Wednesday, April 29, 2026

 🍃💠 నా భార్య పొందిన సంతృప్తి వెలకట్టలేనిది.!
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..

🔹 నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి?
ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్లు, కార్పొరేట్ హోదాలు… ఇదే కదా అందరి లెక్క!
కానీ ఈ లెక్కలన్నింటికీ అతీతంగా — ఆత్మసంతృప్తినే నిజమైన విజయం అని చాటిన ఒక మహిళ కథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది — ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ (జన్మస్థలం: శ్రీనగర్, శ్రీనగర్ జిల్లా, జమ్మూ & కాశ్మీర్).
ఆయన లింక్డిన్‌లో పంచుకున్న అనుభవం అందరినీ ఆలోచింపజేస్తోంది.

🔸 భార్య రుచి వారికూ – భిన్న దృక్పథానికి ఉదాహరణ

రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచే ఒక మూసలో ఆలోచించలేదు.
19 ఏళ్ల వయస్సులోనే తన జీవిత లక్ష్యాలపై స్పష్టత కలిగిన ఆమె, కాలేజీ పూర్తయ్యాక ఒక మ్యాగజైన్‌లో పని ప్రారంభించింది. ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్లో ఉద్యోగం సాధించి, 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేసింది..

ఈ కాలంలో ఆమె
➡️ వార్షికంగా సుమారు రూ.20 లక్షల ఆదాయం
➡️ కెరీర్‌లో అత్యున్నత స్థాయి
➡️ స్థిరమైన గుర్తింపు
అన్నీ సాధించింది..

🔸 జీవితానికి కొత్త అర్థం

మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకుంది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ —
తన కుమారుడి పెంపకం కోసం స్వచ్ఛందంగా ఉద్యోగానికి విరామం తీసుకుంది..

🔸నాలుగు సంవత్సరాల పాటు పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించిన ఆమె, తిరిగి పని చేయాలనుకున్నప్పుడు మళ్లీ కార్పొరేట్ ప్రపంచాన్ని ఎంచుకోలేదు.

🔸 రూ.20 లక్షల నుంచి రూ.20 వేల దారి

2014లో రుచి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసింది.
సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి
➡️ నెలకు కేవలం రూ.20 వేల ఆదాయం మాత్రమే.

కానీ —
ఆమె ముఖంలో కనిపించిన ప్రశాంతత, మనసులో కలిగిన తృప్తి
ఆ సంపాదనతో పోల్చలేనివి..

ఈ విషయాన్ని అంకుర్ లింక్డిన్‌లో ప్రస్తావించినప్పుడు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు..

“విజయం అనేది ఆదాయంలో కాదు, మనం ఎంచుకున్న జీవితంలో ఉంది” అని చాలామంది వ్యాఖ్యానించారు..

🍃💜 కొసమెరుపు
సమాజం చూపించే విజయ ప్రమాణాలు ఒకటే కాదు.
జీతపు ప్యాకేజీ కాదు…
డబ్బు పెరిగిందా లేదా అన్నదే ప్రశ్న కాదు —

🔹మనసు ప్రశాంతంగా ఉందా?
🔸మన జీవితం మనకు అర్థవంతంగా ఉందా?
హోదా కాదు…
🔸మన మనసు ఒప్పుకున్న జీవితం,
🔹మన కుటుంబానికి ఇచ్చిన విలువ,
🔹మనకు ప్రశాంతత ఇచ్చిన నిర్ణయం-- 
🔸ఇవే నిజమైన విజయ సూచికలు.
*డబ్బు తగ్గినా, మనిషితనం పెరిగితే…
అదే సమాజానికి మార్గదర్శకం..*
*అదే నిజమైన సంపద..అదే నిజమైన విజయం..🎉*
*ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం దొరికితే...*

🌾స్వేచ్ఛ అనువాదం : కూర్పు : వల్లూరి 🙏

🍃💜 నమస్సులతో
🌿 వల్లూరి సూర్యప్రకాష్
🏡 బ్యాంక్ కాలనీ –1, కరీంనగర్

No comments:

Post a Comment