🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(256వ రోజు):--
మరణం : (ఇతరులది) బంధు మిత్రులమరణం తగిన కారణంకాదు మరణం తర్వాత వారికి మీరు చేయ గలిగేదేమీ ఉండదు కనుక. ఈ విష యంలో చెయ్యాల్సిన ఏర్పాట్లకు ఇంకెందరో ఉండకపోరనే నమ్మకం మాకుంది. అందుచేత దయచేసి మీరు తరగతులకు హాజరైతే, చని పోయినవారి ఆత్మశాంతికి మన మందరమూ కలిసి ప్రార్థించవచ్చు. శరీరం శ్మశానవాటికకు చేరుతుంటే వెంబడించటంకంటే, మనం ప్రేమిం చేవారికి చేయదగిన మంచిసేవ ఇంకేదో ఉండకపోదు.
స్వమరణం : దీన్ని సరైన కారణం గా మేము అంగీకరిస్తాం. కాని, చెల్లిం చాల్సిన రుసుములన్నీ చెల్లించారో లేదో చూడటానికి, ఒక వారంరోజుల ముందైనా మాకు తెలియచేయాలి. అంతేకాక, బృందానికి నాయకులు గా ఉన్నవారు తాము చెయ్యాల్సిన పనులు చేయటానికి మరొకరికి తర్ఫీదునివ్వాలి కూడా.
విఘ్నాలు : తరగతి జరుగు తుండగా తరుచూ సౌచాలయానికి వెళ్లటాన్ని మేo గర్హిస్తాం. ఇకనుంచి సౌచాలయానికి వెళ్లాల్సినవారు తమ అక్షరక్రమంలో వెళ్ళాలి. ఉదా హరణకు, పేరు 'అ'తో మొదలైన వారు మొదటి 15 నిముషాల్లో వెళ్ళ వచ్చు. నిర్ణీతసమయంలో వెళ్లలేక పొతే, మళ్ళీ మీవంతు వచ్చేదాకా ఆగాల్సిందే.
ఈ నియమాలకు అంగీకరించి, శ్రద్ధగా చదివే మన సభ్యులందరకూ అవసరమైతే లిఖితరూపంలో అంద జేస్తే, ఇకమీదట హాజరుకాకపోవట మనేది ఉండదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
_*_
హాస్యంతో చెప్పినా, పఠనకేంద్రా ల లక్ష్యంపై దృష్టిసారించడానికి బదు లు చిన్నచిన్న విషయాలకే ప్రాము ఖ్యాన్నిచ్చి అలజడి చెందటం తమ తప్పిదమేనని పఠనబృందాల నాయకులందరూ గ్రహించారు. "మీరు బాగుపడితే వాళ్ళు కూడా బాగుపడతారు" అనికూడా స్వామీజీ వారికి గుర్తుచేశారు.
1970 చివరిభాగంలో తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి, దగ్గు మళ్ళీ తరుచూ రాసాగాయి. తను చెయ్యా ల్సిన పని త్వరగా ముగించి విశ్రమిం చాల్సిన సమయం ఆసన్నమైందని స్వామీజీకి తోచింది. పశ్చిమహిమా లయపర్వతాల్లోని కాంగ్రా లోయలో సిద్దబారి అనే ప్రదేశంలో ఆశ్రమానికి స్థలనిర్ణయం జరిగింది. స్వామీజీకి, ఇతర మిషన్ సభ్యులకూ ఇది విశ్రాంతనివాసంగా ఉంటుంది. ఆ ఆవరణలో సాందీపని సాధనాలయం వంటి ఆశ్రమ పాఠ శాల కూడా ఉంటుంది. అక్కడ బోధించే బాధ్యత పట్టభద్రులైన బ్రహ్మచారి వివేకచైతన్య స్వీకరిస్తారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment