30 సంవత్సరాల తర్వాత? || ఆచార్య ప్రశాంత్
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SuN0eOHctY0
Transcript:
(00:01) 2026 లో ఈ భూమి తగలబడుతుంటే మీరేం చేస్తున్నారు 10 20 30 ఏళ్ల తర్వాత చరిత్ర మిమ్మల్ని చాలా కఠినంగా చాలా కోపంతో ఈ ప్రశ్న అడుగుతుంది. 2026 లో భూమి రగులుతుంటే మీరేం చేస్తున్నారు అని అప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు కనీసం తలెత్తుకొని సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు మిగలదు. నిజం చెప్పాలంటే నాకు మనుషుల మీద కూడా అంత జాలి కలగడం లేదు.
(00:29) ఈ మూగ జీవాల్లో చూడండి పాపం వాటి దగ్గర వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. మీరు ఉష్ణోగ్రత పెంచుతున్నారు అకాల వర్షాలు తెస్తున్నారు కానీ వాటి దగ్గర కనీసం బట్టలు కూడా లేవు. మీకు తెలుసా ప్రతి 0.1 డిగ్రీ సెల్సియస్ పెంపుకి వేలాది పశుపక్షాదుల జాతులు అంతరించిపోతాయి. మీరు మీ ఇళ్లలో హాయిగా కూర్చున్నారు కాబట్టి మీకు తెలియదు.
(00:50) కానీ వాటి జీవావరణం సర్వనాశనం అయిపోయింది. కేవలం 0.1డిగ్రీ 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే చాలు వేలాది జాతులు అదనంగా అంతమైపోతాయి. వాటిని చంపడానికి మీరు వచ్చి నేరుగా కొట్టాల్సిన అవసరం లేదు. మీరు వాటి ఇల్లు లాగేసుకున్నారు అవి చచ్చిపోయాయి అంతే అవి ఎక్కడ ఉంటాయి అవి అంతమైపోయాయి. మీకు తెలియడం లేదు ఎందుకంటే మీరు మీ ఇళ్లలో భద్రంగా ఉన్నారు.
(01:10) అడవుల్లో భార్య ఎత్తల వినాశం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతోంది అది మీ విలాసాల కోసం మీ అవసరాల కోసమే జరుగుతోంది. ఊరికే జరగడం లేదు మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు అడవుల్ని నరికితేనే వచ్చింది. ఎక్కడైనా ప్రకృతి విపత్తు వస్తే సరే మనుషులను కాపాడటానికి ఆర్మీ వెళ్తుంది. రక్షణ దలాలు వెళ్తాయి హెలికాప్టర్లు వెళ్తాయి కానీ అడవుల్లో ఆ మూగజీవాలను కాపాడటానికి ఎవరు వెళ్తారు? అడవుల్లో కోట్లాది ప్రాణాలు అంతమైపోయాయి కేవలం మనిషి చేసిన తప్పుల వల్ల
No comments:
Post a Comment