బ్రహ్మచర్యం ప్రతిష్టాయాం వీర్య లాబః ॥
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QgBenRG_7u8
Transcript:
(00:00) బ్రహ్మచర్యం అనేది చాలా గంభీరమైన విషయం బ్రహ్మచర్యం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో చెప్పాలంటే మీరు బ్రహ్మచర్యాన్ని ధారణ చేసి చూడండి. అప్పుడే స్వతహాగా మీకు ఆ లాభాలు అన్నీ అనుభవంలోకి వస్తాయి. అది కూడా అతి తక్కువ సమయంలోనే ఒక నూతన ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి మీకు కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం ఒక తపస్సు సర్వశ్రేష్ట బలం బ్రహ్మచర్యం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయి.
(00:42) ఎవరైతే వారి జీవితంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారికి మాత్రమే ఇవి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఎందుకంటే బ్రహ్మచర్యం ఒక వ్రతం. మనిషి కొంతకాలమైనా దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే దాని అనుభవం లాభాలు ప్రత్యక్షంగా చూడగలుగుతాడు. బెనిఫిట్స్ గురించి మాట్లాడితే అన్నిటికంటే ముందు ఫిజికల్ బెనిఫిట్స్ బ్రహ్మచర్యం శారీరక ఆరోగ్యానికి ముఖ్య ఆధారంగా పరిగణించబడుతుంది.
(01:19) మన భారతీయ శాస్త్రాల్లో ఆధునిక మెడికల్ సైన్స్ రీసెర్చ్ లో కూడా బ్రహ్మచర్యం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలడనే విషయం నిర్వివాదాంశంగా కన్ఫార్మ్ చేయబడింది. బ్రహ్మచర్యం వల్ల దీర్ఘాయువు లభిస్తుంది. బ్రహ్మచర్యం వల్ల అనేక రోగాల భారి నుండి మనిషి రక్షింపబడతాడు. బ్రహ్మచర్యం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
(01:52) ఎందుకంటే బ్రహ్మచర్య పాలన అంటేనే స్వీయ నియంత్రణ. ఏ వ్యక్తి అయితే ఒక నియమిత జీవితం సమతుల్య జీవితం గడుపుతూ నియమిత ఆహారం తీసుకుంటాడో అతను బ్రహ్మచర్య ధారణ లేని వ్యక్తులకు వచ్చే అనేక రోగాల భారి నుండి కూడా సురక్షితంగా ఉంటాడు. ఈ రోజుల్లో బ్రహ్మచర్య ధారణ లేని వ్యక్తుల జీవితాల్ని బాగా పరిశీలిస్తే వారు దైవదర్శనం కంటే ఎక్కువగా డాక్టర్ల దర్శనం చేసుకుంటున్నారు.
(02:32) వాళ్ళ పరిస్థితే ఇలా ఉంది. కానీ బ్రహ్మచర్య జీవనంలో ఒక తేజస్సు ఉంటుంది. ఒక ఓజస్సు ఉంటుంది. ఒక గొప్ప సామర్థ్యం అపరిమిత బలం వారికి అనుభవం అవుతుంది. ఒక అసామాన్య శక్తి అనుభవం అవుతుంది. వీటి వల్ల మనిషి ఆరోగ్యంగా తయారవుతూ ఉంటాడు. అకాల మృత్యువుని కూడా నిలువరించగలుగుతాడు. ఇవన్నీ శారీరక ఉపయోగాలు రెండవది మెంటల్ మానసిక లాభం ఏంటి? ఒకవేళ ఎవరైనా బ్రహ్మచర్యం పాటిస్తే వారి మనసు ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రత శక్తి మన దగ్గర ఉంటే
(03:20) ఏదైనా సాధించగలమనేది మనందరికీ బాగా తెలుసు దీనివల్ల విల్ పవర్ పెరుగుతుంది. బ్రహ్మచారి జీవితంలో ఏవి తలుచుకుంటే అది సాధించగలడు. ప్రపంచంలో ఎన్నెన్ని ఆవిష్కారాలు జరిగాయో అవన్నీ కూడా బ్రహ్మచర్య అవస్థలో ఉన్నప్పుడు సాధించినవే వారు ఏకాంతంలోకి వెళ్లి అంతర్ముఖులై క్రమబద్ధమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ ఆవిష్కారం చేయగలిగారు.
(03:56) సైంటిస్ట్ ల జీవితాన్ని చూడండి పెద్ద పెద్ద స్పిరిచువల్ ట్రూత్స్ ఆధ్యాత్మిక రహస్యాల ఉద్ఘాటన కూడా బ్రహ్మచర్య అవస్థలోనే జరిగింది. ఇక్కడ ఏకాగ్రత పెరుగుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. మనసులో దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల ఏ కార్యం చేసినా దృఢతతో చేయడం వల్ల తప్పక సఫలత లభిస్తుంది. ఇక మూడవది ఇంటలెక్చువల్ బుద్ధికి సంబంధించిన లాభం బ్రహ్మచర్య ధారణతో బుద్ధి యొక్క పరిశీలన శక్తి నిర్ణయ శక్తి మెరుగుపడుతుంది.
(04:39) నాలుగవది మోరల్ నైతికత వ్యక్తిలో నైతికత పెరిగే కొద్దీ వ్యసనాలు చెడు అలవాట్లు అన్నీ సమాప్తమైపోతాయి. నైతికత కలిగిన వ్యక్తి సమాజానికి దేశానికి ఒక గొప్ప సంపద. ఐదవ లాభం ఆర్థిక అభివృద్ధికి సంబంధించింది. బ్రహ్మచర్య పాలన చేయకుండా క్రమశిక్షణ రాహిత్యం కలిగిన వ్యక్తి జీవితంలో కామవికారం అయితే చిందులేస్తుంది. ఇంద్రియాలని తన వసం చేసుకోలేని వ్యక్తి చేసే పనులు స్వయానికి సమాజానికి కీడు చేసేవిగా ఉంటాయి. ఇక ఆరవది సామాజిక కోణం
(05:28) సమాజంలో నేడు రాజ్యమేలుతున్న నిరుద్యోగం పేదరికం ఆకలి చావులు రోగాలు వీటన్నిటికీ మూల కారణం ఏదో రకంగా కామవికారమే అనేది లోతుగా ఆలోచించినప్పుడే మనకి అర్థమవుతుంది. కాబట్టి శారీరక మానసిక భౌతిక నైతిక ఆర్థిక సామాజిక సమస్యలన్నిటికీ బ్రహ్మచర్యమే ఏకమాత్ర సమాధానం బ్రహ్మచర్యము లేకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయని మనకి అర్థంవుతుంది.
(06:12) ఇక చివరిది ఆధ్యాత్మిక మార్గం బ్రహ్మచర్య వ్రత పాలన లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఊహించలేము. ఆధ్యాత్మిక మార్గానికి మొట్టమొదటి శరత్తు బ్రహ్మచర్యమే ఎందుకంటే ఈ మార్గము మనసుకి బుద్ధికి సంబంధించింది. ఆత్మ గుణాలు శక్తుల అధ్యయనాల మార్గం ఇది. ఆత్మ స్వధర్మం పవిత్రత. పవిత్రతకు ఆధార స్తంభం బ్రహ్మచర్యమే. అయితే బ్రహ్మచర్యం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని వీర్యము ఒక వ్యర్థ పదార్థము అని అది బయటకు పోతే ఎలాంటి నష్టము లేదు అలాగే
(07:02) ఉన్నా ఎటువంటి లాభము లేదు అని మేధావులుగా చెప్పబడే కొంతమంది పనికట్టుకుని మరి ఈ అంశాన్ని గూర్చి ప్రచారం చేస్తున్నారు. అమాయకులు సామాన్యులు లోతుగా ఆలోచించని వారు వీరి మాటల మాయలో పడిపోయి అదే నిజం అనుకని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దాని కారణంగా ఈనాడు యువతరంలో బలహీనత శక్తిహీనత నపుంసకత్వము సంతానహీనత ఇవన్నీ స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి.
(07:46) అందుకనే వీర్యాన్ని శరీరంలో ధరించడం కోసం బ్రహ్మచర్యం అనే తపస్సును దీక్షను మహర్షులు ఏర్పాటు చేశారు. అటువంటి ఒక ధార్మిక పరంపర కలిగిన భారతీయులు తమ పరంపరను ఇతిహాసాన్ని చరిత్రను ధర్మశాస్త్రాలను అన్నిటిని పక్కన పెట్టి వీటికి విరుద్ధమైనటువంటి అల్ప మేధావులు చెప్పే మాటలు పట్టుకుని ముందుకు సాగడం చాలా బాధాకరం.
No comments:
Post a Comment