*🌹🌹అరుణాచలం అనే పదానికి అర్థం🌹🌹*
*"అరుణాచలం'' అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారికి అనేక అర్ధాలు స్ఫురిస్తాయి. అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం. పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివ స్వరూపం. యోగులకు పరంజ్యోతి దానికి అతీతంకూడా జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి. భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ ఇలా ఎన్నొ ....*
*భగవాన్ శ్రీ రమణ మహర్షి వాక్కులకు వేరే ప్రమాణముల ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే.*
*ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది పూజయే. గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళు లోపున మరణించిన వారికి ముక్తి కలుగుతుంది. అంతే కాదు కమలాలయమును తిరువారూర్ నందు జన్మించినచో ముక్తి కాశీ క్షేత్రములో మరణించినచో ముక్తి.*
*అరుణాచలమును స్మరించిన మాత్రమున ముక్తి కలుగును. దీనిని బట్టి అరుణాచలం విశిష్టత తెలియవచ్చుచున్నది. తక్కిన గిరులన్నీ ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు కానీ అరుణాచలం మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే.*
*మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు.అందువల్ల ఈకొండ పరమశివుడే తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు.*
*ఓం నమః శివాయ*
*అరుణాచలశివ అరుణాచలశివ*
*అరుణాచలశివ* *అరుణాచలశివ*
*అరుణాచలశివ అరుణాచలశివ*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
No comments:
Post a Comment