Sunday, October 26, 2025

 [10/26, 09:17] +91 89857 42274: రహస్యమేమి లేదు
– డా. తుమ్మల దేవరావ్, నిర్మల్

రహస్యమేమి లేదు…
మన చుట్టూ తిరుగుతున్న ముఖాలు నీడలు మాత్రమే,
కాలం కర్రతో కొడితే పరాయి దారులు పట్టే వాయువులు.
అవకాశం అనే తక్కెడలో మనసులు తూలిపోతుంటే,
నిబద్ధత అనే పదం కేవలం ధ్వనిగా మిగిలిపోతుంది.
బతుకు జట్కా బండి 
దానిపై సగం నిజం, సగం మాయ!
ఒక క్షణం సానుభూతి, మరో క్షణం స్వార్థం,
అదే మనిషి అనిశ్చిత నాటకం.
నిన్నటి వరకు “నీ ప్రాణం నా శ్వాస” అన్నవారు
ఈరోజు నీ నీడను కూడా దాటిపోతాడు.
ప్రేమ ప్రమాణాలు సుగంధం లాంటి మాయ 
గాలి తాకితే తారుమారవుతాయి.
తోబుట్టువుల అనుబంధం కూడా కరువు కాలం బాటలో
లెక్కల పుస్తకమవుతుంది,
కాకి ఎంగిలి తిన్న మమతలు
వాటా చెల్లించుకుంటూ గాలిలో కలిసిపోతాయి.
రహస్యమేమి లేదు...
ఒకరి చూపులో మరొకరి దుఃఖాన్ని వెతికే ప్రయత్నం మాత్రమే.
మాటల ముసుగులో మౌనం దాగి ఉంటుంది,
ఆ మౌనం లోపలే కత్తులు పదును పెడతాయి.
ప్రేమ రసాయనం ఆవిరైపోయిన నేల మీద
జీవితం పంట ఎట్లా పుడుతుంది?
మనిషితనం కరిగిపోయిన ఈ క్షేత్రంలో
హృదయం ఒక నిర్జన కట్టడమే.
రహస్యమేమి లేదు...
నీ మనసు గుహలో నీవే రాసుకున్న నిషిద్ధ నీడలతో
నీవే యుద్ధం చేస్తూ,
నీవే ఓడిపోతూ ఉన్నావు.
రహస్యమేమి లేదు...
నిజం ఎప్పుడూ అద్దంలో కాదు,
అద్దం వెనుక ఉన్న చీకటిలో దాగి ఉంటుంది.
("బంకీ" జెన్ మాస్టర్ కి కృతజ్ఞతలు... నా జెన్ కవితలనుండి)
[10/26, 10:11] +91 94945 49969: వర్తమాన 
విషాదం ఇదే ఇదే

మనిషి
మనిషిగా మిగలక పోవడం

ముసుగులే
అసలైన ముఖాలుగా చలామణీ కావడం

ప్రేమైనా....
ద్వేషమే అయినా...
సూటిగా వ్యక్తీకరించకపోవడం 

సూటిగా...
స్పష్టంగా...
గాఢంగా ....
ఆవేదనా భరితంగా ...
ఉంది కవిత 

👏👏👏👏👏👏

No comments:

Post a Comment