Monday, October 27, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(257వ రోజు):--
       అక్కడి తరగతులు ఆంగ్లంలో కాక, హిందీలో జరుగుతాయి. ముఖ్య పాఠ్యగ్రంథం రామాయణం. శ్రీరామునికి ఆదర్శవంతుడైన చక్ర వర్తిగా, తండ్రిగా, సోదరునిగా,భర్త గా హిమాలయప్రాంతపు ప్రజలలో చాలామంచి పేరుంది. ఇక్కడి వృద్ధు ల్లోనూ, యువకుల్లోనూ కూడా రామాయణ మహాకావ్యంలో చాలా భాగాలను కంఠస్థంచేసిన వారుండ టం ఈనాటికీ అరుదైన విషయం కాదు. ఈ పాఠశాలలో హిందీలో బోధించే అధ్యాపకులకు శిక్షణనిస్తా రు ; వారు బోధించబోయేది ఉత్తర భారతవాసులకు కనుక, ఆప్రాంతపు సంస్కృతి, సంప్రదాయాల అవగా హన కూడా పాఠ్యoశాలలో ఉంటుంది.
          1980లో యజ్ఞకార్యక్రమాలు నిర్వహించడానికి స్వామీజీ అమెరికా వెళ్లినపుడు, అక్కడి వైద్యులు ఆయన హృద్రోగానికి శస్త్రచికిత్స అవ సరమని నిర్ధారించారు. డెట్రాయిట్ నగరంలో ఆయనకు వైద్యపరీక్షలు జరిపిన చాలామంది భారతీయ వైద్యులు ఆయన రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉందనీ, గుండె కొట్టుకుంటున్న తీరు కూడా సరిగా లేదనీ కనుగొన్నారు. వాళ్ళ మాటల ను ఆయన నవ్విపారేసి, వాళ్ళపని వైద్యపరీక్షలు చేయటం, తనపని బోధించడం అనీ, వాళ్ళపని వాళ్ళు చేశారనీ, తనపని తను కొనసాగిస్తా ననీ చెప్పారు. చివరకు వారి బలవం తం వల్ల ఒక ఆసుపత్రికి వెళ్లి గుండె పరీక్ష చేయించుకున్నారు. గుండెకు రక్తాన్ని చేరవేసే 4 ముఖ్యమైన రక్త నాళాల్లోనూ 80% పైగా అడ్డంకు లున్నాయని ఆ పరీక్షలో తేలింది. ఉపన్యాసాలు తక్షణం నిలిపివేయా లన్నారు. మూడురోజులపాటు జరి పిన వైద్యపరీక్షల తర్వాత టెక్సాస్ లోని హ్యూస్టన్ వైద్యకేంద్రంలో డాక్టర్ డెంటన్ కూలే 1980 ఆగస్టు 26 న రక్తాన్ని వేరే నాళాలద్వారా గుండెకు చేరవేసే బైపాస్ శస్త్రచికిత్స చేశారు. 
         హూస్టన్, డెట్రాయిట్ ఆసుపత్రు లలో రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నతర్వాత, ఒకరోజు  ఆయన చొక్కాచేతులు మడిచి అర చేతులు రుద్దుకుంటూ ప్రకటించారు: "సరే, ఇంకా నాకు పదేళ్ల ఆయుష్షు వుంది ; ఏం చెయ్యగలనో చూద్దాం" అంటూ. 24 గంటల తర్వాత ఆయన భారతదేశానికి బయలుదేరారు, 1981 లో చెయ్యాల్సిన పనులపట్టీతో సహా. బొంబాయి చేరగానే చిన్మయ మిషన్ పరిపాలక మండలి సభ్యుల తో సమావేశమై, పట్టణాలలోని మిషన్ కేంద్రాలన్నిటికీ స్వతంత్రప్రతి పత్తి నీయాలని ప్రతిపాదించారు. బొంబాయిలో కొందరు బ్రహ్మచారు లు 2 1/2 ఏళ్లపాటు జరిగిన పాఠ్య కార్యక్రమాన్ని పూర్తిచేయబోతున్నారు అప్పటివరకూ బ్రహ్మచారులందరూ సాందీపని కేంద్రకార్యాలయపు అధీ నత లోనే పనిచేస్తూ కార్యక్రమాలను సమన్వయపరచడం, జమాఖర్చు లను వ్రాయడం, ఏవైనా సమస్య లుంటే పరిష్కరించడం చేసేవారు. ఇకమీదట మిషన్ కేంద్రాలకు పూర్తి స్వాతంత్య్రం ఉంటుంది. వారివారి ప్రాంతాల అవసరాలనుబట్టి ఏ కార్య క్రమాలను చేపట్టాలో వారే తేల్చుకో వాలి ; వాటిని నిర్వహించే బాధ్యత ను కూడా వారే స్వతంత్రంగా చేపట్టా లి. బ్రహ్మచారులకు కూడా పూర్తి స్వాతంత్య్రం ఉంటుందని దీనివల్ల ఎవరైనా భావించవచ్చు. కాని, దీనికి విరుద్ధంగా, మిషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న గృహస్థుల అధీనంలో బ్రహ్మచారులు పనిచేస్తారు. ఇది గృహస్థులకు ఒకపెద్ద అవకాశమూ, సవాలూ కూడా. ఒక ఆధ్యాత్మిక సంస్థను బహుప్రయోజనకారిగా నిర్వహించడానికి అవసరమైన విశాలదృష్టి వారికి ఉంటుందా ?
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment