Friday, October 31, 2025

 *ఓ నారసింహా !*
 ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. 

బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. 

ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. 

నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది.

 అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది.

 ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.

పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు.

 *ఓ గరుడవాహనా !* మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు...!!

*భూషణవికాస !*
 *శ్రీ ధర్మపురనివాస !*

దుష్టసంహార ! 
నరసింహ ! 
దురితదూర !🙏💐

No comments:

Post a Comment