అంటే పొందు పొందు పొందడం శరణం వ్రజ అంటే పొందడం శరణం కోసం రావడం పొందడం కాబట్టి నువ్వు కర్మ సన్యాసం చేసి అంటే జ్ఞాన మార్గంలోకి వచ్చి ఆత్మ
(1:57:55) స్వరూపంగా నన్ను పొందు నన్ను తెలుసుకో అప్పుడు ఏమవుతుంది అదే మోక్షము సర్వపాప నివృత్తి సర్వ కర్మ నివృత్తి దాని వల్ల మోక్షము ఈ రకంగా కాబట్టి ఇది భగవత్పాదులు వారి భాషలో చక్కగా చూపించిన సమన్వయం అలాగే వారి భాషలో కొన్ని కొన్ని దగ్గరల మనకు కొన్ని సందేహాలు వస్తుంటాయి నేను మొన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నాను ఆ ఒకసారి సన్నిధానం వారి ముందు సన్నిధానం వారి ముందు దర్శనం రోజు అవుతూ ఉంటుంది గురువుగారి దగ్గర అందరూ దర్శనంకి వస్తుంటారు.
(1:58:25) చిన్న పిల్లలు ఎవరైనా భగవద్గీత చెప్పేటట్టు ఉంటే వాళ్ళని ఇట్లా పైకెత్తి నిలబెడతారు వారు గురువు గారి ముందు కొన్ని శ్లోకాలు చెప్తుంటారు. అట్లా ఒక పిల్లవాడు చెప్తూ ఒక శ్లోకం వచ్చింది అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకర్తమః సర్వం జ్ఞానప్లవేనేవ విజనం సంతరిషసి అన శ్లోకం వచ్చింది నువ్వు పాపుల్లోకల్లా పాపుడివైనప్పటికీ పాపివైనప్పటికీ నువ్వు జ్ఞానము అనే నౌకతో జ్ఞానం అనే ఒక సాధనంతో అన్ని పాపాలను దాటేయచ్చు అని ఉంది.
(1:58:56) ఇది ఏదో హిందూ మతంలో చెప్పే మాటలాగా లేదు ఇది ఏదో వేరే దగ్గర నుంచి వచ్చిన మాటలాగా ఉంది అప్పుడు వెంటనే భగవత్పాదులు గురువుగారు నా వైపు తిరిగి ఏమిటయ్యా ఇది అన్ని పాపాలు చేస్తే అసలు వాడికి జ్ఞానం వస్తుందా అని చెప్పి అన్నారు ఎందుకంటే ఉపనిషత్తులో నా విరతో దుశ్చరితాత్ నాశాంతో నాసమయత ప్రజ్ఞానేనైన ఆప్నియాత్ దుశ్చరితము అంటే అధార్మికమైన ప్రవృత్తిని మానుకోనివాడు జ్ఞానంతో ఆత్మని పొందలేడు అని ఉంది ప్రజ్ఞానేన ఏనం నా ఆప్నియాత్ దుశ్చరిత అవిరతః ప్రజ్ఞానేన ఆత్మాన ఆప్నేత్ అని ఉంది కాబట్టి మరి ఈ మాట ఏమిటి నువ్వు పైగా మామూలుగా ఏదో రెండు మూడు పాపాలు పాపుల్లోకి వెళ్ల పెద్ద పాపివైనా
(1:59:34) కూడా నువ్వు దాన్ని దాటేస్తావ అంటే ఎలాగయ్యా అని గురువుగారు నన్ను అడిగారు అంటే అదే వారికి తెలుసు వెళ్లి అక్కడ భాష్యం చూడు అని అర్థం దానికి కాబట్టి వెళ్లి చూస్తే అక్కడ అంటే ఇది ఇంకా మాకు పాఠం కాకముందుకు పాఠం కాని రోజుల్లో ఇది కాకముందు కాబట్టి అక్కడ వెళ్లి చూస్తే ఏముందంటే భగవత్వాలు చక్కగా ఏం రాశారంటే జ్ఞానికి లేదా సాధన చేస్తుండే వాడికి పుణ్యం కూడా పాపం లాగానే కనబడుతుందంట జ్ఞానికి ఎందుకు ఇది ఇనప సంఖ్యలో అది బంగారపు సంఖ్యలో రెండు బంధాన్ని కలిగించేవి ఆ కర్మ వల్ల శరీరం వస్తుంది వస్తుంది కాబట్టి పుణ్యమైనా పాపమైనా ఒకటే కాబట్టి
(2:00:09) జ్ఞానికి పుణ్యం కూడా బంధం పాపం లాగానే బంధకం కాబట్టి రెండిటిని కలిపి పాపము అని చెప్పేసారు అంటే పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః అంటే ఏమిటి అందరికంటే బాగా ఎక్కువ కర్మలు చేసిన కూడా ఎన్ని కర్మలు ఉన్నా కూడా ఒక్క జ్ఞానంతో వాటిని మొత్తం దాటేయచ్చు అని భగవత్పాదులు అక్కడ వ్యాఖ్యానం చేశారు ఎంత అందమైన వ్యాఖ్యానం అది ఎట్లా అంటే చక్కని ఇప్పుడు మనం మామూలుగా పై పై చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ విషయం మనకు తెలియదు పైగా అంత సంగతంగా కూడా లేదు అంత యుక్తంగా కూడా లేదు కానీ భగవత్పాద దీన్ని చూస్తే ఆ ఇప్పుడు చాలా బాగుంది పుణ్య పాపాలు రెండిటిని కూడా మనం జ్ఞానంతోనే దాటేచ్చు
(2:00:44) ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు సర్వ కర్మాణి భస్మసాత్కుతే పాప కర్మాణి అని చెప్పి అనలేదు సర్వ కర్మాణి పుణ్యం పాపం రెండు పోతాయి అప్పుడు నైష్కర్మ సిద్ధి పరమాం సన్యాసేనాది గచచతి సన్యాసేన మోక్ష మార్గంతో జ్ఞాన మార్గంతో నైష్కర్మణ్య సిద్ధి కలుగుతుంది అంటే కర్మ లేని స్థితి కలుగుతుంది దీన్ని పట్టుకొని సురేశ్వరాచార్యులు శృంగేరి పీఠానికి తొలి అధిపతులుగా భగవత్పాదుల చేత నియమింపబడిన సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధి అనే ఒక చక్కని గ్రంథాన్ని రాశారు ఈ పదాన్ని పెట్టుకొని కాబట్టి భగవత్పాదులు గీతలో ఈ విధంగా రకరకాల సమన్వయాలు చూపించారు. రకరకాల ఇక్కడ ఇక్కడ కర్మని
(2:01:18) కాదనాల్సిన అవసరం లేదు భక్తిని కాదనాల్సిన అవసరం లేదు జ్ఞానాన్ని కూడా కాదనుకోవాల్సిన అవసరం లేదు వీటి మూడిటికి చక్కని సమన్వయం ఒకటి ఉంది అదే భగవంతుడు గీతలో చూపించాడు భక్తి ద్వారా జ్ఞానము కర్మ ద్వారా జ్ఞానము అన్ని ఇవి లేకపోతే జ్ఞానం రాదు ఇవి లేకపోతే జ్ఞానం రానే రాదు కాబట్టి ఇవన్నీ పెట్టుకొని యోగ్యతను సంపాదించి భగవద్భక్తులమై ధర్మిష్టులమై మనం జ్ఞాన మార్గంలోకి అప్పుడు అడుగు పెట్టాలి అనే భగవంతుడు తోటి చెప్పిన సమన్వయాన్ని భగవత్పాదులు భాష్యంలో చాలా చక్కగా మనకు చూపించారు.
(2:01:50) అద్భుతం బాగుంది బాగుంది బాగుంది. [నవ్వు] వారు చెప్పింది మీరు మాకు ఈరోజు రిఫ్లెక్షన్ ముఖంగా చెప్పారు. జీవులందరి రిఫ్లెక్షన్ తనేగా మనం చెప్పుకుంది. [నవ్వు] అంతే అంతే అంతే ఎస్ అయితే ఇంతకుముందు మధ్యలో మీరు చెప్పినట్టుగా గీతా భాష్యానికి సంబంధించి ఆ భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ఉపోద్గాతం రాశారు అన్నారు.
(2:02:10) మీరు అది అన్నప్పటి నుంచి దాని చుట్టూ తిరుగుతుంది ఒకసారి దాని గురించి ఆ ఆ ఉపోద్గాతం మనం చూస్తే ఒక ఒకటిన్నర పేజీలు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అన్నట్టుగా దాంట్లో సౌందర్యం ఏంటంటే భగవద్గీతకు ఉపోద్గాతము భగవత్పాదులు భగవంతుడి మాటలతోనే ఇచ్చారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు సకల నారాయణో భగవాన్ సృష్వేదం జగత్ పరమాత్మ ఈ సృష్టిని చేశాడు దీనికి మనక ఏం గుర్తొస్తుంది కల్పక్షాని కల్పాదో విసృజామ్యహం అహం సర్వస్య ప్రభవః నేను జగత్కారం అని చెప్పిన మాట అక్కడ వచ్చింది అలాగే తస్య స్థితించి కీర్షుహు దాని యొక్క స్థితి కోసము అది మరిచ్యాదినగ్రే ససర్జ వాళ్ళకి ప్రవృత్తి వేదోక్తం ప్రవృత్తి
(2:02:48) లక్షణం ధర్మం బోధ గ్రాహయమాస వేదోక్తం ప్రవృత్తి లక్షణం గ్రాహయమాస వేదోక్తం ధర్మం అని ఉంది ముందు మరీచ్యాది ప్రజాపతులని సృష్టించి వాళ్ళకి ప్రవృత్తి మార్గమైన వేదోక్త ధర్మాన్ని చెప్పాడు భగవంతుడు అలాగే సనకాదిన్ సృష్ట్వ నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయమాస సనకాదులని సృష్టించి వాళ్ళకి నివృత్తి లక్షణమై జ్ఞాన మార్గాన్ని చెప్పాడు ఇది ఎక్కడఉంది గీతలో అలాగే లోకేస్మిన్ దివిధ నిష్ట పురా ప్రవక్త ఆయన నిష్ట అంటే స్థిరంగా ఉండే ఒక చోటు అదే స్థితి అసి స్థితించికిషుహు మరిచ్యాది నగ్రేసర్జ అలాగే మరిచ్యాదులని సృష్టించాడు మరిచాది ప్రజాపతులని సృష్టించాడు సనకాదులని
(2:03:26) సృజించాడు. ఇది ఎక్కడఉంది అని చెప్పంటే ఆ మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్త మద్భావ మానసా జాతాః ఏందంటే మహర్షయ సప్తపూర్వ సప్తఋషులు అలాగే మహర్ష సప్తఋషులు పూర్వే చత్వారః తులి నలుగురు ఆయన సనక సనందన సంతకుమార సనత్సుజాతులు భగవత్పాదులు వాచ్యంగా రాయలేదు అయితే ఇక్కడ పూర్వే చత్వారః అని చెప్పి వదిలేశరు మధుసూధన సరస్వతి వారి గీత భాష్యంలో ఇట్లా ఈ అర్థం చెప్పారు.
(2:03:55) కాబట్టి ఆ పూర్వే చత్వార అంటే తొలి నలుగురు బ్రహ్మ యొక్క మానస సంతానం అలాగే మనవహ మనువులు కూడా ఎందుకంటే చత్వారు మనవహ అంటే మనువులు నలుగురు కాదు మనవులో 14 మంది కాబట్టి చత్వార మనవహ అని అక్కడికి అన్వయం లేదు భగవత్పాదులు కూడా అట్లా అన్యాయాన్ని ప్రదర్శించలేదు అయితే అక్కడ స్పష్టంగా సనకాదులు అని చెప్పి రాయలేదు ఆ స్పష్టతని తర్వాత మనకి మధుసూ సరస్వతులు ఇచ్చారు.
(2:04:16) కాబట్టి ఈ విధంగా ఆ ఈ మైత్యాదులని సృష్టించాడు భగవంతుడు సనకాదులని సృష్టించాడు భగవంతుడు అనే మాట భగవంతుడు చెప్పింది అలాగే వాళ్ళ ఒకళ్ళకి ప్రవృత్తి మార్గం ఒకళ్ళకి నివృత్తి మార్గం ఎక్కడ ఉంది అంటే లోకేస్మి దివిధానిష్ట పురాపోక్తమయ అనగా ఈ లోకంలో ఇదివరకు రెండు మార్గాలు చెప్పున్నాను జ్ఞానయోగేన కర్మయోగమయన భగవత్పన్నాడు గ్రహయావాస వేదోక్తం అని చెప్పి ఈ ధర్మాలు వేదోక్తమైనవి అది ఎక్కడఉందంటే పురాప్రోక్త అని భగవంతుడు అన్నాడు ఇదివరకు నేను చెప్పాను మనం గీత మొత్తం వెతుకు ఈ శ్లోకం కంటే ముందు జ్ఞాన కర్మ మార్గాల యొక్క ప్రసక్తి లేదు.
(2:04:47) నేను ఇదివరకు చెప్పాను అంటే ఏమిటి నేను వేదోపదేశ కాబట్టి సృష్టిదులో వేదాన్ని ఉపదేశించింది నేనే కాబట్టి ఈ ఉపదేశాన్ని నేనే చేశాను అని కాబట్టి ఈ లోకం యొక్క స్థితిని పాలించడానికి మరీచ్యాదులకి నేను ఉపదేశం చేశాను ఆ ధర్మం కొనసాగింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట భగవత్పాద చెప్పిన మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే వివస్వతే యోగం ప్రక్తవ్యయం మనుషకం పరంపరా ప్రాప్తం రాజషయో ఈ యోగాన్ని నేను నా ఆది స్వరూపంలో సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనోకి క్షవాకుకి అలాగే రాజర్షి పరంపర అక్కడ రాసింది ఏమిటంటే ఈ రాజర్షికి ఎందుకు చెప్పాలంటే లోకాన్ని
(2:05:23) నిలపాల్సింది వాళ్ళు కాబట్టి లోకం యొక్క స్థితి దీని మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఉపదేశం జరిగింది. ఇది భగవత్ రా తస్య స్థితికేషు మరీత్యాది సృష్ట్వ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయమాస వేదోక్తం అని చెప్పి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు ఆ ధర్మము అద దీర్ఘకాలేన అనుష్టాతృణం కామోద్భవా హీయమాను వివేక హేతుకేన ప్రవర్ధమానే అధర్మే హియమానే ధర్మే ఆ ధర్మం దీర్ఘకాలంగా వస్తుండగా దాన్ని అనుష్టించే వాళ్ళ యొక్క మనసుల్లో కామం పుట్టడం వల్ల అధర్మం పెరిగి ధర్మం తగ్గుతుండగా ఇది ఎక్కడఉంది అని చెప్పంటే [గొంతు సవరించుకోవడం] అసలు దీర్ఘకాలంలో
(2:06:04) ధర్మం క్షయించింది అన్నమాట సతుకాలేన మహత యోగనష్టపరంతప ఏ ధర్మం అయితే చెప్పానో అదే కాలక్రమేణ ఆ ధర్మం క్షీణించింది అదే ఇక్కడ ధర్మం క్షీణించింది ఎందుకు క్షీణించింది అని చెప్పంటే అక్కడ ఏమన్నారు అనుష్టాత్రణం కామోద్భవాత్ కామోద్భవాత్ హీయమాన వివేక హేతుకేన వీళ్ళకి కామం పుట్టడం వల్ల వివేకం పోవడం వల్ల అధర్మము ఇదంతా ఎక్కడఉంది కామం పుట్టడం వల్ల వివేకం పోవడం సంజాత కామ కామాత్ క్రోధే క్రోధత్ భమ సమోహ స్మృతి విభ్రమః స్మృతి విభ్రమ అంటే భగవత్పాదులు రాసింది ఏమిటంటే గురువు దగ్గర ఆర్జించ శాస్త్రజ్ఞానం ఆ క్షణానికి గుర్తు రాకుండా పనికి రాకుండా పోతుంది. కాబట్టి
(2:06:42) గురువు దగ్గర నేర్చుకున్న ధర్మం దేని వల్ల పోతుంది మొత్తానికి సంఘాత సంజాయతే కామః కామం వల్ల మన వివేకం ధర్మాధర్మ వివేకం పోతుంది కాబట్టి అనుష్టాతృణం కామోద్భవాత హీయమాన వివేక హేతుకేన వాళ్ళ కామం పుట్టడం వల్ల వివేకం పోతుంది దానివల్ల అధర్మం పెరుగుతుంది కాబట్టి కామం వల్ల అధర్మం ఇది ఎక్కడఉంది అర్జునుడు అడుగుతాడు కేన ప్రయుక్తయం పాపం చతతి పురుషః మనిషి ఎందుకు పాపాన్ని చేస్తాడు భగవంతుడు ఏం చెప్పాడు కామయేష క్రోధయేష అంత తథాతేనేదం ఆవృతం ఆవృతం జ్ఞానమేతేన అని అంది కాబట్టి ఆ కామం అనేది జ్ఞానాన్ని కప్పేసి మనిషి చేత పాపం చేయిస్తుంది కాబట్టి భగవత్పాదులు
(2:07:21) కామోద్భవాత హీయమాన వివేక హేతుకేన అధర్మేన అక్కడ వరకు వచ్చింది కాబట్టి దాన్ని పిపాలయుషుహు దాన్ని పాలన చేయాలి కాబట్టి భగవంతుడు అవతరించాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామయోగయుగ అనే మాటకి ప్రతిబింబం అది కాబట్టి ఈ రకంగా అలాగే అంశేన వసుదేవ వసుదేవా దేవక్యం సంభూవ ఇక్కడ అంశేన అనేదానికి ఏం రాశరంటే దాని భాష్య వ్యాఖ్యాకర్తలు ఏం రాశరంటే శక్తి లేషేన భగవంతుడు తన యొక్క అనంతమైన శక్తిలో ఒక భాగంగానే అవతరించి కృష్ణ పరమాత్మగా లోకంలో అవతార మూర్తి చరించాడు అని ఇది ఎక్కడఉందంటే ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మయ నా యొక్క ప్రకృతిని నేను వశపరుచుకొని
(2:08:05) నేను సంభవిస్తాను అని ఉంది కాబట్టి ఈ రకంగా ఇది ఇంత తో అట్లా భగవంతుడు పుట్టాడు గీతను ఉపదేశించాడు అని ఉంది కాబట్టి ఇప్పుడు భగవత్పాద ఇచ్చిన ఉపోద్గాతం మొత్తం ఏమిటి గీతా సారాంశమే భగవత్పాదుల యొక్క ఉపోద్గాతము కాబట్టి ఆ ఉపోద్గాతంలో ఉండే అందం ఇది ఆ ఉపోద్గాతం ఇప్పుడు ఎలా ఇవ్వాలి అంటే నిజానికి గీతకు ఉపోద్గాతం రాయడం అది కాదు కదా అంటే మానవాళ్ళకి ఉండే అన్ని సమస్యలకి సమాధానం చెప్పే గ్రంథం సాక్షాత్తు పరమాత్మ దయతలచి మానవాళ్ళకి అర్జునుని అడ్డు పెట్టుకొని మనక ఇచ్చిన ఉపదేశం దీనికి ఉపద ఉద్ఘాతని రాయడం మామూలు విషయం కాదు వేరే వాళ్ళ పుస్తకానికి ఫోర్డ్ రాయడం
(2:08:42) అంటే నాలుగు మాటలు ఏవో రాసేస్తాం దీనికి ఎలా రాయడం అంటే భగవంతుడి మాటలతోనే భగవత్పాదులు ఉపాద్ఘాతన్ని రాశారు అద్భుత దాంట్లో ఉండే అన్నం బాగుంది బాగుంది బాగుంది మరొక మరొక ప్రశ్న ఇప్పుడు ఉపనిషత్తుల విషయానికి వస్తే పదవ ఉపనిషత్తు ఇప్పుడు ఆ అంటే కేవలం 10 ఉపనిషత్తులను ఎందుకు శాస్త్రంగా తీసుకున్నారు ఆ అంటే భగవత్పదలో ప్రస్థానత్రేయ భాషలో ఈ గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వేటిక భాషలు రాస్తుండే క్రమంలో వారు 10 ఉపనిషత్తులు తలకు భాషని రాశారు వాటినే దశోపనిషత్తులు అంటాము ఈష కేన కఠ ప్రశ్న ముండ అంటే ముండక ముండ మాండోక్య తిత్తిరి ఐత్రయ చాందోగక్య బ్రహధారణ్యక ఈ పదింటికి
(2:09:18) రాశారు. వీటిల్ని ఎందుకు రాశారు వీటిని మాత్రమే వారు గ్రహించారు అంటే దీనికంటే వేరే ఉపనిషత్తులు చాలా వారు ఉటంకించారు. నారద పరివరాజక ఉపనిషత్తు జాబాలో ఉపనిషత్తు ఆ శ్వేతాశ్వతనం ఇవన్నీ కూడా వారు ఉటంకించారు. అయితే అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రం ఉపనిషత్తులు అని చెప్పి కాదు అయితే ఇవి ఎందుకు ఉపనిషత్తులు అంటే భగవత్పాదులు ఉపనిషత్ శబ్దానికి అర్థం చెప్పారు.
(2:09:44) ఉపనిషత్తు ఏమిటంటే సత్పదార్థానికి మనల్ని దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టేది పరమాత్మకి దగ్గరికి మనల్ని తీసుకెళ్లి అంటే రెండు మూడు నిర్వచనాలు రాశారు వాటిలో ఇదొకటి దగ్గరగా మనల్ని తీసుకెళ్లి పరమాత్మ దగ్గర మనల్ని చేర్చేది కాబట్టి ఉపనిషత్తులు అన్ని కూడా జ్ఞాన ప్రధానమైనవే అది అసలు ఆ ఎటువంటి సందేహం లేదు దాంట్లో ఉపనిషత్తులు జ్ఞానం కోసమే వచ్చాయి తప్ప కర్మ కోసం ఉపాసన కోసం రాలేదు.
(2:10:07) అయితే కొన్ని ఉపనిషత్తుల్లో ఉపాసన ముఖంగా జ్ఞానం చెప్పారు. అంటే ఎక్కువగా ఉపాసన ఉంటుంది చివరిలో జ్ఞానం కూడా ఉంటుంది. ఉదాహరణ మన పరిస్థితి గణేశ అధర్వశీర్షం ఉంది దాంట్లో ఎక్కువగా చెప్పింది గణపతి ఉపాసన నమస్తే గణపతి అని చెప్పి ఆ గణం గణపతి అనే మంత్రం దాంట్లో గణపతి యొక్క రూపం ఏకదంతం చతురహస్తం అవన్నీ వస్తాయి దాంట్లో అయితే ఆ గణపతి ఉపాసననే ప్రధానంగా చెప్పి తన్ముఖంగా ఓ గణపతి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేకేవలం కర్తాసి తమ కేవలం ధర్తాసి తమే కేవలం హర్తాసి తమేవ సర్వం కలివిం బ్రహ్మాసి అని చెప్పి గణపతి ఉపాసన ద్వారా గణపతి యొక్క నిజతత్వమైన
(2:10:41) దాని యొక్క జ్ఞానాన్ని చెప్దాం అని చెప్పి చూశారు అలాగే అలాగే ఈశ్వరుడు గురించి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి శివుడి గురించి అథర్వశపనిషత్తు ఇట్లాంటివి ఉన్నాయి దాంట్లో ఏం చెప్పారు త్రిలోచనం నీలకంఠం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచతి వీతశోకః సమస్త సాక్షం తమసపరస్తత్ ఇక్కడ ఎక్కువ చెప్పింది శివుడి యొక్క రూప ధ్యానం తిమాసహాయం పార్వతిపతి పరమేశ్వరం విభుం త్రిలోచనం మూడు కళ్ళు నీలకంఠం ప్రశాంతం ఇట్లాంటి శివుడిని ధ్యానించాక ఆ యోగికి ఏమ వస్తుంది సమస్త సాక్ష్యం తమసపరస్తాత్ గచచతి అన్ని అజ్ఞానాలు కావలుండే స్థాయిని
(2:11:16) చేరుకుంటాడు ఈ రకంగా శివోపాసన ద్వారా మనకి ఆ తత్వాన్ని చెప్పడం అలాగే నారాయణ సర్వశీర్షం నారాయణో పురుషోహవ నారాయణో కామేత ప్రజాస్జయతే నారాయణ్ బ్రహ్మజాయతే నారాయణ రుద్రోజాయతే నారాయణది ఇంద్రోజాయతే ఇవన్నీ చెప్పి వాళ్ళు ఆ నారాయణ మంత్రాన్ని చెప్పారు నారాయణస్య అష్టాక్షరం పదం యోహవే నారాయణస్య అష్టాక్షరం పదం మధ్యేతి ఆ అవన్నీ సర్వం ఆయురేతి విందతే ప్రాజాపత్యకం అన్నీ విష్ణు ఉపాసన ఆ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పి దాని యొక్క విశేషాలన్నీ చెప్పి దీనంతటికీ వైకుంఠ భవన లోకం గమష్యతి దాని వల్ల వైకుంఠ ఫలితం చెప్పి దీనంతటి వల్ల మనక ఏం తెలుస్తుంది ఏమవుతుంది అని చెప్పంటే
(2:12:00) ఏమన్నారంటే సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి విష్ణువుతో అతనికి ఐక్యం అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఏమైంది విష్ణు ఉపాసననే ప్రధానంగా చెప్పి చివరిలో విష్ణువుతో ఐక్యాన్ని సూచించారు. కాబట్టి ఈ రకంగా కొన్ని ఉపనిషత్తుల్లో ఏమవుతుందంటే ఉపాసనని ప్రధానంగా చెప్పి చివర్లో జ్ఞాన మార్గానికి తగిలిస్తారు భగవత్పాదులు ఈ ఉపనిషత్తులని తీసుకోవడానికి 10 ఉపనిషత్తులని తీసుకోవడానికి కారణం ఏందటంటే ఉపాసన ముఖేనా కాకుండా సాక్షాత్తుగా జ్ఞానోపదేశం చేసిన ఉపనిషత్తులు ఇవి ఉపనిషత్తుల యొక్క నిర్వచనం ప్రకారమే జ్ఞానం ద్వారా పరమాత్మను తెలియచెప్పేవే
(2:12:35) అని అర్థం కాబట్టి ఆ రకంగా జ్ఞాన ప్రధానంగా ఉండి దేవతోపాసనల వల్ల వచ్చే కన్ఫ్యూషన్ ఉండే అంటే ఇవేం లేకుండా కేవలం జ్ఞానం చెప్పేవి ఉపనిషత్తులు వాటిలో ఈ 10 ప్రధానమైనవి ఇంకా చాలా [గొంతు సవరించుకోవడం] ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ కానీ ఇవి ప్రధానమైనవి కాబట్టి ఈ 10 జ్ఞానాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఉపనిషత్తులు కాబట్టి ఇవి అలాగే ఉపాసనని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని వాటి ద్వారా జ్ఞానాన్ని కూడా సూచించే ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి.
(2:13:03) కానీ భగవత్పాదులు చూపించే ఉపనిషత్ హృదయం అనే ప్రయోజనానికి ఆ ఉపనిషత్ అంటే ఏమిటి జ్ఞానాన్ని ఇచ్చేది పరమాత్మ తెలియజెప్పింది కాబట్టి ఆ నిర్వచనానికి పూర్తిగా సరిపడే అంటే ఇవి సరిపడవని చెప్పి కాదు కానీ ఇంకా ఎటువంటి ద్వారా లేకుండా పరంపరగా లేకుండా సాక్షాత్తుగా సరిపోయే ఉపనిషత్తులని భగవత్పాదులు వ్యాఖ్యానించారు కొంత ఈజీయస్ట్ మెథడ్ అనుకోవచ్చు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా స్ట్రెట్ ఫార్వర్డ్ గా ఉంటాడు మళ్ళీ కన్ఫ్యూషన్స్ లేకుండా ఆ లేకపోతే మళ్ళీ మామూలుగా శివుడు విష్ణు అమ్మవారు గణపతి ఎవరు ఎవరి నమ్మాలి ఏంటని అవన్నీ మొదలవుతాయి అవన్నీ కాకుండా నేరుగా
(2:13:34) జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేసిన ఉపనిషత్తులని భగవత్పాదులు తీసుకున్నారు. అందుకనే ఈ ఉపనిషత్తులోకి ఎక్కడైనా విష్ణు శబ్దము శివ శబ్దం వచ్చినా వారు ఆ దేవత పేరు చెప్పలేదు ఇప్పుడు అనుకున్నట్లుగా శివం శివం అద్వైతం చతుర్థం దగ్గర శివుడు అంటే శివుడి అని చెప్పలేదు శివం అంటే స్వచ్ఛమైన పరమాత్మ అని చెప్పారు.
(2:13:53) అలాగే తద్విష్ణో పరమం పదం సోద పరమాత్మ తద్విష్ణో పరమం పదం అనే కథ ఆ వ్యాఖ్యానంలో వాసుదేవాక్యస్య బ్రహ్మణః స్థానం పరబ్రహ్మ యొక్క స్థానం అని చెప్పారు తప్ప ఫలాని దేవత అని చెప్పి అనలేదు అయితే భగవత్పాదులకి ఏంటంటే విష్ణు భక్తి చాలా ఉంది కాబట్టి వారు వాసుదేవాక్యస్య బ్రహ్మణః అని చెప్పి అన్నారు కానీ పరబ్రహ్మ స్థానం అని నిర్ణయించారు అలాగే సూత్ర భాష్యంలో కూడా ఈ వాక్యాన్ని విచారించినప్పుడు సూత్ర భాషలో కూడా ఈ వాక్యాన్ని విచారించినప్పుడు వారు ఈ ఏమంటారు [గొంతు సవరించుకోవడం] ఈ వాక్యానికి విష్ణు పదం అంటే పరబ్రహ్మ అని అర్థం తప్ప విష్ణు అనే దేవత అంటే ఈశ్వర రూపం యొక్క లోకము ఒక దేవత యొక్క
(2:14:30) లోకం అని చెప్పి అర్థం కాదు బ్రహ్మగా ఉండడమే విష్ణు పదం అని చెప్పి తేల్చారు. ఈ రకంగా వారు దాన్ని సమన్వయం చేసి చూపించారు. ఇప్పుడు మీరు మాటల్లో మధ్యలో ఇప్పుడు భగవత్పాదుల వారు విష్ణు భక్తుడు చాలా ఎక్కువగా వారికి అంటున్నారు కదా దీనిపైన ఒకసారి అది కూడా ఒక మాట ఉంది భగవత్పాదులు ప్రధానంగా విష్ణు భక్తులు అన్నాం అది ఇష్టమే విష్ణు భక్తి అందరికీ ఉంటుంది కాబట్టి భగవత్ తప్పక వైష్ణవులు అని చెప్పి అనుకోవడంలో ఇబ్బంది ఏమ లేదు.
(2:14:57) దీనికి కారణం కూడా మనం ఊహించవచ్చు ఎందుకంటే కాలటిలో వారి కులదేవత కృష్ణుడు బాలకృష్ణుడు ఎక్కడైతే వారి జన్మభూమి ఉందో దాని పక్కనే కృష్ణ మందిరం ఉంటుంది. ఆ కాబట్టి అదొక కథ కూడా శంకర దిగ్విజయంలో ఉంది వారు పూర్ణ నది యొక్క మందిరం చూసామండి అవును అవును పూర్ణది దారిని మళ్ళంచినప్పుడు వారు దారిని మళ్ళంచారు అలాగే వారు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతుంటే అశరీరవాణి ఏపడింది.
(2:15:19) ఓకే ఇక్కడ నది ప్రవాహం ఎక్కువగా ఉంది నన్ను వేరే చోట పెట్టు అని చూస్తే కృష్ణుడు అంటే గతి మార్చేసరికి ఆ కృష్ణ మందిరం మరీ దగ్గరగా అయిపోయింది నదికి కాబట్టి వారు కృష్ణుడిని కొంచెం జరిపి ఇంకో దగ్గర చేశారు అందుకనే మనం చూస్తే కృష్ణుడు నది ఒడ్డు కొద్ది దూరంలో దూరంలో ఉంటారు కొద్ది దూరంలో అవును అంటే కొంచెం దూరం వెళ్లి ఆ ఘాటులోకి దిగాలి కాబట్టి భగవత్పాదుల యొక్క కులదేవత కృష్ణుడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆరాధించిన ఆ రూపం మీద తప్పక విశేష ప్రీతి ఉండడం మీద ఇబ్బంది ఉంది అయితే ఇక్కడ ఏమిటంటే భగవత్పాదులు విష్ణు విష్ణు రూపాన్ని మాత్రమే ఈశ్వర రూపంగా భావించారా
(2:15:51) అని చెప్పండి అక్కడ తప్పకుండా కాదు ఎందుకంటే భగవత్పాలు దక్షిణామూర్తి స్తోత్రం రాశారు తప్పక వారే రాశారు అని చెప్పి ఎందుకు ఒప్పుకోవాలంటే దానికి భారతి గారు సురేశ్వరాచార్యులు రాశారు కాబట్టి అది తప్పకుండా వారు రాసింది దాంట్లో స్పష్టంగా ఈ ఏ పరమాత్మ నుండి అయితే జగత్తు ఉద్భవిస్తుందో ఆ పరమాత్మ దక్షిణామూర్తే ఏ పరమాత్మ యొక్క జ్ఞానం వల్ల సాధకులకు మోక్షం వస్తుందో ఆ అది దక్షిణామూర్తి ఏ పరమాత్మ అష్టమూర్తులుగా లోకాన్ని వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మ దక్షిణామూర్తిగా స్పష్టంగా దక్షిణామూర్తి పరబ్రహ్మ అని చెప్పి అక్కడ చెప్పారు కాబట్టి స్పష్టంగా శివుడు అన్నా కూడా
(2:16:23) దక్షిణామూర్తి అనే ప్రతీతి ఉంది అలాగే లలితా త్రిషతికి భాష్యం రాశారు. దాంట్లో స్పష్టంగా అమ్మవారు పరాశక్తి దీనికి విషయము అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణ అని చెప్పి చెప్పారు కాబట్టి ఏమిటంటే సూత్ర భాష్యంలో అక్కడ ఒక్క రెండు దగ్గరలో విష్ణు ప్రస్తావన ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే బృహదారణ భాష్యంలో అంతర్యామి బ్రాహ్మణుల్లో పరమాత్మ లోకానికి అంతర్యామి అని మాత్రమే ఉపనిషత్తులో చెప్తూ ఉండగా వారు అక్కడ ఏం రాశారు అంటే అంతర్యామి అయిన నారాయణుడు అని చెప్పి రాశారు అది ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే యోగ్యమైన పదం అది ఎందుకంటే అంతర్యామి అంటే లోపల ఉండేవాడు
(2:16:58) నారాయణుడు అంటే ఏమిటి నారము అంటే జీవ సమూహము జీవ సమూహమునే అయద అంటే తన యొక్క స్థానముగా తగిలినవాడు అంటే జీవులలో ఉండి అన్నిటిని వ్యాపించినవాడు నారము అంటే ఇంకో అర్థం ఉంది నరుల కోసమ వచ్చినది నారము అంటే జీవుల కోసం జీవుల కర్మానుభవం కోసం ఉన్న ఈ లోకము కాబట్టి ప్రపంచానికే నారము అని పేరు దానిలో ఉన్నవాడు కాబట్టి తర్వాత నారాయణ శబ్దానికి సర్వవ్యాపకుడు అని ఒక అర్థం వస్తుంది.
(2:17:25) అంతర్యామి అంటే ఈ అర్థం సరిగ్గా సరిపోతుంది ఒకటి అందుకనే మనం ఇక్కడ నారాయణుడు అంటే భగవత్పాదులు విష్ణువే అని చెప్పి అనుకుంటారు అనే సందేహం మనకు వస్తుంది కాబట్టి బృహద బృహదారణిక భాష్యానికి భారతికలు రాస్తూ సురేశ్వరాచార్యులు అని చెప్ప ఏమన్నారంటే యఫ్ పృథివ్యమితేషోసోతేషోసో కతతిత జగద్గురు ఈ జగత్తుకి ఆది అయిన ఏ పరమాత్మ అయితే ఈ అంతర్యామి బ్రాహ్మణులో అంతర్యామిగా చెప్పబడుతున్నాడో హరిర్ బ్రహ్మ పినాకీతి బహుధా ఏకోపి కత్యతే గీయతే అని చెప్పి అన్నారు.
(2:17:58) ఆ పరమాత్మయే ఆ పరమాత్మ ఏకోపి ఒక్కడే అయినప్పటికీ అతన్నే హరి అని అంటారు బ్రహ్మ అని అంటారు పినాకి అని చెప్పి కూడా అంటారు అని వార్తిక కారుడి యొక్క బాధ్యత ఏమిటంటే భాష్యం యొక్క తాత్పర్యాన్ని వివరించడమే వార్తికులు వార్తికారులు చేయాల్సిన పని అంటే అక్కడ భగవత్పాదులు నారాయణ అని చెప్పి ఎందుకు అన్నారు అంటే ఆ అంతర్యామి అయిన పరమాత్మకి చాలా పేర్లు ఉన్నాయి వాటిలో నారాయణ నామం బాగా సరిపోయేది అని చూపించారు కాబట్టి భగవత్పాదులు తప్పక విష్ణు భక్తులు వారి అన్ని రూపాలోకి విష్ణు రూపమే వారికి ఎక్కువ ఇష్టం అని చెప్పడంలో ఇబ్బందిఏమ లేదు అయితే ఇంకా ఈశ్వరుడికి వేరే రూపాలే
(2:18:31) లేవు. వేరే రూపాలన్నీ ఈశ్వరుడి యొక్క రూపాలు కావు జీవుల రూపాలు అనేదైతే వారు అనలేదు. అలాగే జేనోపనిషత్ భాష్యంలో కూడా ఉమా అనే పదం వస్తుంది అక్కడ ఉమా అంటే ఎవరు అని చెప్పంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడి యొక్క పత్ని యాసదా సర్వజ్ఞన ఈశ్వరణ సహవర్తతే అని ఉంది కాబట్టి అక్కడ కూడా స్పష్టంగా ఉమాపతి అయినవాడు ఈశ్వరుడు అనే ఒక మాట ఉంది అలాగే వారి సూత్ర భాష్యంలో జావాలోపనిషత్తుని వారు ఉదాహరించారు ఆ జావాలో ఉపనిషత్తులో స్పష్టంగా రుద్ర జపం వల్ల మోక్షం వస్తుంది శివుడు పరమాత్మ అనే మాట అక్కడ ఉంది అంటే ఆ ఉపనిషత్తు ప్రామాణికం అని చెప్పి వారు తీసుకు కాబట్టి అట్లా రకరకాలుగా
(2:19:08) చూసుకున్నా కూడా భగవత్పాదులు నారాయణుడిని ఈశ్వరుడి యొక్క ఇష్ట రూపంగా పెట్టుకున్నారు. ఈశ్వరుడికి ఉండే అనేకానేక రూపాలు అందుకనే అన్నారు సియాత్ పరమేశ్వరస్యాపి మాయామయం రూపం సాధకానుగ్రహ అర్థం పరమాత్మ తన యొక్క అనంతమైన మాయా శక్తితో ఏ రూపాన్నయనా ధరించొచ్చు అని భగవత్పాదులు సుద్రభాషలో చెప్పారు. ఆ అనంతమైన రూపాల్లో వారికి విష్ణు రూపం ఎక్కువ ఇష్టమైనది.
(2:19:30) అంతే తప్ప ఇంకా ఈశ్వరుడికి వేరే రూపాలు దక్షిణామూర్తి అమ్మవారు మొదలైన రూపాలు అసలు లేనే లేవు ఆ రూపాలు ఈశ్వరుడి యొక్క రూపాలు కావు అని చెప్పి అక్కడ వారు అట్లా అనలేదు. కానీ తప్పకుండా విష్ణు భక్తులే విష్ణు రూపం పట్ల వారికి మొక్క ఉంది అనడం వల్ల వారికి అది ఇబ్బంది లేదు దాంట్లో బాగుందండి బాగుంది బాగుంది బాగుంది పరమాత్మ నిజంగా మీరు ఇవన్నీ చెప్తా ఉంటే ఇవన్నీ చదవడం ఒకటి గుర్తుంచుకోవడం ఒకటి దాని తత్వాన్ని అర్థం చేసుకోవడం ఒకటి అనుష్టానం చేసి ఉపాసన చేయడం ఒకటి అసల ఎక్కడికి ఎంత వాంగ్మేము ఎంత వ్యవస్థ ఎంత ఇది అసలు అందుకనే మనం ఆ శ్లోకం కూడా అందుకనే శృతి
(2:20:13) స్మృతి పురాణ ఆలయం అనే విశేషణం వేసాక కరుణాలే అని చెప్పి ఎందుకు అనాలి ఎందుకంటే వారు శృతి స్మృతి పురాణాలు అన్నిటిని చక్కగా జీర్ణించుకున్నారు. వారికి జ్ఞానం ఉంది వారు ముక్తులు దాని యొక్క సారం అంతా ఇన్ని గ్రంథాలు ఇంకా ఎందుకు ఇచ్చారు వారు శృతి స్మృతి పురాణాల యొక్క సారాన్ని ఎవరికీ వంటపట్టే విధంగా వారికి చెప్పడానికి ఇన్ని ఇన్ని గ్రంథాలు వారు ఎందుకు రాశారు అంటే దానికి హేతు కరుణా లేదు దానికి అహేతుకమైన కరుణ తప్ప మనం ఇంకో మాట చెప్పడానికి లేదు లేకపోతే లేకపోతే సహస్ర ఉపదేశ సహస్రి వెయి రకాలుగా అక్కడి నుంచే ఇంకా వివేక చూడా మణి
(2:20:53) ఇంచుమించు 600 శ్లోకాలు దానికంటే కూడా ఏదో ఆ అపరోక్షనుభవతి 150 శ్లోకాలు ఎంతో ఉంటుంది అది దానికంటే ఇంకొంచెం శతశ్లోకి దానికంటే ఇంకొంచెం ఏదో ఏదో దక్షిణామూర్తి అష్టకం ఇంకా ఆరు శ్లోకాల్లో చాలు నిర్వాణ షట్కం కాదు ఐదు శ్లోకాలు చాలు మనీషా పంచకం మూడు శ్లోకాలు చాలు అది ప్రాతస్మరణ స్తోత్రం ఒక్క శ్లోకం ఏక శ్లోకి ఎవ్వరికి ఎంత టైం ఉంటే ఎంత సమయం ఉంటే దాని ప్రకారం మీరు చదువుకోండి.
(2:21:20) దీనివల్ల వారు సాధించిన ప్రయోజనం ఏంటంటే శంకర వాంగ్మయం ద్వారా వేదాంత తత్వం తెలుసుకోవడానికి నాకు అవకాశం లేదు అని అనే అవకాశాన్ని వారు ఎవరికీ ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఎవరికీ ఎంత టైం లేకపోయినా సరే ఎంత పనుల మధ్యలో ఉన్నా సరే భగవత్పాదుల సాహిత్యాన్ని అధ్యయనం చేయవచ్చు తద్వారా వేదాంత తత్వం తెలుసుకోవచ్చు అనే యొక్క భరోసాని ఇన్ని గ్రంథాలు రాయడం ద్వారా మనకు ఇచ్చారు అది కేవలం వారి యొక్క కరుణ తప్ప మరొక హేతువు మనం దానికి చెప్పలేం ఏది లేదు ఇంకా అద్భుతం అద్భుతం అది కూడా ఎందుకు అంటే వేదాంత తత్వం తెలుసుకోవడం ఎందుకు అంటే వారి స్వార్థం ఏం లేదు ఇక్కడ
(2:21:56) అదేద వారి స్వార్థం ఏంది మోక్షజ్ఞ మోక్షానికి వీరు చేరు అవ్వాలి అంటే తెలుసుకోవాల్సిందే జ్ఞానం రావాల్సిందే సం మోక్షం రావడం వల్ల వారికి ఉన్న మోక్షం ఎక్కడికి పోదు అంతే కదా అదే ఉన్న మోక్షం లేదో డిగ్రీ పెరుగుతుంది అంటే మోక్షం అంటేనే సర్వోత్కృష్టమైనది అంతే కదా కాబట్టి అది అహేగతుకమైన కరుణ అద్భుతం మహా అద్భుతం అసలు వేరే మాటలు లేవు భగవత్పాదులు వివేక చూడలో గురు లక్షణాలు రాస్తూ అహేతుక దయాసింధు బంధు రానమతాం సతాం తన దగ్గర దరిచేరిన సత్పురుషులందరికీ కూడా బంధువై సన్మార్గాన్ని ఉపదేశించే అహేతుకమైన దయా సముద్రమే గురువు ఖచ్చితంగా తెలియాలి తెలుసుకోవాలి
(2:22:33) అండ్ చివరిగా మరొక విషయం ఈరోజు మనం చూసుకుంటున్నంటే ఈ తరం ఆ తర్వాత తర్వాత తరాలకి మనం మాట్లాడితే ఇప్పుడు శంకర భాష్యం గురించి గానీ శంకరుల వారు రాసినటువంటి అనేక అనేక వాంగ్మయాల గురించి గాని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నారు న్నారు నేను చూస్తున్నాను మనం అనేకమంది పిల్లలతో తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం.
(2:22:52) వారి అభిప్రాయాలు ఏంటి అంటే ర్యాంకులు మార్కులు ఇవి రాకపోతే మాకు ఇంట్లో మాకే గుర్తింపు లేదు సో వాటి చుట్టూ తిరగాలనేటటువంటి ఒక ఆలోచనలు దానిలో తిరుగుతా ఉన్నారు అనేకమంది ఒక పోటీ అంటే ఒక కాంపిటీషన్ ప్రతి దాంట్లో కాంపిటీషనే వాడేంది నువ్వేంది వాడేంది నువ్వేంది అనేది దీంట్లో ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఇప్పుడు శంకర వాంగ్మయము మళ్ళీ తర్వాత ఇవన్నీ స్తోత్రాలు మళ్ళీ వీటన్నిటికీ మించి మోక్ష సాధన అసలు ఈ మోక్షం ఇవన్నీ ఏందరా నాయనా ఇక్కడ శరీరంతోటి పుట్టిన నేను చచ్చేలోపు సుఖంగా ఉండాలి ఆ ఎప్పుడో వచ్చేటటువంటి మోక్షం గురించి ఇప్పుడు నేను చేసేది ఏంది
(2:23:24) అనేటటువంటి ఒక ఆలోచన ఇది ఒకవైపు నడుస్తుంటే మరొక వైపు ఏం నడుస్తుందయ్యా అంటే చాలా మంది యూత్ మ్ ఇవన్నీ పక్కన పెట్టేసి మోక్ష సాధనే మాకు లక్ష్యం అని చెప్పేసి ఇవన్నీ వదిలేసి చివరికి కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి మేము సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తాం మేము వీటన్నిటికీ ఈ సామాజికంగా ఉండేటటువంటి విషయాలన్నీ మాకు వద్దు మేము వేరే దగ్గరికి వెళ్తాం.
(2:23:48) ఉమ్ మేము నిత్యం యోగ తపస్సు వ్యవస్థ మెడిటేషన్ దీంట్లో ఉండిపోతాం మాకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అనుకునేటటువంటి యూత్ ఒకవైపు ఉన్నారు. అసలు ఏమి అంత కాదురా నాయనా అనే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. అసలు మీ ఇద్దరికీ ఇప్పుడు శంకర వాంగ్మయం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అసలు అవసరం ఏంటి? యువతకి శాంకర వాంగ్మయం యొక్క ఉపయోగం ఉందా? అంటే ముందు మనం ఏమనుకోవాలంటే అసలు యువతకు ఏం కావాలి ఎవరికైనా ఏం కావాలి సుఖం రావాలి దుఃఖం పోవాలి ఎస్ దాని ఆ దుఃఖం ఇంకఎప్పటికీ అది కూడా సుఖ తాత్కాలికమైన సుఖము తాత్కాలికమైన దుఃఖ నివృత్తి కాదు శాశ్వతమైన సుఖము శాశ్వతమైన
(2:24:28) దుఃఖ నివృత్తి అందరికీ కావాలి దానికే మన శాస్త్రాల్లో పెట్టిన పేరు మోక్షం కాబట్టి అది ప్రయోజనంగా పెట్టుకున్న వాంగ్మయమే శంకరా వాంగ్మయం కాబట్టి అంటే కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ పనుల్లో అంటారు ఇప్పుడుఏంటి ఏంటంటే నువ్వు శంకర భాష చదివితే గాని నాకు ఉద్యోగం రాదా అంటే శాంకర భాష ఉద్యోగం కోసం కాదు నీకు మోక్షం రావడం నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం శాంకర [నవ్వు] భాష నేను శాంకర భాషను చదివితే అంటే ఇంకొంత దూరం కూడా వెళ్ళొచ్చు శాంకర భాష్యం చదివితే ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయా అంటే నీకు ఆరోగ్య సమస్య వచ్చింది నీకు శరీరం
(2:24:58) రావడం వల్ల అసలు నీకు ఇంకా ఎప్పటికీ శరీర సమస్యలు నీకు రాకూడదు అంటే శంకర భాష్యం చదువు మోక్షాన్ని పొందు తద్వారా ఇంకా అసలు ఆ మనం ఏమంటాము ఆరోగ్య సమస్యలు రావడానికి శరీరం లేని స్థితిని నువ్వు పొందగలుగుతావు కాబట్టి మనం ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే భగవత్పాదులు మోక్షానికి మార్గం వేశరు తాత్కాలికమైన ప్రయోజనానికి కాదు ఆ మోక్షం అనే ప్రయోజనం మనం అనుకున్నట్లుగా అందరికీ కావాలి నాకు సుఖం నాకు శాశ్వతమైన సుఖం వద్దు అని ఎవ్వరు అనలేరు కాబట్టి ఆ అవసరం ఉందా అంటే ఆ అవసరం అందరికీ ఉన్నప్పుడు ఈ అవసరం కూడా అందరికీ ఉంటుంది ఇదొకటి రెండోది ఏమిటంటే వారు చెప్పిన విషయంలో
(2:25:30) చాలా నీతులు ఉన్నాయి చాలా మంచి మంచి నీతులు ఉన్నాయి ఆ నీతులన్నిటిని తప్పకుండా గ్రహించాలి భజగోవిందంలో గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమ సహస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయచ విత్తం దీంట్లో లోకంలో పనికి రానిది ఏముంది చెప్పండి నీకు డబ్బు ఉంటే నీ భోగాల మీద నీ కావలసిన వాళ్ళ మీద దాన్ని వ్యర్థం చేయకు ఎవరికైతే దాని యొక్క అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వు నీ సమయాన్ని నువ్వు ఎవరెవరితోనో ఖర్చు పెట్టకు సత్పురుషులతో మాత్రమే సాంగత్యం పెట్టుకో ఇవన్నీ కూడా లౌకికమైన నీతులా కాదా అలాగే ఈ లౌకికమైన విషయాలు తెలుసుకోవడానికి వారు రాసిన రత్నం లాంటి
(2:26:05) పుస్తకం ఏందంటే ప్రశ్నోత్తర రత్నవాళిక దాంట్లో వారు ప్రశ్నలు లేవనతే సమాధానాలు కూడా చెప్తారు ఎన్నో లౌకికమైన నీతులు దాంట్లో చాలా లౌకికమైన నీతులు ఉదాహరణకి ఆ కుత్ర విధేయో యత్నః మనిషి ఎక్కడ ప్రయత్నం చేయాలి దేనికోసం ప్రయత్నం చేయాలి విద్యాభ్యాసే సదౌషధే దానే విద్యాభ్యాసం విషయంలో ఆరోగ్యం విషయంలో దానం విషయంలో మనిషి ప్రయత్నం చేయాలి.
(2:26:33) ఇది మనకు పనికవచ్చేదా లేదా పైగా దీనికి సన్నిధానం వారు వ్యాఖ్యానం చేస్తూ విద్యాభ్యాసం ఆరోగ్యం అంటే మనది మాత్రమే కాదు వేరే వాళ్ళది కూడా విద్యాభ్యాసం అంటే విద్యని అభ్యసించడం మాత్రమే కాదు ఇతరుల చేత అభ్యసింప చేయడం అలాగే సద ఔషధం అంటే మనం మాత్రమే ఔషధాలతో మనం ఆరోగ్యం ఉండడం మాత్రమే కాదు వేరే వాళ్ళకు కూడా ఉపాయాలని అందించడం ఒకసారి ఒక హాస్పిటల్ యొక్క ఉద్ఘాటనకి జగద్గురువులు దయచేశారు.
(2:26:58) అక్కడ వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఇది చెప్పారు. ఈ హాస్పిటల్ యొక్క ప్రయోజనం ఏమిటి అనేది భగవత్పాదులు మనకి ప్రశ్నోత్తరత్వానికి చెప్పారు. భగవత్పాదులు ఎలాగైతే మనకి చెప్పారో ఔషధం కోసం తప్పక ప్రయత్నం చేయాలి మనము ఆరోగ్యంగా ఉండాలి ఆ ఆరోగ్యం నలుగురికి అందించాలి అనే ఆశయం ప్రకారం ఈ హాస్పిటల్ లో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి ఒకసారి గురువుగారు ఆ మాట చెప్పున్నారు ఒక దగ్గర కాబట్టి ఈ రకంగా ఎన్నెన్నో లౌకికమైన నీతులు ఇది కూడా చెప్పారు కామాత అందరికీ తల్లి ఎవరు ధేనుహు గోమాతే ఈ ప్రపంచానికి మాత మీరు రాష్ట్రమాత అనుకుంటారో దేశమాత అనుకుంటారో జాతి మాత
(2:27:35) అనుకుంటారో తల్లి అంటే ధేనువు అని అన్నారు భగవత్పాదులు ఇట్లాంటి విషయాలు కూడా దీంట్లో ఎన్నెన్నో విషయాలు చెప్పుకున్నారు. కాబట్టి లౌకికమైన నీతులు ఎలాగో ఉన్నాయి. అలాగే ఇంకా మోక్షం మోక్షం కోసం అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే వారు చేసిన చాలా అందమైన పని ఏమిటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కానీ చదివే వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది అక్కడ ఉన్నారు కొంతమంది ఇంకో దగ్గర ఉన్నారు అందరూ చేరాల్సింది ఒకటే దగ్గరికి కానీ అందరికీ ఒకటే రూట్ చెప్పాలి.
(2:28:06) ఇది ఎట్లా అంటే నాలుగు దగ్గరలో ఉన్న నలుగురు జనాల్ని ఒకటే లొకేషన్ కోసం తీసుకురావడానికి ఒకటే రూట్ చెప్పండి అన్నట్టుగా అది పరిస్థితి ఇప్పుడు వారిని జగద్గురు అంటున్నామ అంటే జగత్తులో ఉండే అందరికీ కూడా మోక్ష మార్గాన్ని చూపించిన వారు అట్లా ఉన్నప్పుడు మరి జగత్తులో ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఉన్నాడు వాడి యొక్క అతని యొక్క తమ తమ యొక్క ప్రస్థానాల్లో కాబట్టి ఇక్కడ వారు ఏం చేశారంటే మొదటి నుంచి చివరి వరకు ఒక మ్యాప్ వేశారు రోడ్ మ్యాప్ వేశారు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడికి పూర్తిఅవుతుంది.
(2:28:37) మీరు ఎక్కడెక్కడెక్కడ ఉంటారో అక్కడ నుంచి మొదలుపెట్టండి అని చెప్పారు. అంటే నలుగురు ఒకటే చోటికి ఒకే రూట్లో రావడం ఎప్పుడు కుదరదు అంటే వేరు వేరు రూట్లలో ఉన్నప్పుడు కానీ అందరూ ఒకటే దారిలో వేరే చోట్లలో ఉన్నప్పుడు అదే దారిలో రావడం అనేది కుదురుతుంది. కాబట్టి అది భగవత్పాదులు చేసింది. కాబట్టి వారు ఏం చెప్పారంటే ఒక సంక్షిప్తంగా చెప్పాలంటే సాధన పంచకం అని చెప్పి రాశారు దాన్ని సోపాన పంచకం అంటారు.
(2:29:02) ఆ మొదటి శ్లోకమే బంధ నుంచి మోక్షానికి దారి మొత్తం దాంట్లో ఉంది వేదో నిత్య మధీయతాం తదుతం కర్మస్వనిషీయతం తేన ఈషస్య విధీయత అపచితిహి కామ్యేమతిస్తజతాం పాపోహపరిధూయతం భవసుఖే దోషో సంధియతాం ఆత్మచఛ వివసీయతం నిజగ్రహతూర్ణం వినర్గమ్యతం అని మొదటి చివరికి బ్రహ్మేకాక్ష మర్తం అ పరబ్రహ్మాత్మనస్థీయతం అని పూర్తి చేశరు వేదో నిత్య అధీయతం ముందు అధ్యయనం వేదం చదివేవాళ్ళు వేదం లేదా వైదికమైన వాంగ్మయం అంటే ఇతిహాస పురాణాది వాంగ్మయం అధ్యయనం చేయండి.
(2:29:38) తదతం కర్మస్నుష్టయతం ఆ వేద శాస్త్రాలు మనకి చెప్పిన స్వధర్మాన్ని అనుష్టించండి దాన్ని మీరు ఎలా అనుష్టిస్తారంటే తేన ఈషస్య విధియతాం అపచితిహి మీ స్వధర్మంతోనే పరమాత్మకి పూజ చేయండి. అదే భగవంతుడు అన్నాడు గీతలో స్వకర్మణతమభ్యర్చ సిద్ధిం విందతి మానవః స్వధర్మంతోనే పరమాత్మని అర్చించి మనిషి సాఫల్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పి అన్నాడు పరమాత్మ కాబట్టి అదే పంథాన్ని కొనసాగిస్తూ భగవత్పాదులు తేన అంటే వేదోక్తేన కర్మణ ఈషస్య అపతిహి విధీయతం ఈశ్వరుడికి నువ్వు పూజని చేయి పరమాత్మని పూజించు ఈశ్వరుడికి పూజిస్తే మరి నాకో అంటే అట్లా కామ్యేమతిస్తజ్యతాం కామ్య కర్మలను అసలు
(2:30:20) పెట్టుకోకు కామలతో కామ కామంతో కామ్య కర్మలు చేయకు కానీ వేదముఖంగా నీకు ఉన్న విధిని పరమాత్మకి సమర్పించి చేయి అలాగే తద్వారా ఏమవుతుందంటే పాపోహ పరిధోయతాం నువ్వు చేసే పాప పనులని మానుకో అలాగే మనసులో ఉండే పాప సంస్కారాలు ఈ రీతిగా క్రమంగా తొలగిపోతుంటాయి. అయితే ఇంతేనా చెప్పిన కర్మలు చేసుకుంటూ పోవడం అంటే కాదు భవసుఖే దోషోను సంధియతం సంసార సుఖంలో దోషం ఉంది అనే విషయాన్ని ఎప్పటికైనా నువ్వు గుర్తించు సంసార సుఖంలో దోషం ఉందంటే ఇంక ఎప్పటికీ సుఖం లేదు అని నిరాశ చెందకు ఆత్మేచ వ్యవసీయతం ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడం వల్ల సుఖం ఉంది కాబట్టి దాన్ని తెలుసుకొని కోరిక పెట్టుకో
(2:31:01) జిజ్ఞాసని చేసుకో నీకు ఎప్పుడైతే నిజంగా ఇంకా నాకు లోకంతో ఏ సంబంధము లేదు ఆత్మ ఒక్కటే కావాలని ఉందో అప్పుడు నిజ గ్రహత్వం పూర్ణం వినర్గమ్యతం అప్పుడు నీ స్వధర్మాన్ని నీ లౌకికమైన కార్యక్రమాన్ని వాటిలన్నిటిని అక్కడికి ఆపు చేసి ఆ ఆశ్రమాంతరాన్ని స్వీకరించి అప్పుడు నువ్వు పూర్తి జ్ఞాన మార్గంలోకి వెళ్ళొచ్చు ఎప్పటివరకైతే నాకు లోకంతో అస్సలు ప్రయోజనం లేదు అని నీకు అనిపించలేదో అప్పటివరకు నువ్వు లోకంలో నీ బాధ్యతను తప్పక నువ్వు నిర్వర్తించాల్సివలసిందే అనేది ఈ రకంగా అలాగే జ్ఞానం జ్ఞానంలో వాక్యార్థ విచారం అవన్నీ చేసి మోక్షాన్ని
(2:31:34) పొందాలి. కాబట్టి ఇది స్పష్టమైన ఒక మార్గం చాలా మంది అడుగుతుంటారు మనోనిగ్రహం ఎలాగండి ధ్యానాన్ని కూర్చుంటాం మనసు కూర్చోవట్లేదు దీనికి సమాధానమే ప్రబోధ సుధాకరం యొక్క రెండో భాగం ప్రబోధ సుధాకరం అనే గ్రంథం రాసారు దాంట్లో మొత్తం అదే ఉండేది ఇలా ఒక్కొక్క గ్రంథంలో సాధకులకు వచ్చే అన్ని సమాధానాలకి భగవత్పాదులు ఈ రకంగా వ్యాఖ్యానం ఒక మార్గాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఈ కాలం వాళ్ళకి ఎందుకు కావాలంటే ఏ కాలం వాళ్ళకు కూడా సుఖం సుఖం పొందడానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని స్పష్టం చేసిన వాళ్ళు భగవత్పాదులు కాబట్టి ఆ మనకి పారమార్థికమైన ప్రయోజనం కావచ్చు లేదా ఒకటి
(2:32:13) లోకంలో మాత్రం అద్వైతానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అద్వైతాన్ని తెలుసుకోవడం వల్ల లోకంలో ప్రయోజనం ఏమిటి నిజమైన ఐక్యం సాధించాలంటే ఒక్క ఆత్మ శరీరంలో మాత్రమే తేడా ఆత్మలో తేడా లేదు అనేదానికంటే ఎక్కువ సమైక్యం ఎక్కడ ఉంటుంది కాబట్టి అదొకటి అలాగే నీ యొక్క శరీరం ఏదైతే ఉందో అది వ్యవహారానికి మాత్రమే ఉండేది నిజరూపం కాదు అనేసరికి ఏమవుతుంది శరీరాన్ని పెట్టుకొని వచ్చే భేదాల వల్ల ద్వేషాలు మనస్పర్ధలు యుద్ధాలు అనేవి తగ్గుతాయి ఒకవేళ నిజంగా ఇది ఉంటే అలా కాబట్టి ఇంకోటి జగత్తు మిత్య అంటే ఏమిటి మిత్య అంటే ఆమె మనం మిత్య అనే పదం మాట్లాడుకోలేదు భగవత్పాదులు మిత్య అంటే
(2:32:51) చాలా స్పష్టంగా రాశారు సత్తు అసత్తు కానిది సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది అసత్తు అంటే ఎప్పుడూ ఉండనిది దీని మధ్యలో ఏముంది కొంతకాలం ఉండేది అదే జగత్తు అదే మిత్య ఎందుకంటే జగత్తులో ఏ ఒక్క పదార్థం కూడా నిత్యంగా లేదు అందుకని సత్తో కాదు అసత్తు కాదు మధ్యలో ఒకటే దాన్ని మిత్య అంటే అనిత్యము అని చెప్పి ఇంచుమించు అర్థం వస్తుంది.
(2:33:13) కాబట్టి ఈ జగత్తు మిత్య అని తేలినప్పుడు ఈ జగత్తు వల్ల మనం ఎందుకు బాధపడతాం ఇది తాత్కాలికంగా వచ్చి వెళ్ళేది కాబట్టి ఏ బాధలు పడినా కూడా అవన్నీ వచ్చి వెళ్ళేవే కర్మానుసారంగా వచ్చి వెళ్ళేవే కాబట్టి దీనికి ఎక్కువగా కృంగిపోవాల్సిన అవసరం లేదు సుఖాలు కూడా సుఖాలకు పొంగవల్సిన అవసరం లేదు ఏ సుఖం వచ్చినా కర్మ అనురోధైనా వచ్చింది అది వచ్చి వెళ్ళిపోతుంది దీనివల్ల నేను ఏమి నన్ను నేనేమి మర్చిపోకర్లేదు కాబట్టి సుఖ దుఃఖాలకు నిశ్చలంగా ఉండడం అనేది జగన్ మిథ్యాత్వం యొక్క ఒక ప్రయోజనం ఈ రకంగా అద్వైత సిద్ధాంతం వల్ల లోకంలోనే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి సిద్ధాంతంగా
(2:33:46) ఇలాగ అలాగే ఇంకా రకరకాల ప్రయోజనాల కోసమే భగవత్పాదులు ఇన్ని స్తోత్రాలు కూడా రాసింది. ఇప్పుడు ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఆ స్తోత్రం వాళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. నాకు రక్షణ కావాలి కాలభైరవాష్టకం నరసింహ కరావలం చదువుకోండి నాకు అన్నానికి లోటుగా ఉంది నాకు అది కావాలంటే అన్నపూర్ణాష్టకం చదువుకోవచ్చు.
(2:34:07) డబ్బుకి కరువు డబ్బు కొదవ అంటే కనకధారా స్తోత్రం చెప్పుకో అలాగే నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకో అలాగే నాకు అమ్మవారిని ఉపాసించాలి ఉంది కానీ కానీ నాకు మంత్రోపదేశం చేసే గురువు దొరకట్లేదు పర్వాలేదు కళ్యాణం వృష్టిస్తావ అని చెప్పి ఉంది దాంట్లో అమ్మవారి యొక్క పంచదశీ మంత్రం యొక్క బీజాక్షరాలన్నీ కూడా వరుసగా దాంట్లో నిక్షేప్తం చేసి పెట్టారు భగవత్పాదులో కాబట్టి నువ్వు దాన్ని చదువుకో దాన్ని చదువుకుంటే అది నువ్వు అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపాసించినట్టే ఉపదేశం రావాల్సిన అవసరం లేకుండా స్తోత్రం కాబట్టి ఉపదేశం అక్కర్లేదు కానీ దాంట్లో ఆ మంత్రం
(2:34:38) యొక్క అక్షరాలన్నీ వస్తాయి కాబట్టి దాన్ని జపించడం వల్ల అమ్మవారి ఉపాసన చేసినట్టే ఉంటుంది. అలాగే నాకు శివోపాసన చేయాలని చెప్పి ఉంది పంచాక్షర స్తోత్రం చెప్పుకో కాదు 108 సార్లు చేయాలని చెప్పి ఉంది శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రం చెప్పుకో దాంట్లో 27 శ్లోకాలు శ్లోకానికి నాలుగు పాదాలు ప్రతి పాదం చివరిలో నమఃశివాయ అని వస్తుంది.
(2:34:59) శ్రీమదాత్మే గుణేక సింధవే నమఃశివాయ ధామలేష దూతకోక బంధవే నమఃశివాయ ఇలాగే రకరకాల 108 సార్లు నమఃశివాయ అనేది వస్తుంది. ఈ రకంగా నాకు మా పిల్లలకి మాకు చదువు బాగా రావాలి దక్షిణామూర్తి మంత్రోపదేశం చేయడానికి ఎవరు దొరకట్లేదు అంటే దక్షిణామూర్తి [గొంతు సవరించుకోవడం] వర్ణమాల స్తోత్రం ఉంది దక్షిణామూర్తి యొక్క మంత్రం యొక్క అక్షరాలని శ్లోకాల్లో పొదిగి రాసిన స్తోత్రం ఉంది కాబట్టి దక్షిణామూర్తి మంత్రం పొందడానికి అవకాశం లేని వాళ్ళు దక్షిణామూర్తిని ఉపాసించదలుచుకుంటే ఈ స్తోత్ర పారాయణ వల్ల దక్షిణామూర్తి మంత్రపం యొక్క ఫలితం కలుగుతుంది ఇట్లాంటివి ఉన్నాయి ఇవన్నీ
(2:35:31) కాదు నాకు భగవంతుడి యొక్క దివ్య మంగళ రూపాన్ని హాయిగా పాదాల నుంచి శరస్సు వరకు ధ్యానించ చాని ఉంది బాగుంది విష్ణు పాదాదికేశంత స్తోత్రం ఉంది చదువుకోండి విష్ణువు యొక్క రూపం కాదు శివుడిది ఉంది శివుడి రూపం నేను ధ్యానించాలి బాగుంది శివపాదాదికేశంత స్తోత్రం శివ కేశాదిపాదంత స్తోత్రం కూడా ఉంది రెండు చదువుకోవచ్చు ఆ కాదు అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించామండి సౌందర్య లహరి ఆ చివరి శ్లోకాలు చివరి 60 శ్లోకాలు అంతా కూడా అన్ని అమ్మవారి యొక్క రూపవర్ణనే అట్లా కాదు మాకు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని ధ్యానించాను సుబ్రమణ్య భుజంగం కూడా ఉంది
(2:36:00) దాంట్లో కూడా రూపవర్ణ చక్కగా ధ్యానించబడండి కాబట్టి ఎవ్వరికీ అట్లా అంతా కాదు నాకు శుద్ధమైన ఆత్మతత్వం కాదు అయితే పద ప్రస్థాన గ్రంథాల్లోకి వెళ్దాం ప్రకరణ గ్రంథాల్లోకి వెళ్దాం ఇట్లా కాదు నాకు బాగా లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కావాలి పద ప్రస్థాన భాషల్లో చూసుకుందాం ప్రస్థాన త్రయ భాషలో చూసుకుందాం ఈ రకంగా కాదు ఇవన్నీ కాదు భగవంతుడి పేర్లు వాటికి అర్ధాలు ఇంత తెలుసుకుంటే చాలు నాకు విష్ణు సహస్రనామ భాష్యం త్రిస్తి భాష్యం రెండు సిద్ధంగా ఉన్నాయి ఏది కావాలో నువ్వు చెప్పు అది చదువుకో ఈ రకంగా ఎవరికి ఏ అవసరం ఎప్పుడు కావాలో ఎటువంటి అవసరం
(2:36:28) కావాలో వాటినన్నిటిని తీర్చడానికి ఒక సర్వతోముఖమైన సమగ్రమైన వాంగ్మయ సంపత్తిని మనకి కాదు ఈ భరత జాతికి కాదు ఈ ప్రపంచానికి అందించారు కాబట్టి భగవత్పాదులు జగద్గురువులు అనే శబ్దానికి సర్వతా యోగ్యులైన వారు అని చెప్పి మన సంప్రదాయం మనకి చెప్తుంది. ఎందుకంటే వారి అవతార ప్రయోజనమే అది మనం వారి అవతారంతో మనం మొదలు పెట్టాం.
(2:36:55) చివరిలో కూడా వారి అవతారం గురించి చెప్పుకుంటే పురాణం వారి యొక్క అవతారాన్ని వర్ణిస్తూ ఏం చెప్పింది చతుర్భిసహితశే శంకరః అవతరిష్యతి కైలాసవాసి అయిన శంకరుడు నలుగురు శిష్యులతో అవతరిస్తాడు. దాని యొక్క ప్రయోజనం ఏమిటి అని చెప్పంటే ఆ శ్లోకంలోనే అదే శ్లోకంలో చెప్పారు వ్యాకుర్వన్ వ్యాస సూత్రార్థం శుతేర్ అర్థం యతోచితం వ్యాస సూత్రాలైన బ్రహ్మ సూత్రాలకి ఉపనిషత్తులకి ఉచితమైన యుక్తి యుక్తమైన అర్థాన్ని చెప్పడానికి శంకరుడు నలుగురు శిష్యులతో అవతరిస్తాడు వ్యాసభాష వ్యాస సూత్రాలకు భాష్యాన్ని శివుడు విరచిస్తాడు ఉపనిషత్తులకు భాష్యాన్ని చెబుతారు అని ఉంది స్పష్టంగా అలాగే మరొక
(2:37:32) పురాణంలో ఏముందంటే కరిష్యత్ వతారాణి శంకరో నీలలోహితః శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం వైద శృతిస్మృతి మార్గాన్ని ప్రతిష్టాపన చేయడానికి శంకరుడు నీలలోహితుడైన శంకరుడు అవతరిస్తాడు అక్కడ ఏం చెప్తారంటే ఉపదేశతి తజ్ఞానం య బ్రహ్మ సం పరమాత్మ గురించి పరబ్రహ్మ గురించి వేదాంతాల్లో చెప్పబడిన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు శివుడు అని చెప్పి చివర్లో ఒక మాట చెప్పారు ఏతం భక్త్యా నిషేవంతే ఏనకేనోపచారతః విజిత్య కలిజాన్ దోషాన్ ప్రవిశంతి పరంపదం అని ఉంది ఇది శంకరాచార్యుల యొక్క అవతారానికి మనకు ఉండే సంబంధాన్ని పురాణమే చెప్పిన శ్లోకం ఎందుకంటే ఇట్లా ఈ విధంగా
(2:38:17) వేదాంతోపదేశం చేసిన శివావతారం అంటే శంకరావతారమే కాబట్టి ఈ పురాణ వాక్యం కూడా శంకరాచార్యుల గురించే చెప్పేది దాని గురించి చెప్పిన మాట ఏంటంటే ఏతం భక్త్యా నిషేవంతే ఎవరెవరైతే ఆ శంకరుల యొక్క వేదాంతోపదేశ రూపమైనలో లోకులకి లోకంలో వైదిక మార్గాన్ని పునరుద్ధరించిన రూపం అని చెప్పారు కదా శ్రోతస్మార్త ప్రతిష్టార్థం కాబట్టి లోకంలో మరల వైదిక మార్గాన్ని ఉద్ధరించి వేదాంత బోధ చేసే ఏ శివ అవతారం అయితే ఉంటుందో శంకరాచార్య రూపమైన అవతారం ఏదైతే ఉంటుందో ఎవరైతే దాన్ని సేవిస్తారో ఎలా సేవించమంటారండి ఏనకేనోపచారతః మీకు చేతనైనంత ఎలాగైతే అలాగా ఆయన గ్రంథాలు
(2:38:58) చదివి వారు చెప్పిన మా ధర్మాన్ని అనుసరించి వారు చూపించిన దేవతలని ఉపాసి ంచి వారు చెప్పిన గ్రంథాలన్నీ చదివి వారు చెప్పిన తత్వాన్ని తెలుసుకొని ఏదో ఒక విధంగా ఎవరైతే వారి యొక్క మార్గంలో పడతారో ఎవరైతే భగవత్పాదుల పాదాల పంచన చేరుతారో వాళ్ళఏంటంటే విజిత్య కలిజా దోషాన్ని కలికాలానికి చాలా దోషాలు ఉన్నాయి. మనుషులకి ఆయుష్యు సరిపోదు మేధాశక్తి తగ్గిపోతుంది.
(2:39:24) వాతావరణం అంతా ఉండదు ఇవన్నీ కలిదోషాలు ఇవన్నీ మన సాధనకి వెళ్ళడానికి ఉపకరించేవి కావు పైగా మనకి ప్రతిబంధకాలుగా ఉండేవి. అటువంటి కలిదోషాలను కూడా వాళ్ళు వాళ్ళు దాటుకొని ప్రవిశంతి పరంపదం మానవ జన్మకి పరమలక్ష్యమైన ఆ మోక్షాన్ని వాళ్ళు పొందగలుగుతారు. దానికి మార్గం ఏమిటంటే భగవత్పాదులు మనకు చూపించిన మార్గము అని పురాణం మనకి ఈ రకంగా భగవత్పాదుల యొక్క అవతారాన్ని ఉటంకించి అవతార ప్రయోజనం చెప్పి అవతార ఫలితం చెప్పి అవతారం వల్ల మనం పొందే లాభాలని కూడా ఈ రకంగా చెప్పింది కాబట్టి తప్పక శాంకర వాంగ్మయాన్ని చదవాల్సిన అవసరం ప్రతి ఆస్తి కొడుకని చెప్పి కూడా అన నాకు సుఖం కావాలి అనుకుండే ప్రతి జీవికి ఉంది
(2:40:08) ఉంది ఏ జీవు ఏ జీవి అయినా ఏ ప్రాణి అయినా సరే నాకు సద్గతి పొందడం ఎలాగా నాకు పరమ శ్రేయసు ఎలా వస్తుంది అని దానికి ఏ ప్రాణికైనా సరే ఒక ఇచ్చ కలిగినట్లయితే శాంకర మార్గంలో భగవత్పాదుల యొక్క ఉపదేశం ప్రకారం ఆ ప్రాణి నడుచుకుంటే ఎక్కడున్నా సరే అక్కడి నుంచి మొదలై తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఏ ప్రాణి అయినా సరే మోక్షాన్ని పొందగలుగుతుంది అనే విషయాన్ని మనకి పురాణం కూడా ప్రమాణీకరిస్తుంది.
(2:40:37) కాబట్టి ఆ శంకరాచార్యులు ఇప్పుడు మనకి భగవత్పదుల వాంగ్మయం మాత్రమే ఉంది మరి శంకరాచార్యులని చూడడం ఎలాగ అంటే భగవత్పాదులు చెప్పారు అస్మత్ పీఠ సమారూఢః పరివ్ర ఉక్త లక్షణః అహమేవేతి విజ్ఞేయః యస్యదేవతిశుతేహ నా పీఠాల మీద నేను పెట్టిన నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాల మీద ఉక్త లక్షణః మనం అనుకున్నట్లు అన్ని యోగ్యతలతో ఏ సన్యాసులు అయితే ఏ యతి శ్రేష్టులయితే అధిష్టించి ఆ పీఠాన్ని అధిష్టించి ఉంటారో సహా అహమేవేతి విజ్ఞేయః వాళ్ళు నే నా యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి కాబట్టి ఇంత అద్భుతమైన వాంగ్మయాన్ని మనకఇచ్చిన భగవత్పాదులని సేవించుకోవడానికి సేవించి కొంతైనా రుణంలో
(2:41:18) లేష లేష లేషమైనా తీర్చుకోవడానికి అవకాశం ఉందా అనుకుండే వాళ్ళకి తప్పక వారిని చతురామనాయ పీఠాధిపతుల యొక్క రూపంలో దక్షిణాంనాయ పీఠంలో అయితే జగద్గురువుల భారతీర్థ మహాస్వామి వారి యొక్క రూపంలో అలాగే జగద్గురువుల విధశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క రూపంలో ఉన్న శంకరాచార్యులని తప్పకుండా మనం సేవించమని తద్వారా భగవత్పాదుల పట్ల మనకు ఉండవలసిన కృతజ్ఞతలో ఒక ఈషద్భాగమైన మనం ప్రకటించుకోవచ్చు.
(2:41:44) అద్భుతం అద్భుతం అయితే ఇక్కడ మరొక్క ప్రశ్న ఇప్పుడు క్షాత్ర ధర్మం గురించి భగవత్పాదులు గారు చెప్పినటువంటి ఏదైనా ఒకటి క్షాత్ర ధర్మం అంటే చెప్పారు క్షాత్ర ధర్మం అంటే ఏమిటంటే దాని కాళిదాసే చెప్పాడు క్షతకిలత్రయత ఇతగ క్షత్రస్య శబ్దో భవనేశరః అని రఘవంశంలో మాట ఉంది లోకాన్ని గాయాల నుండి రక్షించేవాడు ఎవ్వరికీ దుఃఖం లేకుండా చూసుకునేవాడు అని అర్థం ఇదే భగవత్పాదులు ప్రశ్నోత్తరత్మాలికలో చెప్పారు కోరాజా రంజన కృత్ అని చెప్పారు.
(2:42:16) నిజమైన రాజు ఎవరు అంటే ప్రజలకి మంచి ఆనందాన్ని కలిగించేవాడు అంటే ఊరికనే వాళ్ళకి ఏదో తాత్కాలికమైన లాభాలు చూపించేవాడు కాదు నిజంగా వాళ్ళని ఆనందింప చేసేవాడు. అలాగే ఆ రాజు ఎలా ఉండాలి? కాచ సభ పరిహర్య ఎటువంటి రాజ్యసభని వదిలేయాలి. హీనాయా వృద్ధ సచివేన జ్ఞానవృద్ధులైన సలహాదారులు లేని రాజసభ దీనికి పనికి రాదు దాని వల్ల ఏ ప్రయోజనం లేదు కాబట్టి రాజు ఆ సరిైన సలహాదారులను పెట్టుకొని ఉండాలి అలాగే లుబ్దుడైన రాజు ఉండేది కుత్ర నివాసో కార్యః ఎక్కడ ఉండాలి అంటే సజ్జన నికటే అథవా కాశ్యం సత్పురుషులతో ఉండాలి లేదా కాశ్యం అంటే క్షేత్రాల్లో ఉండాలి కఫ్ పరిహార్యోదేశః
(2:42:59) అంటే లుబ్దుడైన రాజు ఉండే చోట ఉండకూడదు అంటే కేవలం ధనం మీదనే దృష్టి ఉండే రాజు ఉండే చోట ఉండకూడదు అంటే ఇవన్నీ రాజులకే ఉపదేశాలు మీరు సరిైన సలహాదారులను పెట్టుకోండి. మీరు ధనలోభంతో మీరు మీరు ప్రవర్తించకండి ప్రజల యొక్క సుఖశాంతులే మీ నిజమైన అభిప్రాయము ఇటువంటి ఉపదేశాలన్నీ కూడా రాజులు ఎలా ఉండాలి అంటే పరిపాలకులు క్షాత్రం వీళ్ళందరూ ఎలా ఉండాలి లోకాన్ని ఎలా ఉంటే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా సరైన మార్గంలో వాళ్ళు ఉంటూ ప్రపంచాన్ని కూడా సరైన మార్గంలో నడపగలుగుతారు అనే విషయంలో భగవత్పాదులు ఇటువంటి ఉపదేశాలు చేస్తున్నారు ఇది గాక
(2:43:34) గీతలో భగవంతుడు ఆ క్షాత్ర ధర్మాలు చెప్పినప్పుడు శౌర్యం తేజో దృత దాదాక్షం యుద్ధేచ్యపలాయనం దానం ఈశ్వర భావ క్షాత్రం కర్మ స్వభావజం అన్నప్పుడు భగవత్పాదులు ఇవన్నీ కూడా వీటిలన్నిటికీ వ్యాఖ్యానించారు దాక్ష్యం అంటే వారు ఎన్ని రాశరంటే ఏది ఎప్పుడు చేయాలో తెలియడం పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయడం అని చెప్పి తెల్ల మొహం వేయకూడదు వెంటనే ఆ సమదర్భానికి సరిైన చర్యను తీసుకోగలగాలి.
(2:43:57) ఇలాగ రకరకాల ఆ ఈశ్వర భావః ఆజ్ఞలు జారీ చేయాలి. మనం ఏదో బిక్కు బిక్కుమని ఏదోటి వాడిని చూస్తూ భయపడుతూ ఉండకుండా ఆ పరిపాలించేవాడు స్వతంత్రంగా స్థిరంగా నిలబడి ఎవ్వరికీ జంకకుండా ధర్మ మార్గంలో వెళ్ళగలగాలి ఇటువంటి వివరాలన్నీ కూడా భగవత్పాదులు అక్కడ గీత భాషలో ఇచ్చారు. కాబట్టి క్షాత్రం గురించి అంటే ఈ ప్రసంగాలు ఇట్లా వచ్చినాయి. బాగుంది బాగుంది బాగుంది అంటే ఇదంతా నిజంగా ఈరోజు ఉన్నటువంటి తరానికి ఎందుకు అవసరం అనేది చాలా చక్కగా అద్భుతంగా మీరు వివరించారు ఎందుకు అవసరం అనేది నిజంగా ఒక మనిషి అంటే ఏదైనా మోక్ష సాధనలో ముఖ్యంగా ఇదంతా చదివితే అంటే అంత చదవడం చాలా కష్టం బట్
(2:44:33) మీరు చెప్తున్నది వింటూ ఉంటే కూడా ఒక మనిషి మనిషిలా బ్రతకడానికి ఏది అవసరం ఒక మనిషి మనిషిలాగా బ్రతకడానికి మనీషి అవ్వడానికి అవ్వడానికి మనిషి అవ్వడానికి మనిషిగా ఉండడానికి మనీషిగా అవ్వడానికి రెండిటికీ కావాల్సినవి ఉన్నాయి అన్ని అన్ని ఉన్నాయి సో కచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నిజంగా చెప్తున్నాను ఆ ఇప్పుడు మన ఛానల్ లో కూడా రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ గురించి కాదు నేను మాట్లాడుతున్నది.
(2:44:58) ఇప్పుడు నిజంగా ఎన్నో ఎన్నో ప్రవచనాలు మీరు ఇస్తున్నారు. మీరు ఎంత మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నారు. తిరుగుతున్నారు ప్రవచనాలు ఇస్తున్నారు. అంటే సామాన్యులకి అర్థమయ్యే స్థాయిలో నిజంగా ప్రతి విషయాన్ని విశదీకరించి వివరించి మీరు చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా అందరూ చూడాలి.
(2:45:16) ఎంత ఎక్కువ చూస్తే ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు అవకాశం వచ్చింది ఇక్కడ మూడు గంటలు కూర్చొని మాట్లాడుకునే అవకాశం బట్ అందరికీ అవకాశం దొరకడం కష్టం కానీ ఆ అవకాశం ఇవ్వడానికి ఈరోజు మన అదృష్టవశాత్తు మన డిజిటల్ మీడియా అనేది ఉంది చాలా పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి మీరు ఒకసారి కచ్చితంగా చాలా మంది చూస్తున్నారు బట్ చూడని వారి గురించి నేను చెప్పేది తప్పకుండా చూడాలి అర్థం చేసుకోవాలి అండ్ ప్రత్యేకంగా వారి మాటలు విన్న తర్వాత మనం ఏదో అర్థం చేసుకోవాలి అని ఉండదు ఇంకా డైరెక్ట్ గా ఆ మాటలు అర్థమైపోతాయి సో అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కాబట్టి మీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి పెద్ద
(2:45:44) సంఖ్యలో పెద్ద స్థాయిలో అవసరం అవసరం అవసరం ఎందుకంటే ధర్మం గురించి చెప్పేవారు ఆ చాలా తక్కువగా ఉన్నారు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది ఆ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు కదా ఎందుకంటే ఎంతసేపు పక్కన మీద పడేసాడు మాకు చెప్తలేదు కాబట్టి మాకు వస్తలేదు. కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్తున్నారు తిరుగుతున్నారు వారు కేవలం ఆ పని మాత్రమే పెట్టుకొని ఈ జీవితాన్ని దానికోసమే దాదాపుగా దాని కోసమే వేరే ఏం లేదు వేరే ఏది లేదు కాబట్టి ఆ తత్వాన్ని చాలా పెద్ద స్థాయిలో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
(2:46:13) ఇదంతా కూడా మనం అనుకున్నట్లు ఇదంతా నా సొంత శక్తి ఏమి కాదు ఇదంతా మనం ఇదివరకు దాంట్లో అనుకున్నాం ఇప్పుడు కూడా అది జగద్గురువుల యొక్క మార్గ నిర్దేశం ఎందుకంటే ఆ మీకు తెలిసిన విషయమే నేను సొంతంగా ఏ పని చేయను వారు నాకు చెప్పిన పనులేవు నేను నా జీవితంలో పెట్టుకున్న పనులు కాబట్టి వారు సర్వ శంకరుల హృదయమే వారి హృదయం కాబట్టి ఏవి ఉపయోగించే విషయాలు అనేవి వారు కొన్ని సంకల్పించుకున్నప్పుడు వాటిల్లో ఏ భాగాలైతే వారు నన్ను సాధ సాధనంగా వాడుకొని నాకు కూడా ఉపయోగించే విషయాలు ఎక్కడైతే చెప్తారో ఆ విషయాలని నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తుంటాను.
(2:46:48) ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీతో ఇట్లా ఒక సెషన్ ఉంటుంది ఒక రికార్డింగ్ ఉంటుంది అని చెప్పని వెంటనే వారు చెప్పింది ఏంటంటే శంకర వాంగ్మయం గురించి చెప్పు అని చెప్పమంటున్నారు కాబట్టి వెంటనే అలాగే అది నిర్దేశం వారి యొక్క మార్గ నిర్దేశం కాబట్టి ఇప్పుడు నా పని ఏమిటంటే జగద్గురువులు నాకు గురువుగారు నాకు చెప్పిన ఈ విషయం గురించి సమగ్రంగా నాకు చేతనైనంతగా నేను విషయాలు కొన్ని తెలుసుకొని ఎందుకంటే జగద్గురువులు నన్ను ఏమైనా చెప్పమన్నప్పుడు నేను చాలా సార్లు గమనించాను అదేదో వేరే వాళ్ళ కోసం కాదు దాంట్లో వారు నాకు ఏది చెప్పినా దాంట్లో
(2:47:18) నేను చదువుకోవడానికి ఏదో విషయం ఉంటుంది. కాబట్టి అది ఆ అది నాకు ఒక పాఠమే అది అలాగే వారు నాకు చెప్పిన పని కాబట్టి నాకు వీలైనంతలో ఆ విషయాలని నలుగురికి నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి పంచడం అనేది అద్భుతం అద్భుతం ఇది ఇంకా అదృష్టం మనందరికీ కూడా ఏకంగా జగద్గురువులు వారు మనకు తెలియజేయాలి అనేటటువంటి తపనతో ఇంత అంటే అవసరం లేదండి నిజంగా చెప్తున్నాను కదా అవసరం లేదు కానీ ఇంత శ్రమ ఇంత తపన ఎందుకోసం అంటే ఈ సమాజం కోసం మనకోసం మనం దేశం కోసం దేశం కోసం కాబట్టి మనం బాధ్యతగా బ్రతకడం కోసం ఇంతకుముందు మనం ఫస్ట్ గా మాట్లాడిన శంకరుల వారికి వచ్చేది ఏముంది
(2:47:58) ఏమీ లేదు మనకి ఇవన్నీ ఇవ్వడం ద్వారా కానీ మనకోసం మనకోసం వారి తపన జగద్గురువుల తపన దయచేసి మనందరం కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన తర్వాత తరాలకి తెలిపే ప్రయత్నం చేద్దాం. అండ్ మరొక్కసారి ఆ చాలా చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం.
(2:48:19) అండ్ ఇది రెండవది మన సిరీస్ లో ఇది రెండవ ఎపిసోడ్ సిరీస్ అనే విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు [నవ్వు] సిరీస్ లో రెండో విషయం అండ్ చివరిగా ముగించే ముందు మీ ద్వారా ఏదైనా ఒక స్తోత్రం ఒక స్తోత్రం నాకు ఇష్టదేవ నరసింహ స్వామి భగవత్పాదులాగా నేను కూడా వైష్ణువేండి. [నవ్వు] కాబట్టి ఆ వారు నరసింహ స్వామి మీద రెండు స్తోత్రాలు ముఖ్యంగా రాశారు.
(2:48:40) ఒకటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కరుణారస స్తోత్రం అంటారు. అలాగే లక్ష్మీ నరసింహ పంచరత్నం యొక్క స్తోత్రం రాశారు. అది కొంచెం దక్షిణామూర్తి స్తోత్రం లాగా ఉంటుంది పూర్తిగా అది మనకి తత్వాన్ని చెప్పే స్తోత్రం కాబట్టి ఆ జీవేశ్వర సంబంధం మనం ఏదైతే ఎక్కడైతే మొదలు పెట్టామో దాన్ని చాలా చక్కగా ఆ చెప్పే ఒక శ్లోకం దాంట్లో వారు చెప్పారు తవత్ ప్రభుజీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురుసతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలః బింబాలంకృతి మాతను చేతో భృంగ భ్రమసివృతా భవమరుభూమో విరసాయం భజభజ జ లక్ష్మీ నరసింహానధ పదసరసిజ మకరందం శ్లోకం అంటే ఓ మనసనే తుమ్మెద
(2:49:23) నువ్వు సంసారం అనే ఎడారిలో అనవసరంగా తిరుగుతున్నావు నీకు కావాల్సింది శాశ్వతమైన మకరందం కదా అది నీకు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పాద పద్మాల వద్ద దొరుకుతుంది తప్ప సంసారం అనే ఎడారిలో దొరకదు. వెంటనే మనక వస్తుంది మనసు అనుకుంటుంది నాకు ప్రభువు నా జీవుడు జీవుడే కదా మనసుని పెట్టుకొని [గొంతు సవరించుకోవడం] రకరకాల వ్యవహారాలు చేసేది కాబట్టి భగవత్పాదులు ఆ మనసుకు చెబుతున్నారు తత్ ప్రభు జీవ ప్రియం ఇచ్చ ఓ మనస్సా నీ ప్రభువైన జీవుడు నిజంగా సుఖంగా ఉండాలి అని చెప్పంటే నరహరి పూజాం కురుసతం నువ్వు నరసింహ స్వామిని నువ్వు చక్కగా ఆరాధించు పూజించు వెంటనే సందేహం వస్తుంది.
(2:50:05) జీవుడు సంతోషంగా ఉండాలంటే జీవుడిని లాలించి బుజ్జగించాలి కానీ నరసింహ స్వామిని పూజిస్తే జీవుడు ఎందుకు సుఖంగా ఉండేది అని చెప్పంటే అక్కడ భగవత్పాదులు మంచి ఉపమానం చెప్పారు ప్రతిబింబాలంకృతి దృతి కుశలః బింబాలంకృతి మాతనుతే మనము బింబాన్ని అంటే మన ముఖాన్ని అలంకరించుకోవాలంటే చూడాల్సింది దేన్ని ప్రతిబింబాన్ని కాబట్టి ప్రతిబింబాన్ని చూసినప్పుడు ప్రతిబింబం బాగుండాలంటే ఏం చేయాలి ప్రతిబింబం ఇప్పుడు నేను రోజు భస్మం కుంకుమ పెట్టుకుంటాను.
(2:50:40) నా ముఖం బాగుండాలి అంటే అంటే నా ముఖం కాదు ప్రతిబింబం ప్రతిబింబం బాగుండాలి నా నా రిఫ్లెక్షన్ లేదా పోనీ రిఫ్లెక్షన్ అంటే అద్దం పక్కన పెట్టేయండి కెమెరాలో కెమెరాలు ఎప్పుడు ఈ కెమెరాలో నా నా ఛాయ పడుతుంది. దాంట్లో నేను బాగా కనపడాలి. అని చెప్పి అంటే నేను కెమెరాకి వెళ్లి బొట్టు పెడితే సరిపోతుందా? కెమెరాలో [గొంతు సవరించుకోవడం] పడే ప్రతిబింబానికి మూల భూతమైన దాన్ని నేను అలంకరించాలి అలంకరించాలి.
(2:51:03) కాబట్టి నేను కెమెరాలో నేను బాగా అందంగా పడాలంటే ప్రతిబింబంలో నేను చాలా అందంగా కనపడాలంటే నేను బింబంలో నేను సరిగ్గా వాస్తవం కుంకుమ పెట్టుకుంటే అది సరిగ్గా కనపడుతుంది. కాబట్టి ప్రతిబింబడైన జీవుడు బాగుండాలంటే నువ్వు బింబాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అనుకోండి ఈశ్వరుడు బింబము దాని యొక్క ప్రతిబింబమే జీవుడు ఆకాశం నుండి సూర్యుడు ఈశ్వరుడు దాన్ని ప్రతిబింబించిన సూర్యుడు జీవుడు కాబట్టి మనము ఆ జీవుడి యొక్క నిజమైన సుఖాన్ని కోరుతున్నామ అంటే ఈశ్వరారాధన అనేది తప్పనిసరి పైగా ఈ దృష్టాంతంలో కూడా జీవుడు ఈశ్వరుడిని పూజించాల్సిన అవసరం అలాగే అదే సమయంలో
(2:51:38) జీవుడికి ఈశ్వరుడికి ఉండే ఐక్యం జీవుడు జీవుడు ఈశ్వరుడు ఒకటయినప్పటికీ జీవుడు ఈశ్వరుని ఆరాధించాల్సిన అవసరం ఎందుకుఉంది అనేది భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారు కాబట్టి దీంట్లోనే అంతా వచ్చింది ఈశ్వరుని సేవించాలి క్రమంగా మన యొక్క ఉపాధిని అతిక్రమించి ఈశ్వరుడితో ఐక్యమయి శుద్ధ చైతన్యంగా మిగిలే ప్రయత్నం చేయాలి అనే అర్థంఅంతా ఈ యొక్క శ్లోకంలో చాలా అందమైన ఉదాహరణతో ఉపమానంతో భగవత్పాదులు మనకు అందించారు.
(2:52:08) అద్భుతం ఈ అద్భుతంతో మనం ఈ అంకాన్ని ఈరోజుకి ముగిస్తున్నాం మళ్ళీ కచ్చితంగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ చాలా ఉన్నాయి చెప్పాల్సినవి చేయాల్సినవి అండ్ మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు ఆ

No comments:

Post a Comment