Sunday, October 26, 2025

 యుగ యుగాలుగా పంచ భూతాల లో ఎలాంటి మార్పు లేదు, రాదు... యుగాలు మాత్రమే మారుతాయి, యుగ ధర్మాలు మాత్రమే మారుతాయి... సత్యం మాత్రం మారదు... బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఎంతో శ్రమించి అందరికీ సులభ మార్గంలో ద్యాన మార్గాన్ని అందించారు... ఎందరెందరో శిష్యులు ద్వారా విశ్వ వ్యాప్తంగా శ్వాస మీద ధ్యాస మార్గాన్ని ప్రచారాలు చేయించారు పండిత పామరులకు అర్ధం అయ్యేలా అధ్యాత్మిక గుట్టు రట్టు బట్ట బయలు చేసి...
     సులభమైన ధ్యాన మార్గాన్ని కొందరు మిడి మిడి జ్ఞానంతో వ్యక్తిగత ప్రచారాలు, వ్యక్తిగత వ్యాపారాలతో ముడి పెట్టి... కొత్త కొత్త సాధకులు పిరమిడ్ ధ్యాన మార్గంలో వెల్లువలా వస్తున్నారు ప్రతి చిన్న చిన్న గ్రామాలలో కూడా.. వారందరూ కొత్త మాయ ప్రచారాల మాయలో పడకుండా శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం మాత్రమే ధ్యాన సాధన మార్గం అని గుర్తించండి... సమయాన్ని సరైన సాధన కోసం మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వండి...
సాధన ద్వారా మాత్రమే నాడీ మండలం శుద్ధి.
సరైన సాధన ద్వారా మాత్రమే ఏడు చక్రాలు ఉత్తేజం.
సరైన సాధన ద్వారా మాత్రమే దివ్య శిక్షువు ఉత్తేజం
సరైన సాధన ద్వారా మాత్రమే జన్మ జన్మల చెడు కర్మలు దగ్దం.

No comments:

Post a Comment