ESSENCE vs EXISTENCE : Sartre Existentialism / Philosophy explained in telugu
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8R8ZPkTpH0w
Transcript:
(00:02) వరల్డ్ వార్ 2 జరిగింది. యూరోప్ మొత్తం రక్తం ఏరులే పారింది. ఆ మారణ హోమాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఆ నిందని రాజకీయ నాయకులపై బడా బాబులపై వేశారు. బట్ ఒకే ఒక్కడు మాత్రం ఆ హోలోకాస్ట్ కి సోల్జర్స్ ని కూడా బాధితులని చేశాడు. అతనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ జీన్ పాల్ శాస్త్రి యుద్ధం ముగిసిన తర్వాత యూరోప్ లో ఒక విచిత్రమైన నిశబ్దం వచ్చింది.
(00:32) అది శాంతి కాదు అది ఒక ప్రశ్న కోట్లాది మంది చనిపోయారు కానీ విచిత్రం ఏంటంటే చంపిన వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు భార్యా పిల్లల మధ్య కూర్చున్నారు కానీ వాళ్ళ చేతులు రక్తాన్ని మర్చిపోలేకపోయాయి. బట్ ఆ టైంలో కామన్ గా ఒక వాక్యం వినిపించింది. ఇందులో మా తప్పేమ లేదు మేము జస్ట్ ఆర్డర్స్ ఫాలో అయ్యాం మేము కావాలని చంపలేదు అది మా స్వభావం కాదన్నారు.
(00:58) ఈ మాటలు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇది బాధ్యతను బయటికి నెట్టేస్తుంది. నేను కాదు పరిస్థితులు చేశయి నేను కాదు ఆదేశాలు చేశాయి. ఈ మాటలు బాధ్యత నుండి తప్పించుకోవడం లాంటిది. ఈ మాటలు విన్న జీన్ పాల్ శాస్త్రికి బాధేసింది. ఎందుకంటే ఈ మాటలు తప్పు చేసి తప్పించుకోవడం అందుకే అతను అందరికీ అర్థమయ్యేలా ఒక నైఫ్ ఎనాలజీ ఇచ్చాడు.
(01:26) ఒక కత్తిని చేతిలోకి తీసుకో దాన్ని చూడు అది చాలా కూల్ గా ఉంటుంది. ఐరన్ తో తయారు చేయబడి ఉంటుంది. పదునుగా ఉంటుంది. బట్ దానికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అదే కోయడం అందిన వరకు కోయడం ఆ కోసే ఉద్దేశమే దాన్ని కత్తిగా చేసింది లేకుంటే అదిఒక మామూలు మెట్ల అయ్యేది. ఇప్పుడు కత్తిని తయారు చేసిన కమ్మరి దగ్గరకు వద్దాం. అతని చేతిలో ఐరన్ ఉన్నప్పుడు ఆ ఐరన్ ని ఇంకా గాయం చేయకముందు కత్తిగా మార్చక ముందు ఆ కమ్మరి మనసులో ఒక ఆలోచన ఉంది.
(02:01) ఆ ఆలోచన కొయ్యాలి అనే ఆలోచన ఆ కొయ్యాలి అనే ఆలోచన ముందు పుట్టి తర్వాత కత్తి పుడుతుంది. అంటే ఇక్కడ ఒక కత్తి పుట్టడాని కంటే ముందే దాని స్వభావం ఏంటో ముందే నిర్ణయించబడింది. దట్ మీన్స్ కత్తి యొక్క స్వభావం దాని ఉనికి కంటే ముందే ఉంది. ఇప్పుడు శాస్త్రి అడిగిన ప్రశ్న ఏంటంటే మనిషి కూడా ఒక కత్తిలాగా పుట్టాడా మనిషి కత్తి ఒకటేనా మనిషి పుట్టడాని కంటే ముందే మరొక మనిషిని చంపాలి అనే స్వభావంతో పుట్టాడా 100% కాదు ఎందుకంటే మనిషి కత్తి ఎప్పటికీ ఒకటి కాదు కత్తి తనంతట తనకి కోసే స్వభావం ఉండదు అది ఎవరో ఇచ్చిన స్వభావం ఎవరో చేసిన పని కానీ మనిషి అలా కాదు అతను ముందే డిజైన్ అయి రాలేదు అతను ముందుగా
(02:47) ఉన్నాడు అంటే ముందు ఎగ్జిస్టెన్స్ అయ్యి తర్వాత మాత్రమే తనను తాను ఎసెన్స్ గా మార్చుకుంటాడు. ఇక్కడ మీకు ఇంకో ఫిలాసఫీ చెప్పాలి ఎందుకంటే శాస్త్రి అర్థం కావాలంటే అతను ఎవరిపై తిరగబడ్డాడో అర్థమైతేనే అతను ఏం చెప్పాడో పూర్తిగా అర్థంవుతుంది. చాలా ఏళ్ల క్రితం అరిస్టాటిల్ ఏమన్నాడంటే ప్రతి వస్తువుకి ప్రతి జీవికి ఒక టెలాస్ ఉంటుంది.
(03:14) అంటే ఒక అల్టిమేట్ లక్ష్యం ఒక స్వభావం ఒక పర్పస్ ఉంటుంది. ఒక విత్తనం తన స్వభావాన్ని బట్టి చెట్ట అవుతుంది. కళ్ళు తమ స్వభావాన్ని బట్టి చూస్తాయి. సేమ్ మనిషి కూడా తన స్వభావాన్ని బట్టి ఒక రేషనల్ అనిమల్ హేతుబద్ధమైన జంతువు నేచర్ లో ప్రతిదీ ఇప్పటికే నిర్ణయించబడి ఉంది. సో మనం చేయాల్సింది ఒక్కటే ఆ స్వభావాన్ని పూర్తిగా వ్యక్తపరచడం సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఏమవ్వాలో ఆల్రెడీ నిర్ణయించబడి ఉందని అరిస్టాటిల్ అంటాడు.
(03:51) కానీ శాస్త్రే అదేం కాదు ఏది నిర్ణయించబడలేదు నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వు నిర్ణయించబడే కత్తి కాదు నువ్వు ఏమవ్వాలో నిర్ణయించుకోవాల్సిన మనిషివి నిన్ను ఎవ్వరూ కత్తిలా ఒక పర్పస్ కోసం తయారు చేయరు నువ్వు ఏమవ్వాలో నిర్ణయించుకొని ఎంపిక చేసుకునే శక్తి పూర్తిగా నీకే ఉంది అంటాడు. కానీ ఇక్కడ సోల్జర్స్ ఒక ప్రశ్న అడిగారు. నేను ఆర్డర్స్ ఫాలో కాకపోతే పై అధికారులు నన్ను చంపుతారు లేదా నా శత్రువే నన్ను చంపుతాడు.
(04:18) సో ఇక్కడ నాకు ఎంపిక లేదు జస్ట్ ఆర్డర్స్ ఫాలో అయ్యాను అంతే బట్ చంపే స్వభావం నాది కాదన్నారు. ఈ మాటలు వినగానే చాలా లాజికల్ గా అనిపిస్తుంది. కానీ శాస్త్రి ఇక్కడే ఒక కత్తి లాంటి ప్రశ్న వేస్తాడు. మీకు చంపే అవకాశం బదులు చనిపోయే అవకాశం లేదా అన్నాడు. ఖచ్చితంగా ఉంది. చనిపోవడం అనేది ఒక ఆప్షన్ గా అక్కడ ఉంది.
(04:43) ఇంకా చెప్పాలంటే చావు భయంతో చంపి నాకు ఎంపిక లేదు అనడం నీ ఎంపికను ఆడ్రెస్ వెనక దాచి పెట్టడం లాంటిది. ఎందుకంటే నా ప్రాణం కాపాడుకోవడానికి నా శత్రువుని చంపాలి అనుకోవడం ఒక స్పష్టమైన ఎంపిక. ఇది కొంచెం గందరగోళంగా ఉండొచ్చు ఇప్పుడు ఇంకా క్లియర్ గా స్పష్టంగా చెప్తాను. ఒక వారిలో ఉన్న సైనికుడికి ఆ టైంలో ఉన్న ఆప్షన్స్ ఏంటి చంపొచ్చు చంపడాన్ని తిరస్కరించవచ్చు పారిపోవచ్చు లొంగిపోవచ్చు లేదా చనిపోవచ్చు ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ తో కూడిన ఆప్షన్స్ కానీ ఆప్షన్స్ లేవు అనడం ఒక స్పష్టమైన మోసం ఇక్కడ శాస్త్రీయ సైనికుడిని క్రూరంగా జడ్జ్ చేస్తున్నాడా 100% కాదు ఎందుకంటే శాస్త్రే కోరుకునేది
(05:30) ఒక్కటే సైనికుడు ఎంపిక లేదుని అని చెప్పొద్దు. చూస్ చేసుకోలేకపోవడానికి నువ్వు తయారు చేసిన గతి కాదు నువ్వు ఒక ఎంపిక చేసుకునే మనిషివి. సో శాస్త్రీయ సైనికుడి నుండి ఏం ఆశిస్తున్నాడు? ఒక సైనికుడు ఏం చెప్పాలంటే నేను చనిపోవడానికి భయపడి నేను నా శత్రువుని చంపాను. ఇది పూర్తిగా నా నిర్ణయం దీనికి నేనే బాధ్యున్ని ఇది చాలా కష్టమైన మాట కానీ ఇది నిజాయితి బట్ ఆడ్రస్ వల్ల చంపాను అనడం నిజాయితి కాదు అది పిరికితనం ఇంకా చెప్పాలంటే మోరల్ పిరికితనం ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం ఇక్కడ సైనికుడు తప్పా ఒప్పా శాస్త్రీయ తప్పుల కంటే నీకు బాధ్యత
(06:12) ఉందా లేదా అనేది ముఖ్యం అన్నాడు. చంపడం తప్పా ఉప్పా అనేది పర్టికులర్ కాంటెక్స్ట్ వార్ ఎథిక్స్ జస్ట్ వార్ థియరీలోకి వస్తుంది. కానీ నాకు ఎంపిక లేదు అనడం మాత్రం ఎప్పుడు ఎవరికీ ఏ సిచువేషన్ లోనూ నిజం కాదన్నాడు. ఇప్పుడు ఈ ఫిలాసఫీని నీ లైఫ్ కి అప్లై చేసుకో నీకు నిజంగా ఎంపిక లేదా
No comments:
Post a Comment