Wednesday, November 25, 2026

ఒక తెలుగు యువరాణి దోచేసిన నిధి! | 1947 Baroda Pearl Carpet & Pithapuram Mystery

ఒక తెలుగు యువరాణి దోచేసిన నిధి! | 1947 Baroda Pearl Carpet & Pithapuram Mystery

Author Name:Kautilya

Youtube Channel Url:https://www.youtube.com/@KautilyaDecodes

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vb3zCcvpMNk





Title: ఒక తెలుగు యువరాణి దోచేసిన నిధి! | 1947 Baroda Pearl Carpet & Pithapuram Mystery

Author Name: Kautilya

Description: 2009లో దోహా ఆక్షన్‌లో ₹45 కోట్లకు అమ్ముడుపోయిన 15 లక్షల బస్రా ముత్యాల కార్పెట్... 1947లో సర్దార్ పటేల్ గారు రంగంలోకి దిగినా ఇండియాకు ఎందుకు తిరిగి రాలేదు? పిఠాపురం మహారాజు కూతురు, 'ది ఇండియన్ వాలిస్ సింప్సన్'గా పేరుగాంచిన యువరాణి సీతాదేవి అసలు కథ ఇది!

ఈ ఎపిసోడ్‌లో 1943 మద్రాస్ రేస్‌కోర్స్‌లో మొదలైన వివాదాస్పద ప్రేమకథ, బ్రిటిష్ చట్టాన్నే బోల్తా కొట్టించిన ఓవర్‌నైట్ లీగల్ లూప్‌హోల్, 1947 తర్వాత బరోడా రాజ ఖజానా నుండి యూరప్‌కు తరలిపోయిన అరుదైన వజ్రాలు, మరియు తెలుగు భాష కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన పిఠాపురం మహారాజు రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ గారి స్ఫూర్తిదాయక చరిత్రను లోతుగా విశ్లేషిస్తున్నాం.

⏱️ Chapters:
00:00 - 2009 దోహా ఆక్షన్ & ₹45 కోట్ల ముత్యాల కార్పెట్ మిస్టరీ
01:34 - 1943 మద్రాస్ రేస్‌కోర్స్ & చట్టాన్ని బోల్తా కొట్టించిన లీగల్ హ్యాక్
04:27 - 1947 బరోడా ఖజానా తరలింపు, మొనాకో & ప్యారిస్ పార్టీ కౌంటర్
08:13 - అసలు ట్విస్ట్: పిఠాపురం మహారాజు సూర్యారావు గారి త్యాగం
10:40 - పతనం: 1956 విడాకులు & 1989 ప్యారిస్‌లో ఒంటరి ముగింపు
12:03 - ఒకే కోట... రెండు విరుద్ధ వారసత్వాలు

📌 Key Topics Covered:
• Baroda Pearl Carpet (15 Lakh Basra Pearls) & 2009 Sotheby's Doha Auction
• Princess Sita Devi of Baroda & Maharaja Pratapsinhrao Gaekwad
• Sardar Vallabhbhai Patel, V.P. Menon & 1947 Princely States Integration
• Star of the South (128 Carats), English Dresden (78 Carats) & Wallis Simpson Emerald Incident
• Pithapuram Maharaja Surya Rao Bahadur, Andhra Sahitya Parishat & Suryarayandhra Nighantuvu

📚 Sources & Visual Note:
Historical events are compiled from archival newspapers (1943–1956), public records of the Baroda & Pithapuram princely states, and Sotheby's 2009 auction archives. Certain historical scenes use stylized visual reconstructions alongside authentic archival photographs for documentary storytelling.

🔔 Subscribe to Kautilya Decodes for more untold Telugu historical mysteries & investigative documentaries!

#TeluguHistory #BarodaPearlCarpet #PithapuramMaharaja #SitaDevi #KautilyaDecodes

Transcript:
(00:00) అది మార్చి 2009 ఖతార్లోని దోహా సిటీలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సోతేబి సాక్షన్ హౌస్లో పిన్డ్రాప్ సైలెన్స్ గా ఉంది. ప్రపంచం నలుమూల నుండి వచ్చిన బిలియనీర్లు మ్యూజియం క్యూరేటర్ల కళ్ళన్నీ స్టేజ్ మీద వేలాడి తీసిన ఒకే ఒక వస్తువుపై ఉన్నాయి. అది మామూలు తివాచీ కాదు. ఏకంగా 15 లక్షల అసలైన బస్రా ముత్యాలను, వేలాది పచ్చలను, కెంపులను మరియు వజ్రాలను కలిపి స్వచ్ఛమైన బంగారు, వెండి దారాలతో జింక చర్మం మరియు పట్టుపై అల్లిన ఒక అద్భుతం.
(00:30) అదే ది బరోడా పెర్ల్ కార్పెట్. వేలం మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఆ కార్పెట్ ఏకంగా 5.5 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో సుమారు 45 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ ఉంది. అసలు 1865లో బరోడా మహారాజు కండేరావు గైక్వాడ్ మదీనాలోని ప్రవక్త సమాధికి కానుకగా ఇవ్వాలని ఈ కార్పెట్ ను తయారు చేయించారు.
(00:52) కానీ అది ఇవ్వకముందే ఆయన చనిపోవడంతో దాదాపు 80 ఏళ్ల పాటు ఇది బరోడా రాజ ఖజానాలోనే అత్యంత రహస్యంగా ఉండిపోయింది. మరి 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత బరోడా కోటలో ఉండాల్సిన ఈ అమూల్యమైన జాతీయ సంపద అకస్మాత్తుగా ఎక్కడికి మాయమైంది? స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన దీనిని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారు? ఈ ఇంటర్నేషనల్ మిస్టరీ వెనక ఉన్నది ఏ స్మగ్లరో, అండర్ వరల్డ్ డానో కాదు.
(01:17) మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి వెళ్ళిన ఒక తెలుగు యువరాణి. ఆమె పేరే సీతాదేవి. చట్టంలోని ఒక చిన్న లొసుగుతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని బోల్తా కొట్టించి స్వతంత్ర భారతదేశంలోనే అతిపెద్ద రాజరికపు ఖజానా తరలింపుకు కారణమైన ఆమె కథ ఏ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ కు తక్కువ కాదు. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1943లోకి వెళ్ళాలి.
(01:40) మద్రాస్ లోని రేస్ కోర్స్ అప్పట్లో సౌత్ ఇండియాలోని రాజులు, జమీందారులు, బ్రిటిష్ ఉన్నతాధికారులు కలుసుకునే అత్యంత విలాసవంతమైన వేదిక. అక్కడికి ఉయ్యూరు జమీందార్ ఎంఆర్ అప్పారావు గారి భార్యగా ఒక కొడుకు తల్లిగా వచ్చిన 26 ఏళ్ల యువరాణి సీతాదేవి పై ఒక వ్యక్తి కళ్ళు పడ్డాయి. ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. గుజరాత్ లోని బరోడా సంస్థానానికి మహారాజు అయిన ప్రతాప సింహారావు బ్రిటిష్ ఇండియాలో అత్యంత గౌరవప్రదమైన 21 గన్ సెల్యూట్ సైనిక్ హోదా ఉన్న ఐదు అతి పెద్ద సంస్థానాల్లో బరోడా ఒకటి.
(02:07) ప్రపంచంలోని అత్యంత ధనిక వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. మద్రాస్ రేస్ కోర్స్ లో మొదలైన ఆ ఒక్క చూపు కొన్ని రోజుల్లోనే తీవ్రమైన ప్రేమగా మారింది. ప్రతాప్ సింహారావు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య పెళ్లికి మూడు అసాధ్యమైన చట్టపరమైన అడ్డుగోడలు నిలబడ్డాయి. మొదటిది సీతాదేవికి ఇప్పటికే వివాహం అయింది.
(02:26) 1940లలో బ్రిటిష్ ఇండియాలో హిందూ వివాహ చట్టాల ప్రకారం ఒక భార్య తన భర్తకు విడాకులు ఇవ్వడం దాదాపు అసాధ్యం. అసలు హిందూ చట్టంలో డివోర్స్ అనే కాన్సెప్టే లేదు. రెండవది ప్రతాప్ సింహారావు గారికి కూడా అప్పటికే మహారాణి శాంతదేవి తో పెళ్లై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. మూడవది అన్నిటికంటే పెద్ద చిక్కు బరోడా సంస్థానం అప్పట్లో అడ్వాన్స్డ్ గా ఉండేది.
(02:47) సరిగ్గా ఏడాది ముందే అంటే 1942లో స్వయంగా బరోడా సంస్థానంలోనే యాంటీ బిగమీ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం బరోడా చట్ట ప్రకారమే నేరం. ఈ మూడు గోడలను దాటడం ఎవరి వల్ల కాదని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే సీతాదేవి బరోడా మహారాజు కలిసి అత్యుత్తమ న్యాయవాదులతో కూర్చొని అప్పటి బ్రిటిష్ ఇండియా చట్టాల్లో ఉన్న ఒక అద్భుతమైన లీగల్ లూప్ హోల్ ను బయటకు తీశారు.
(03:13) 1939 నాటి డిసల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ మరియు అప్పటి బ్రిటిష్ కోర్టు తీర్పుల ప్రకారం ఒక హిందూ మహిళ ఇస్లాం మతం స్వీకరిస్తే ఆమె ముందు చేసుకున్న హిందూ వివాహం రద్దయ్యే చట్టపరమైన వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత జరిగింది దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. రాత్రికి రాత్రే సీతాదేవి ఇస్లాం మతాన్ని స్వీకరించింది. వెంటనే తన మొదటి భర్త ఉయ్యూరు జమీందార్కు టెలిగ్రామ్ ద్వారా విడాకుల నోటీస్ పంపింది.
(03:35) వివాహం రద్దు అయిందని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆమె మళ్లీ ఆర్యసమాజ్ ద్వారా శుద్ధి కార్యక్రమం చేయించుకొని హిందూ మతంలోకి తిరిగి వచ్చింది. ఇక బరోడా లోని బహుభార్యత్వ చట్టం సంగతి ఏంటంటే దానికి ప్రతాప్ సింహారావు ఇంకా సింపుల్ హ్యాక్ వాడారు. నేను బరోడా రాజుని చట్టం నా ప్రజలకు తప్ప నాకు వర్తించదు అని ప్రకటించి డిసెంబర్ 1943లో సీతాదేవిని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
(03:58) ఈ వార్త ఢిల్లీలోని వైస్రాయ్ భవనాన్ని కదిలించింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను ఇంత బహిరంగంగా అపహాస్యం చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం సీతాదేవికి హర్ హైనేస్ అనే అధికారిక రాజరిక హోదా ఇవ్వటానికి నిరాకరించింది. అంతేకాకుండా బ్రిటిష్ అధికారులు ఆమెను ఒక రాణిగా కూడా గుర్తించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
(04:18) కానీ సీతాదేవికి ఆ బ్రిటిష్ టైటిల్స్ తో పని లేదు. ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన బరోడా ఖజానా తాళాలు ఉన్నాయి. ఇలానే నాలుగేళ్లు గడిచాయి. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతున్నారు. కానీ రాజులకు అసలైన గండం అప్పుడే మొదలైంది. భారత ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయన కార్యదర్శి విపి మీనన్ గారు దేశంలోని 560 సంస్థానాలను భారత్ లో విలీనం చేసే భారీ ఆపరేషన్ ను మొదలు పెట్టారు.
(04:47) ఇక రాచరికాలు అంత అవుతాయని తమ వందల ఏళ్ల ఖజానా భారత ప్రభుత్వ పరం అవుతుందని ప్రతాప్ సింహారావు గారికి, సీతాదేవికి స్పష్టంగా అర్థమైపోయింది. అప్పుడే మొదలైంది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన బరోడా ట్రెజరీ డ్రైయిన్. ప్రభుత్వం రాజుల వ్యక్తిగత ఆస్తులను, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను వేరు చేసే పనిలో ఉండగానే బరోడా ఖజానా నుండి అంతులేని సంపద రహస్యంగా విదేశాలకు తరలిపోవడం మొదలైంది.
(05:13) 1948లో భారత ప్రభుత్వం బరోడా లెక్కలను ఆడిట్ చేసినప్పుడు అధికారులు నోళ్లు వెల్లబెట్టారు. కొద్ది నెలల వ్యవధిలోనే అప్పటి విలువలో ఏకంగా కోట్లాది రూపాయలు అంటే సుమారు కోటి డాలర్లకు పైగా బరోడా ఖజానా నుండి మాయమై యూరప్ బ్యాంకులకు చేరినట్లు బయటపడింది. డబ్బు మాత్రమే కాదు గైక్వాడ్ అంశం తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన అమూల్యమైన రత్నాలు, ఆభరణాలు ఒక్కొక్కటిగా దేశం దాటాయి.
(05:36) 1853లో బ్రెజిల్ లో దొరికిన ఫేమస్ 128 క్యారెట్ల స్టార్ ఆఫ్ ది సౌత్ డైమండ్, 78 క్యారెట్ల ఇంగ్లీష్ డ్రెస్ డెన్ డైమండ్, ఏడు వరుసల అత్యంత అరుదైన బరోడా ముత్యాల హారం మరియు మనం మొదట్లో చెప్పుకున్న 15 లక్షల ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన బరోడా పర్ల్ కార్పెట్ వీటిలో చాలా ఫేమస్. ఈ సంపదతో వీరిద్దరూ యూరప్ లో ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
(05:57) లండన్ లో ఎస్టేట్లు, పారిస్ లో విలాసవంతమైన భవనాలు, గుర్రపు పందాల కోసం అరుదైన రేసు గుర్రాలు, ప్రైవేట్ విమానాలు కొన్నారు. అన్నిటికంటే తెలివైన ప్లాన్ ఏంటంటే భారతదేశంలో, యూరోప్లో టాక్స్లు కట్టకుండా తప్పించుకోవడానికి సీతాదేవి ఏకంగా ప్రపంచంలోని అత్యంత రిచ్ టాక్స్ హెవెన్ అయిన మొనాకో దేశపు సిటిజన్షిప్ తీసుకుంది. అక్కడి మాంటె కార్లో క్యాసినోలలో, పారిస్ పార్టీలలో ఆమె దర్పం చూసి యూరోప్ రాజులే ఆశ్చర్యపోయేవారు.
(06:24) అప్పట్లోనే అంతర్జాతీయ మీడియా ఆమెకు ది ఇండియన్ వాలెన్స్ సింసన్ అనే పేరు పెట్టింది. ఆమె దర్పానికి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ ప్రస్తావిస్తాను. సీతాదేవి తన దగ్గర ఉన్న కొన్ని అరుదైన ఎమరాల్డ్స్ పారిస్ లోని ప్రముఖ జ్యువెలరీ సంస్థ అయిన వ్యాన్ క్లిఫ్ అండ్ ఆర్పెల్స్ కు అమ్మేసింది. ఆ సంస్థ ఆ ఎమరాల్డ్స్ తో ఒక అద్భుతమైన హారాన్ని తయారు చేసి బ్రిటన్ మాజీ రాజు భార్య అయిన డచెస్ ఆఫ్ విన్స్టర్ వాలెన్స్ సింసన్ కు అమ్మింది.
(06:46) కొన్ని రోజుల తర్వాత పారిస్ లో జరిగిన ఒక భారీ రాయల్ పార్టీలో వాలెన్స్ సింసన్ ఆ ఎమరాల్డ్ హారాన్ని మెడలో వేసుకొని గర్వంగా తిరుగుతుంది. అక్కడ ఉన్న వారంతా ఆ హారాన్ని పొగుడుతుంటే అదే పార్టీలో ఉన్న సీతాదేవి చిన్నగా నవ్వి అందరికీ వినిపించేలా ఒక మాట అంది. ఆ ఆభరణాలు నా కాళ్ళకు వేసుకునే పట్టీలుగా ఉన్నప్పుడే ఇంకా బాగుండేవి.
(07:05) కానీ మీ మెడలో కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి అని ఆ ఒక్క మాటతో పార్టీలో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వాలెన్స్ సింసన్ ఆ మరుసటి రోజే ఆ హారాన్ని తిరిగి షాపులో ఇచ్చేసిందని పారిస్ పేపర్లు హెడ్లైన్స్ లో వేసాయి. ఇక్కడ భారతదేశంలో సర్దార్ పటేల్ గారు, విపి మీనన్ గారు ఈ ఖజానా దోపిడీని చూస్తూ ఊరుకోలేదు. 1948 లో ప్రతాప్ సింహారావు ను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
(07:28) కొంత డబ్బును తిరిగి కట్టేలా ఒప్పించారు. కానీ పటేల్ మరణం తర్వాత 1951 లో ప్రతాప్ సింహారావు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజులందరినీ ఏకం చేస్తూ రూలర్స్ యూనియన్ అనే సంస్థను స్థాపించడానికి ప్రయత్నించారు. ఇక నెహ్రూ ప్రభుత్వం ఈ విషయంతో సహనం కోల్పోయింది. ఏప్రిల్ 1951 లో రాష్ట్రపతి ప్రత్యేక జీవో ద్వారా ప్రతాప్ సింహారావు ను బరోడా మహారాజ పదవి నుండి తొలగించింది.
(07:50) ఆయన పెద్ద కొడుకు ఫతే సింహారావు ను కొత్త రాజుగా ప్రకటించింది. అయితే విదేశాల్లో ఉన్న ఆ కోట్లాది రూపాయల ఆభరణాలను, ఆ ముత్యాల కార్పెట్ ను వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం బరోడా కొత్త రాజు ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. మొనాకో సిటిజన్షిప్ రక్షణలో ఉన్న సీతాదేవి అవి సంస్థానం ఆస్తులు కాదు నా భర్త నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతులు అని వాదిస్తూ వాటిని తిరిగి ఇవ్వడానికి ససేమిరా నిరాకరించింది.
(08:14) ఇప్పటిదాకా మీరు విన్నది ఒక సంచలనమైన హైస్ట్ కథ. ఒక రాజు ఖజానాను ఖాళీ చేసి భారత ప్రభుత్వంతోనే తలపడి మొనాకోలో విలాసంగా బతికిన ఒక యువరాణి కథ. కానీ ఇక్కడే ఈ స్టోరీలో మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ప్రజా ధనాన్ని విదేశాలకు తరలించి పారిస్ పార్టీల్లో కోట్లు ఖర్చు చేసిన ఈ సీతాదేవి అసలు ఎవరి కూతురో తెలుసా? ఆమె తండ్రి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం మహారాజు రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్.
(08:41) ఇక్కడే చరిత్ర రాసిన అతిపెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. కూతురు చట్టంలోని లొసుగుతో బరోడా సింహాసనం ఎక్కితే అంతకు 40 ఏళ్ల ముందే ఆమె తండ్రి పిఠాపురం సింహాసనం కోసం ఏకంగా లండన్ లోని ప్రివీ కౌన్సిల్ వరకు వెళ్లి ఒక భీకరమైన లీగల్ వార్ గెలిచారు. 1885 లో జన్మించిన ఆయన దత్తతపై సొంత బంధువులే తిరుగుబాటు చేసి కోట్ల ఆస్తిని లాక్కోవడానికి మద్రాస్ హైకోర్టు నుండి లండన్ వరకు కేసులు వేశారు.
(09:03) చరిత్రలో సంచలనం సృష్టించిన ఆ పిఠాపురం అడాప్షన్ కేసులో గెలిచి 1906 ఆ ప్రాంతంలో ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలోనే అత్యంత రిచ్ జమీందారులలో ఒకటైన పిఠాపురం గద్దెనెక్కారు. కానీ సింహాసనం దక్కగానే ఆయన చేసింది అందరు రాజుల్లా వేటలు, విలాసాలు కాదు. ఒకేసారి రెండు వ్యవస్థలపై తిరుగుబాటు. ఒకవైపు కుల వివక్ష తారాస్థాయిలో ఉన్న సనాతన సమాజాన్ని ఎదిరించి సొంత బంధువుల నుండే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ దళితులకు, అనాథలకు ఆశ్రమాలు, హాస్టళ్లు కట్టించారు.
(09:32) మరోవైపు బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ దెబ్బకు మన తెలుగు భాష వందల ఏళ్ల చరిత్ర ఉన్న తాళపత్ర గ్రంథాలు చెదలు పట్టి అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. దాన్ని ఆపడానికి ఆయన ఒక రెస్క్యూ ఆపరేషన్ లాంటి ఉద్యమమే చేశారు. 1911 లో ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపించి మారుమూల గ్రామాల్లో మట్టిపాలు అవుతున్న వేలాది తాళపత్ర గ్రంథాలను సొంత ఖర్చుతో సేకరించి కాపాడారు.
(09:54) దశాబ్దాల పాటు వందలాది పండితులకు జీతాలు ఇస్తూ లక్షలాది రూపాయలతో సూర్యరాయాంధ్ర నిఘంటువు అనే ఏడు సంపుటాల మహా డిక్షనరీని నిర్మించారు. తెలుగు గుణింతాలు, ఒత్తులను మెషిన్ పైకి ఎక్కించడం అసాధ్యమని అందరూ చేతులు ఎత్తేస్తే ఆ సవాలును స్వీకరించి మొదటి తెలుగు టైప్ రైటర్ తయారీకి ఆర్థికంగా సహాయం చేశారు. ఒక్కసారి ఆయన్ని ఊహించండి. ఒక తండ్రి తన జీవిత కాలం సంపాదనంతా తెలుగు భాష కోసం, విలువలు కోసం కరిగించేస్తే అదే కోటలో పెరిగిన ఆయన కన్న కూతురు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అతి పెద్ద రాయల్ స్కాండల్ గా మారిపోయింది.
(10:26) 1943 లో సీతాదేవి మతం మారి అప్పటికే పెళ్లైన బరోడా మహారాజును రెండో పెళ్లి చేసుకున్నప్పుడు పిఠాపురం మహారాజు తట్టుకోలేకపోయారు. ఆ అవమానాన్ని భరించలేక ఆ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించి కన్న కూతురితోనే శాశ్వతంగా సంబంధాలు తెంచుకున్నారు. మరి తండ్రిని ఎదురించి భారత ప్రభుత్వాన్ని బోల్తా కొట్టించి సీతాదేవి పోగు చేసిన ఆ వందల కోట్ల సంపద, ఆ 15 లక్షల ముత్యాల కార్పెట్ ఆమెకు శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చాయా? దానికి సమాధానం అయితే లేదు.
(10:53) 1951 లో ప్రతాప్ సింహారావు మహారాజా పదవి కోల్పోయిన తర్వాత బరోడా నుండి వచ్చే భారీ రాజ్య భరణం ఆయన పెద్ద కొడుకు చేతికి వెళ్లిపోయింది. డబ్బు రాక ఆగిపోగానే ఒకప్పుడు ప్రపంచాన్ని ఎదురించి పెళ్లి చేసుకున్న జంట మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి 1956 లో ప్రతాప్ సింహారావు, సీతాదేవి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన 1968 లో లండన్ లో ఒంటరిగా కన్ను మూశారు.
(11:16) ఇక పారిస్ లో మిగిలిపోయిన సీతాదేవి తన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి తన దగ్గర ఉన్న అమూల్యమైన బరోడా ఆభరణాలను ఒక్కొక్కటిగా రహస్యంగా అమ్మేసుకోవడం మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ఆ ఫేమస్ బరోడా ముత్యాల కార్పెట్ కూడా యూరప్ లోని ఒక ప్రైవేట్ కలెక్టర్ చేతిలోకి వెళ్లి దశాబ్దాల పాటు అజ్ఞాతంలోకి జారుకుంది. సీతాదేవికి ఈ లోకంలో మిగిలిన ఏకైక ఆధారం ఆమె రెండో కొడుకు సాయాజీరావు.
(11:39) ఆమె ముద్దుగా ప్రిన్సీ అని పిలుచుకుంటుంది. కానీ 1985 లో విధి ఆమెపై అతి పెద్ద పిడుగు వేసింది. కేవలం 40 ఏళ్ల వయసులోనే ప్రిన్సీ ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణంతో సీతాదేవి పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒకప్పుడు పారిస్, మొనాకో పార్టీలను శాసించిన ఆ తెలుగు యువరాణి తన చివరి నాలుగేళ్లు తీవ్రమైన మానసిక వేదనతో ఎవరూ లేని ఒంటరిగా గడిపి 1989 లో పారిస్ లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
(12:03) 2009 లో దోహా వేలం లో 45 కోట్లకు అమ్ముడుపోయిన ఆ బరోడా ముత్యాల తివాచి ఈ రోజు ఖతార్ లోని మ్యూజియం లో అద్దాల పెట్టెలో బందీగా ఉంది. అదే టైం లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పెద్ద గ్రంధాలయంలో పిఠాపురం మహారాజ సూర్యారావు గారు నిర్మించిన సూర్యాంధ్ర డిక్షనరీ ఈ రోజుకి తెలుగు భాషకు ఊపిరి పోస్తూ సజీవంగా ఉంది.
(12:24) ఒకే పిఠాపురం కోట ఒకే రక్తం కానీ రెండు విభిన్న దారులు. మనం ఎంత సంపదను పోగు చేశామన్నది కాదు ఆ సంపదతో సమాజానికి ఏమి ఇచ్చి వెళ్ళామన్నదే చరిత్రలో మన పేరు నిలబడుతుంది. పిఠాపురం సంస్థానం గురించిన ఈ అన్ టోల్డ్ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఇందులో మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ట్విస్ట్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని లోతైన తెలుగు హిస్టారికల్ మిస్టరీస్ కోసం మన కౌటిల్య డీకోడ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(12:46) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment