Wednesday, April 29, 2026

జీవితాన్ని మార్చే సూత్రాలు | Life Changing Spiritual Tips | Satyagrahi

జీవితాన్ని మార్చే సూత్రాలు | Life Changing Spiritual Tips | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RLZHwFStMqg



Transcript:
(00:02) ప్రతిరోజు ఉదయం లేవగానే మీ మనసులో మొదట మిదిలే ఆలోచన ఏంటి? రేపటి గురించి భయమా నిన్నటి గురించి కోపమా లేక పక్కనఉన్న వారిపై ఏదో తెలియని అసూయ ఒకసారి గమనించండి మనమందరం ఒక వింతైన యుద్ధంలో బతుకుతున్నాం. ఆ యుద్ధం బయట ప్రపంచంతో కాదు మన లోపల ఉన్న ద్వేషంతో అసంతృప్తితో ఈ రోజుల్లో మనుషుల మధ్య దూరం పెరిగిపోవడానికి కారణం టెక్నాలజీ అని చెప్పేసి అందర అంటారు కానీ నిజానికి అది మనందరి మనసుల్లో పేరుకుపోయిన స్వార్థం. మనం అందరినీ అనుమానిస్తాం.
(00:32) ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వీరి వల్ల నాకేం లాభం అని ఆలోచిస్తున్నాను తప్ప నేను వీరికి ఏమి ఇవ్వగలను అని అనుకోవడం లేదు. ఫలితంగా మన చుట్టూ వందల మంది ఉన్నా మనం ఒంటరి వాళ్ళమే లోపల ఏదో తెలియని బాధ ఏదో శూన్యం ఎదుటి మనిషిని ప్రేమిస్తున్నాం అని చెప్తాం కానీ అక్కడ కూడా మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి.
(00:54) ఆ కండిషన్ కొంచెం అటు ఇటు అయినా ఆ ప్రేమ కోపంగా మారిపోతుంది. ఈ కోపం ఈ ద్వేషం మనల్ని మనం ఒక చీకటి గదిలో బంధించుకున్నట్లు చేస్తున్నాయి. మీకు అనిపించడం లేదా లోపల ఎక్కడో ఆ ప్రశాంతత మిస్ అవుతుందని ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా మనం ప్రేమని ఒక వ్యాపారంగా మార్చేసాం. నేను మీకు ఇది చేశాను కాబట్టి మీరు నాకు అది చేయాలి అని లెక్కల్లో మునిగిపోయాం.
(01:18) నిమ్ కరోలి బాబా ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనుషుల మధ్య విభజన అనేది మన అహంకారం నుంచి పుడుతుంది అని మనం ఎప్పుడైతే నేను వేరు మీరు వేరు అని అనుకుంటామో అప్పుడే ద్వేషం మొదలవుతుంది. ద్వేషం అనేది ఒక విషయం లాంటిది. అది ఎదుటి వారిని చంపదు కానీ మిమ్మల్ని లోపల నుంచి నెమ్మదిగా నాశనం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని మీ ఆలోచన శక్తిని మీ ఎదుగుదలని అది తినేస్తుంది.
(01:42) మనం హనుమంతుడిని ఆరాధిస్తాం. ఆయన బలాన్ని కోరుకుంటాం కానీ ఆయన బలమంతా ఎక్కడుందో తెలుసా ఆయన హృదయంలో ఉన్న నిస్వార్థమైన ప్రేమలో ఉంది. మనం ఆ ప్రేమను పక్కన పెట్టి కేవలం భౌతికమైన విషయాల వెంటే పరిగెడుతున్నాం. అందుకే చిన్న విషయానికి కోపం రావడం మనుషులను దూరం చేసుకోవడం మనకి అలవాటయపోయింది. ఈ సమాజం మనకి నీ గురించి నువ్వు ఆలోచించుకో అని నేర్పించింది.
(02:07) కానీ అది మనల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేసింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? నీమ కరోలి బాబా జీవితం మనకి ఒకటే పాఠం నేర్పుతుంది. అందరినీ ప్రేమించండి అందరికీ ఆహారం పెట్టండి భగవంతుని స్మరించండి. ఇది వినటానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కానీ ఆచరణలో అతి పెద్ద ఆధ్యాత్మిక సాధన. హనుమంతుని కృప మీకు కలగాలంటే మీరు చేయాల్సింది మంత్రాలు చదవడం మాత్రమే కాదు ఆయనలా సేవ చేయడం నేర్చుకోవాలి.
(02:35) శరతులు లేని ప్రేమని ప్రాక్టీస్ చేయండి. అంటే ఎదుటివారు మీకు తిరిగి ఏమి ఇవ్వకపోయినా వారిని గౌరవించండి. వారి పట్ల దయతో ఉండండి. ఎవరైనా మిమ్మల్ని నొప్పించినా వారిని క్షమించేంత పెద్ద మనసు అలవర్చుకోండి. ఎందుకంటే క్షమించడం అనేది బలహీనత కాదు. అది అత్యున్నతమైన బలం. మీరు ఎప్పుడైతే ద్వేషాన్ని వదిలేసి ప్రేమని ఆయుధంగా చేసుకుంటారో అప్పుడు మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది.
(03:02) మీకు తెలియకుండానే మీ సమస్యలు చిన్నవిగా అనిపించడం మొదలవుతాయి. ఎందుకంటే ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. భయం లేని చోట విజయం దానంతట అదే వస్తుంది. నిజమైన మార్పు అనేది మాటల్లో ఉండదు. అది చేతల్లో ఉండాలి. ఈరోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. రోజుకి ఒక్కరికైనా కేవలం ఒకే ఒక్కరికైనా నిస్వార్థంగా సహాయం చేయండి.
(03:26) అది డబ్బుతో కూడుకున్నది కానక్కర్లేదు. ఒక చిన్న మంచి మాట ఒక చిరునవ్వు లేదా కష్టాల్లో ఉన్నవారికి నేను ఉన్నాను అనే భరోసా అది చాలు. మీరు ఎప్పుడైతే ఎదుటి మనిషిలో పరమాత్మను చూడటం మొదలు పెడతారో అప్పుడు మీకు ఏ మనిషి శత్రువులా కనిపించరు. హనుమంతుల వారు రాముడిని తన హృదయంలో ఎలా ప్రతిష్టించుకున్నారో మీరు కూడా ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని చూడండి.
(03:49) ద్వేషం మిమ్మల్ని బంధిస్తుంది. ప్రేమ మిమ్మల్ని విముక్తి చేస్తుంది. జీవితం చాలా చిన్నది. దాన్ని కోపంతో పగతో వృధా చేసుకోకండి. మీరు ఈ ప్రపంచానికి ఏమఇస్తారో అదే మీకు తిరిగివస్తుంది. మీరు ప్రేమను పెంచితే అద్భుతాలు మీ తలుపు తడతాయి. ఆ అద్భుతం మరెక్కడో లేదు. మీలో ఉన్న మార్పులోనే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి.

No comments:

Post a Comment