Monday, October 27, 2025

 *_✨ శ్రీరమణమహర్షి ✨_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి వద్దకు ఎప్పుడూ వచ్చిపోయే ఒక భక్తుడు. మహర్షికి పరమ భక్తుడు. వారి బిడ్డకి 8 సంవత్సరాల వయసు. ఒకే ఒక్క బిడ్డ, చనిపోయాడు. ఆ తండ్రి ఎంతో దుఃఖంతో సకుటుంబంగా ఆశ్రమానికి వచ్చాడు._* 
    
*_విషయం తెలిసిన మహర్షి ఇలా సెలవిచ్చారు... సాధనాభ్యాసం అన్ని దుఃఖాలనూ ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పునూ, ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని శోకాల్లోనూ పుత్రశోకం అతి దుర్బరం అంటారు. తనకంటూ ఒక విశిష్టరూపం ఉన్నంత కాలం, దుఃఖము ఉంటుంది. రూప భావన దాటిననాడు తాను నిత్యుడనని (ఆత్మనని) తెలుస్తుంది._* 
  
*_పుట్టుట లేదు, గిట్టుట లేదు. పుట్టేది దేహము మాత్రమే, అది అహంకరణ కల్పించినది. కాని తనువు సాయంలేక అహంకరణ నిలబడదు. దానిని ఎపుడూ తనువు సమమనే వ్యవహరిస్తారు. కానీ తలపు ప్రధానం. వివరం తెలిసిన వాడెవడైనా నిద్రలో తన దేహము ఉందేమో చెప్పమను ! నిద్రలో తనువు_*
*_తోచకున్నా, అపుడు ఆత్మ లేకుండెనా ఏమి ? నిద్రలో తానెట్లున్నాడు ? లేచినపుడు ఎట్లున్నాడు ? ఈ రెంటిలో భేదమేమి ?_* 

*_మెలకువ అంటే అహంకారం లేవటమే. దాని తోడోనే తలపులూ లేస్తాయి. ఆ తలపులెవరికో, ఎచటనుండియో కనుక్కో ! చైతన్యమైన ఆత్మ నుండియే కలిగి యుండవలెను. దాన్ని అస్పష్టంగానైన తెలియగల్గితే అహంకార నాశనానికి కొంతకుకొంత సాయపడుతుంది. అప్పుడు అనంతమైన సత్ (ఉనికి) బోధపడ వీలవుతుంది. ఆ స్థితిలో సత్యం తప్ప, వ్యక్తులెవ్వరూ ఉండరు. అచట మృతి తలపూలేదు, ఏడవటమూ లేదు. పుట్టానని అనుకొన్నవాడు చనిపోతాననే భయాన్నెట్లు తప్పించుకుంటాడు ? తాను అసలు పుట్టెనా ? అడిగి చూడు. అపుడు వానికి బోధ పడుతుంది. 'ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. పుట్టిన దేహము, తలపులుగా తీరుతుంది; తలపులే సంకటాలన్నిటికీ మాలకారణము' అని. ఆ తలపుల మూలం కనిపెట్టు. అంతట నిక్కమైన ఆత్మయొక్క అంతరాంతరాల్లో సుప్రతిష్ఠితుడు అవుతాడు !!_*

*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment