Thursday, October 17, 2024

 *🍁 భాగ్య..🍁* 
🌻🌹🦚💎💜🌈

 *నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లి మంగ ఉన్న భాగ్యకు,  తల్లిదండ్రులు పదమూడేళ్ళ వయసులోనే పెళ్ళి చేసేసారు... పెళ్ళయిన ఆరునెలలకే నలభై ఏళ్ళ భర్త గుండెపోటుతో చనిపోతే, భాగ్య తిరిగి పుట్టింటికే చేరింది...* 

 *పదమూడన్నరేళ్ళకే, వైధవ్యంతో, కళ తప్పిన అభాగ్య జీవితం, సాగిస్తోంది భాగ్య...* 

 *తరువాతి పదిహేనేళ్ళకు నలుగురు తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళయ్యి తమకు అనుకూలంగా ఉన్న ఊళ్ళల్లో మేస్త్రీలుగా స్ధిరపడిపోయారు.. తల్లీతండ్రీ చనిపోయారు...* 

 *ఆడపిల్లలిద్దరూ బతుకుతెరువు కోసం పూలకొట్టుని నడుపుకుంటూ వేంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో బతుకుతున్నారు..* 

 *సింహాద్రికి మంగ అంటే చాలా ఇష్టం , మనం పెళ్ళి చేసుకుందాం మంగా అని సింహాద్రి చాలాసార్లు మంగని అడిగాడు, అసలే ఒంటరితనంతో బాధ పడుతున్న, అక్క భాగ్య, తనను మరీ ఒంటరిగా భావించుకుంటుందేమో అని,  మంగ పెళ్ళికి తొందరపడటం లేదు...* 

 *సింహాద్రి తండ్రి రంగయ్య, వడ్డీవ్యాపారి, రూపాయి లాభం గురించే ఎప్పుడూ ఆలోచనలు రంగయ్యకి...* 

 *ఆరోజు సాయంత్రం మంగ బంతిపూలను దబ్బనంసూది దారంతో దండలా మారుస్తోంది.. ఉన్నట్టుండి మంగను గట్టిగా తనవైపుకు లాగేసుకుంది భాగ్య... మంగ భుజాన్ని రాసుకుంటూ కిందకు జారిందిపదునైన కొడవలి ఒకటి...* 

 *మంగపై కొడవలితో దాడి చేస్తున్నాడు శరవణ...* 

 *చెల్లిమీదకి కొడవలి వేస్తున్న శరవణని చూసిన భాగ్య చటుక్కున చెల్లిని పక్కకి లాగేయటం, వెంటనే మంగ చేతిలోని దబ్బనంసూది తీస్కోవటం, శరవణ పొట్ట దగ్గర పొడిచెయ్యటం టకటకా చేసేసింది భాగ్య......* 

 *ఇంజక్షన్ కంటే కూడా కాస్త ఎక్కువే చురుక్కుమంటూ గుచ్చుకుంది దబ్బనం.. అబ్బా అంటూ పొట్ట పట్టుకున్నాడు శరవణ...* 

 *ఆ మాత్రం సమయంలోపలే,..* 

 *పక్కనే ఉన్న షాపులోని కొబ్బరికాయ ఒకటి అందుకుని శరవణ నెత్తి మీద పగలకొట్టేసింది భాగ్య... ఇంతలో చుట్టూ పదిమంది చేరుతుంటే శరవణ నొప్పి పుడుతున్న నెత్తిని పట్టుకుని ఒకటే పరుగు..* 

 *ఇద్దరూ ఆడవాళ్ళే... పైగా భాగ్య ఎప్పుడూ, దిగాలుగా తల వేలాడేసుకుని కూర్చునుంటుంది నీరసంగా.. మంగ కంట పడకుండా, వెనకాల నుండీ వెళ్ళి దాడి చేసేసి పారిపోవచ్చు అనుకున్నాడు శరవణ... అనూహ్యంగా భాగ్య, చెల్లెలి కోసం,  చురుకుగా స్పందించడంతో, శరవణకు వెన్నుచూపి పారిపోక తప్పలేదు....* 

 *డబ్బులోనూ జాతిలోనూ మంగ తమకు తగినది కాదని రంగయ్య పురమాయించాడు శరవణని,  మంగను ఖతమ్ చేసేయమని.. చెల్లి మీద భాగ్యకున్న అప్రమత్తత వల్లనేమో మరి, భాగ్య సమయానికి తగురీతిగా స్పందించి చెల్లిని కాపాడుకుంది..* 

 *సేకరణ* 

🦚🌹🌻💎💜🌈

No comments:

Post a Comment