Friday, March 15, 2024

మనం చేసే మేలు మనకేగాని లోకానికి కాదు

 మనం చేసే మేలు మనకేగాని లోకానికి కాదు
కర్తవ్యనిష్ఠ ఆధ్యాత్మిక పురోగతిలో మన కెలా తోడ్పడుతుందో అనే విషయాన్ని విచారించడానికి ముందు మరొక దృక్పథం నుండి కర్మానికి భారతీయులమైన మనం గ్రహించే అర్థం సూక్ష్మంగా తెలుసుకుందాం. ప్రతి మతానికి తత్త్యవిచారం, పురాణాలు, క్రతుకలాపాలు అనే మూడు భాగాలుంటాయి. తత్త్యవిచారమే నిస్సంశయంగా ప్రతిమతం యొక్క సారాంశం; మహాపురుష చరిత్రలలోని ఐతిహాసాల చేతను, అద్భుత విషయాలను గురించిన గాథలచేతను, కథలచేతను పురాణాలు తత్త్యాన్ని సోదాహరణంగా విశదీకరిస్తాయి; క్రతుకలాపాలు దానికి సర్యజనగ్రాహ్యమైన రూపాన్నిస్తాయి.అంటే తత్త్యశాస్త్రం యొక్క మూర్తీభవించిన రూపమే క్రతు కలాపాలు; తత్యశాస్త్ర స్థూలరూపమే క్రతుకలాపాలు. ఈ క్రతువులే కర్మ. ప్రతిమతంలోను ఇది అవసరమైవున్నది. ఎందుకంటే విశేషమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పొందనిదే గ్రహింపవీలుగాని పారమార్థిక విషయాలను మనలో అనేకమంది తెలుసుకోలేరు. సమస్తం తమకు బోధపడుతుందని మానవులు అనుకోవటం తేలికేగాని అనుష్ఠానానుభవానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాలను గ్రహించటం ఎంతో కష్టమని తెలుస్తుంది. సంకేతాలు మనకు చాలా తోడ్పడతాయి. సంకేతాల ద్యారా తత్త్యాన్ని బోధించే విధానాన్ని మానుకోలేము. అతిప్రాచీనకాలం నుండి సంకేతాలు అన్ని మతాలలోను వినియోగింపబడుచుండేవి. ఒక విధంగా చూస్తే సంజ్ఞల ద్వారానే మనం ఆలోచించగలం, అసలు శబ్దాలు భావాల సంజ్ఞలే. పక్షాంతరంలో జగత్తులోని ప్రతిదీ సంజ్ఞ అనే భావింపనగును. జగత్తంతా ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు మరుగున వుండే తత్యం భగవంతుడు. ఈ విధమైన సంజ్ఞాశాస్త్రం కేవలం మానవకల్పితం కాదు; ఫలానా మతానికి చెందిన కొంతమంది జనులు ఒకచోట చేరి, కొన్నిసంజ్ఞలను ఊహించి వాటిని తమ మనస్సుల నుండి వెలువరిస్తున్నారని భావింపకూడదు. ఈ పారమార్థిక సంజ్ఞలకు ఒక సహజాభివృద్ధి ఉంది. లేకపోతే దాదాపుగా ప్రతి వ్యక్తి మనస్సులోను కొన్ని సంజ్ఞలు ప్రత్యేకంగా కొన్ని భావాలకే స్ఫురణను కలిగించడానికి కారణం ఏమిటి? ‘సిలువ’ అనే ‘✝’ ఈ చిహ్నం మొట్టమొదట క్రైస్తవమతం నుండి ఉద్భవించినదని మీలో అనేకమంది భావించవచ్చును. కాని నిజానికి ఇది క్రైస్తవ మతానికి పూర్వం, మోసెస్ పుట్టడానికి ముందు, వేదాలకు ముందు, మానవులను గురించిన విషయాలకు ప్రమాణగ్రంథాలు ఏర్పడడానికి పూర్వమే వుండేది. ‘ఏజ్టెక్’, ‘ఫానిషియను’ జాతులలో ఈ చిహ్నాన్ని చూడవచ్చును. ప్రతిజాతిలోను సిలువ అనే ఈ చిహ్నమున్నట్లు కనిపిస్తుంది. అలాగే సిలువ వేయబడిన మానవుని ప్రతిమ కూడా ప్రతి జాతివారికీ పరిచితమైనదిగానే కనిపిస్తుంది. వృత్తం లోకమంతటా వ్యాప్తిగాంచిన ఒక మహాసంజ్ఞ. అన్ని సంజ్ఞలకంటే అధిక విశ్వవ్యాప్తి వున్న సంజ్ఞ ‘స్వస్తిక’. బౌద్ధులు దీన్ని లోకమంతటా వ్యాపింపచేశారనే నానుడి ఒకప్పుడుండేది. కాని బౌద్ధమతానికి అనేక యుగాలకు ముందే ఇది వివిధ జాతుల వాడుకలో వుండేదని తెలియవస్తూంది. ప్రాచీన బాబిలోనులోను, ఈజిప్టులోను ఇది కానవస్తుంది. దీనివలన తేలేదేమిటి? ఈ సంజ్ఞలన్నీ కేవలం ఆచారాన్ని అనుసరించి ఏర్పడినవి కావు. వీటి కేదో ఒక కారణం వుండి వుండాలి. మనిషి మనస్సుకు ఈ సంజ్ఞలకు సహజ సంబంధం వుండివుండాలి. భాష ఎప్పుడూ ఒక ఒడంబడిక ద్వారా ఏర్పడదు. ఈ భావాలను ఈ మాటతో తెలుపుదామని ప్రజలు తమలో తామే ఒడంబడిక చేసుకోలేదు. భావానికి సరిపడే శబ్దం – శబ్దానికి సరిపడే భావం లేకుండటం ఎన్నడూ లేదు; భావాలకు మాటలకు అవినాభావ సంబంధం సహజం. ఇలా భావాన్ని తెలిపే సంజ్ఞలు శబ్దరూపంలోగాని, వర్ణరూపంలోగాని వుండవచ్చును. చెవిటివారు, మూగవారు శబ్దేతరాలైన సంజ్ఞలతో ఆలోచించాలి. మనస్సులోని ప్రతిభావానికీ జతపడే రూపంవుంది; సంస్కృత వేదాంతంలో ఇవే నామరూపాలని చెప్పబడుతున్నాయి. ఏర్పాటుచేత (ముందుగా అనుకొని) భాషను సృష్టించటం ఎంత అసాధ్యమో సంజ్ఞా శాస్త్రాన్ని సృష్టించటం కూడా అంతే అసాధ్యం. కర్మ కలాపంలోని సంకేతాలలో మానవుల పారమార్థికాశయాలు ప్రకటితాలవుతున్నాయి. కర్మ కలాపాలు, దేవాలయాలు మొదలైన ఉపకరణాలు నిష్ప్రయోజనాలని చాలా తేలికగా చెపుతుంటారు. ఆధునిక కాలంలో ప్రతి శిశువు ఇలా చెబుతున్నాడు. కాని దేవాలయంలో దేవుణ్ణి అర్చించేవారు, అలా అర్చించని వారికంటె అనేక విషయాలలో మెరుగ్గా వున్నారనటం జనం సులభంగా గుర్తించగల సంగతే. కాబట్టి కొన్ని ఆలయాలకు, క్రతుకలాపాలకు, ఇతర బాహ్య విధులకు కొన్ని మతధర్మాలతో వున్న సంబంధంచేత, ఆయా మతధర్మాలను అవలంబించేవారికి, ఆ రూపాలు వేటికి సంజ్ఞలై వున్నాయో ఆ ఆశయాలను స్ఫురింపచేస్తాయి. కాబట్టి క్రతుకలాపాలను, సంజ్ఞలను పూర్తిగా ఉపేక్షించటం వివేకం అనిపించుకోదు. వీటిని గురించిన వివేచన, అనుష్ఠానం కూడా కర్మయోగంలో భాగమే.
కర్మశాస్త్రానికి రూపాంతరాలు అనేకం వున్నాయి. శబ్దార్థాల అన్యోన్యసంబంధ పరిశీలనాన్ని, శబ్దశక్తితో ఏం సాధించగలమో పరిశీలించడమూ దీనిలో ఒకటి. ప్రతిమతమూ శబ్దశక్తిని అంగీకరిస్తుంది. కొన్ని మతాలలో శబ్దంనుండే సృష్టి సమస్తమూ ఉత్పన్నమైనదని చెప్పబడివుంది. భగవత్సంకల్ప బాహ్యరూపమే శబ్దం. ముందుగా తాను అనుకొన్న విధంగా, సంకల్పించిన విధంగా భగవంతుడు సృష్టించాడు. శబ్దంనుండి సృష్టి వెలువడింది. మన ఐహిక జీవిత వేగపు ఒత్తిడిలో నాడీమండలం గ్రహణశక్తిని కోల్పోయి మొద్దుబారుతోంది. వయస్సు పైబడినదంటే అధికంగా ఈ లోకంలో ఆటుపోట్లకు గురై ఉన్నాము అనీ, అంటే మరింత స్తబ్ధత మనల్ని ఆవరించి ఉంటుంది. మన చుట్టూ నిత్యమూ జరిగే ప్రక్రియలపై కూడా శ్రద్ధ పెట్టము. అయినా మానవస్వభావం ఒకొక్కప్పుడు తన ఔన్నత్యాన్ని ప్రకటింప చూస్తుంది. అప్పుడీ సామాన్య జీవిత సంఘటనలను చూసి అబ్బురపడి వాటి తత్త్వాన్ని గ్రహించడానికి ప్రేరితులమౌతాము; ఇలా అబ్బురపడటమే జ్ఞానార్జనకు తొలిమెట్టు. మతంలో వేదాంతంలో శబ్దానికి వున్న అధిక ప్రాముఖ్యాన్ని అలావుంచి, మానవజీవిత నాటకరంగంలో శబ్దసంజ్ఞలు ప్రధానపాత్ర నిర్వహిస్తుండటాన్ని గుర్తించ వచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను తాకటంలేదు. నా మాటలవల్ల పుట్టే వాయుస్పందనాలు మీ చెవులలో ప్రవేశించి, నాడులను స్పృశించి మీ మనస్సులలో ప్రతిస్పందనను కలుగ చేస్తున్నాయి. దీనిని మీరు నిరోధించలేరు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన దేమిటంటే – ఒకవ్యక్తి మరొకణ్ణి ‘మూర్ఖుడా’ అనగానే అతడు లేచినిలబడి పిడికిలిబిగించి తనను తిట్టినవాడి ముక్కుమీద గుద్దుతున్నాడు. శబ్దశక్తి ఎలాంటిదో చూడండి! అతిదీనురాలైన ఒక స్త్రీ విలపిస్తోంది; మరొకామె ఆమెను సమీపించి మారటగా కొన్ని శాంతి వచనాలు పలుకుతుంది. క్రుంగిపోయిన ఆ దీనురాలు ఊరడిల్లి దుఃఖవిరహితయై నవ్వుతుంది. శబ్ద ప్రభావం ఎలాంటిదో చూడండి! వేదాంతంలో శబ్దం శక్తిమంతమే, సామాన్య జీవితంలోనూ అది శక్తిమంతమే. ఎలాంటి ఆలోచన, విమర్శన లేకుండానే రేయింబవళ్లు ఈ శబ్దశక్తిని మనం వినియోగిస్తున్నాము. శబ్దశక్తి ప్రభావాన్ని గ్రహించటం దానిని వినియోగించటంకూడా కర్మయోగాంశమే.

జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 2

 ,*త్రిపురా రహస్యము -62*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

*స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము*

 
 *జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 2*

ఆ మాటలు విన్న పరశురాముడు ఆలోచించాడు. అతడికి మళ్ళీ సందేహం కలిగింది.

గురువుకు నమస్కరించి గురుదేవా ! సత్సంగము, ఈశ్వరానుగ్రహము, వైరాగ్యము, ఈ మూడూ మోక్షానికి కారణము అన్నారు. విటిలో ముఖ్యమైనది ఏది ? దాన్ని ఎలా పొందగలము ? అన్నాడు.
 
ద: నాయనా ! శ్రేయస్సుకు ముఖ్యమైన మొదటి కారణాన్ని గురించి వివరిస్తాను విను. ఆ పరాచితి, పరమేశ్వరియే తన స్వాతంత్రేచ్చవల్ల ఈ జగత్తును సృష్టించింది. ఆమెయే హిరణ్యగర్భుడనే పేరుతో ఈ శరీరాన్ని ధరించింది. జీవులయొక్క కర్మలను, వారి కోరికలను అనుసరించి వారికి చిత్రవిచిత్రమైన ఫలితాలు ఇవ్వగల కర్మలను సృష్టించింది. 

ప్రతి మనిషీ మంచి, చెడూ కర్మలు చేస్తూనే ఉంటాడు. వీటి ఫలితంగా ఉత్తర జన్మలు ఎత్తుతుంటాడు. ఒక్కొక్కసారి కామ్యకర్మలే చేస్తాడు. వాటిలో ఏ లోపం జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వవు. పైగా ఒక్కొక్కసారి దుష్ఫలితాలు కూడా ఇస్తాయి. అందుకని సత్పురుషులనాశ్రయించి కర్మలు ఏ రకంగా చెయ్యాలో తెలుసుకుని ఆ రకంగానే వాటిని పూర్తి చెయ్యాలి.

సాధారణంగా సత్సంగం వల్లనే శ్రేయస్సు కలుగుతుంది. ఒక్కొక్కసారి గతంలో మనం చేసిన ఉత్కృష్టమైన తపస్సులాంటిది ఉంటే అనుకోకుండా శ్రేయస్సు కలుగుతుంది. వారికీ అల్పసాధనతోనే సంపూర్ణ జ్ఞానం సిద్దిస్తుంది.

 పూర్వపుణ్యంవల్ల వాసనలు లేనివారికి మనస్సు నిర్మలంగా ఉండి జనకుని లాగా అతిస్వల్పకాలంలోనే మహత్తర జ్ఞానం కలుగుతుంది.
 అధికవాననలున్నవాదికి జ్ఞానం కలిగినా దానివల్ల ఫలితముండదు.

జ్ఞానులలో కూడా స్థితి భేదాలున్నాయయ్యా !

 త్రిమూర్తుల మనస్సులలో కర్మవాసనలు లేవు. అందుకే వారు స్వభావజ్ఞానులు, అయినప్పటికీ వారి స్వభావగుణ మహాత్య్వాలలో  తేడా ఉంది.
 
పరశురామా నేను, దూర్వాసుడు, చంద్రుడు ఒక తల్లి బిడ్డలమే అయినా మాలో తేడా కనపడుతున్నది.

దుర్వాసుడు - కోపిష్టి
చంద్రుడు = కాముకుడు. దక్షుని కుమార్తిలందరిని వివాహం చేసుకున్నాడు.

ఇక నేను - _సర్వసంఘపరిత్వాగిని విరాగిని
అదే విధంగా వశిష్టుడు - కర్మిష్టి
సనకసనందనాదులు -_ సన్యాసులు
నారదుడు =. భక్తుడు
బృహస్పతి _ దేవగురువు
శుక్రాచార్యుడు - . రాక్షస గురువు
వ్యాసుడు - శాస్ర రచయిత
జనకుడు = రాజు
భరతుడు – త్యాగి 
 
వీరందరూ జ్ఞానులే ఇంకా ఇలాంటివారెందరో ఉన్నారు. వారిలో అనేక తేడాలు కనిపిస్తాయి. రామా ! నీకొక పరమ రహస్యాన్ని చెబుతాను విను.
 
వాసనాత్రయమును గురించి గతంలో వివరించాను.
1. అపరాధము 2. కర్మ ౩. కామము. వీటిలో కర్మవాసన బలీయమైంది. దీనివల్ల మనస్సు అత్యంత మూఢమవుతుంది. మిగిలిన రెండు వాసనలు లేకపోయినా, కర్మవాసన ఒక్కటి ఉంటేచాలు. జ్ఞానం కలగదు. ఈ కర్మవాసనకొద్దిగా ఉన్నా చాలు. అజ్ఞానము పెరిగిపోతుంది. మిగిలిన రెందు వాసనలు ప్రతిబంధకాలవుతాయి. అపరాధ, కర్మవాసనలు లేనివారికి కామవాసనలు ప్రతిబంధకాలు కావు. అందుచేతనే కర్మవాసనలు ఏ మాత్రం లేనివారిని మేధావులు అంటారు. వారికీ విషయాన్ని ఒకసారి విన్నంత మాత్రం చేతనే, అప్పటికప్పుడే మననము, ధ్యానము కలుగుతాయి. ఆ వెంటనే ఆత్మదర్శన మవుతుంది.

జనకమహారాజు లాంటివారు ఈ కోవకు చెందినవారే. వీరు జీవన్ముక్తులు. వీరి విషయంలో కామక్రోధాలు ప్రతిబంధకాలు కావు. అందుకనే వారు వాటిని నిరోధించటానికి ప్రయత్నంకూడా చెయ్యరు. 
 
అందుకనే జ్ఞానోదయమైన తరువాత కూడా వారిలో కామాదులు పుడుతూనే ఉంటాయి. కాని వాటివల్ల ఏ రకమైన మాలిన్యము వారికి అంటదు. వారిని 'ముక్తులు” అంటారు. 
 
పరశురామా ! కర్మవాసనలతో బాగా మలినమై పోయినవారికి సాక్షాత్తూ పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేసినా జ్ఞానం కలగదు.

అపరాధము, కర్మ తక్కువగా ఉండి కామవానన ఎక్కువగా ఉన్నవారు చాలా కాలం శవణమననాలు, ధ్యానము చేస్తే, అతికష్టం మీద జ్ఞానం కలుగుతుంది. వారు ఎక్కువగా సమాధిలోనే ఉంటారు. సమాధి అభ్యాసం వల్ల వాసనలు నశిస్తాయి. వీరి మనస్సు నశిస్తుంది వీరిని “నష్ట మానసులు” అంటారు. వీరు మధ్యములు.

యోగసాధన చేసేవారిలో కొందరు సోమరితనంతో తీవ్రసాధన చెయ్యరు. అప్పుడు మనస్సు నశించదు. వారిని “నసమననస్ములు” అంటారు. వీరే “'మందజ్ఞానులు” “కేవలజ్ఞానులు” వీరు ప్రారబ్బానికి లొంగిపోతారు. సుఖదుఃఖాలను అనుభవిస్తారు.
 
చనిపోయిన తరువాత మోక్షాన్ని పొందుతారు. నష్టమానసులు ప్రారబ్దాన్ని జయిస్తారు, వీరికి మనసుండదు కాబట్టి వీరి వాసనలు గొదె అడుగున ఉండే విత్తనాలలాగా తప్పలు అయిపోతాయి. అంతే గాని మొలకెత్తవు. జీవన్నుక్తులు ఉత్తమజ్ఞానులు.

వీరి దృష్టి ఆత్మానందం మీదనే ఉంటుంది. ఒక్కొక్కసారి బాహ్యప్రపంచం వైపు కూడా వీరు రావచ్చు. వీరు మేధావులు. ఏకకాలంలో అనేక పనులు, చెయ్యగలరు. అందుకే వీరిని “బహుమానసులు” అంటారు. వీరికి కూడా ప్రారబ్ద ఉండచ్చు. కాని అది మొలకెత్తగానే జ్ఞానాగ్నితో దాన్ని దగ్ధం చేస్తారు. కాబట్టి 'ప్రారబ్బకర్మ ఫలితాలు వారికి ఉండవు.
                                                     
🪷⚛️✡️🕉️🪷

ప్రతికూలతలతో ఎప్పుడూ బాధపడకండి. మీరు దీపం వెలిగించండి, చీకటి తానంతట తనే వెళ్తుంది.

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 121 / Osho Daily Meditations  - 121 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 121. చీకటి 🍀*

*🕉  ప్రతికూలతలతో ఎప్పుడూ బాధపడకండి. మీరు దీపం వెలిగించండి, చీకటి తానంతట తనే వెళ్తుంది. 🕉*

*చీకటితో పోరాడే ప్రయత్నం చేయవద్దు. అవకాశమే లేదు, ఎందుకంటే చీకటి ఉనికిలో లేదు - మీరు దానితో ఎలా పోరాడగలరు? దీపం వెలిగించండి, చీకటి పోతుంది. కాబట్టి చీకటిని మరచిపోండి, భయాన్ని మరచిపోండి. సాధారణంగా మానవ మనస్సును వెంటాడే ప్రతికూల విషయాలన్నింటినీ మరచిపోండి. ఉత్సాహం యొక్క చిన్న కొవ్వొత్తిని వెలిగించండి. ఉదయాన్నే మొట్ట మొదట, గొప్ప ఉత్సాహంతో లేచి, ఈ రోజు మీరు నిజంగా ఎంతో ఆనందంతో జీవించబోతున్నారనే నిర్ణయంతో- ఆపై గొప్ప ఆనందంతో జీవించడం ప్రారంభించండి. మీ అల్పాహారం తీసుకోండి, కానీ మీరు దేవుడిని తిన్నట్లుగా తినండి. అప్పుడు అది సంస్కారం అవుతుంది.*

*నీ స్నానం చెయ్యి, కానీ దేవుడు నీలోనే ఉన్నాడని గుర్తుంచుకో; మీరు దేవుడికి స్నానం చేస్తున్నారు. అప్పుడు నీ చిన్న బాత్రూమ్ దేవాలయం అవుతుంది, నీ మీద కురిసే జలం అభిషేకం. ప్రతి రోజు ఉదయం చాలా నిర్ణయాత్మకతతో, నిశ్చయతతో, స్పష్టతతో లేవండి, ఈ రోజు చాలా అందంగా ఉండబోతోందని మరియు మీరు దానిని అద్భుతంగా జీవించబోతున్నారని మీకు వాగ్దానం చేసుకోండి. మరియు ప్రతి రాత్రి మీరు పడుకునేటప్పుడు, ఈ రోజు ఎన్ని అందమైన విషయాలు జరిగాయో మళ్లీ గుర్తుంచుకోండి. కేవలం స్మరణ మాత్రమే అవి రేపు తిరిగి రావడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ఆపై ఈ రోజు జరిగిన ఆ అందమైన క్షణాలను గుర్తుంచుకుని నిద్రపోండి. మీ కలలు మరింత అందంగా ఉంటాయి. అవి మీ ఉత్సాహాన్ని కలిగి ఉంటాయి మరియు మీరు కూడా కొత్త శక్తితో కలల్లో జీవించడం ప్రారంభిస్తారు. ప్రతి క్షణాన్ని పవిత్రంగా చేసుకోండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 121 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 121. DARKNESS 🍀*

*🕉 Never be bothered by negatives. You burn the candle, and the darkness goes on its own.  🕉*

*Don't try to fight with the darkness. There is no way, because the darkness does not exist-how can you fight with it? Just light a candle, and the darkness is gone. So forget about the darkness, forget about the fear. Forget about all those negative things that ordinarily haunt the human mind. Just burn a small candle of enthusiasm. First thing in the morning, get up with a great enthusiasm, with a decision that today you are really going to live with great delight-and then start living with great delight. Have your breakfast, but eat it as if you are eating God. Then it becomes a sacrament.*

*Take your bath, but remember that God is within you; you are giving a bath to God. Then your small bathroom becomes a temple, and the water showering on you is a Abhishekam. Get up every morning with great decisiveness, with certainty, with clarity, a promise to yourself that today is going to be tremendously beautiful and you are going to live it tremendously. And each night when you go to bed, remember again how many beautiful things have happened today. Just the remembrance helps them to come back again tomorrow. Just remember, and then fall asleep remembering those beautiful moments that happened today. Your dreams will be more beautiful. They will carry your enthusiasm, and you will also start living in dreams with a new energy. Make every moment sacred.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

ఓ సాధారణ సాధకురాలి స్వగతం.......

 [3/14, 06:18] +91 73963 92086: ఓ సాధారణ సాధకురాలి స్వగతం.......

తనువు తనది కాదని తెల్సుకున్నవాడికి జపమేలా, తపమేలా....."
ఉదయం బిక్షాటనకు వచ్చిన ఓ కొమ్మదాసరి ఈ పాట పాడాడు.... బహుశా త్యాగరాజు కృతి అనుకుంటా. ఈ పాట విన్నప్పుడు మదిలో ఏదో భావన..... ఇంతలోనే ప్రక్కింటినుండి జేసుదాసు గారి పాట......
"గాలివానలో వాననీటిలో పడవప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం......."
 ఈ పాట వింటుంటే మనసంతా వికలం...... ఈ రెండు పాటలు ఒకేరోజు  వినడం యాదృచ్చికమైన, ఎందుకో నాలో ఏదో అలజడి. ఈ పాటల్లో సత్యముందని తెలుసు, కానీ.......... ఊహు...చెప్పలేని అంతర్యుద్ధం.
నాలో ఆధ్యాత్మిక తపన వుంది. కానీ, పూర్తిగా వైరాగ్యం ఇంకా రాలేదు. అటు అడుగులు వేస్తున్నా విరాగినిని కాలేదింకా. పారమార్ధిక విషయాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తానో, ప్రాపంచికతకు, మానసిక ఆనందంకు అంతే  ప్రాముఖ్యతనిస్తూ పయనిస్తున్నాను. ఇదిగో ఇక్కడే సంఘర్షణ మొదలైంది...... ఇలా ఐతే ముందుకు సాగడం అసాధ్యమని అర్ధమైనదగ్గరనుండి అంతర్యుద్ధం.......
ప్రాపంచిక ప్రపంచంలో అనేక ఆకర్షణలుంటాయి. మనస్సు కోరుతుందని, ఇందులో మానసిక ఆనందం వుందని పరుగులు పెడ్తే ఎలా? మనస్సువైపు కాదు, మాధవునివైపు సాగిపొమ్మని అంతరంగంలో హోరు....
అటా.......ఇటా..........  రెండింటిని సమన్వయపరుస్తూ ఎలా సాగను? ఎంతో గుంజాటన........
ఈ మద్య రోజుకు రెండు,మూడు గంటలు నెట్ కు అటుక్కుపోతున్నా...... ఈ ఆధునిక అభిరుచుల అల్లికలో కాలాన్ని వృధాగా చేజార్చుకుంటున్నానేమోనన్న ఆవేదన.

ప్రాపంచికత, ఆధ్యాత్మికత సమతూకం అంటే సరిగ్గా సమన్వయపరుచుకుంటూ జీవన పయనం సాగించడం దుర్లభం కాకపోవచ్చు గానీ కొంత కష్టతరమే.

భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడైనాడు. ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు.
అలాగని బంధాల్ని వదిలి వెళ్ళితే పరమాత్ముడు తెలియబడతాడా????? ఊహు..........
విషయ వస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేంద్రియ నిగ్రహంగల వ్యక్తికి గృహజీవనమే తపస్సుగా వుంటుంది. సంసారములో వుంటూనే దేనిని అంటుకోకుండా, పరిత్యాగబుద్ధి (పరిత్యాగమంటే నాది అనే భావాన్ని,దానిపట్ల అనురక్తిని త్యజించడం)ని అలవర్చుకున్న వ్యక్తి తపస్వే. తపమెరిగినవాడు పతన మెరుగడు. ఆంతర్యములో చోటుచేసుకున్న బలహీనతలను పారద్రోలునదియే తపస్సు. బాహ్యప్రేరణలకు లొంగక ఆంతర్య సౌందర్యమును వీక్షించించుటకు చేయు ప్రయత్నమే తపస్సు. నియమబద్దక సాధనాలు అనుష్టించి మనస్సు నియంత్రిచుకున్న వ్యక్తికి గృహమైనా, అరణ్యమైనా ఒక్కటే. ఎక్కడున్నా ఏంచేస్తున్నా అతడు నిత్యముక్తుడే, ఆనంద పరిపూర్ణుడే . అటువంటి ముక్తసంగునికి గృహమే తపోవనమని హితోపదేశం వుంది. అటువంటివారే సమన్వయ జీవితాన్ని గడపగలరు. 


కానీ-
చొక్కా గుండీలు ఊడిపోయాయి, బట్టలు సర్దుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా,బయటికి వెళ్ళడానికి సిద్ధమౌతూశ్రీవారి చిందులు. ఏంటమ్మా, ఎప్పుడూ ఇడ్లీ, దోశలు, ఉప్మా తప్ప నూడిల్స్ లాంటివి చేయవచ్చుకదా, టిఫిన్ ముందు అమ్మాయి అలక. నేను రాత్రి చెప్పాను కదమ్మా, నా టి షర్టు ఇస్త్రి చేసి వుంచమని... ఎన్ని బట్టలున్న వాడి చెప్పింది రెడీ చేయలేదని అబ్బాయి అరుపులు. ఇది ఇలా చేశావేమిటి, అది అలా చేశావేమిటీ......అత్తగారి పెద్దరికపు అదిలింపులు. ఏం చేస్తునారు వదినగారు...... ఇరుగు పొరుగు పలకరింపులు............ స్నేహితులకి సమయం కేటాయించలేనంత బిజీయా...... మిత్రుల మాటలతూటాలు..... ఈ ప్రాపంచిక అనుబంధాల్లో ఏ ఒక్కరికి సమయానికి ఏం చేయకున్నా అడుగుతారు, అరుస్తారు, అలుగుతారు...... సో..... వీరందర్నీ ఆనందపరచడానికి ఉరుకులు,పరుగులు తప్పవు. పారమార్ధికము కంటే ప్రాపంచికము వైపే ఎక్కువ తూగుతున్న. తూగాలి, తప్పదు. ఈ నేపద్యములో పరమాత్మున్ని పలకరించేది, పలవరించేది ఎలా కుదురుతుంది? భగవంతుని విషయంలో ఓ వెసలబాటు...... పలకరించకపోయిన ఏమీ అనడు. పైగా నారాయణుడు నారదుని గర్వభంగం చేసే కధ... (నిండు నూనెగిన్నెనిచ్చి తొణకకుండా గుడి చుట్టూ తిరిగి రమ్మంటే, దాని మీద ధ్యాసతో నారాయణుని తలవడు. అదే ఓ కర్షకుడు లేస్తూనే ఓసారి, పొలములో పనికి దిగుతూ ఓసారీ, భోజనముకు ముందోసారి, రాత్రి పడుకునే ముందోసారి తలవడం చూపించి నీకంటే ఉత్తమ భక్తుడని చెప్పే కధ)... గుర్తు చేసుకొని ఆ కర్షకుని కరుణించిన నారాయణుడు ఇన్ని పనుల మద్య పరుగులు తీస్తున్న నన్ను కూడా కనికరించి కరుణించడా........ మనస్సు ఇలా సర్దిచెప్పేస్తుంది, సమర్ధించేస్తుంది...... ఇదో మనో మాయ.
[3/14, 06:18] +91 73963 92086: ఇక బంధంలో వుంటూ బంధాలు అంటుకోకుండా వుండగల్గితే...........
నిజమే, జీవితం ధన్యమౌతుంది. కానీ ఎప్పుడో త్రేతాయుగం నాడు జనకునికి ఇది సాధ్యమైంది. సంసారములోనే ఉండి తరించిన కర్మ యోగి ఆయన. ఇక రామదాసు లాంటి వారికి తగును. సేవ, స్వాధ్యాయం(శాస్త్ర పఠనం) సాధన, సత్యం, సంయనం (నిగ్రహం) ఈ ఇదు "స"కారాలు సంసిద్ధిని అత్యుత్క్రుష్ట సాధనాలు. వాటిని సదా పూనికతో శక్తిసామర్ధ్యాలమేరకు అలవర్చుకొని చాలామంది ఆచరించి తరించారు. కానీ,
అంతటి శక్తి నాకెలా సాధ్యమౌతుంది? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గంకు ఎగిరినట్లు వుంటుంది. ప్రాపంచికమును, పారమార్దికమును సమన్వయపరుచుకోలేని నేను ఏదీ అంటకుండా ఎలా వుండగలను? భర్తాపిల్లలకు చిరు అనారోగ్యం కల్గిన ఆందోళన పడతాను. ఆత్మీయులకు ఏ బాధ కల్గిన తల్లడిల్లుతాను. భర్త ఉన్నతిని, పిల్లల, స్నేహితుల అభివృద్ధిని చూసి ఆనందముతో మరింత ఆకాంక్షిస్తాను. వారి వారి కష్ట సుఖాల్లో తాదాప్యం చెందుతాను. అటువంటి నేను బంధాలను అంటుకోకుండా వుండగలనా? వస్తు, వ్యక్తుల బ్రాంతిలో తగులుకొనిన నేను వాటిని వదలకనే వస్తురహిత చైతన్యస్థితి కలుగవలెనని అభిలషించడం అత్యాశే. ఆశుద్ధమైన మనసు ఆత్మసాక్షాత్కారం చేసుకోగలదా? మనస్సులో ఎటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, దేనితో తాదాప్యం చెందకుండా, ప్రతీది ఈశ్వర పనే, అనే భావముతో వుండి, ఆచరించు కర్మలన్నీ భగవానుడు వొసగిన పవిత్ర ధర్మములుగా భావించి ఆచరిస్తే ఆ కర్మలు నైష్కర్మములు అయి అంటుకోవు. కానీ అది నాకింకా అలవడలేదు.
గమ్యం తెలియకపోయినా పారమార్ధిక పయనంలో సాధనాగమనం సరిగ్గా వుంటే చాలు, స్మరణం వీడని మననం తోడుంటే చాలు.... జ్ఞాన జననం జరిగినట్లే, అంధకారం అదృశ్యమైనట్లే, విజ్ఞాన తీరాలు సమీపించినట్లే అని అన్నారు శ్రీ సుందర చైతన్యనందులు.
ఒకటి మాత్రం నిజం -
గమ్యంచేరేటంతటి సాధన చేయలేకపోయినను ఈ ఆధ్యాత్మిక చింతన అలవడిన దగ్గరనుండి మంచిచెడుల వివేకంతో నా గమనం ప్రశాంతముగా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇది చాలదు. ప్చ్.....
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామా....... 


సేకరణ రాధ 🙏

దేహం పోతుంది.... మరి నేను!!??

 దేహం పోతుంది.... మరి నేను!!??
✍️యం.సి. శివశంకరశాస్త్రి
✳️❀━❀━❀🪷❀━❀━❀✳️

🪷 శ్రీ రమణ మహర్షులవారికి నామకరణం చేసిన రోజున తల్లిదండ్రులు పెట్టిన పేరు - వెంకట్రామన్♪. ఆయన పదహారో ఏట తండ్రి మరణవార్త విని ఇంటికి చేరుకున్నాడు♪. బయట పడుకోబెట్టిన మృతదేహాన్ని చూడగానే... 'మా నాన్న చనిపోయాడంటారేం? ఇక్కడే ఉన్నాడుగా' ఆశ్చర్యంగా అన్నాడు♪. 'చనిపోకపోతే నిన్ను ప్రేమతో దగ్గరికి పిలిచి మాట్లాడేవారు కదా బాబూ!’ సానునయంగా అన్నారు అక్కడ చేరిన పెద్దలు♪. 

🪷 'అయితే, ఇంతకాలం నాతో మాట్లాడింది ఈ శరీరం కాదా?' వెంటనే సంశయం వెలిబుచ్చాడు♪. పెద్దల నోట మాట రాలేదు... శరీరం వేరు. లోపలి నుంచి మాటాడింది వేరా... అంటే... నేను ఈ శరీరం ఒకటి కాదా, వేరు వేరా? అలాంటప్పుడు 'నేను' ఎవరు? ఆయన మనసును తొలిచివేసిన తొలి సంశయమిది♪.

🪷 ఒకనాడు వెంకట్రామన్ తన మేనమామ ఇంటిలో మేడమీద ఉన్న చిన్న గదిలో ఒంటరిగా కూర్చున్నాడు♪. కొంత సేపటికి తన ఊహకు అందని ఓ విచిత్ర సంఘటన జరిగింది♪. అది ఆయన మాటల్లోనే చెప్పాలంటే...
 
✳️ శరీరంలో ఎలాంటి అనారోగ్యమూ లేదు♪. చనిపోతున్నానన్న మాట ఎవరితోనూ చెప్పదలచుకోలేదు. వస్తూన్న మరణాన్ని ఎదుర్కొని, ధైర్యంగా పర్యవసానం తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరాను♪. అనుకొన్నట్టు నిజంగానే చావు దాపురించింది♪. ఇంతకీ చావు అంటే ఏమిటి? ఎవరికొస్తుంది♪. నాకేనా? నేను ఎవరిని, చనిపోయేది ఏమిటి? ఓహో! ఈ శరీరం చనిపోతుంది♪. పోతే పోనీ,  అనుకొన్నాను. అంతే... నా రెండు కాళ్లు, చేతులు బార్లా చాచాను♪. పెదాలు బిగపట్టాను♪. మాట, పలుకు లేకుండా శ్వాస పీల్చకుండా ఉండిపోయాను♪. అటుపై నేను నాపై దృష్టి సారించాను♪. చావును అనుభవించాను... మళ్ళీ ఇలా అనుకొన్నాను♪. శరీరం చచ్చిపోయింది♪. ఇక శవాన్ని శ్మశానానికి తీసుకుపోతారు♪. దహనం చేస్తారు♪. కాలి బూడిదైపోతుంది♪. బూడిదైన శరీరంలో 'నేను' నశించానా? నేను నశించిపోతే శరీరం కాలి బూడిదైనట్లు నేను ఎలా తెలుసుకోగలను♪. అయితే, నేను శరీరాన్ని కానా? శరీరం కాలి బూడిదైన తరువాతా చావును అంటకుండా ప్రకాశిస్తున్నాను♪. దీన్నిబట్టి అనునిత్యమైన శరీరం నేను కాదన్నమాట♪. _*శరీరం వేరు, నేను వేరు. 'నేను' నాశనం లేని 'ఆత్మ'. శరీరం క్షయమైతే నేను అక్షయం. మహనీయంగా తలపింపజేసే ఈ శరీరంలోని భావాతీత శక్తిని నేను♪.*_ 

🪷 అంతే... అలా అనుకున్న నాకు నన్నావహించిన మరణ భయం శాశ్వతంగా నా నుంచి దూరమైపోయింది♪. అని ఆయనే (రమణులు)  స్వయంగా చెప్పుకున్నారు♪.

🪷 భగవాన్ రమణ మహర్షులు - వారి మహాభినిష్క్రమణానికి ముందు,  కొద్ది కాలంపాటు ఎడమ చేయిపై లేచిన రాచపుండుతో బాధపడ్డారు♪. రమణులను దర్శింపవచ్చిన భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు వైద్య సలహాలిచ్చారు•. మహావైద్యులను పిలిపించి పలుమార్లు శస్త్ర చికిత్సలు చేయించారు♪. ఈ శరీరం నాది కాదు అనుకొన్న రమణులు భక్తుల మనవి కాదనలేక శస్త్రచికిత్సలకు తలవొగ్గి జరుగుతున్నవాటిని తనవికాదనుకుని భావించి భరించారు♪.

🪷 శ్రీరమణ మహర్షులవారు 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి తమ భౌతిక దేహాన్ని వీడారు♪. భక్తజనులందరూ చూస్తుండగానే ఆ శరీరంలోంచి ఓ దివ్యజ్యోతి కాంతులు విరజిమ్ముతూ బయటికొచ్చి ఆకాశమార్గాన వెళ్తూ అరుణాచల శిఖరంలో కలిసిపోయి కనుమరుగైంది♪. 

🙏 తాను, శరీరం ఒకటి కాదని ప్రత్యక్ష నిరూపణ చేసి ఆ తత్త్వ తేజాన్ని అందరికీ పంచిపెట్టి దేహం చాలించిన రమణులవారు భక్తజన హృదయాల్లో ఈనాటికీ చిరంజీవిగా విరాజిల్లుతున్నారు.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️❀━❀━❀🪷❀━❀━❀✳️

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలీ.* *భగవద్గీత చెప్పిన అభ్యుదయ సిద్ధాంతం.

 *ఎవరిని వారే ఉద్ధరించుకోవాలీ.* 

 *భగవద్గీత చెప్పిన అభ్యుదయ  సిద్ధాంతం.* 

 ఆత్మోద్ధరణ చెందాలంటే సప్త సూత్రాల ఆలంబనగా సాధకులు ముందడుగు వేయాలి. 

ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. 

చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం.

 ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు.

 అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. జీవన పరివర్తనకు, ఏకత్వం నుంచి అనేకత్వానికి కొనసాగించే మధుర యాత్ర- ఆధ్యాత్మిక చింతన. 

సప్త సూత్రాల సమన్వితంగా ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మికత దీప్తిమంతమవుతుంది. 

నిశిత దృష్టి, నిజాయతీ, నిశ్శబ్దం, నిర్మోహం, నిర్భయం, నిరంతర చింతన, నిర్విచారం- అనే ఏడు అంశాల ప్రాతిపదికన ఆధ్యాత్మిక ప్రగతి ప్రణాళిక ఆవిష్కారమవుతుంది. 

ప్రతి వ్యక్తికీ సమున్నత ఉపకరణం బుద్ధి. కర్మల్ని అనుసరించి బుద్ధి ఆకృతి దాలుస్తుంది. అల్ప బుద్ధులతో అనల్పమైన విషయాల్ని సాధించడం అసాధ్యం. 

విశాల దృక్పథం, సద్బుద్ధి, సాత్విక దృక్కోణం వ్యక్తుల్ని ఆదర్శమూర్తులుగా ప్రకటిస్తాయి. వీటిని సాధించాలనే లోతైన దృష్టి అవసరం. 


నీతి నిజాయతీలనేవి బాహ్యంగానే కాదు. ఆంతరంగికంగా ఎవరికి వారు ప్రదర్శించినప్పుడే ఆధ్యాత్మికత స్వచ్ఛ స్ఫటికంగా ప్రకాశిస్తుంది.

 సంకుచిత భావనలను విడనాడి, సంఘర్షణాత్మక వైఖరిని నిలువరించి స్పష్టతతో మసలుకోవాలి. 

‘నిశ్శబ్దం నిండిన హృదయం పరమాత్మకు నెలవు’ అన్నారు రామకృష్ణ పరమహంస.

 మనసులో అలజడులనే సవ్వడులు లేకపోతే, ప్రతి మదీ మందిరమైమంగళదాయకమవుతుంది.


 శాంతి నిండిన మనసు ఆహ్లాదభరితమై, ఆధ్యాత్మిక వనమై గుబాళిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవడం ఆధ్యాత్మిక పయనంలో ముఖ్య సూత్రం.

 ప్రతికూలతల్ని అధిగమించి, విపరీత శక్తుల్ని ఎదుర్కొని సమదర్శనంగా ప్రగతి బాటలో ప్రయాణం చేసినప్పుడు మనోహరమైన మజిలీలు మనల్ని పలకరిస్తాయి.

 నిర్మోహంగా వ్యవహరించడం ద్వారా జీవన్ముక్తుడై సాధకుడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రకాశిస్తాడని జగద్గురు ఆదిశంకరులు పేర్కొన్నారు.

 స్వపరభేదాలు లేని సమ్యక్‌ దృష్టి, సమగ్రభావన వ్యక్తుల్ని విలక్షణంగా తీర్చిదిద్దుతాయి. 

‘అనవసర భయాలతో జీవితాన్ని కుంగదీసుకోవద్దు. జీవితం అనేది భయపడటానికి కాదు. 

జీవన మధురిమల్ని సదా ఆస్వాదించడానికి’- అంటారు శ్రీఅరవిందులు. 

ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం ఆధ్యాత్మిక చింతనలో ఎల్లప్పుడూ అభిలషణీయం.

 పిరికితనం అనేది మరణంతో సమానమని వివేకానందుడు చెప్పిన హితోక్తి.

 జీవనయాత్రలో ఎదురయ్యే ప్రతి సంఘటననూ దైవం నిర్దేశించినదిగానే స్వీకరించాలి.

 ధైర్యం,సాహసంఅనేవివ్యక్తులకు సహజ భూషణాలుగా అమరినప్పుడు వాళ్లు తేజోమూర్తులుగా ప్రకాశిస్తారు.

సాధనా చతుష్టయాల గురించి తెలుసా?

 సాధనా చతుష్టయాల గురించి తెలుసా?
సాధన చతుష్టయాలైన సంతోషం, శమం, విచారణ, సాధు సంగమం అనేవి సంసార సాగరం నుంచి తరింపజేసే ఉపాయాలట. దీనికి సంబంధించిన శ్లోకం, దాని వివరణ ఇలా ఉంది..
'సంతోషమే పరమ లాభం. సత్సంగమే పరమగతి. విచారమే పరమ జ్ఞానం. శమమే పరమ సుఖం'.
ఈ నాలుగు రకాలైన ఉపాయాలనూ అభ్యసించేవారే ఘనీభూతమై ఉన్న ఈ మోహజాలాన్ని జయిస్తారు. వీటిలో ఏ ఒక్క దాన్నైనా సర్వశక్తి యుక్తులతో అభ్యసిస్తే, మిగతా మూడూ కూడా లభిస్తాయి. స్వచ్ఛమైన శమం వల్ల హృదయం నిర్మలమైనప్పుడు అలాంటి వ్యక్తి వద్దకు మిగతా మూడూ వచ్చి చేరుతాయి. సంతోషం, విచారణ, సత్సంగం ఉన్నచోట 'జ్ఞానం' రూపు దిద్దుకుంటుంది, సుగుణాలన్నీ ఆశ్రయిస్తాయి, విజయలక్ష్మి వరిస్తుంది.  "స్వప్రయత్నం" అనే పురుషకారం చేత మనస్సును జయించి, ఈ నాల్గింటిలో ఏ ఒక్కదానినైనా నిరంతరం ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి.  “శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో  ఒక్కటైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోవాలి.  ఈ నాల్గింటినీ కాస్త కాస్త ఆశ్రయిస్తూ పోగా, కొంతకాలానికి అంతా సుసాధ్యమే అవుతుంది. మొదట్లో కొంత పట్టుదలతో ఆ తరువాత ప్రయత్నం వీడకుండా ఉంటే  సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అసలు ప్రయత్నమనేదే చేయకుండా, "మానవ మాత్రులం! మా వల్ల ఏమవుతుంది?" అని నిరుత్సాహ పడి, తుచ్ఛ విషయాలకై పరుగులు పెడితే అది మూర్ఖత్వమే కదా! ఎందుకంటే మనుషుల్లోనే అత్యంత మహనీయులు, ఆత్మజ్ఞులు... అత్యంత మూర్ఖులు కూడా ఉన్నారు. అందువల్ల సాధన చెయ్యాలి.  అసలు రహస్యమంతా సాధనలోనే ఉంది కానీ దైవంలో కాదు.
ఈ మనస్సును పురుషకారంతో జయించి, ఈ నాల్గింటిలో ఒక్కదానినైనా వశం చేసుకుంటేనే 'ఉత్తమగతి'. అలా కాకుండా మనసుకు నచ్చినట్టు ఉండటం.  ఇంద్రియ విషయాలను మాత్రమే ఆశ్రయించడం, కల్పిత వ్యవహారాలనే నమ్ముకొని ఉండడం... అది శుభప్రదం అవుతుందా? ఈ నాల్గింటి కోసం కష్టపడి ప్రయత్నించాలి. చంచల మనస్సు గుణదోషాలనే ప్రీతిపూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఆ గుణ దోషాలను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఈ గుణదోషాలు తొలగేదెలా? మంచి గుణాలను ఆశ్రయించడమే అందుకు ఉపాయం.  ఏ మార్గం కావాలో బాల్యంలోనే నిర్ణయించుకోవాలి. చక్కగా ఆలోచించాలి, మార్గాన్ని అన్వేషించాలి. తరువాత దాన్ని అనుసరించాలి. . అంతేకానీ, బాధపడుతూ కూర్చుంటే ఎవరికీ  ఏ లాభమూ ఉండదు.
సాధన చతుష్టయం
వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది. అందుచేత బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గృహస్థ, వానప్రస్థాశ్రమాల తర్వాత కర్మలనాచరిస్తూ చిత్తశుద్ధిని సంపాదించుకొని బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం. 
సాధన చతుష్టయం సాధించాక శ్రవణ మననాదులు చెయ్యాలని అది శంకరులు చెబుతారు. నిజానికి వేదాధ్యనం గాని, యజ్ఞాది కర్మలను గాని చెయ్యకుండానే కొందరు మహాపురుషులు బ్రహ్మజ్ఞానులయ్యారు. అంచేత బ్రహ్మమును తెలుసుకోవాలనే జిజ్ఞాసకు  వీటి ఆవశ్యకత లేదనే చెప్పవచ్చు. కాని అవిచేస్తే మంచిదే. ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకొనే జ్ఞానము, సూక్ష్మబుద్ధీ ఉంటే సరిపోతుంది. బ్రహ్మమును తెలుసుకోడానికి కులభేదం గాని, లింగభేదం గాని లేకుండా సంసారమే బంధంగా ఉందనీ, దాన్నుంచి విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక కలిగితే చాలు. అలాంటి వ్యక్తి ఏమీ తెలియనివాడు కాని, అన్నీ బాగా తెలిసినవాడు కాని గాకూడదు.        
వివేకజ్ఞానము, ఇహపరలోకాల్లో ఉండే భోగవిషయాలపై వైరాగ్యము, శమదమాది సాధనాసంపత్తి, మోక్షం పొందాలనే తీవ్రవాంఛ కలిగిన తర్వాత బ్రహ్మను తెలిసికో శక్యమవుతుంది. శమదమాది సాధనాసంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానం, శ్రద్ధ  అనేవి సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి.
బ్రహ్మ ప్రాప్తికి, శ్రవణాదులు చెయ్యడానికి తగిన యోగ్యతను సాధించే సాధనాలని సాధనచతుష్టయం అంటారు. అవి (1) నిత్యానిత్య వస్తువివేకము – భూత భవిష్యద్వర్తమాన కాలాలు మూడిట్లోను నాశనం లేకుండా ఉండేది నిత్యమైనది. కొంతకాలం ఉండి తర్వాత నశించే దాన్ని అనిత్యమైనదని అంటాం. ఈ రెండిటి జ్ఞానమే నిత్యానిత్య వివేకము అంటారు. మన కంటికి కనిపించే రూప సముదాయమంతా కొంతకాలం ఉండి నశించేదే. అలాగే ఇంద్రియాల ద్వారా తెలియబడే వ్యక్త ప్రపంచమంతా కొంత కాలం ఉండి నశించి పోయేనే భావన కలుగుతుంది. అప్పుడు నాశనం లేని పదార్ధం ఒకటి ఉండాలని తెలుస్తుంది. అదే ఆత్మ అని తెలిసి దాన్ని పొందాలనే నిశ్చయం కలుగుతుంది.
(2) ఇహాముత్రార్ధ ఫలఫలభోగ విరాగం ( వైరాగ్యం) – ఈలోకంలో గాని పరలోకంలో గాని లభించే అన్ని సౌఖ్యాలను తృణీకరించి నిరాదరణ కల్గి ఉండటాన్ని వైరాగ్యమంటారు. 
(3) శమాదిషట్కము - ఇది ఆరు విధములు.
(అ) శమము -  మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము అనే  అంతరింద్రియములను వాటి వృత్తులకు పోనీయక బ్రహ్మమునందే నిరంతరము నిలపటడాన్ని శమము అంటారు. అంటే అంతరింద్రియ నిగ్రహము /మనోనిగ్రహం.
(ఆ) దమము - ఇంద్రియాలను బాహ్య విషయాలవైపు పోనీయకుండా మరలించి, అత్మయందే లగ్నం చెయ్యడం  దమము. అంటే  బాహ్య ఇంద్రియ నిగ్రహము. దీన్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమైనది. శమ దమాదులకు వైరాగ్యం అవుసరం.  
(ఇ) ఉపరతి - విషయాలయందు దోష దృష్టిని విచారణ చేసి వాటిని తిరస్కరించటం. మళ్ళీ ఇంద్రియాలు వాటి స్వభావం ప్రకారం బయటి విషయాల జోలికి పోనీయకుండా నిలపడాన్ని ఉపరతి అంటారు.
(ఈ) తితీక్ష - అంటే ఓర్పు. శీతోష్ణములు సుఖదుఃఖములు మొదలైనవి వచ్చి పోతూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండవు.  అంచేత వీటిని సహనంతో ఓర్చుకోవడం అలవరచుకోవాలి. ఆ ఒర్పునే తితీక్ష అంటారు. 
(ఉ) శ్రద్ధ - శాస్త్రాలయందు, గురువాక్యాల యందు విశ్వాసము కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు.
(ఊ) సమాధానము-  తన బుద్ధిని అన్ని విధాలా బ్రహ్మమందే  ఎపుడూ  స్థిరపరచుకొని ఉండటాన్నే సమాధానం అని అంటారు. మరికొందరు శాస్త్రమందు చెప్పబడిన విషయాలు, గురువుచే ఉపదేశించబడిన వాక్యాలు ఒక్కటే అని శృతియుక్తి, అనుభవములచేత  ఆత్మ నిశ్చయం పొంది, సంశయాలను నివృత్తి గావించు కోవడమే సమాధానమని అంటారు.
 (4) ముముక్షుత్వము – సంసార బంధ నివృత్తి ఎప్పుడు ఏవిధంగా కలుగుతుందా అని ఆలోచిస్తూ, మోక్షమందే ఆపేక్ష కలిగి ఉండటాన్ని ముముక్షత్వం అంటారు.
ప్రపంచంలో ఆకర్షణలన్నీ అశాశ్వతాలే ననే విషయాన్ని గ్రహించడమే వివేకం. అప్పుడు వాటి మీద ఆసక్తి తొలగి పోతుంది. అదే వైరాగ్యమంటే. విజ్ఞానము లేక అపవిత్రమైన జీవనాన్ని గడిపేవాడు ఆ పరమపదాన్ని పొందలేడు. సంసారంలోనే చిక్కుకొని ఉంటాడు. మనోనిగ్రహం కలిగిన విజ్ఞానవంతుడు పవిత్ర జీవితాన్ని గడిపేవాడు ఆ పరమ పదాన్ని పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదని కఠోపనిషత్తు జ్ఞానవైశిష్యాన్ని చెబుతోంది. ఈ విధంగా  మనోనిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను మనస్సులో లీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహత్తత్వంలోను విలీనం చేసి, దాన్నిప్రశాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలనే సాధనను కఠోపనిషత్తు చెబుతోంది. ఇలా సాధన చతుష్టయాన్నిపొందినవాడు, ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు; సర్వమూ అత్మగానే చూస్తాడు. మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉంటేనే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. సద్గురువును సేవించి సఫలయత్నుడవుతాడు.

త్రిపురా రహస్యము -- పురుష ప్రయత్నము

 త్రిపురా రహస్యము - 23
~

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 

13. పురుష ప్రయత్నము - 2  

గారడీ వాడికి తెలిసిన మాయ చాలా తక్కువ. ఈ కొంచానికే మానవులు తట్టుకోలేకుండా ఉన్నారు. అలాంటప్పుడు సర్వజగద్రక్షకుడైన పరమేశ్వరుని మాయ నుంచి తప్పుకోవటం ఎవరి తరము ? ఈ మాయ పరమేశ్వరుని ఆశ్రయించి ఉంటుంది. అతనికి లోబడి ఉంటుంది. పాముకోరలలో ఉన్న విషంలాగా ఈ మాయ పరమేశ్వరుడితోనే ఉన్నప్పటికీ, దీనివల్ల ఆయనకు హాని ఏ మాత్రం ఉండదు. పరమేశ్వరుని అనుగ్రహం పొందినవాడు కూడా ఈ మాయకు లోను కాడు. 

అందుచేత, ఆయన్ని ఆరాధించి ప్రసన్నం చేసుకున్నవాడు జ్ఞానాన్ని పొంది మోహం నుండి విముక్తుడౌతాడు. శ్రేయస్సును పొందటానికి అనేక మార్గాలున్నాయి. అయినప్పటికీ పరమేశ్వరానుగ్రహాం లేనిదే అవి ఏవీ ఫలించవు. కాబట్టి ముందుగా ప్రపంచ కారణమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. తరువాత మోహాన్ని నశింపచేయటానికి యోగసాధన చెయ్యాలి.  

రాజా ! ఈ జగత్తంతా ఒక కార్యం. మరి దానికి కారణం అంటూ ఉండి తీరాలి. అంటే జగత్తుకు ఒక కర్త ఉండి తీరాలి. అయితే ఆకాశము, పరమాణువులు. ఇవి అవయవాలు గలవికాదు. వాటికి కర్తలేడు. అంటారు. అయితే జగత్తుకు మాత్రమే కర్త ఉన్నాడు అనటం సరియైనది కాదు. ఏవేవి వేద్యములో అంటే తెలియదగినవో అవన్నీ కార్యములే. దీని ప్రకారము ఆకాశము, అణువు కూడా వేద్యములే. అందుచేత వాటికి కూడా ఒక కర్త ఉన్నాడు. కాబట్టీ పృధివ్యాధులకు కర్త ఉన్నాడు.  

సృష్టికి ముందు సత్తూ లేదు. అసత్తూ లేదు. అంతా చీకటిగా ఉండేది. అప్పుడు శూన్యం లోనుంచి జగత్ కర్త ఈ జగత్తును సృష్టించాడు. సృష్టిలో ముందుగా ఆకాశం ఉద్భవించింది. దాని నుంచి వాయువు, దాని నుంచి అగ్ని దాని నుంచి జలము, దాని నుంచి భూమి ఉద్భవించాయి. అయితే జగత్తుకు కర్తలేడు. అనే ఆగమం కూడా ఒకటి ఉంది. 

అయితే దీన్ని ఇతర ఆగమాలతో ఖండించటం జరిగింది. కాబట్టి ఇది ప్రమాణం కాదు. (చార్వ్యాక మతంలో పంచభూతాలలో ఆకాశం లేదు.) 

రాజా ! క్రియ అనేది బుద్ది పూర్వకం. బుద్ధి ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. బుద్ది లేకపోతే క్రియలేదు. ప్రపంచ సృష్టి చెయ్యాలి అంటే జ్ఞానం కల ఒక వస్తువు ఉండాలి, జ్ఞానంలేని జడపదార్థాలు ఏమీ చెయ్యలేవు. కుండను తయారుచెయ్యాలంటే కుమ్మరి కావాలి, అంతే కాని బొమ్మలో ఉన్న కుమ్మరి కుండను తయారు చెయ్యలేడు. 

ఆగమాలు ప్రపంచ సృష్టికర్త మహాజ్ఞాని అని ఉద్దోషిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ పనిని చూసినా అది బుధ్ధితో జ్ఞానంతో కూడినదే అనిపిస్తుంది. ఈ రకంగా ఆగమాల ప్రకారము జగత్తంతా ఒక కర్త చేత సృష్టించబడింది. ఆ కర్త మామూలు వాళ్ళకన్న విలక్షణుడు. ఊహించటానికి వీలులేని ప్రపంచాన్ని సృష్టించిన ఆ కర్త  మహాశక్తి సంపన్నుడై ఉండాలి. అంత శక్తి గలవాడు కాబట్టి, తనను శరణు జొచ్చిన వారిని రక్షించ గలుగుతున్నాడు. 

కాబట్టి ఓ నాధా ! మనోవాక్కాయ కర్మలతో శక్తివంతుడైన పరమేశ్వరుణ్హి శరణు వేడు. నాధా ! మనస్పూర్తిగా సేవిస్తే ప్రభువులకే మనమీద దయ కలుగుతంది కదా ! అలాంటప్పుడు భగవంతుడికి కలగదా? అయితే ఒక్క విషయం, రాజుల కోరికల మేరకు మనం పనులు చేస్తాము. అప్పుడు వారు మన కోరికలు తీరుస్తారు. మరి భగవంతుడికి కోరికలు ఉండవు కదా ? అతడికి మన సేవ వల్ల లాభం ఏమిటి ? అంటావేమో ? పరమేశ్వరుడు భక్తవత్సలుడు. అతడు తనని సేవించని వారి కోరికలు కూడా తీరుస్తాడు.  

అలాంటప్పుడు తనను ఆరాధించే భక్తుల కోరికలు తీర్చడా ? రాజులు నిర్ధయులు  కృతఘ్నులు. భగవంతుడు అలా కాదు. అతడు దయాసింధువు. కరుణామూర్తి. అతడికి ఒక కట్టుబాటు ఉంది. అలా కాకపోతే రాజ్యాలకు మల్లేనే ఈ లోకం కూడా ఏనాడో నశించిపోయేది. రాజులకు కట్టుబాట్లు లేకపోవటం వల్లనే రాజ్యాలు నశిస్తున్నాయి. కాబట్టి ఓ రాజా ! నువ్వు కుతర్మాన్ని వదిలి పరమేశ్వరుణ్ణి శరణువేడు. అతడే నీకు శ్రేయస్సు కలగచేస్తాడు. అయితే నువ్వు మాత్రం శ్రేయస్సు కావాలని అతడిని సేవించవద్దు. అని చెప్పింది హేమలేఖ.....🙏

J N RAO 🙏🙏🙏

*****కోరికలు - భయక్రోధాలు

 కోరికలు - భయక్రోధాలు
✍️ గోపాలుని రఘుపతిరావు
✳️🪷🌹🪷🌹✳️🌹🪷🌹🪷✳️

🪷 అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు♪. అతడే జగత్తుకు ప్రభువు♪. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు♪. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు♪. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి♪? రుషి కోరికలను జయించినవాడు♪. అందువల్ల అతడికి భయక్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు♪. మనిషి కోరికల స్థావరం♪! కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు♪.

🪷 భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిల అంతరిక్షంలో తేలియాడే, అనేక నక్షత్ర గ్రహసముదాయాలు ఉన్నాయి♪! ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉందన్నది ఊహకు అందని విషయం♪.

🪷 జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం (బలం కోల్పోవడం), వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు♪. వార్ధక్య, మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు♪. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు♪. మనిషి సాధన పండించుకుని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది♪. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే♪. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది♪. వెలుగు వెంట నీడలా భయం ఆవహిస్తుంది♪. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది♪.

🪷 కోరికలకు మూలం మనసు♪. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం♪. వైరాగ్య భావన అలవాటు చేయడం వల్ల మనసు మనిషి మాట వింటుంది♪. తర్ఫీదులో భాగంగా రుషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు♪. ఇంద్రియాల (కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం) వల్లే మనిషికి కోరికలు కలుగుతాయి♪. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలు హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి♪. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది♪. కోరికలూ తగ్గుముఖం పడతాయి♪.

🪷 సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గడాన్ని తెలుసుకుంటారు♪. కోరికలు తగ్గించుకున్నవారికి అవి తీరడం లేదన్న మనస్తాపం ఉండదు♪. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు♪. శరీరం జాగ్రదవస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి♪. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు♪.

🪷 రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి సామాన్యులను కలతకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది♪. అటువంటి వ్యాధులు వారికి భయం కలగజేయలేదు♪. చేతకానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది♪. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించినవారవుతారు♪. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ అనందస్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది♪. 

❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🪷🌹🪷✳️🌹🪷🌹🪷✳️

భగవద్గీత పారాయణ ఫలం

 [3/11, 17:21] +91 73963 92086: *🕉️🙏భగవద్గీత*🕉️🙏

*🕉️🙏ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయండి.*🕉️🙏

*🕉️🙏భగవద్గీత పారాయణ ఫలం*🕉️🙏

*🕉️🙏'గీత’ అనే పదం హద్దును  సూచిస్తుంది. ‘గీత’ హద్దును సూచిస్తే, మహాభారతంలోని ‘గీత’(భగవద్గీత ) రీతిని సూచించింది. శివగీత, బ్రహ్మగీత, గణశగీత, హనుమద్గీత, దేవీగీత, వశిష్టగీత, పరాశర గీతా ఇలా ఎన్నో గీత గ్రంథాలున్నప్పటికీ మహాభారతంలోని ‘భగవద్గీత’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ను అర్జునుడికి బోధించి కర్తవ్యాన్ని సూచించాడు. భగవంతుని ప్రతిరూపమే భగవద్గీత . ధర్మస్థాపన చేసేందుకు దోహద పడింది.🕉️🙏*

*🕉️🙏భగవద్గీత కర్మయోగంలో ఆరంభమై భక్తిశరణాగతిలో అంతమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకంటే మానవుని నిత్యజీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి.🕉️🙏*

 *🕉️🙏భగవద్గీత ఏ మతాన్ని  ఏ సంప్రదాయాల్ని కాదనదు అన్ని మతాలవారూ, సంప్రదాయాల వారూ భగవద్గీతను ఆదరిస్తున్నారు. విశ్వమానవ కల్యాణం కొరకు సమస్త ప్రాణికోటికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్త్వాజ్ఞానా మృతమే భగవద్గీత. 701  శ్లోకాలతో 18 అధ్యాయాలలో పొందుపరచబడినది.🕉️🙏*

*🕉️🙏భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా భగవద్గీత పఠన మహాత్మ్యాన్ని వివరించాడు.🕉️🙏*

 *🕉️🙏భగవద్గీత పఠనం చేసి పాటించడం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.🕉️🙏*

*🕉️🙏మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి.🕉️🙏*

 *🕉️🙏సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది.🕉️🙏*

*🕉️🙏అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత.🕉️🙏* 

*🕉️🙏భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.🕉️🙏*

*🕉️🙏'క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం’ లో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో మానవ శరీరం ఏ విధంగా ఆవిర్భవించింది. దాని ప్రాముఖ్యత, లక్షణాలు గురించి వివరంగా పేర్కొన్నారు. సత్వ, రజ, తమో గుణాల ప్రాబల్యం వలన మానవుని, నడవడిలోని మార్పులు, వాని ప్రవృత్తులు, శరీర స్పందన గురించి విశదంగా వ్యాఖ్యానించారు.*
*మానవుని జీవిత నడవడికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన సందేశం.🕉️🙏*

*🕉️🙏మూఢుని మోహాన్ని పోగొట్టి కర్తవ్యపరాయణుని చేస్తుంది. భగవద్గీత లో కర్మ, జ్ఞాన, భక్తి మూడు విషయాలు కనబడు తుంటాయి. కర్మ సాత్విక,* *రాజసిక, తామసికమని మూడు విధాలని భగవద్గీత చెప్పింది. కర్మ ఎప్పటికీ వదలరాదు. ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. అది కర్తవ్యబుద్ధితో చేస్తుండాలి. ‘🕉️కర్మణ వాధికారస్తే మా ఫలేషు కదాచన🕉️’ కర్మ* *చేయడం నీ విధి. దాని ఫలితాన్ని ఇచ్చేది మరొక శక్తి. జ్ఞానం లేని కర్మ వ్యర్థమే. భక్తి లేకపోతే జ్ఞానం అలవడదు. ”🕉️సర్వధర్మాన్పరిత్యజ్య🕉️” అన్ని ధర్మాలు వదలి తనను మాత్రమే శరణు పొందమని భగవానుడు చెప్పాడు. నిత్తనైమిత్తిక సమస్త ధర్మాల కంటే కర్మలకంటె* *భగవశ్చరణాగతి ఎన్నో రేట్లు అధిక ఫలం కలిగిస్తుంది. భగవానుని భగవద్గీత ధర్మమిది.*
*గీత భగవద్వాణి అగుటవలన వేదరుక్కులతో సమానం. ఇది ఉపనిషత్సారము,* *అద్వితీయము. భగవద్గీత శ్రీకృష్ణభగవానుని ముఖారవిందం నుండి స్రవించిన దివ్యామృతం.*🕉️🙏

*🕉️🙏భగవద్గీత ధర్మాల యొక్క సముదాయమని స్వామి వివేకానందుడు అంటే, వినోభాభావె నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా* *ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతగా ఉపయోగపడింది అనగా, తిలక్‌ ప్రపంచ సాహిత్యమంతటిలోనూ భగవద్గీత కు దీటు రాగల గ్రంథం* *వేరొకటిలేదు.* *అది మనుషులను పరమానంద పదవికి కొనిపోగల అపూర్వసాధనం అని …* *ఇలా ఎందరో మహానుభావులు భగవద్గీత గురించి వ్యాఖ్యానించారు.*
*భగవద్గీతా కించి దధీతా గంగాజల లవకణికా పేత సకృదపియేన మురారి సమర్చా క్రియతేత స్వయమ్యో పినచర్చా” అని ఆదిశంకర భగవద్పాదులు భగవద్గీతా ప్రశస్త్యాన్ని వివరించాడు.🕉️🙏*

*🕉️🙏భగవద్గీత ను భగవానుడు మార్గశిర శుక్ల ఏకాదశినాడు. అర్జునునికి ఉపదేశించినాడు.* *కాన ఆనాడే గీతాజయంతిని జరుపుతున్నారు.*
*గీతామృతాన్ని మనం గ్రోలి ధన్యులమవుదాం!*
*‘రసస్రవంతి-కావ్యసుధ🕉️🙏*

*🕉️🙏పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే🕉️🙏*
[3/11, 17:21] +91 73963 92086: *🕉️🙏సమస్త గ్రంథాల సారం వేదం. వేదసారం ఉపనిషత్తు. ఉపనిషత్సారాంశం భగవద్గీత . భగవద్గీత సారాంశం భగవంతుని శరణాగతి. అనన్యభావంతో శరణు పొందినవానికి సమస్త పాపాలనుండి రక్షింపబడి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. హృషీకేశుడైన శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగంలో చేసిన బోధామృతమే భగవద్గీత. ‘గీ’ అంటే త్యాగం. ‘త’ అంటే తత్వజ్ఞానం. త్యాగాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వివరించేది. లోకంలో కర్మ మార్గం, భక్తిమార్గం, జ్ఞానమార్గాలను అవలంబించే ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రంలో ఉన్నారు. మోక్షం పొందడానికి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలనే నాలుగు ద్వారాలగుండా ఏ ద్వారంనుంచైనా వెళ్లి ముక్తిసౌధంలోకి చేరుకోవచ్చు. ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రం చేరునట్లు, ఈ మార్గములన్నియు, జీవుని కైవల్యధామానికి చేరుస్తాయి. చిత్తము తమోగుణంతో కూడిన వాసనలతో నిండిపోయి, కఠినశిల వలె ఉన్నంత వరకు, ఎన్ని పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉన్నా, భగవంతుని గాంచలేరు. కొన్ని వేల యుగాలలో చేసిన ఫలితాన్ని సులభంగా పొందే మార్గం భగవద్భక్తి.🕉️🙏*

*🕉️🙏పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలోని భగవద్గీతకు ప్రత్యేక స్థానముంది.* *భగవద్గీతలోని అక్షరాలకు అనంత శక్తి ఉంది.* *భగవద్గీత కేవలం భక్తి బోధనే కాదు. హిందూ*
*సంస్కృతి వికాసానికి మూలాధారాలు అందులో ఉన్నాయి.🕉️🙏*

*🕉️🙏ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలోని పాండవులకు, కౌరవులకు మధ్య జరుగునున్న భీకర సంగ్రామం. ధర్మానికి, అధర్మానికి అనాదిగా అవిరామంగా జరుగుతున్న పోరాటం. ఆ పరిస్థితుల్లో పార్థుడే కాదు, ఎవరున్నా, అంతర్మథనానికి లోను కావలసిందే. పార్థుని సందేహాలకు ఇచ్చిన సమాధానమే ఈ భగవద్గీతసారం.*
*నిరాశా నిస్పృహలతో అచేతనావస్థలో ఉన్న పార్థునికి కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుడు అతనిని యుద్ధోన్ముఖుని కావించాడు. ధర్మసంస్థాపన కోసం బోధించిన ఈ గీత నేటి తరాన్ని కూడా అంతే సమర్థంగా కర్తవ్యోన్ముఖుల్ని చేయగలదు. అనేక సంశయాలకు దారి చూపగల జ్ఞానసంపత్తి ఇది. ఈ జ్ఞాన సంద్రాన్ని మధించిన వారెందరో, మహానుభావులు, విద్యావేత్తలు, తాత్వికులు, వేదాంతులు తమ తమ పరిధిలో వారి అవగాహన ప్రస్ఫుటంగా వివరించారు.*
*ఇది భారతీయులకే కాక, యావత్ప్రపంచానికీ మహా ప్రసాదం. ఇహపరాలకు, ప్రాపంచిక, ఆధ్యాత్మికాలకు సంబంధించిన అనేక అంశాలు, పండు వొలచినట్లుగా, తర్కబద్ధంగా సుబోధకం గా వివరించారు.🕉️🙏*

*🕉️🙏గీత అంటే భగవద్గీతే కాదు, వశిష్ట గీత, హంసగీత, భ్రమరగీత, శ్రుతిగీత, బ్రాహ్మణ గీత – ఇలా దాదాపు 18 గీతలున్నాయి. గీత శబ్దం వినబడగానే భగవద్గీత ఒక్కటే మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేది.🕉️🙏*

*🕉️🙏నేను యుద్ధం చేయను. బంధువులు, తాతలు, అన్నగార్లు, మేనమామలు, వీరిని చంపి రాజ్యాన్ని పాలించాలి. అందుకే నాకీ రాజ్యం వద్దన్నాడు అర్జునుడు. యుద్ధం ఎందుకు చేయాలో గీతలో చక్కగా విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. నీ విద్యుక్తధర్మాన్ని నీవు నెరవేర్చు. అది కర్మ చేయడం కన్నా గొప్పది. భగవద్గీత భౌతిక అజ్ఞానంనుండి వుద్ధరించడమే పరమతత్వం.🕉️🙏*

*🕉️🙏ప్రతి ఒక్కరు కర్మలపై ఆశ లేకుండా కర్మలు చేస్తూ వాటిపైన ఆసక్తి చూపాలి. అపుడే మానవుడు అభివృద్ధి చెందుతాడు. జడపదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం. ఇంద్రియల కంటే మనసు ఉత్తమం. మనసుకంటే ఆత్మ ఉత్తమమైనది. అందుకే మనిషి తాను చేయలదలచిన పని, ఆత్మసాక్షిగా చేయాలి. ఆత్మను ఒప్పిస్తే అన్నిటినీ ఒప్పించినట్లే. ప్రతిఫలాపేక్ష లేకుండా మనము పని చేయడమే మన ధర్మం.🕉️🙏*

*🕉️🙏భగవద్గీతలో జ్ఞాన కర్మ మార్గాలలో ఏది విశిష్టమైనది అనేదానికి ఎంతటి జ్ఞాని అయినా కర్మలుచేయక తప్పదని కర్మలు చేస్తే ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే దోషం ఉండదని సమన్వయం కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంది.🕉️🙏*

*🕉️🙏భగవద్గీతలో ఒక అధ్యాయమైనా పారాయణం చేయాలి.🕉️🙏*

*🕉️🙏కనీసం ఒక శ్లోకమైనా త్రికరణ శుద్ధిగా పఠించి  జీవితంలో పాటించాలి .🕉️🙏*

*🕉️🙏సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు 🕉️🙏*

ఎవ్వనిచే జనించి...!!

 ఎవ్వనిచే జనించి...!!

రమణభగవానులు ఏదో పుస్తకం చదువుకుంటూ వుంటే,
ఒక భక్తుడు ఆసక్తిగా అడిగాడు- భగవాన్! అది ఏం పుస్తకం? అని. 
"నా జీవితచరిత్ర" అన్నారు భగవాన్.
తీరా ఆ భక్తుడు ఆ పుస్తకం వైపు చూస్తే, అది కేనోపనిషత్తు.
ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు.

భగవాన్ అబద్ధం చెప్పాడు అని అనగలమా?
వారు పరమ సత్యమే చెప్పారు-

కేన అంటే ఎవ్వనిచే.
ఎవ్వనిచే ఈ సకలచరాచరమంతా ఉనికి కలిగి ఉన్నదో
వాడే నేను అని భగవాన్ చెప్పినట్లైంది.

కాబట్టి అటువంటి కేనోపనిషత్తును సరళ వ్యావహారిక భాషలో నేను వ్రాసుకున్నదానిని అందరితో పంచుకుంటున్నాను...

పైగా శ్రీకాళహస్తి క్షేత్రంతో సంబంధం ఉన్న ఉపనిషత్తు అని తెలియడం వలన, కించిత్ ప్రాంతాభిమానం తోడైనందు వలన ఈ ఉపనిషత్తును మాత్రమే ఎన్నుకొని వ్రాయడానికి ప్రోత్సాహం అయ్యింది. 

* * *

ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపల నుండు? లీనమై
ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం
బెవ్వడ? నాది మధ్యలయు డెవ్వడు? సర్వము తానైన వా
డెవ్వడు? వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.

* * *

శిష్యుడు: 
ఎవ్వనిచే మనస్సు చరిస్తోంది?
ఎవ్వనిచే ప్రాణం సంచరిస్తోంది?
ఎవ్వనిచే వాక్కు పలుకుతోంది?
ఎవ్వనిచే కళ్లు చూస్తున్నాయి?
ఎవ్వనిచే చెవులు వింటున్నాయి?

గురువు: 'అది' దైవం.
మనసుకు మనస్సుగా
ప్రాణానికి ప్రాణంగా
వాక్కుకు వాక్కుగా
కన్నుకు కన్నుగా 
ఉన్నది.

కాబట్టి ఇంద్రియాల  వెనుక ఉండి
ఇంద్రియాలను నడిపే శక్తియే ఆత్మ.

కన్నుకు దేని వలన చూచే శక్తి కలిగిందో
దానిని కన్ను చూడలేదు.

మనసుకు దేనివలన తలచే శక్తి కలిగిందో
దానిని మనసు తలవలేదు.

అందువల్ల 'అది'(ఆత్మ) ఎలాంటిదో
దాని గుఱించిన వివరమేమీ మాకు తెలియదు.

కేవలం అనుభవానికి మాత్రమే సంబంధించిన 
ఆ పరతత్త్వాన్ని ఎలా ఇతరులకు అవగతం అయ్యేలా చెప్పాలో
మాకు తెలియడం లేదు.

తెలుసు అనడానికి 
తెలియదు అనడానికి 
'అది' అతీతంగా ఉన్నది.
అని మా పెద్దలు చెప్పగా విన్నాం.

* * *

దేని వలన వాక్కు ప్రకటనం అవుతుందో
దేనిని వాక్కు తెలుపలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది
దైవం కాదని తెలుసుకో.

దేని వలన మనసుకు తలచేశక్తి కలుగుతుందో 
దేనిని మనసు తలవలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది 
దైవం కాదని తెలుసుకో.

దేని మూలంగా కళ్లు చూస్తున్నాయో
దేనిని కళ్లు చూడలేవో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది 
దైవం కాదని తెలుసుకో.

ఏది చెవుల ద్వారా వినబడదో
దేని వలన చెవులు వినగలుగుతున్నాయో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది 
దైవం కాదని తెలుసుకో.

దేని వలన ముక్కుకు వాసన చూసే శక్తి కలిగిందో
దేనిని ముక్కు వాసన చూడలేదో
అదే దైవం.
ఇక్కడ లోకులు చేత ఆరాధింపబడేది 
దైవం కాదని తెలుసుకో.

* * *

శిష్యుడు: 
గురువుగారూ! 
నేను ఆత్మను బాగా తెలుసుకున్నాను.

గురువు:
నేను ఆత్మను బాగా తెలుసుకున్నాను 
అని నీవు అంటున్నావంటే,
నీకు ఆత్మ గుఱించి తెలియలేదు అని అర్థం.

నాకు తెలుసు అనటానికి
నాకు తెలియదు అనటానికి
ఏ తెలివైతే ఆధారంగా ఉన్నదో
ఆ  తెలివే తాను.

ఈ తత్త్వంలో ఉన్న విచిత్రమేమంటే-
తెలుసు అన్నవాడు తెలియనివాడు.
తెలియదు అన్నవాడు తెలిసినవాడు.

నిజానికి 'నాకు తెలియదు' అన్నవాడే
అమరత్వాన్ని పొందుతాడు.

ఇప్పుడే ఇక్కడే ఆత్మను పొందడం గొప్ప లాభం.
లేకపోతే అదే గొప్ప నష్టం.

ఆత్మని పొందనివాడు జగత్తులో భేదాన్ని చూస్తాడు కాబట్టి
అతడు మృత్యువుకు బలి అవుతాడు.

ఆత్మను పొందినవాడు సర్వత్రా అభేదాన్ని దర్శిస్తాడు కాబట్టి
అతడు అమరుడవుతాడు.

* * *

మరణం ఎందుకు ముఖ్యం

 హరిఓం  ,                                -                                          -                    *మరణం ఎందుకు ముఖ్యం*

మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే చాలా అందమైన కథనం. మృత్యువు ప్రతి ఒక్కరూ భయపడే విషయం.  పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ చదవండి... 
     ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతను "ఓ స్వామీ, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి?" సన్యాసి అన్నాడు "ఓ రాజు దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు దొరుకుతుంది. మీరు దాని నుండి నీరు త్రాగండి మరియు మీరు అమరత్వం పొందుతారు. పర్వతాలు దాటిన తర్వాత అతను ఒక సరస్సును కనుగొన్నాడు. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు  కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు, అతను నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు, చాలా బలహీనమైన వ్యక్తి పడుకుని నొప్పితో ఉన్నాడు. రాజు కారణం అడగగా, "నేను సరస్సులోని నీటిని తాగాను. మరియు అమరుడయ్యాడు. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు, గత 50 ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు మరియు నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను." రాజు ఆలోచించాడు "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి. నేను అమరత్వం మరియు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసిని అడిగాడు. సన్యాసి ఇలా అన్నాడు, "సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. అక్కడ మీకు పసుపు పండిన పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తినండి మరియు మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు." రాజు చెప్పినట్లే చేశాడు. అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు. పండ్లను తెంపి తినబోతుంటే, కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు !! నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. అతను సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు" నా కుడి వైపున మా నాన్న ఉన్నారు. 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఒకరి ఆస్తి కోసం ఒకరి అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి *"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు.  

అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు
_*మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది*_
". మరణాన్ని నివారించే బదులు, మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం, ప్రతి సెకను జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి . మిమ్మల్ని మీరు మార్చుకోండి అపుడు ప్రపంచం మారుతుంది. 

1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 
2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 
3. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర (తీర్థయాత్ర) లాగా ఉంటుంది 
4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది
5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది 
6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది 
7 . ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది. ...............                                -                                                      -                     🙏🙏 ....                                    -                      వలిశెట్టి లక్ష్మి శేఖర్ .....                                            -             98660 35557 .....                                           -           10.03.2024....

ఉపనిషత్తులు అంటే ఏమిటి?

*ఉపనిషత్తులు అంటే ఏమిటి?*
🕉ఓంశ్రీమాత్రేనమః🕉

*జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.*ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.* 

*ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండి నేర్చుకొనుట అని ఇంకొక అర్థము. ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?*

*సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి.  అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది. ఉపనిషత్తులను ‘రహస్యం’ అని ఎందుకు పిలుస్తారు?*

*‘ఉపనిషత్’ శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి ‘రహస్యము’ అను అర్థం.  రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే.  కాని దాని ‘రహస్యం’ అని అనం.  ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం.  ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం.  ఆత్మా అనేది ‘నేను, నేను’ అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు.  అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు.  ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.* 


*ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలు* 

*జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.* 

*జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.* 

*అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే “గ్రంథం” అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన “విద్య” అని ఇంకొక అర్థం – ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.*

@@@@@@@@@

*ఉపనిషత్తులు వేదాలకు శిరస్సులనదగినవి.  అవి జ్ఞాన భాండాగారాలు.*


 *భారతీయులకు పరమ ప్రమాణమై నవి. జ్ఞాన అనుష్టానానికి ఇవి మూల గ్రంధములు.*


 *పరమాత్మ యొక్క యదార్ధ తత్త్వాన్ని తెలియజెప్పేవే ఈ ఉపనిషత్తులు.*


 *నాలుగు వేదాలలోను మొత్తం 1180 ఉపనిషత్తు లున్నాయి.*

 *21+109+1000+50 = 1180. అయితే 108  ఉపనిషత్తులు ముఖ్యంగా ప్రచారంలో ఉన్నాయి. 108 అనే సంఖ్య బ్రహ్మాన్ని సూచించే సంఖ్య అని చెబుతారు.మానవ శరీరం లో 108 ముఖ్యనాడులు ఉంటాయి. రాశి చక్రంలో 27నక్షత్రాలు,ఒక్కో నక్షత్రం 4 పాదాలను   కలిగి ,9నక్షత్ర పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా 9 పాదాలు 12 రాశులలో 9×12=108 ఉంటాయి. అందుకే జపమాల 108 పూసలతో ఉంటుంది.* 


*అసలు ఈ 108 ఉపనిషత్తుల పేర్లు ఏ రకమైన సందేహం లేకుండా మనం తెలుసుకో గలగటానికి  ముక్తికోపనిషత్తే మూల కారణంగా చెప్పవచ్చు*.

*మానవజాతికి ఆదర్శమూర్తియైన శ్రీరామచంద్రుడు పరమ భక్తాగ్రేసరుడైన ఆంజనేయుని కొరకు చెప్పబడిన  ఉపనిషత్తులో ఈ 108 ఉపనిషత్తుల పేర్లు, వాటి యొక్క శాంతి మంత్రములు ఇవ్వబడినవి*. 
*ఈ ఉపనిషత్తును ముక్తికోపనిషత్తు అని ఎందుకన్నారు?*

*కొన్ని ఉపనిషత్తులకు వాటిలోని మొదటి మంత్రంలోని మొదటి పదం వల్ల ఆయా పేర్లు వచ్చినవి. ఉదా: ఈశ, కేన.* 


*ఈ ఉపనిషత్తు ముక్తినందుకొనుటకు సులభమైన రాజ మార్గాన్ని ప్రసాదించటం కారణంగా దీనికి ముక్తికోపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇది సార్ధక నామధేయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ముక్తిలోని రకాలు, సాయుజ్యముక్తి నందుకొనే విధానము విపులంగా వివరించబడినందున మోక్షార్ధులైన వారికి ఇది చాలా ముఖ్యమైన ఉపనిషత్తు అని చెప్పవచ్చు*. 

*108 ఉపనిషత్తులను 7 విభాగాలుగా చెప్పవచ్చు.*

అవి. 
*1. సన్యాస ఉపనిషత్తులు* 

*2. యోగ ఉపనిషత్తులు* 

*3. సామాన్య వేదాంత ఉపనిషత్తులు* 

*4. వైష్ణవ ఉపనిషత్తులు* 

*5. శైవ ఉపనిషత్తులు* 

*6. శక్తి ఉపనిషత్తులు* 

*7. దశోపనిషత్తులు* 
*ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ,ఛాందోగ్య, బృహదారణ్యక అనేవి దశోపనిషత్తులు.*


 *దశోపనిషత్తులకు ముగ్గురు ఆచార్యులు శంకర, రామానుజ, మధ్వాచార్యులు భాష్యాలు వ్రాయటం జరిగింది.*   


*మోక్షార్థులకు ఇవి చాలా ప్రధానమైనవి. ఈ దశోపనిషత్తులు అవగాహన కావాలంటే సామాన్య వేదాంత ఉపనిషత్తులకు చెందిన  ముక్తికోపనిషత్తు అధ్యయనం చేయటం ఎంతో ముఖ్యం.*


 *108వదైన ఈ ముక్తికోపనిషత్తును అధ్యయనం చేసిన తరువాతనే దశోపనిషత్తుల అధ్యయనానికి పూనుకుంటారు. కనుక ఇది చాలా ముఖ్యమైనది.*

౪౪౪౪౪౪౪౪౪౪౪

*“ఓం శాంతిః  శాంతిః  శాంతిః” అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?*

*ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది.  వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.* 

*శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మికదుఃఖాలు అంటారు.* 

*పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక దుఃఖాలు అంటారు.* 

*అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు.* 

*పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాలదుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.* 

∆∆∆∆∆∆∆∆∆∆∆

*పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?*

*ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః!*
*ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా!!* 

∆∆∆∆∆∆∆∆∆∆∆

*శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?*

*శ్వేతాశ్వతరోపనిషత్తు.* 

∆∆∆∆∆∆∆∆∆∆∆

*నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి?* 
*అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?* 

*ఋగ్వేదం – ప్రజ్ఞానం బ్రహ్మ – ఐతరేయోపనిషత్తు* 


*యజుర్వేదం – అహంబ్రహ్మాస్మి – బృహదారణ్యకోపనిషత్తు*


*సామవేదం – తత్వమసి – చాందోగ్యోపనిషత్తు*
 

*అథర్వణవేదం – అయమాత్మాబ్రహ్మ – మాండూక్యోపనిషత్తు*


******🧘‍♂️విచక్షణా జ్ఞానం🧘‍♀️

*🧘‍♂️విచక్షణా జ్ఞానం🧘‍♀️*

*ఓం నమశ్శివాయ*🙏🙏🙏

 *తల్లి గర్భంలో ఉన్నంతసేపు తను ఆత్మను అని భావించిన శిశువు తల్లి గర్భము నుండి భూమి మీదికి రాగానే తను అంటే దేహము అని అనుకుంటున్నాడు*

*_మనుష్యులు పుట్టుకతోనే ఇది కావాలి, అది వద్దు అంటూ రాగద్వేషములతో పుడుతున్నారు.*

 *వీటి వ్యామోహములో పడి మనిషి తన విచక్షణా జ్ఞానము కోల్పోతున్నాడు.* 
*అజ్ఞానములో పడిపోతున్నాడు. రాగద్వేషముల వలన కలిగే సుఖములను దు:ఖములను అనుభవిస్తున్నాడు._*

*_మనుషులకు పుట్టుకతోనే రాగద్వేషములు, ఇష్టాఇష్టాలు, సుఖదు:ఖాలు సంక్రమిస్తాయి. ఇవి అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ, రజస్, తమో గుణముల సమ్మేళనమే. ఇవి అన్నీ చేరి ఆత్మకు, మనసుకు మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. దానినే వ్యామోహము, మాయ, అజ్ఞానము, తెలియని తనము అంటారు._*🙏🙏🙏

*_ఆ కారణం చేత మానవులు తమ జీవితమంతా ఈ ద్వంద్వాలలో పడి కొట్టుకుంటూ, తమలో ఉన్న ఆత్మస్వరూపమును గురించి తెలుసుకోలేక పోతున్నారు.*🙏🙏🙏

*తమలో ఉన్న ఆత్మానందాన్ని విడిచిపెట్టి, సుఖం కోసం, ఆనందం కోసం బయట వెతుక్కుంటూ ఉంటారు._*

*_సామాన్య మానవుడు ధనంలో, ఆస్తిలో, బంధువులలో, పరాయి స్త్రీలసంగమంలో, పదవిలో, ఇలా రకరకాలుగా బయట ఉన్న ఆనందాని కొరకు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. వాటి కోసం నానాపాట్లు పడుతుంటాడు._*

*_సుఖం కోసం పరుగు.*
 *దు:ఖాన్నుండి తప్పించుకోడానికి పరుగు.*

*పదవి కోసం పరుగు.*

 నిరంతరం పరుగెడుతూనే ఉంటాడు. ఈ *పరుగులో పడి పరమాత్మను తెలుసుకోలేక పోతున్నాడు.*

*దీనినే “ద్వన్ద్వమోహేన" అంటే ద్వంద్వాల వల్ల కలిగే మోహం._* అంటారు 

*_ఇది సామాన్యమైన మోహం కాదు. దట్టమైన మోహం. ఈ మోహానికి తగ్గట్టు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒకటి. దీనితో పాటు లెక్కలేనన్ని కోరికలు. వాటిని తీర్చుకోడానికి అడ్డమైన పనులు చేయడం._*

*_అవితీరకపోతే కోపం. ద్వేషం, పగ, మనసు అల్లకల్లోలం కావడం. అటువంటప్పుడు ఎలా ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత లేనిదే ధ్యానం కుదరదు. ధ్యానం చేస్తేనే కానీ ఆత్మస్వరూపం అర్థం కాదు. కాబట్టి చూచిందల్లా నాదవ్వాలి అనే కోరికలను వదిలిపెట్టాలి._*🙏🙏🙏

*_దీని తరువాత వచ్చేది ద్వేషము. తనకు ఇష్టంలేని వస్తువుల మీద, మనుషుల మీద ద్వేషం పెంచుకోవడం. ఆ ద్వేషము కోపంగా మారుతుంది. ఆ కోపంతో కలిగే విషపరిణామాలు మనం చెప్పుకున్నాము. కోపం వలన సమ్మోహము, దానివలన స్మృతి విభ్రమము కలుగుతుంది. దాని వలన బుద్ధినాశనం అవుతుంది. తుదకు జరిగేది సర్వనాశనం.అందుకేఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వములను వదులుకోవాలి అని పరమాత్మ చెప్పాడు._*🙏🙏🙏

*_ఇవన్నీ కూడా పుట్టుకతోనే వస్తాయి. మధ్యలోరావు. పూర్వజన్మ సంస్కారం వలన వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి కానీ వాటి వ్యామోహంలో పడి పోకూడదు. వివేకం పెంపొందించుకోవాలి !_*🙏🙏🙏

*ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ?*
*నేను అంటే ఎవరు ? మరి అన్ని దేహాలలో వున్న ఏకైక ఆకారం లేని “చైతన్యానికి” నేనువేరు వాళ్ళు వేరు అనే భేదం ఎక్కడుంటుంది. ఆకారం లేనిదంతా ఒక్కటే అని గ్రహించడమే ముక్తి.*🙏🙏🙏

అలా కాకుండా ఈ శరీరం ‘నేను’ తదితర శరీరాలు ‘ఇతరులు’ అని భావించేదంతా అజ్ఞానం చేత మానవుని మనసులో ఏర్పడిందే తప్ప అది సత్యం కాదని గ్రహించాలి. ఒక గ్రామంలోని గృహాలను చూసినప్పుడు ఇది పుల్లయ్య గృహం, ఇది ఎల్లయ్య గృహం, ఇది బలరాముడి గృహం అని చెప్పుకుంటాం. అంతేగాని ఆ గృహాల పైన ఉన్న ఆకాశాన్ని చూపించి ఇది పుల్లయ్య ఆకాశం, ఇది ఎల్లయ్య ఆకాశం, ఇది బలరాముని ఆకాశం అని చెప్పలేం కదా!ఎందుకంటే గృహాలకు ఆకారం ఉంది. ఆకారాల మధ్య భేదం ఉంది.

భేద దృష్టిని అనుసరించి ఆకారాలను చూసినప్పుడు ఇది ఎల్లయ్యది, ఇది పుల్లయ్యది అని భావిస్తున్నాం. ఆకాశానికి ఆకారం లేదు. ఆకారం లేనిదానికి భేదం ఎక్కడుంటుంది?భేదం లేనప్పుడు ఇక ఇది అతడిది అది ఇతడిది అనే విభజన ఎలా చెయ్యగలం. *భేదం లేనిదంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం.*

*మరి మనిషి అంటే ఆకారం లేని ‘ఆత్మచైతన్యం’ అయినప్పుడు మనిషికి మనిషికి మధ్య భేదం ఎక్కడుంది?అజ్ఞాన దృష్టిచే అనేకంగా కనిపించేదంతా వాస్తవానికి అనేకం కాదు అంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం.అట్టి దృష్టి పరమ పవిత్రం. మంగళకరం...*🙏🙏🙏 

*కాబట్టి ఈ ప్రపంచమంతా అజ్ఞాన దృష్టికి అనేక శరీరాలుగాను ఆకారాలుగాను కనిపించవచ్చుగాని వాస్తవానికి అన్నింటిలో వున్నది ఏకైక నిరాకార“చైతన్యమే” అని గ్రహించడమే సత్య దృష్టి..*


ఈ ప్రపంచంలో 
ఎవరు ఆనంద స్వరూపుడు అంటే,  

*కేవలం తనను తాను తెలుసుకున్న వారు మాత్రమే.*

*నిత్య ఆనందం ఆయనకే ఉంటుంది.*

*బ్రహ్మానందం ఆయనకే సొంతం.*

*నిత్య తృప్తి అనే పదం ఆయనకే చెందుతుంది.*
*(ఆయనే సర్వజ్ఞాని)*🙏🙏🙏

*ఈయన ఏదో ఉండడం వల్ల ఆనందంగా ఉండడు.*
*ఈయన ఏదో దక్కడం వల్ల తృప్తి చెందడు.*
*ఈయన ఏది ఉన్న ఏది లేకున్నా నిత్యం ఆనందంతో తృప్తితో ఉంటాడు.*

కానీ మామూలు మనుషులు అలా కాదు 

*ఏదో ఉంటేనే సంతోషంగా ఉంటారు. ఏదో ఉంటేనే ఆనందంగా ఉంటారు. ఏదో లేకపోతే దుఃఖంతో బాధతో ఉంటారు.ఒకదానిమీద ఆధారపడేవారు మామూలు మనుషులు.*

*ఏది లేకున్నా నిత్యం ఆనందంతో తృప్తిగా ఉండేవారు మాత్రమే జ్ఞానులు*🙏🙏🙏

 *అందుకొరకే   మిమ్మల్ని జ్ఞానులు అవ్వండి అని     మొత్తుకునేది.*

*మీకు జ్ఞానం కలుగుతే*
*మీరు ఇక జీవితంలో దేనికొరకు ఆరాటపడరు.  పోరాటం చేయరు.* 

*దేహ భావన విడవండి*

 *ఆత్మజ్ఞానులు కండి*🚩

🕉️ *సర్వేజనా సుఖినోభవంతు*🕉

సత్సంగం* 🕉️🙏 *🕉️🙏దేవుడు దుకాణం

 🕉️🙏 *సత్సంగం* 🕉️🙏

*🕉️🙏దేవుడు దుకాణం🕉️🕉️*

*దేవుడు ఒక దుకాణం తెరిచాడట,*

 *అక్కడికి ఒక ఆసామి వెళ్లి*

*‘ఇక్కడ ఏమి దొరుకుతాయి?*

 *అని అడిగాడు.*

*ఏది కావాలంటే అది దొరుకుతుంది’ అన్నాడు దేవుడు.*

 *‘అలాగా, అయితే డబ్బు దొరుకుతుందా?*

 *‘చెప్పానుగా, దొరుకుతుంది’.*

*‘మరి మనశ్శాoతి?’* *దొరుకుతుంది’...*

 *‘ఆరోగ్యం?’.*

*అది దొరుకుతుందా’..*

 *సుఖం? ఊ... తలూపాడు దేవుడు.*

 *ప్రేమ?’ దొరుకుతుంది’ కాస్త విసుగ్గా చెప్పాడు.*

*సరే అయితే గెలుపు దొరుకుతుందా?...*

*చెప్పానుగా అన్ని దొరుకుతాయి.*

*నీకేమి కావాలో చెప్పు ముందు?*

*ఇంకా క్యూలో చాలా మంది ఉన్నారు.*

 *ఊ... అయితే నాకు "సక్సెస్ ఫుల్ లైఫ్" కావాలి.*

*సరే ఇదుగో అని ఒక గింజను చేతిలో పెట్టాడు దేవుడు.*

 *ఏమిటిది? ఆశ్చర్యంగా అడిగాడు.*

*విత్తనం...*

*ఎందుకిది ..*

 *సక్సెస్ ఫుల్ జీవితం కావాలన్నావుగా,*

*దీనితో నాకేం పని?. ఇది ముందు నాటితేనే కదా,*

*అది పెరిగి పెద్దదై నీకు ఫలితాన్నిచ్చేది.*

 *బుద్దుడికి చెట్టు క్రింద జ్ఞానోదయం అయినట్లు.....*

 *ఆ చెట్టుకు మూలమైన విత్తనం చేతిలో పడగానే బల్బు వెలిగింది.*

*దేవుడి దుకాణం లో పండు దొరకదు..*

*విత్తనం దొరుకుతుంది.*

*ఏది కష్ట పడకుండా..,*

 *ఏమి చేయకుండా రాదు.*

 *డబ్బ, శ్రమా, ఆలోచనా, ఇంకోటా..*

 *మరోటా.. ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి.*

 *ఏది నాటితే అదే కాస్తుంది.....*

*కానీ ఖచ్చితంగా కాస్తుంది.*

*🕉️🙏ఈ భావాన్ని మీ పిల్లల గుండెల్లో నాటండి.🕉️🙏*

*గొప్ప వాళ్ళవుతారు.*

*🕉️🙏ఆ దేవుడి దుకాణానికే విత్తనాలు పంపిస్తారు.🕉️🙏*

🕉️🙏🕉️

అంతరంగప్రార్థన

 హరిఓం,                              -                                                           -     *🙏అంతరంగప్రార్థన🙏🏻*
  
పరమాత్మా! బ్రహ్మ ముహూర్తంలో నన్ను అజ్ఞాన యుతమైన నిద్ర నుండి లేపుము. అట్టి పవిత్ర సమయమున అంతరంగంలో నిన్నే స్మరించు నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము.🙏🏻

పరమేశ్వరా! పర్వతాల వలె సుఖదుఃఖాలు భయపెట్టినను, చివరి శ్వాస వరకు త్రికరణశుద్ధిగా... నీ ప్రార్ధనలోనే నిలువగల శక్తి సామర్ధ్యాలను నాకు వసగుము.🙏🏻

సర్వేశ్వరా! ప్రతినిత్యమూ భక్త సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ఇవ్వు. నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించు.🙏🏻

సర్వజ్ఞా! ఇంద్రియ భోగాలపైన, బలీయమైన వాంఛలపైన, పరిపూర్ణ విరక్తిని నాకు కలిగించు. నీవు నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూ... గమనిస్తూ... కొలువై ఉన్నావనే జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకము అగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.🙏🏻

ఈశ్వరా! తెలిసి గానీ, తెలియక గానీ ఏ ప్రాణికి నా వలన హాని జరుగని విధంగా నడుచుకొనునట్లు నన్ను అనుగ్రహించు. ఆత్మ స్తుతి, పరనిందలు అనేడి పాప కూపంలో పడకుండా నన్ను కాపాడు.🙏🏻

ప్రేమైక మూర్తీ!  ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండే లాగున నన్ను అనుగ్రహించు.🙏🏻

హే దీనబంధూ!  దేహాభిమానాన్ని, స్వార్ధాన్ని నా నుండి తొలగించు. విషయ సుఖాలు నన్ను బంధించుచున్నవనే జాగృతి నిరంతరం నాలో ఉండేటట్లు కరుణించి నాకు త్రికరణ శుద్ధిని ఇమ్ము.🙏🏻

కరుణాసాగరా!  కీర్తి ప్రతిష్టల మీద, ధన ధాన్య సంపాదన మీద, లౌకిక భోగాలపైన నా చిత్తంలో... కాంక్ష కలుగని రీతిగా దయ చూడు.🙏🏻

సర్వాంతర్యామీ!  ఈ కనబడే ప్రపంచంలో నామరూపాలు అన్నిటియందు నీవే సత్యంగా... ఒక్కటిగా ఉన్నట్లు నాకు గోచరించే లాగున స్ఫురింప జేయుము.🙏🏻

ఓ సదానందా!  సర్వ ప్రాణుల యందు దయ, సాటి మానవుల యందు అకారణమైన సహజ ప్రేమ నాలో పొంగేలా నన్ను అనుగ్రహించు. రాగద్వేష, అసూయలు నాలో పొడసూపనీయకు తండ్రీ...🙏🏻

అచ్యుతా!  దూషణ, భూషణ తిరస్కారాల వలన నా మనసు చలించకుండునట్లు నన్ను అనుగ్రహించు. భక్త బృందంతో ఎల్లకాలము కూడి యుండునట్లు చేయుము.🙏🏻

     భగవంతుని ఇష్ట దైవ రూపంలో గానీ, గురు రూపంలో గానీ ఆరాధించుచున్న నన్ను ఆయా రూపాలతోనే అనుగ్రహించు. అన్ని రూపాలు నీవే కనుక నాలో అభేద భావం కలుగజేయుము తండ్రీ...🙏🏻

పాహిమాం....రక్షమాం..... పాహిమాం ప్రభో.🙏🏻🙏                                 -                                                             -           వలిశెట్టి లక్ష్మీశేఖర్     -            98660 35557 ...              -             09.03.2024.....

ఏమిటీ అష్టసిద్ధులు ? సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని.....కొందరు మహాయోగులు చెబుతారు .

 శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు . తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు .
“విభూతిర్భూతి హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్” – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు .
ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు ?
అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు .
మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు .
సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి . అహంకారం ఆవహిస్తుంది . విచక్షణ నశిస్తుంది . నిగ్రహం నీరుకారిపోతుంది .ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు . లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు . వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు . ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!
దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు .
ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి . జీవానందుడు తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు . సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు .
జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు . ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు . అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు .
ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు . ఇంకేముంది ?
గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది . జీవానందుడి ఆశ్రమం మూతపడింది . శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు . అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు . అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది . గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి . జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు .
“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను . నా తపస్సు కొనసాగించాను , ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు . నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు .
జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు . మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు .

అష్టసిద్ధులు

 అష్టసిద్ధులు
భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు.
అవి
1. అణిమ : సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.
2. మహిమ : భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు
3. గరిమ : ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.
4. లఘిమ : ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు
5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు
6. ప్రాకామ్యము : అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.
7. ఈశత్వం : ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది
8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి
ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.
అష్టసిద్ధులు అనే మాట వినిపిస్తూంటుంది .అయితే వాటిలో కొన్నిటి పేర్లే వినవస్తుం టాయి . ఆ అష్ట సిద్ధుల పేర్లు
అణిమ – అతి చిన్న వాడిగా మారిపోవడం
మహిమ – పెద్ద రూపం పొందడం
గరిమ – బరువుగా మారడం
లఘిమ – తేలికగా మారిపోవడం
ప్రాప్తి – ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం
ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం
ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి
వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ
కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం
సిద్ధులు చాలా ఉన్నాయి . అందు వల్ల అష్ట సిద్ధుల్లో కొందరు గరిమను చేర్చి కామావసాయతను పేర్కొనరు .మరికొందరు కామావసాయతను చేర్చి గరిమను పేర్కొనరు . ఏది ఏమైనా అష్ట సిద్ధులు ఇవే .ఈ అష్ట సిద్ధులని పురాణ పురుషులు ప్రదర్శించారు .
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు .
మహిమా సిద్ధిని హనుమంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు .
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శించాడు . ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది .
ఇక వామనావతారంలో విష్ణువు మూడడుగులతో భూమ్యా కాశాలను ఆవరించినపుడు కూడా ఇదేవిధంగా పెరిగాడు .
గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు . వాడిని కృష్ణుడు చంపివేశాడు .
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు .
లఘిమా అంటే తేలికగా అయిపోవడం . ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు .
ఈసిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది .
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు . దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది .
ఆదిశంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు . తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు . అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు . 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు .
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు . ఏసత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు . సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామస్మరణవల్ల ఉత్తమగతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం .
యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు . తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు . భగవద్గీతలో అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది . పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి . పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక గనుక మన శరీరమే ఒక ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి .
అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి . అష్టమాయల్ని జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట . అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు .

దేహాభిమానమే బ్రహ్మానుభవం

 దేహాభిమానమే బ్రహ్మానుభవం

"ముక్తస్థితిని పొందాలంటే, 
దేహాభిమానాన్ని వదలాలి" అని అంటుంటారు కదా!
మరి మీరేమో 'దేహాభిమానమే బ్రహ్మానుభవం' అంటున్నారు...! అని సందేహాన్ని వెలిబుచ్చారు రాధిక...

* * *

'నేను రామారావు అభిమానిని' అంటాను.
అంటే నేను వేఱు, రామారావు వేఱు  అనే కదా!

'నేను ఈ దేహాన్ని అభిమానిస్తున్నాను' అంటే,
"నేను" వేఱు, ఈ దేహం వేఱు అనే కదా!

దేహానికి నేను వేఱుగా ఉంటేనే,
నేను ఈ దేహాన్ని అభిమానించగలను.

దేహాభిమానం ఉండడం దోషమేమీ కాదు,
'నేను ఈ దేహాన్ని కాను' అనే సత్యాన్ని అది తెలుపుతోంది...

బ్రహ్మము తానెవరో  మరచిపోయేంతగా బాబు అనే బొమ్మను అభిమానించి, బొమ్మే తానైపోయింది.  సుఖదుఃఖాలను అనుభవిస్తోంది.

మళ్లీ ఇప్పుడు 'నేనెవడను' అని తనలో తాను విచారించుకొని,  తానెవరో తెలుసుకొని జగత్తంతా తోలుబొమ్మలాటే అని తెలుసుకుని యధాస్థితికి చేరుకుంటుంది.

నేనెవడను? అనే సాధన చెప్పింది బ్రహ్మానికే;
ఈ బొమ్మకు కాదు.

బొమ్మ జడం - దీనికసలు ఉనికే లేదు.
ఈ బొమ్మకు బంధమూ లేదు, మోక్షమూ లేదు.
ఈ బొమ్మకు సాధనా లేదు, సిద్ధీ లేదు.

మరి ఈ బొమ్మే కదా ఈ వ్యాసం వ్రాస్తోంది?
అని సందేహం రావొచ్చు.

కాదు...

బ్రహ్మమే వ్రాస్తోంది...
తానెవరో తాను తెలుసుకోవడంలో భాగంగానే జరుగుతుంది....ఈ పుస్తకపఠనం, వ్యాస రచనం, సద్గురు సహవాసం, ఆత్మవిచారం...

వాహనంలో వాహకుడు ఉన్నప్పుడు మాత్రమే
వాహనంలో చైతన్యం ఉన్నట్టు,

దేహంలో బ్రహ్మం ఉన్నప్పుడు మాత్రమే ఈ జడ దేహంలో చైతన్యం కనిపిస్తుంది.

ఆయన కదలికే మన కదలికగా కనబడుతుంది.
ఆయన పలుకే మన పలుకుగా ఉంటుంది.

అందువల్లనే రమణులు ఈ దేహాన్ని చిత్-జడ గ్రంథి అన్నారు.

గ్రంథి అంటే ముడి. 
ముడిలో  చిత్-జడముల రెంటి స్పర్శా ఉంటుంది. 

పూర్తిగా చిత్తు అయిపోయినా కదలిక ఉండదు.
పూర్తిగా జడం అయిపోయినా కదలిక ఉండదు.

చిత్-జడముల కలయిక ఈ దేహం.
దేహం వల్లనే సంసారం.
సంసారం వల్లనే దుఃఖం.
దుఃఖాన్ని మాపేది ఆత్మవిచారం.

సంసారంలో-
నేను-నాది విడివిడిగా ఉంటాయి.

స్వరూపంలో-
నేను-నాది ఏకమై ఉంటాయి. 

పూర్తి చిత్తుకూ సాధన అవసరం లేదు.
పూర్తి జడానికీ(శవానికీ) సాధన అవసరం ఉండదు.

చిజ్జడగ్రంథికే అన్నీను...

బొమ్మలాటలో పడి, తానెవరో మరచిపోయిన బ్రహ్మమే చిజ్జడగ్రంథి.

నిజానికి చదరంగంలో రెండువైపులా తానే ఉండి, బ్రహ్మము ఆడే ఆటే ప్రపంచం.

ఓటమీ తనదే, గెలుపూ తనదే.

ఆట అనేది మరిస్తే సుఖదుఃఖాలు రెండూ దుఃఖమే.
ఆట అనే గుర్తుంటే సుఖదుఃఖాలు రెండూ సుఖమే.

మరపే బంధం, ఎరుకే మోక్షం.
బ్రహ్మానికి; మనకు కాదు.

మనకసలు ఉనికే లేదు.
అనే తెలివి కూడా బ్రహ్మము యొక్క స్పర్శ వలన కలుగుతోంది...

* * *

బ్రహ్మమే దేహాన్ని అభిమానించి, దానికి తోడునీడగా ఉండి నడిపిస్తోంది, డ్రైవరు బస్సును నడిపిస్తున్నట్లుగా...

"అదిగో బస్సు వస్తోంది..." అంటామేగాని, 
అదిగో డ్రైవరు వస్తున్నాడు...అని ఎవరూ అనరు.

అలా 'బాబు వస్తున్నాడు' అంటారేగానీ, బాబు లోపలుండి నడిపే బ్రహ్మాన్ని ఎవడూ గుర్తించడు.

అంటే వాహనానికి ప్రాముఖ్యతనిచ్చి, 
వాహకుణ్ణి మరిచిపోతున్నాం.

* * *

'నేను బాబు' అని అనేది బ్రహ్మమే.
'నేను బ్రహ్మమును' అని అనేదీ బ్రహ్మమే.

బ్రహ్మమునకు-

నేను బాబు అని అనుకుని బాబు అయ్యే శక్తీ ఉంది.

అహంబ్రహ్మాస్మి  - నేను బ్రహ్మమును అనుకుని తిరిగి బ్రహ్మమయ్యే శక్తీ ఉంది. 

బ్రహ్మము సర్వశక్తిమంతము - చైతన్యము.
బాబు అస్వతంత్రుడు - జడము.

* * *

కాబట్టి- 
బాబు బ్రహ్మము కావడానికి చేసే సాధన కంటే,
బ్రహ్మమే బాబు అయివున్నది అనే అవగాహన సిద్ధినిస్తుంది. 

ఉన్నది "ఒక్కటే" లేదా "ఒక్కడే" అన్నాక...
రెండవది లేదు అన్నాక...
ఇక ఎవడి మీద కేసు పెట్టగలం...!

* * *
-జ్ఞానశిశువు

Tuesday, March 12, 2024

ఆణిముత్యాలు

 ❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
      ☀️ ఆణిముత్యాలు            
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁

🔸 నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.

🔸  నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది  అని వెతకకు, అది నీ అంతరంగంలోనే  అంతర్యామి అయిన  అంతరాత్మలోనే ఉంటుంది.

🔸  సంతోషానిచ్చేది సంపదలు, అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.

🔸  నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.

🔸  మన సమస్యలకు, మన దుఃఖాలకు, మన బాధలకు పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి,  కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.

🔸  సంతోషం అనేది ఎంతో మధురమైనది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.

🔸  విజయం సాధించడంలో ఎవరూ నిన్ను మోసము చేయలేరు - నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప.

🔸 నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.

🔸 నిన్ను నీవు విమర్శించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.

🔸 నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.

🔸 నిన్ను నీవు మోసగించుకున్నంతగా , ఇంకొకరెవరూ నిన్ను మోసగించరు.

🔸 దేనినైనా ఆశించబోయే ముందు అందుకు కావలసిన అర్హతను సంపాదించుకో – తనను తాను జయించుకోగల వ్యక్తి అన్నింటిని జయించగలడు.

🔸 దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు.

🔸  నీమీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.

🔸  అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
                ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
  పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
       భారతీయత కూడా నేర్పండి

   🙋🏻‍♂️ జై హింద్  🇮🇳  జై భారత్  🫡

Monday, March 11, 2024

శరీరం - ఇహపరాలకు - సాధనం

 *🙏శరీరం - ఇహపరాలకు - సాధనం🙏*
                *-- ౦ --*
💐💐👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐


*🌹శ్లోకం :-*
*పునర్విత్తం..! పునర్మిత్రం..!* 
 *పునర్భార్య..! పునర్మహి..!*
*ఏతత్సర్వం..! పునర్లభ్యం..!*
*న శరీరం..! పునః..! పునః।।*

 🌷
*పోయిన ధనం..!*
*మళ్లీ చేరుతుంది...!* 

🌷 *దూరమైన మిత్రుడు..!*
 *మళ్లీ..! చేరువఅవుతాడు..!*      
         
🌷 *భార్య గతిస్తే..! మరొక భార్య..! లభిస్తుంది..!*

🌷 *భూసంపద..! మళ్లీ ప్రాప్తిస్తుంది..!* 

*పోయినవన్నీ..!*
*మళ్లీ..! తిరిగి రాబట్టుకోవచ్చు..!* 

*కానీ..! మానవ శరీరం మాత్రం..!*
 *మళ్లీ..! మళ్లీ..! తిరిగి రాదు..!*

*అందుకే..!*
 *శరీరం ఖలు..! ధర్మసాధనం..! అన్నారు..!*

 *కేవలం..! శరీరం..! ఉంటేనే..!*
 *ధార్మికమైన..! పనులు..! చేయవచ్చు..!*

 *శరీరం ఉంటేనే..!*
 *నాలుగు మంచి పనులు చేసే..! అవకాశం వస్తుంది..!*

 *శరీరం ఉంటేనే..!*
 *హితవాక్యాలు చెప్పవచ్చు..!*
*ఏ పని చేయడానికైనా..!*
*శరీరం కావాలి..!*

 *కనుక..! శరీరమును..! రక్షించుకోవాల్సింది..!*
 *మానవ జన్మ ఎత్తినవాళ్లే..!*

*జంతువులకు..! శరీరం ఉంటుంది..! కానీ..! వాటికి ఆలోచన ఉండదు..!*

*పైగా కొద్దోగొప్పో..! ఆలోచన..! కలిగినా..! దాన్ని అమలు..! చేయడానికి..!* 
*శరీరం..! సహకరించదు..!*

*బుద్ధి..! ఆలోచన..!* 
*మాట్లాడే శక్తి..!* 
*కావలసినది..!* 
*సంపాదించుకొనే..! జ్ఞానం..!*
*తగిన అవయవ నిర్మాణం..!*
*ఉండేది ఒక్క *మనుష్యులకే..!*

*వాటిని అమలు చేసే..! నైపుణ్యమూ..! మనుష్యులకే ఉంటుంది..!*
*కనుక..! మనమందరం..! శరీరాన్ని..! కాపాడుకోవాలి..!*

*అతిగా తిన్నా..!*
*అతిగా ఆలోచించినా..!*
*అతిగా సుఖించినా..!*
*అతిగా దుఃఖించినా..!*                    
*ఏదైనా..! అతిగా చేస్తే..!* 
*ఈ "శరీరం" కాస్తా..! పుటుక్కుమంటుంది..!*. 

*ఇక *శరీరం..! చేజారిపోయాక..! చేసేది..! ఏమీ ఉండదు..!* 

*కనుక ముందు..! శరీరమును..! జాగ్రత్తగా..! చూసుకోవాలి..!*    
                                   
*దీనికి :-*
 
*సత్యం..!* 
*ధర్మం..!*
*శాంతి..!*
*ప్రేమ..!*
*అహింసలను..!*

 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి..!*

*విస్తరాకు:-*

*విస్తరాకుని..! ఎంతో శుభ్రంగా..! ఉంచుకొని నీటితో కడిగి..! నమస్కారం చేసుకుని..! భోజనానికి..! కూర్చుంటారు..!*
*భోజనము తినే వరకు..!*
*ఆకుకు మట్టి అంటకుండా..!*
 *జాగ్రత్త వహిస్తాము..!*

*తినిన మరుక్షణం..! ఆ విస్తరాకును..! మడిచి..! దూరంగా..! *మురికి పై పడేసి వస్తాము..! తర్వాత ఆ ఎంగిలి..! ఆకును ముట్టుకోము కూడా..!*

*మనిషి జీవితం..! కూడ అంతే..!*
 *'ఊపిరి" పోగానే..! ఊరిబయట..! పారేసి వస్తారు..!*,

*విస్తరాకు పారేసినప్పుడు..!*
*సంతోష పడుతుంది..! ఎందుకంటే..!* 

*పోయే ముందు..! ఒకరి ఆకలిని..! తీర్చటానికి..! తను ఉపయోగ పడినాను..!*అన్న తృప్తి..!*
 *విస్తరాకుకు..! ఉంటుంది..!*,

*విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన..!తృప్తి..! భగవంతుడు..! మనుషులకు కూడా..! ఇవ్వాలని..! భగవంతుణ్ణి..! ప్రార్థిస్తూ.. !*

*"" సేవ చేసే అవకాశము..!* *వచ్చినపుడు..! సేవ చేయండి..!""*     *జారవిడుచుకోకూడదు..!* 

 ,
*ఇంకొకసారి..!*
*ఎప్పుడో..! చేయవచ్చనుకొని..!* *వాయిదా వేయకండి..!*
*ఆ అవకాశము..! మళ్లీ వస్తుందని..! అనుకుంటే..! పొరపాటే..!* *కుండ ఎప్పుడైనా..! పగలవచ్చు..! అప్పుడు..! విస్తరికివున్న  తృప్తి కూడా..!* 
*మనకి ఉండదు..!*

*ఎంత సంపాదించి ఏమి లాభం..?*

*ఒక్క పైసా..! అయినా..!*
 *తీసుకు పోగలమా..?*

*మన చేత..!*
 *ప్రత్యక్షంగా..! పరోక్షంగా..!* 
*ఓ..! 10 మందికి..!* 
*మంచి జరిగితే..!* 
*మన మానవ జన్మ..! సార్థకమయినట్లే ..!**👏

*సజ్జనసాంగత్యంతో..!*
*సర్వేశ్వర నామస్మరణతో..!*
*సర్వులలో..! సర్వేశ్వరుని..!*
*దర్శించి..!*
*సర్వేశ్వరానుగ్రహంతో..!*
*జనన..! మరణ రహితమైన..!*
*పరమోక్షమును..!*
*మనమెల్లరము..!*
 *పొందెదముగాక..!*
*ఇదియే..!*
*ఈ మానవజన్మకు..!*
*అర్థం..! పరమార్థం..!*


🙏 *యధ్బావన సద్గతిః🙏* 
*సర్వేజనాః..! సుఖినోభవంతు..!*
              *-- ౦ --*
      *శ్రీరామ..! జయ..! రామ..!*
      *జయ..! జయ..! రామ..!*
     *శ్రీరామరక్ష..! సర్వజగద్రక్ష..!*
💐💐👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐

గాందీ* *జాతిపిత అనిపించుకోవడం కోసం దేశాన్ని సంకనాకించాడు* *నెహ్రూ* *శాంతిదూత అనిపించుకోవడం కోసం దేశాన్ని చైనాకు ప్రపంచానికి తాకట్టు ( దాసోహం చేసాడు )* *దేశాన్ని లూటీ చేసీందీ ఎవ్వడు ఇది కథ కాదు

 *గాందీ*
*జాతిపిత అనిపించుకోవడం కోసం దేశాన్ని సంకనాకించాడు*
*నెహ్రూ*
*శాంతిదూత అనిపించుకోవడం కోసం దేశాన్ని చైనాకు ప్రపంచానికి తాకట్టు ( దాసోహం చేసాడు )*

 *దేశాన్ని లూటీ చేసీందీ ఎవ్వడు ఇది కథ కాదు*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

_*1885 లో భారత్ విచ్చిన్నం, హిందూ నాశనం లక్ష్యం తో ఒక విదేశీయుడి చేత స్థాపించబడ్డ కాంగ్రెస్ 138 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా తన లక్ష్యం కోసం మాత్రమే పనిచేసింది.*_

*1.స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకస్తున్నట్టు నటిస్తూ పసలేని పోరాటాలు చేస్తూ బ్రిటిష్ సహకారం తో కాంగ్రెస్ లాంటి బలమైన మరో పార్టీ రాకుండా అడ్డుకుంది.*

*2. విప్లవ వీరుల్ని ఉరికంబాలకు బలి ఇస్తుంటే మౌనంగా ఆనందించిన గాంధీ, ముస్లింలను పునరాగమనం ద్వారా హిందువులుగా మార్చిన శ్రద్ధానందను చంపిన రషీద్ ను తన సోదరుడని చెప్పి ఉరి నుండి కాపాడాడు*

*3. కేరళలో జరిగిన దారుణ హిందూ హత్యలకు గాని ప్రత్యక్ష చర్య పేరుతో కలకత్తా ను హిందూ శవాల గుట్టగా మార్చడాన్ని గానీ కాంగ్రెస్ వ్యతిరేకించలేదు*

*4. 1947 ఆగష్టు 14 న 21 లక్షల మంది హిందువుల్ని చoపితే, దానికి ప్రతీకార చర్య జరిగితే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గాంధీ ఒక్క ముస్లిం ఒంటిపై దెబ్బ పడకుండా ఆపాడు*

*5. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునిపాక్ నుండి భారత్ కి పారిపోయి వచ్చిన హిందువులు దేవాలయాల్లో తలదాచుకున్నారు, అవి చాలక మసీదుల్లో తలదాచుకోడానికి ప్రయత్నం చేసిన హిందువుల్ని ఆపి గడ్డ కట్టె చలికి తట్టుకోలేక వందల సంఖ్య లో పసిపిల్లల, వృద్ధుల చావుకు కారణం అయ్యాడు* 

*6. భారత్ లోని సంస్థనాలన్నీ పటేల్ గారిని ప్రధానిగా నిర్ణయించి ఓటు వేయగా గాంధీ కుట్రతో పటేల్ గారికి పడ్డ ఓట్లను నెహ్రూకు బాదలయించేలా చేసి ముగ్గురు ముస్లింలను ప్రధానులుగా చేసాడు, భారత్ కి నెహ్రూ, పాక్ కు జిన్నా, కాశ్మిర్ కు (వజీర్-ఏ-అజాం )గా షేక్ అబ్దుల్లాను చేసాడు* 

*7. గాంధీ యొక్క హిందూ నాశన పధకాన్ని సహించక అతడ్ని చంపిన గోడ్సే ఉగ్రవాది గా ముద్ర వేసిన కాంగ్రెస్  అప్పటికే 25 లక్షల హిందువుల్ని చంపించిన జిన్నాను, వాడి హంతక ముఠాని పట్టించుకోలేదు*

*8. ప్రత్యేక ప్రతిపత్తి (ప్రత్యేక దేశం)  పేరుతో భారత్ బడ్జెట్ నుండి కాశ్మిర్ కు ప్రత్యేకంగా వేల కోట్ల డబ్బు కేటాయించి  మొత్తం ముస్లిం నాయకులకే పంచింది*

*9.ఆర్టికల్ 370 ద్వారా కాశ్మిర్ లో హిందువులు ప్రవేశించకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పాకిస్తాన్ పౌరులకు ఎర్ర తివాచి పరిచింది* 

*10. కాశ్మిర్ లో 10వేల మంది హిందువుల్ని ముస్లింలు ఊచకోత కోసి చంపగా మిగిలిన వారు పారిపోయి ఢిల్లీ రోడ్లపైకి చేరితే వాళ్ళని కాంగ్రెస్ పట్టించుకోక బిచ్చగాళ్లుగా మార్చింది* 

*11. మైనారిటీ చట్టం ద్వారా ముస్లిం క్రైస్తవులకు దేశసంపదను దోచిపెట్టిన కాంగ్రెస్ దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకుని దేవాలయాల్ని, వాటి భూముల్ని లూటీ చేసి హిందూ ద్రోహులకు పంచింది.*

*12. మైనార్టీ పేరుతో ముస్లిం క్రైస్తవులకు మత విద్యను నేర్పించడానికి వీలు కల్పించి  హిందువులకు మత విద్యను నిరాకరించింది*

*13. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి అధికారికంగా ఇఫ్తార్ విందులు ఇవ్వడం, రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగస్తులను ఇష్టానికి వదిలేయడం, మక్కా యాత్రకు అయ్యే ఖర్చు ప్రజల సొమ్ము నుండి ఇవ్వడం ఇవన్ని కాంగ్రెస్ మొదలు పెట్టి నాన్ బీజేపీ పార్టీలచేత కొనగింప చేసినవే.*

*14. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఆ రెండుమతాలకు మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ సంక్రాతి కానుక అన్ని మతాలకు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్సే*

*15. కేరళలోని మీనాక్షి పురంలో హిందువులను అధిక సంఖ్య లో చంపి దాన్ని రహమ్మత్ నగర్ గా మార్చడం కాంగ్రెస్ కుట్రే*

*16. హిందూ జనాభా తగ్గించే కుట్రతోనే జనాభా నియంత్రణ బిల్ ను కాంగ్రెస్ తెచ్చింది*

*17. కొలీజియం ను హిందూ వ్యతిరేకులతో నింపి తీర్పులన్నీ హిందూ నాశనానికి, ముస్లిం రక్షణకి అనుకూలంగా ఉండేలా తయారు చేసింది*

*18. JNU, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలు లాంటి అనేక యూనివర్సిటిలలో  కమ్యూనిస్ట్ లను చేర్చి అక్కడ చదివేవారిని హిందూ శత్రువులుగా, దేశ ద్రోహులుగా, పాకిస్తాన్ ప్రేమికులుగా మార్చేలా చేసింది, వాటిలో ఆవుమాంసం తినే కార్యక్రమాలను నిర్వహించింది*

*19. సెవెన్ సిస్టర్స్ పేరుతో ఈశాన్య రాష్ట్రాలను విడదీసి వాటిని క్రైస్తవ మిషనరీలకు అప్పజెప్పి, డబ్బులిచ్చి 7 రాష్ట్రాలను క్రైస్తవ ప్రాంతాలుగా మార్చింది*

*20. సైన్యానికి కనీస అవసరాలు ఇవ్వకుండా భారత్ సరిహద్దు ప్రాంతాలను చైనా, పాకిస్తాన్ లకు పంచింది దాదాపు 3 రాష్ట్రాలకు సరిపడ భూమిని శత్రు దేశాలకు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చింది*

*21. భారత్ కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యుడిగా వచ్చిన అవకాశాన్ని వద్దని దాన్ని చైనాకు ఇప్పించి న కాంగ్రెస్ లక్షలకోట్ల నష్టాన్ని ప్రజలకు అంటగట్టింది*

*22. రక్షణ పరంగా కీలకమైన అనేక దీవుల్ని బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ లకు నెహ్రూ ఉచితంగా ఇచ్చాడు, వాటి విలువ లక్షల కోట్లలో ఉండడమే కాక ఆ కారణంగా రక్షణ నిధులు భారీగా పెంచాల్సి వచ్చింది*

*23. పాకిస్తాన్ ను ఓడించి ఆక్రమించే సమయంలో కాంగ్రెస్ సైన్యాన్ని వెనక్కి పిలిచి సమస్యను బుద్ధిపూర్వకంగా ఐక్య రాజ్య సమితిలో పెట్టి కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్టు తయారు చేసింది*

*24.1947 లో మొదలైన రిగ్గింగ్ (పటేల్ ఓట్లని నెహ్రూకి మార్చిన )  దాని జీవితం మొత్తం కొనసాగింది* 

*25.1947 లో కాంగ్రెస్ చేసినపాకిస్తాన్ కు సైకిళ్ల ఎగుమతితో మొదలైన స్కాం  దాదాపు 500 లక్షల కోట్లుకు చేరిందని అదంతా ఇటలీ, స్విస్ లకు చేరాయని ఆరోపణలున్నాయి.*

*26.రాజ్యాంగం చెప్పిన 10 సంవత్సరాల రిజర్వేషన్స్ ని పెంచుకుంటూ పోయి నిజమైన హక్కుదారుల లకు దక్కాల్సిన ఉద్యోగాలను క్రైస్తవులకు కట్టబెట్టింది.*

*27. వక్ఫ్ చట్టాన్ని తెచ్చి దేశం మొత్తం ముస్లింల సొంతం అయ్యేలా కుట్ర చేసింది, హిందూ సంఖ్య ఎక్కువగా లేని చోట్ల భూముల్ని, ఇళ్లని లాక్కుని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు*

*28. కేరళ, బెంగాల్ లాంటిముస్లిం ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాలను ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించి షరియా అమలు చేయడంలో కాంగ్రెస్ సహకారం పూర్తిగా ఉంది.*

*29. గొప్పగొప్ప అణు శాస్త్రవేత్తల్ని, అంతరిక్ష పరిజ్ఞానం కల మేధావుల్ని చంపి, కనుమరుగు చేసి భారత్ ఎదగకుండా చేసింది*

*30. చైనా వ్యాపారం, ఎదుగుదల కోసం భారత్ తయారీ రంగాన్ని పాతాళానికి తొక్కింది*

*31. తనకు డబ్బు రావడo కోసం మాత్రమే పరిశ్రమ లను అనుమతించింది*

*32. ప్రభుత్వ సొమ్ముతో (ప్రజలు కట్టిన పన్నులతో) స్థాపించిన భారీ పరిశ్రమలలో కమ్యూనిస్ట్ యూనియన్ లకు ప్రవేశం కల్పించి నష్టాల్లోకి నెట్టి పారిశ్రామిక అభివృద్ధిని నాశనం చేసింది*

*33. రక్షణ రంగాన్ని బలహీనం చేసి నాన్ బీజేపీ పార్టీలతో కుమ్మక్కు అయి పాకిస్తాన్, మయన్మార్, బాంగ్లాదేశ్ ల నుండి 15 కోట్ల మంది ముస్లింలను రప్పించి హిందువులను అంతం చేసే కుట్రకు తెరతీసింది.*

*34. ఈ దేశస్తులైన హిందువులకు రక్షణ లేకుండా చేసి, బలహీన పరచి నోరేత్తకుండా చేసి, వ్యవస్థలన్నిటిని హిందూ శత్రువులతో నింపి హిందువుల్ని 3వ జాతి పౌరులుగా మార్చింది.*

*35. ఏ నాయకత్వం, యుక్తి లేని హిందువులు తాగుడికి బానిసలుగా మారడం కాంగ్రెస్ కుట్రలో భాగమే*

*36. పురాణాలను, ఇతిహాసాలను, చరిత్రను వక్రీకరించడానికి కావాల్సిన అన్ని మసాలా దినుసుల్ని కమ్యూనిస్ట్ లకు అందించి, విద్యాశాఖను ముస్లింలకు కట్టబెట్టి ఆ ఇద్దర్ని కలిపి హిందూగ్రంధాలను సమూలంగా మార్పించి హిందువులు, హిందు దేముళ్ళు నిరంతరం విమర్శలకు గురి అయ్యే వాతావరణాన్ని సృష్టించింది.*

*37. కొంతకాలం శత్రువులుగా నటించిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు హిందూ అంతం నేపథ్యంలో పాలు, నీళ్లలా కలిసి పనిచేసారు* 

*38. ప్రతి రంగంలో యూనియన్లకు ప్రవేశాన్ని కల్పించి ఆ యూనియన్ల ద్వారా హిందూ వ్యతిరేకతను పెంచి పోషించింది.*

*39. యాక్ట్ అఫ్ వర్షిప్ చట్టాన్ని తెచ్చి గతంలో ముస్లింలచేత మసీదులు మార్చబడ్డ హిందూ దేవాలయాలు శాశ్వతంగా మసీదులుగా ఉండేలా చేసింది. పన్నుల రూపంలో వచ్చే డబ్బును హిందూ నాశనం కోసం ఉపయోగించడానికి కావల్సిన ప్రతి దాన్ని ఉపయోగించుకుంది.* 

_*ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ తానొక ముస్లిం పార్టీనని స్పష్టంగా చెప్పింది.*_
*దీని హిందువులు అందరు గమనించాలి ఇప్పటికైనా మేల్కోవాలి*
*జై శ్రీరామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*
సేకరణ

మీ శరీర భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి ....

 *మీ శరీర భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి ....*

1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు *పొట్ట* గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు  *కిడ్నీలు*  గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా  *గాల్ బ్లాడర్* గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు *చిన్న ప్రేగు* గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు  *పెద్ద ప్రేగులు* గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు 
*లంగ్స్* గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు *లివర్* గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు *గుండె* గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు *ప్యాంక్రియాస్* గాయపడుతుంది ఎందుకంటే అవి రుచికరమైనవి మరియు ఉచితంగా లభిస్తాయి.

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు *కళ్ళు* గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు *మెదడు* గాయపడుతుంది.

*ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.*

ధన్యవాదములు
నీ దేహం దేవుని ఆలయం

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో...

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా...శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా . .. 
So.. Stay healthy and stay fit👍

Saturday, March 9, 2024

అభయహస్తాలు, అపాత్రదానం, గుప్త దానం.....

 సమాజం లో అన్ని విధాలా సంతృప్తికరమైన జీవనం గడుపువారు, తమకు ఉన్నదాంట్లో కొంత ఇచ్చి, ఆర్తులను ఆదుకోవడం ఉత్తమ లక్షణం. చాలా మందికి ఎంత సంపద ఉన్నా  దానం చెయ్యడానికి మనసొప్పదు, కానీ ఎవరైనా ఇస్తే తీసుకోడానికి ముందే సిద్దమైపోతారు. ఇచ్చే చేతికే తీసుకునే అర్హత ఉంటుందనే విషయం మరువకూడదు... ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరి ముందు చాచడానికి ఇష్టపడకుండా, కేవలం ఇవ్వడానికి ఉపయోగించే చేతులను అభయహస్తాలు అంటారు..
.అవసరార్థులను గుర్తించి తదనుగుణంగా చేసే దానానికే ఔచిత్యం ఉంటుంది...అంతేకానీ అనర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చెయ్యకూడదు, దాన్ని అపాత్రదానం అంటారు.... దానం అనేది మనం ఎవరికో చేస్తున్న ఉపకారం కాదు, అది మన జీవితాన్ని చరితార్థం చేసుకునే సదవకాశం మాత్రమే..... 1.మరణ భయంతో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వడం 2.రోగులకు వైద్యం చేయించడం 3. పేదవారికి ఉచిత వైద్య అందించడం 4.  ఆకలితో అలమటించే వారికి మరియు మూగజీవాలకు కడుపు నింపడం, దాహార్తి తీర్చడం.వీటిని చతుర్విధ దానాలు అంటారు... నేడు నేత్రదానం, రక్తదానం,అవయవ దానాలు మరణం అంచున ఉన్న వారికి ప్రాణాలు పోస్తున్నాయి.... ఎవరైనా తమ స్తోమతను మించి గొప్పలకు పోయి దానాలు చేసి కష్టాలు తెచ్చుకో కూడదు. అలాగే తమకు చెందని వస్తువులు దానం చెయ్యకూడదు. దానం చేసేవారు నిర్మల మనస్సుతో ఫలితం ఆశించకుండా దానం చెయ్యాలి. దానం చేసిన తర్వాత మరిచిపోవాలి.ఎవరికీ చెప్పకూడదు, దాన్ని గుప్త దానం అంటారు.వాటికి విలువ ఎక్కువ ఉంటుంది.....గొప్ప గొప్ప దానాలు చేయలేక పోయినా, మనసావాచా ఇవ్వగలిగింది ఇస్తే, ఆ సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులే కాదు, దానం అనే దొడ్డ గుణాన్ని పుణికిపుచ్చుకుని, ఆచరించాలి. అదే  ఇహలోకంలో  మనకు, పై లోకంలో మన పితృదేవతలకు సద్గతులను కలుగజేస్తుంది...... పోలిన రామకృష్ణ భగవాన్... రాజమండ్రి.