The Psychology of People Who Love Staying at Home #Psychology #Introvert#viral
Author Name:Margadarshi Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarshiTelugu-26
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h61PkuwWZ-4
Transcript:
(00:05) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ వీకెండ్ రాగానే అందరూ పార్టీలు పబ్బులన్నీ తిరుగుతుంటే మనమేమో హాయిగా దుప్పటి ముసుగు తన్ని ఒక వెబ్ సిరీస్ చూడటానికో లేక బుక్ చదవడానికో ఇష్టపడతాం. అప్పుడప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తే లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటాం కదా జనాలు మనల్ని చూసి ఇంట్లోనే ఉంటాడు. వీడికి లోకం తెలియదు అంటారు.
(00:30) కానీ నిజానికి ఇంట్లోనే గడపడానికి ఇష్టపడే వారి వెనుక ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది. అదేంటో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్రోవర్ట్స్ అని కానీ అది నిజం కాదు. ఇది కేవలం ఎనర్జీ మేనేజ్మెంట్ కొంతమందికి జనం మధ్య ఉంటే ఎనర్జీ వస్తుంది. కానీ మరి కొంతమందికి జనం మధ్య ఉంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది.
(00:56) మనలాంటి వాళ్ళకి ఒక గంట పార్టీలో ఉండటం అంటే ఫోన్ బ్యాటరీ 100% నుంచి 1% కి పడిపోయినట్టు. అందుకే మనం మన ఇంటికి వచ్చి ఆ బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం. మన ఇల్లే మనకి ఒక ఛార్జింగ్ స్టేషన్ లాంటిది. ఇక బయట ప్రపంచం ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు. ట్రాఫిక్ గోల నచ్చని మ్యూజిక్ అవసరం లేని కబుర్లు ఇవన్నీ మన మైండ్ ని డిస్టర్బ్ చేస్తాయి.
(01:24) కానీ అదే మన ఇంట్లో లైటింగ్ ఎంత ఉండాలి మ్యూజిక్ ఏం ప్లే అవ్వాలి ఏ కాఫీ తాగాలి ఎలాంటి తిండి తినాలి అన్నీ మన ఇష్టం. ఈ కంట్రోల్ అనేది ఒక లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనమే డిజైన్ చేసుకుంటాం. దీన్నే సైకాలజీలో లాస్ట్ టిములేషన్ ప్రిఫరెన్స్ అంటారు. అంటే ప్రశాంతతలో ఎక్కువ ఆనందాన్ని వెతుక్కోవడం అని అర్థం. ఇక మీరు గమనించారో లేదో ప్రపంచంలో గొప్ప గొప్ప ఐడియాస్ అన్నీ ఒంటరిగా ఉన్నప్పుడే పుట్టాయి. లోకం మొత్తం ఫోమోతో బతుకుతుంది.
(01:55) ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఎక్కడో ఏదో జరుగుతోంది. మనం దాన్ని మిస్ అయిపోతున్నామ అన్న టెన్షన్ కానీ హోమ్ బాడీస్ కి ఉండేది జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే బయట ఏం జరిగినా పర్లేదు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను కదా అన్న తృప్తి. ఈ ప్రశాంతతే మనలో క్రియేటివిటీని పెంచుతుంది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం మనం ఒక చిన్న చెక్ చేసుకోవాలి.
(02:24) మనం ప్రశాంతత కోసం ఇంట్లో ఉంటున్నామా లేక బయటికి వెళ్ళాలంటే భయమేసి ఇంట్లో దాక్కుంటున్నామా ప్రశాంతత కోసం ఉంటే అది మీ బలం అవుతుంది. కానీ భయం వల్ల ఉంటే అది మీరు మార్చుకోవాల్సిన బలహీనత అవుతుంది. ఇల్లనేది మీకుొక హాయినిచ్చే చోటు అవ్వాలి తప్ప మిమ్మల్ని బంధించే జైలు కాకూడదు. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ మీరు పార్టీలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మీరు వెనుకబడిపోవడం లేదు.
(02:49) మీరు కేవలం గోలకంటే లోతును ప్రేమిస్తున్నారు. రంగుల ప్రపంచం కంటే ప్రశాంతమైన మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉంటే అదే మీ అసలైన సక్సెస్. మీరు కూడా నాలాగా హోమ్ బాడీనా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ పోడ్కాస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ది లిజనింగ్ గాయ్స్.
(03:10) మరో ఇంట్రెస్టింగ్ వీడియో తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.
No comments:
Post a Comment