Sunday, October 26, 2025

 పత్రీజి లక్ష్యం ఏమిటి, ఎందు కొరకు పత్రీజి బూమి మీదకు వచ్చారు
,,,,,,,,,,,
ప్రతి వ్యక్తి శాకాహరి కావాలి, ప్రతి జీవి రక్షించబడాలి, ప్రతి వ్యక్తి తను భూమి మీదకు ఎందుకు వచ్చారొ తెలుసుకోవాలి
, తెలుసుకోవాలి అంటే ఆత్మ‌ గురించి తెలుసుకోవాలి
ఆత్మజ్ణాని కావాలి
,,,,,,,,,,,,
ప్రతి జీవి రక్షించ బడాలి ,
అంటే ప్రతి వ్యక్తి ఆత్మజ్ణాని అయి ,ప్రతి జీవి తనలాంటిదే అని తెలుసుకుంటే నే కాని ఏ జీవికి హాని తలపెట్టలేరు

ఈ జ్ణాణ వల్ల ప్రతి మనిషి తను భూమి మీదకు వచ్చిన లక్ష్యం తెలుసుకుంటారు,
 జీవులు రక్షించ బడుతాయి

ఇవి పత్రీజి లక్ష్యాలు,
 అందుకు పత్రీజి గారు

 ఎన్నుకున్న మార్గాలు,,,,,,

 మొదటిది ;ప్రతి వ్యక్తికి స్వేచ్చ ను ఇవ్వడం,
స్వేచ్చును ఇస్తే స్వేచ్చ వస్తుంది

  రెండవది ;అతి సులువు అయినది, అందరు ఆచరించ దగ్గది 
అతిశక్తివంతమైనది,
సహజత్వాన్ని‌కలిగి వున్నది, గౌతమ బుద్దుని వద్ద‌  తను గత జన్మలొ ఆచరించిన 
శ్వాస మీద ధ్యాస  మనకు తెలియజేసారు

 మూడవది;సజ్జన సాంగత్యం ఇతరుల జ్ణానాన్ని పంచుకోవడం ( ఆదిశంకార్యుని వద్దనుండి తీసుకున్నారు)

 నాలొగవది ;స్వాద్యాయం ( ప్రపంచంలో ని మహానుబావులను గ్రంధ రూపకంలొ‌ పరిచయం  చేసారు
 అయిదొవది;
నేర్చుకున్నది ఇతరులకు చెప్పమన్నారు  
చెప్పడం ద్వారా జ్ణానము పెరుగుతుంది, పంచితే పెంచ బడుతుంది

ఈ అయిదు మార్గాల ద్వారా మాత్రమే  ఆత్మోన్నతి సాదిస్తాము అని పత్రీజి గారు తెలియజేసారు
,,,,,,,,,
వుచితంగా ధ్యానం బోధించడం
అన్న ప్రసాదం అందరికి సాత్వికమైన రుచి కల ఆహారం 
పెట్టడం
ముఖ్యంగా ఎలాంటి డబ్బు ప్రమేయం లేకుండా సేవ చేయడం
,ప్రకృతి లొ గడపడం, ట్రెక్కింగ్ లు ,పిరమిడ్ ద్వారా ఎక్కువ శక్తిని తీసుకోవడానికి  పిరమిడ్ లు నిర్మించడము, సామూహిక ధ్యానాలు చేయడం వలన సులువగా ఆత్మజ్ణాలు గా అవుతాము
జీవితం ఒక వైబోగం‌అన్నారు
,,,,,,,,,,,,,
,,ధ్యానం ద్వారా జ్ణాణము వస్తుంది
సమస్యలు ఎదుర్కొనే శక్తి వస్తుంది, సమస్యలు ఎదుర్కోవడం ద్వారా ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాము,
సమస్యలు వూరికెనే రావు సమస్యలు జ్ణాణము నేర్పడానికి వస్తాయి
ఇవి మనకు పత్రీజి గారు చెప్పింది

కాని మనము ఏమి చేస్తున్నాము, సమస్యలు తప్పించు కోవడానికి కర్మ విపాక ధ్యానం చేస్తున్నాము,

ఇన్నర్ చైల్డ్ కు వెలుతున్నామ

కూర్చొని నిద్రపోయే ధ్యానం కు వెలుతున్నాము

ఈ మద్యలొ  గ్రహాల నుండి వచ్చే ఎనర్జీ ని సరైన దిశకు మార్చడానికి 12--21 పోర్టల్ ధ్యానం చేసాము,
మల్లి కొత్తగా October 30 న అసెన్షన్ ధ్యాన మట, దాని వలన నాడిమండల శుద్ది చేసుకోవాలట
ఇలాంటి వి అన్ని మిడి మిడి జ్ణాణము కలిగిన వారు, పత్రీజి 
బోదనలను సరిగా అర్థం చేసు కోని వారు అమాయక ధ్యానులను తప్పు దోవ బట్టి స్తున్నారు
వీరిని ఒక విదంగా చెప్పాలి అంటి BLOCK T Shirts అంటారు
మన‌ మద్య లొ వుంటూనే ప్రక దారి పట్టిస్తుంటారు, ప్రక్క దారి పట్టిస్తున్నాము అని వారికి కూడా తెలియదు
వారు చెప్పేది పుస్తకాల లొ వుండవచ్చు, కాని‌ అది మన సబ్జెక్టు కాదు
ఆ పుస్తకాలు పత్రీజి మనకు అందించ వచ్చు, ఇటువంటి జ్ణాణము వుంది అని తెలియజెప్పడం కొరకే
Example : గత జన్మలు వున్నాయి అని తెలిసి వుంటే చాలు , నీ గత జన్మ నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు పత్రీజి
పత్రీజి గారు మనకు ఇంత సులువు అయున మార్గం చూపిస్తె ఈ మిడి మిడి జ్ణానులు సొసైటీ ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు
కాని ప్రక్షాళన జరుగుతున్నది
వీరు అందరు తరమరుగు అవుతారు
వీరకి ఒక చానల్ కూడా తోడు అయినది, 12-21 ను విపరీతంగా ప్రచారం చేసి క్రిస్టల్ వ్యాపారం చేసింది
,,,,,,,,,,,,,,
ఫప్రపంచ శాంతికి ధ్యాన యజ్ణం అని పత్రీజి నోటి వెంట ఎప్పుడూ వినలేదు నేను
ప్రపంచ శాంతికి ధ్యాన యజ్ణం అంటున్నాము

ఈ మద్యన ఎక్కువగా ప్రపంచ శాంతికి ధ్యాన యజ్ణం అనే స్లోగన్ ఎక్కువగా తిరపతి ధ్యాన యజ్ణం లొ విన్నాను , ప్రపంచ శాంతి అని‌ కమర్షియల్ చేసారు

ఇది వరకు కూడా విని వుండ వచ్చు నేను అంతగా వినలేదు
Pmc గైడ్ లైన్స్ లొ  piece world అని వుంది, కొన్ని సార్లు ఇతరులు ఏదైన ప్రతిపాదిస్తె పత్రీజి గారు వద్దు అనరు
నేను కూడా సీనియర్ మాద్టర్స్ ను అడిగాను పత్రీజి గారు ప్రపంచ శాంతి అని తన నోటి నుండి ఎప్పడు అయినా అన్నార అని
నిర్మల మేడమ్ గారు మొదట్లొ ధ్యాన యజ్ణాలు నిర్వహించింది వారే, నిర్మల మేడమ్ గారు ఏమన్నారంటే మేము ప్రపంచ శాంతి అనేది పెడితే బాగుంటుంది కదా అని అడిగితే పెట్టండి అన్నారట, అంతే కాని వారి నోటి వెంట ప్రపంచ శాంతి అనేది రాలేదు
ఎందుకు అంటె అది మన పని కాదు, ప్రపంచ ఎలా వుండాలొ అలా నె వుంటుంది కాబట్టి, 
పత్రీజి గారి ద్రుష్టి లొ ప్రపంచం శాంతి గానె వుంటుంది
Example: ధర్మరాజు, దుర్యోదనుని స్టోరి తీసుకోవచ్చు, ధర్మరాజు కు అంతసవ్యంగానె కనపడుతుంది, ధుర్యోధనుడు కి వేరే గా కనపడుతుంది
,,,,,,,,,,
ప్రపంచ శాంతి మన లక్ష్యం కాదు
ప్రపంచం ఎప్పుడూ శాంతి గానే వుంది
ఈ యుద్దాలు ఇవి అన్ని ఎప్పటికి ఉంటాయి, ఇవి ఎప్పుడూ ఆగవు,
భూమి తనను తాను సరి చేసు కోవడానికి ఉపద్రవాలు స్రుష్టించు కుంటుంది,

ప్రపంచాన్ని  నడిపించు కోవడానికి ఋషి‌మండలి వుంది, వారు ఆ  ప్రణాలిక ను వేసుకుంటారు,మనము అందులొ జోక్యం చేసుకొని 
మనము మన లక్షాన్ని పోగొట్టు కోవద్దు
ప్రపంచ అడ్మినిస్ట్రేషన్ లొ మనము జోక్యం చేసుకోవద్దు
,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,సంసారంలో నె  నిర్వాణం‌
ఆధ్యాత్మిక త లొ తొందర పనికి రాదు, 
నీవు పదవ తరగతి లొ వుంటే పదకొండో తరగతి గురించి మాత్రమే ఆలోచించు

ఏ నక్షత్ర మండలాల గురించి, వాటి నుండి వచ్చే ఎనర్జీ గురించి ఆలోచించకు
పచ్చి వారు అవుతారు అలా ఆలోచిస్తే
నిదానమే ప్రదానము అన్న సూత్రాన్ని పాటించండి
ఇదే ఆఖరు జన్మ కావాలని పిచ్చి ఆలోచన మానుకోండి
మీరు కోరుకుంటేనో, ప్రయత్నం చేస్తేనొ ఆఖరు జన్మ కాదు
,,,,,,,,,,
ధ్యాన మహా యాగం ఎందుకు అంటే ఇది ఒక పండగ అను కోండి, పండగకు కుటుంబ సభ్యుల ను ఎలా కలుస్తామొ అలా, 
ప్రపంచంలో ని ధ్యానులము అందరము కలుస్తాము
ఆధ్యాత్మిక  జ్ణాణము పంచుకుంటాము
కలసి బోజనము చేస్తాము
సంవత్సరంలో ఎన్నో ప్రొగ్రామ్ లు పెడుతున్నాము

ప్రపంచ ద్రుష్టి ని ఆకర్షించేది మాత్రం మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజి శక్తి స్తల్ 
ప్రపంచంలో ని ప్రతి ఒక్క ధ్యాని తప్పనిసరిగా కైలాసపురి రావలసినదే

కైలాస పురి డెవలప్మెంట్ లొ ప్రతి ఒక్క ధ్యాని భాగస్వామ్యం ఉండవలసినదే
కైలాస పురి డెవలప్మెంట్ లొ బాగం అయిన వారు పత్రీజి ఆశయం లొ బాగం పంచుకున్నట్లే
శక్తి స్తల్ పూర్తి అయన తరువాత ప్రతి చోట ప్రపంచంలో ఎక్కడైనా 
పిరమిడ్ సొసైటీ తల పెట్టిన పనులు త్వరగతిన  పూర్తి అవుతావి

,,,,అందుకే రెండు సంవత్సరాల లొ పత్రీజి శక్తి స్తల్ ను నిర్మించు కుందాము
,,,,,,,,,,,,,,,,
ధ్యాన మహా యాగం కు బందు మిత్రుల తొ కదలి రండి
ఈ సారి ధ్యాన మహా యాగం 
కడ్తాల్ ట్రస్ట్ ఆద్వర్యంలో కాకుండా pssm ఆద్వర్యంలో జరుగుతుంది కాబట్టి మన pssm ధ్యానుల అందరి బాద్యత
ఈ ఆర్టికల్ చదివిన తరువాత మీకు ఏమి నిర్ణయం తీసుకుంటారొ ఆ నిర్ణయం మీదనె కట్టుబడి వుండండి
నాకు తెలుసు ఈ ఆర్టికల్  ధ్యాన మహా యాగం వైపుకు తీసుకువస్తుంది అని

పత్రీజి వారి వద్ద నుండి నేర్చుకున్న జ్ణానాన్ని మీకు అందిస్తున్నాను
పత్రీజి గారి తొ 2003 నుండి ప్రయాణం చేస్తున్నాను
 
J Kishanreddy ,(  984933620

No comments:

Post a Comment