Thursday, October 17, 2024

 *🌹మన జీవితంలో తల్లి తండ్రుల పాత్ర 🌹*

        *మన జీవితంలో అమ్మానాన్నల పాత్ర చాలా ముఖ్యమైనది.తల్లి ఎంతగా ఊడిగం చేసి కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో తండ్రి కూడా అంతే. తనకు ఎన్ని బాధ్యతలు ఉన్నా సాధ్యమైనంతవరకు వాటిని నిర్వర్తించడానికి చూస్తారు.తిండి పెట్టి లాల పోసి నిద్ర పుచ్చే జీవితం గురించి గొప్ప పాఠాలు నేర్పింది తల్లి అయితే ఆ కలలని నిజం చేసేవాడు తండ్రి.*

            *ఇద్దరితో మొదలైన జీవితం రాను రాను ముగ్గురు గా నలుగురు గా  మారిన ఎంత భారమైన బాధ్యతగా మోస్తూ వాళ్లకి విద్యా బుద్ధుల్ని నిత్య అవసరాలని అన్నిటిని తీరుస్తూ జీవితం పైన ఆశను కల్పిస్తూ ముందుకు నడిపించేవాడు తండ్రి. క్రమశిక్షణతో ఆ తండ్రి  విద్యాబుద్ధులు నేర్పడానికి నాన్న కష్టాలు పడి వాళ్ల తిండి గురించి బట్ట గురించి కష్టపడుతూ తన ఆరోగ్యము తన భార్య ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు.*

            *ఏ చిన్న ఇంట్లో ఉన్న జీవితం వెళ్ళిపోతుందని ఆ బిడ్డల చదువులు కోసం వాళ్ళ ఉన్నతి కోసం కష్టపడతారు వాళ్ల జీవితం ఎలా గడిచిపోయిందో కూడా గమనించరు. వాళ్లే అమ్మానాన్న. కొంతమంది మహాతల్లులు ఉంటారు వచ్చే ఆదాయంతో సరిపెట్టుకోకుండా గొంతెమ్మ కోరికలతో అప్పులు పాలు చేస్తూ అటు బిడ్డలని ఇటు భర్తని కూడా రోడ్డు మీద వేస్తారు.*

            *ఇలాంటి వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా బుద్ధి అనేది రాదు. ఇలాంటి మహా తల్లులు ఉండటం వల్ల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇది వాస్తవంగా జరిగిన విషయాలు అందుకే ఇక్కడ నేను వ్యక్తపరుస్తున్నాను. కష్టమంటే వాళ్లది వాళ్లకి ఓపిక ఉన్నన్నాళ్ళు మనకోసం కష్టపడి మనకు జీవితాన్ని ఇస్తారు. కానీ పిల్లలకి రెక్కలు రాగానే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తల్లిదండ్రుల గురించి అసలు పట్టించుకోరు వాళ్ళు తిన్నారా ఉన్నారా ఏమైపోయారు.*

           *ఒకప్పుడు అమ్మా నాన్న ప్రపంచం అనుకున్న బిడ్డలకు  కొత్త ప్రపంచం వస్తుంది. వాళ్లకి భార్య పిల్లలు వస్తారు. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. కానీ ఇంత జీవితం రావడానికి కారణమైన తల్లిదండ్రులు మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్.నువ్వు పెట్టే లక్షల్లో ఖర్చు కొంచెం తగ్గించుకొని నీ తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికి నీ మనసంగీకరించదు. భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే భర్త బాగుండరు. మీ వరకే మీరు తినాలి మీ వరకే మీరు బ్రతకాలి ఇదేనా జీవితం, తల్లిదండ్రుల రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా.*

            *ఇంత కూడ పెట్టి బంగ్లాలు కొని  కార్లు కొనుక్కునీ వజ్రాల నగలు ధరిస్తూ ఇదే జీవితం అనుకుంటే సరిపోతుందా. మీ ఊర్లో నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నువ్వు పట్టించుకోవా. వాళ్లతో మొదలైన నీ జీవితము మర్చిపోయావా. కన్నవాళ్ళకి ఇంత అన్నం కూడా పెట్టలేని ఇలాంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆ తల్లిదండ్రులు బాధపడ్డప్పుడు ఆ ఉసురు మీకు తగలదా నీ బిడ్డలకు మంచి జరుగుతుందా ..*

           *నువ్వు ఏది అయితే వాళ్లకు ఇస్తావో అదే బిడ్డలు నీకు ఇస్తారనీ మీరు మర్చిపోతే ఎలా.ఇవి చాలా చిన్న విషయాలు అనుకుంటాం కానీ చాలా సున్నితమైన విషయాలు కొన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ రుణం తీరదు. అలాంటిది కాస్త అన్నం పెట్టడానికి ఆలోచించి వాళ్ళని రోడ్డు మీదకి గెంటేస్తే ఏమైపోతారు..*

               *నీ ఉన్నతికి అసలు కారణమైన అమ్మానాన్న పట్టెడు అన్నం కోసం అలమటిస్తుంటే ఎలా నిద్ర పడుతుంది. మీకు ఎలా తిండి వెళుతుంది లోపలికి.. మీరు క్లబ్బులు కి ఖర్చు పెట్టే డబ్బులు మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి ఖర్చు పెట్టండి. అమ్మానాన్న  ఆశీర్వదిస్తే మీరు ఇప్పుడున్న పొజిషన్ కంటే 100 రెట్లు పైకి వెళ్తారు..*

            *వాళ్లు మీతో విసిగిపోయి జీవితం పైన విరక్తితో ఈ జీవితం మాకు చాలు ఇంకా వద్దు, ఈ నరకంలో మేము బ్రతకలేము అనే స్థితికి వాళ్ళని తీసుకురాకండి ..మీరు వాళ్లతో ప్రేమ ఆప్యాయతగా ఉండడం మొదలు పెడితే అదే వాళ్ళకి మీరు ఇచ్చే కోట్ల విలువ అవుతుంది అని గుర్తు పెట్టుకోండి..*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment