[11/28, 19:54] +91 98486 72301: *ఇది ప్రతి తల్లిదండ్రులకు చాలా అవసరమైన విషయం. పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా అలవాట్లు మార్చడమే బిహేవియర్ థెరపీ.*
✍️ *Madhava's Writings*
*ఇంట్లోనే చేయగలిగే 6 సులభమైన పద్ధతులు చెప్తాను.*
1. తిట్టడం ఆపి, మెచ్చుకోవడం మొదలుపెట్టండి
పిల్లలు చెడు పని చేస్తే మనం వెంటనే అరుస్తాం. కానీ మంచి పని చేస్తే పట్టించుకోం. ఇదే పెద్ద తప్పు.
*ఉదాహరణ:*
పిల్లవాడు రోజంతా ఫోన్ చూస్తే - "ఎప్పుడూ ఫోనేనా?" అని తిట్టడం కాదు.
వాడు 10 నిమిషాలు పుస్తకం చదివితే - "వావ్, నువ్వు ఇవాళ పుస్తకం చదివావా? చాలా బాగా చేసావు" అని గట్టిగా మెచ్చుకోండి.
పిల్లల మెదడు - *మెచ్చుకున్న పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుంది.* తిట్టిన పనిని దొంగచాటుగా చేస్తుంది.
*సూత్రం:* చెడు పనికి తక్కువ రియాక్షన్, మంచి పనికి ఎక్కువ రియాక్షన్.
2. "వద్దు" అని చెప్పకండి, "దీనికి బదులు ఇది చెయ్" అని చెప్పండి
పిల్లలకు "వద్దు" అంటే అర్థం కాదు. ఏం చేయాలో చెప్పాలి.
- "అరవద్దు" అని చెప్పే బదులు - "నెమ్మదిగా, అమ్మకి మాత్రమే వినపడేలా చెప్పు" అనండి.
- "గోర్లు కొరకద్దు" అని చెప్పే బదులు - చేతిలో ఒక బాల్ ఇచ్చి "కోపం వచ్చినప్పుడు దీన్ని నొక్కు" అనండి.
- "ఫోన్ చూడద్దు" అని చెప్పే బదులు - "పదా, బయట 15 నిమిషాలు ఆడుకుందాం" అనండి.
చెడు అలవాటు ఖాళీగా ఉంటే మళ్ళీ వస్తుంది. దాని స్థానంలో మంచి అలవాటు పెట్టాలి.
3. స్టార్ చార్ట్ - పిల్లలకు బాగా పనిచేస్తుంది
ఇది బిహేవియర్ థెరపీలో నెంబర్ 1 పద్ధతి.
ఒక చార్ట్ తీసుకుని గోడకు అంటించండి.
పిల్లవాడు ప్రతిరోజూ చేయాల్సిన 3 పనులు రాయండి:
1. హోంవర్క్ పూర్తి చేయడం
2. పళ్ళు తోముకోవడం
3. ఎవరినీ కొట్టకపోవడం
ప్రతి పని చేసినప్పుడు ఒక స్టార్ వేయండి. 10 స్టార్లు వస్తే వాడికి ఇష్టమైనది ఒకటి కొనివ్వండి - చిన్న చాక్లెట్, పార్క్ కి తీసుకెళ్లడం, వాడితో కలిసి ఆడుకోవడం.
*ఇలా చేస్తే పిల్లవాడికి - "మంచి పని చేస్తే మంచి జరుగుతుంది" అని మెదడులో గట్టిగా నాటుకుపోతుంది.*
4. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో నేర్పండి
చాలామంది పిల్లలు కోపంతో కొడతారు, వస్తువులు విసిరేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కోపాన్ని ఎలా చెప్పాలో తెలియదు.
*వాళ్ళకు ఇలా నేర్పండి:*
- "కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్కపెట్టు"
- "అమ్మా నాకు కోపంగా ఉంది అని చెప్పు, కొట్టకు"
- "ఒక గ్లాసు నీళ్ళు తాగి, 2 నిమిషాలు కూర్చో"
మీరు కూడా వాడి ముందు కోపంతో అరవకండి. మీరు అరిస్తే, వాడు కూడా అరవడమే నేర్చుకుంటాడు. *పిల్లలు మన మాటలు వినరు, మనల్ని చూసి నేర్చుకుంటారు.*
5. రూటీన్ - ఒకే టైం, ఒకే పని
పిల్లల చెడు అలవాట్లకు ముఖ్య కారణం - ఏ టైంకి ఏం చేయాలో తెలియకపోవడం.
ఉదయం 7 గం - లేవడం
సాయంత్రం 5 గం - ఆడుకోవడం
రాత్రి 8 గం - చదువు
రాత్రి 9 గం - ఫోన్ ఆఫ్
మొదటి 10 రోజులు కష్టంగా ఉంటుంది. కానీ 21 రోజులు ఇలా చేస్తే, అదే అలవాటు అయిపోతుంది. అప్పుడు మీరు చెప్పక్కర్లేదు, వాడే చేస్తాడు.
6. భయపెట్టకండి, ధైర్యం ఇవ్వండి
"చదవకపోతే ఫెయిల్ అవుతావ్", "అల్లరి చేస్తే దెయ్యం వస్తుంది" - ఇలా భయపెడితే పిల్లలు ఇంకా మొండిగా తయారవుతారు.
బదులుగా - "నువ్వు చేయగలవు, నాకు నీ మీద నమ్మకం ఉంది" అని చెప్పండి.
చివరిగా మీకు ఒక ముఖ్యమైన మాట: *పిల్లల చెడు అలవాటు పోవాలంటే 3 వారాలు పడుతుంది.*. *కాబట్టి 2 రోజుల్లో మారలేదని విసుక్కోవద్దు. *ప్రతిరోజూ కొంచెం కొంచెం ఓపికగా చేయండి.*. కష్టంలో ఉన్నవాడికి చెయ్యి అందించే మంచి పిల్లలు తయారవుతారు.
క్రింద స్మార్ట్ చార్ట్ ఇస్తున్న చూడండి.. *ఆధ్యాత్మిక కుటుంబం*
*పిల్లల స్టార్ చార్ట్!!!*
దీన్ని ప్రింట్ తీసి గోడకు అంటించండి, పిల్లలు రోజూ స్టార్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
ఈ చార్ట్ లో 5వ పాయింట్ చూడండి - *"కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం"* - పై ఫోటో సందేశం అదే కదా!

No comments:
Post a Comment