Sunday, October 26, 2025

 [10/26, 15:31] +91 94910 37422: డా॥ బి.ఆర్. అంబేద్కర్ సూక్తులు

1. సింహాల్లా జీవించండి.

2. అహింసామార్గం అన్ని సమయాల్లోనూ న్యాయం కాదు.

3. లక్ష్యసాధన ప్రధానం. దానికోసం వివరి సహాయం పొందానన్నది కాదు.

4. ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులూ, బీహార్ అస్పృశ్యులకూ శాస్త్రరీత్యా చాలా దగ్గర పోలికలున్నాయి.

5. అస్పృశ్యులకు ప్రత్యేకంగా చూస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక నియోజక వర్గాలు కావాలి.

6. స్వాతంత్ర్యం వచ్చినా తక్కువ వర్ణాలవారు అగ్రవర్ణాల వారి చేతిలో కష్టాలు పడవలసి వస్తుంది తప్ప వారికి ఒరిగేది లేదు.

7. అస్పృశ్యులకు సమాజంలో అందరితో పాటు సమాన సాంఘిక న్యాయం ఉండాలి.

8. అంటరాని తనాన్ని రూపుమాపటమే నా జీవితలక్ష్యం (రాజ్యాంగం లో అంటరాని తనాన్ని నిషేధించినా నేటికీ అంటరానితనం పూర్తిగా మాసిపోలేదనేది వాస్తవం).

9. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే ఆ స్వతంత్య్ర ఫలాలు హిందూ, ముస్లింలతో పాటు దళితులకూ అందాలి.

10. మన పోరాటానికి మనలో మనము సహకరించుకోవాలి.

11. ఏ కులంలో పుడితే ఏమిటి? అందరూ సుఖంగా బ్రతకాలి.

12. నేను ఎప్పుడూ దళిత నాయకుడినే (ఇక్కడ అంబేద్కర్ యస్.పి. లకు నాయకుడుగా భావించే అవకాశం ఉంది. అది తప్పు ఎక్కడ పీడితులున్నారో వారికి న్యాయం జరిగేలా చూడడమే అంబేద్కర్ ఉద్దేశ్యం).

13. సంఘంలో తెలివి, ధనం, అధికారం ఉన్నవారికే మనుగడ.

14. మిలటరీలో చేరడం ద్వారా ఉన్నతస్థితినీ, అధికారాలనూ పొందవచ్చు.
[10/26, 15:31] +91 94910 37422: רפ

డా॥బి.ఆర్. అంబేడ్కర్ సూర్తులు

15. దళితులకు అధికారంలో భాగం ఇస్తే నేను కాంగ్రెస్లో స్వరాజ్యో ద్యమంలో జేరతా.

16. దళితుల కోసం, పేదల కోసం నా ఇంటితలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

17. ప్రతీదానికీ ప్రజలు ప్రభుత్వం పై ఆధారపడరాదు.

18. సొంతసామర్థ్యాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందు.

19. నీ హక్కులను న్యాయంగా సాధించుకో.

20. స్వరాజ్యం సరైన వ్యక్తుల చేతుల్లో ఉంచాల్సిన అవసరం ప్రజల పై ఉంది (ఓట్లను నోట్లకు అమ్ముకొంటున్నవారి శాతం వేడు అధికంగా ఉంది).

21. వ్యక్తి కంటే దేశం గొప్పది.

22. కాంగ్రెస్లోని వారేకాదు, బయటివారు కూడా గొప్ప దేశభక్తులు కావచ్చు.

23. కీర్తి ఎవరికి వచ్చినా ఫర్వాలేదు. దళితులకు న్యాయం జరిగితే చాలు.

24. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సరిహద్దు తగాదాలు వస్తాయి.

25. మంచిని ఎక్కడ నుండైనా స్వీకరించు.

26. భారత దేశంలోని ముస్లింలను పాకిస్థాన్కు పంపి, పాకిస్థాన్లోని హిందువులను ఇక్కడకు రప్పించాలి. (దేశ విభజన సమయంలో అంబేద్కర్ పై మాటలు చెప్పాడు. కానీ ఎవరూ వినలేద. ఫలితం, భయంకర జననష్టం. చేతులు కాలాయి. ఆకులు పట్టుకున్నా జననష్టాన్ని ఆపలేక పోయాము).

27. నేటి నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం 'కులవ్యవస్థ'.

28. భారత రాజకీయ వ్యవస్థ మెరుగు పడాలంటే అందుకు జిన్నా, గాంధీల ప్రమేయం ఎంతమాత్రం ఉండకూడదు.

29. ఒక కులాన్ని నిస్సహాయంగా చేసి సమాజం తన అవసరాలకు వాడుకుంటుంటే గాంధీ కాదనలేదు.

DR AMBEDKAR QUOTES

COLLECTION 
KONKI RAMESH 

+
[10/26, 15:31] +91 94910 37422: 27. పరులను ప్రేమించగలవారే మంచిపనులు చేయగలరు.

28. చేసిన దానం మరచిపోతేనే ఆ దానం నిజంగా చేసినట్లు.

29. ధర్మం కోసం దేవుడినైనా ఎదురించువాడే నిజమైన భక్తుడు.

30. పరుల క్షేమం కాంక్షించే వాళ్ళంతా సజీవులుగానే వుంటారు.

31. ధైర్యం, సంతృప్తి వున్నవారికి సంతోషం వెంటబడి మరీ వస్తుంది.

32. వాడని పాత్రకు చిలుము పట్టినట్లు, సోమరికి బుద్ధి మందగించుతుంది.

33. వినాలనే శ్రద్ధ వున్నవారికి మౌనం కూడా మాటలాగానే వుంటుంది.

34. కొంతమందికి మాట కటువుగా వున్నా, మనసు వెన్నలా వుంటుంది.

35. ఇంద్రియాలను అదుపులో పెట్టినవాడే ధర్మగురువు అనదగినవాడు.

36. దానంతో మనసు పవిత్రమవుతుంది- ప్రేమతో నిర్మలమవుతుంది.

37. ప్రేమించేవారు ఎవరూ లేకపోవటమే అన్నింటికంటే పెద్ద దరిద్రం.

38. మంచి లక్ష్యాలు లేనివారు చిన్న వైఫల్యాలకు కూడా విసుగెత్తి పోతారు.

39. సంపద లేకపోవటం లోపంకాదు-ప్రేమించేవారు లేకపోవటమే నిజమైన లోపం.

40. మర్రివిత్తనం చిన్నదైనా పెద్ద వృక్షంగా మారినట్లు - సద్భావన చిన్నదైనా అది మనసు మొత్తం ఆక్రమిస్తుంది.

41. ద్వేషం అనే అగ్నిలో కాలకుండా- రాగం అనే మురికిలో మునగకుండా వున్నవాడే ధర్మగురువు అనదగినవాడు.

42. ధార్మికుడు ఇచ్చే విషయంలో ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు-పుచ్చుకునే విషయంలో అవసరమైనదానికంటే తక్కువ తీసుకుంటాడు.

43. మంచి నడవడిక అనేది ఒకరు ఇస్తే లభించే కానుక కాదు-అది ఎవరికి వారు పాటించి సాధించవలసిన జీవన విధానం.

44. ఇతరుల్ని ద్వేషించే సమయమంతా వృధాగా గడచిపోతుంది- ప్రేమించే సమయమంతా సద్వినియోగమవుతుంది.

45. జరా వ్యాధి మరణాలు అర్థమైతే దుఃఖం వుండదు-దుఃఖించే వారికి అవి అర్ధం కాదు.

46. ధర్మాన్ని గ్రంథాల్లో నింపటం మాత్రమే కాదు- దానిని హృదయ గ్రంథులలో నింపాలి.

బౌద్ధ ధర్మామృతం సూక్తులు-సందేశాలు

39

No comments:

Post a Comment