ఆడపిల్లకి పెళ్లి చెయ్యగానే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా తల్లిదండ్రులుగా మనమేం చెయ్యాలి
Author Name:Bhagya creations
Youtube Channel Url:https://www.youtube.com/@Bhagyacreations
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GAAgF-Sz494
Title: ఆడపిల్లకి పెళ్లి చెయ్యగానే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా తల్లిదండ్రులుగా మనమేం చెయ్యాలి
Author Name: Bhagya creations
Description: hai friends in this vedio iam going to tell you something about parents of daughters. if you like this vedio please like share and subscribe my channel. thankyou
Transcript:
(00:00) హాయs ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యా aక్ టు మై ఛానల్. చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఆడపిల్ల అంటే పెళ్లి చేయగానే మన బాధ్యత అయిపోయింది. మన భారం తీరిపోయింది అనుకుంటున్నారండి. అంటే చాలా మంది అంటే దాదాపుగా కొంతమంది అయితే ఆడపిల్లలు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళదే పెత్తనం అని చెప్పని తల్లులు దూరిపోయి అసలు మనశాంతి లేకుండా చేసేస్తున్నారు.
(00:28) అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. చాలా మంది ఏంటంటే ఆడపిల్ల అనగానే భారంగా భావిస్తారు. ఆ భావనలో ఆడపిల్లకి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయింది అమ్మయ్య మనం ఇంక చేతులు కడిగేసుకోవచ్చు అన్నట్టు ఉంటారండి. ఇక వంగి తొంగి కూడా ఆడపిల్ల వైపు చూడరు. ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
(00:48) ఫస్ట్ అండి ఆడపిల్లకి పెళ్లికి ముందే తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా మనం చూడాలండి. ఆర్థిక స్వతంత్రం ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పూర్వం రోజుల్లో అయితేనండి పనిపాటలు చేసుకుంటూ ఆడపిల్లలు మసులుకునేవారు. కానీ అది కాదు కదా ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రం ఉండాలండి కనీసం తనకంటూ కొంత సంపాదన తన కాళ్ళ మీద తాను నిలబడితే ఎక్కువగా కష్టాల వైపు పరిగెత్తదండి.
(01:17) ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి బాధపడిపోవడం అలాంటివి ఉండవు. ఉద్యోగం చేసే అమ్మాయికి చేయని అమ్మాయికి చాలా తేడా ఉంటుందండి. ఉద్యోగం చేయని అమ్మాయి ఏమనుకుంటుందంటే వీళ్ళ మీద ఆధారపడాలి నా జీవితం అంతా ఇంతే అనే భావనతో బ్రతికేస్తుంది. అదే చేతిలో ఒక ఉద్యోగం ఉందనుకోండి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నా జీవితం నా స్వతంత్రం అనే భావన ఉంటుంది.
(01:38) అప్పుడు అత్తవారింట్లో ఏమైనా సమస్యలు వచ్చిన ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆర్థిక స్వతంత్రం ఉంటే అన్ని విధాలా కూడా ధైర్యం వస్తుందండి. ఓ బాగా డబ్బు వచ్చి పడిపోతుంటే ధైర్యంగా మాట్లాడతామని కాదు. ఒక ఆసరా నాది అనేది ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు ఆడపిల్లలు. ఆడపిల్ల పెళ్లి చేసి పంపగానే మన బాధ్యత తీరిపోయింది అని అనుకుంటే ఎలాగండి? ఆ అమ్మాయికి చాలా సమస్యలు ఉంటాయి.
(02:03) పెళ్లి అయిన తర్వాత కూడా మనం ఎలా ఉన్నావు అమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉంటున్నావు? అత్తవారింట్లో అందరూ నీతో ఎట్లా ఉంటున్నారు? అని మనం తెలుసుకుంటూ ఉండాలి. అలా అని మనం దూరిపోయి ఇవాళ మధ్య పుల్లలు పెట్టేసి మీ ఆడపడుచులతో మాట్లాడొద్దు, మీ అత్తగారితో సేవ చేయొద్దు, ఆవిడకి నీకు ఏం పని లేదు నీ మొగుడు వరకే చూసుకో అని మాత్రం నేర్పకూడదు. మనం పిల్ల బాధ్యత తీసుకోవాలి.
(02:23) ఎంతవరకు అంటే ఎలా ఉన్నావు అమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? చక్కగా ఉంటున్నారు కదా? అందరితో కలిసి పో అమ్మా. ఏదైనా చిన్న పెద్ద వచ్చిన కూడా సమర్ధించుకోవాలి. అలాగే అత్త ఇంటి విషయాలు వచ్చి పుట్టింట్లో చెప్పకూడదు. పుట్టింటి విషయాలు తీసుకెళ్లి అత్త ఇంటి లో చెప్పకూడదు. అంటే ఏదైనా విరోధాలు వచ్చేవి అయితే చెప్పకూడదు అమ్మా. అన్ని రహస్యాలు చెప్పకూడదు.
(02:42) నీకు బాధ కలిగిన విషయం పుట్టింటి వాళ్ళతో పంచుకో. ఏదైనా చేయగలిగితే మేము సహాయం చేస్తాం అనేలా ఉండాలండి తల్లిదండ్రులు. తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఏదన్నా వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే వెళ్లి మాట్లాడేలా ఉండాలి. ఈ అమ్మాయి ఏదైనా తట్టుకోలేని సమస్య రావచ్చు. ఎందుకంటే అండి కొత్తగా పెళ్లైన అమ్మాయికి పుట్టింట్లో తాను పెరిగిన వాతావరణానికి అత్త ఇంట్లో తాను ఉండవలసిన వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి.
(03:05) ఈ రెండిటి మధ్యలో తాను నలిగిపోయి ఏదైనా ఆరోగ్యపరంగా తను ఏమన్నా సమస్యలు తెచ్చుకుంది అనుకోండి పరిష్కరించాల్సింది ఎవరు? తల్లిదండ్రులేనండి. అండగా నిలబడాలి. అలాంటప్పుడే అండగా నిలబడాలి. వెళ్లి మాట్లాడాలి వాళ్ళతో. మాట్లాడి అంటే సౌమ్యంగా అండి గొడవలు పడేలా కాకుండా సౌమ్యంగా ఇలా ఉందండి ఇలా ఉండకూడదు అని ఏదో చెబితే కొంతవరకు వినే అవకాశం ఉందన్నమాట.
(03:26) తర్వాత అండి మా నాన్నగారు చెప్పేవారు ఏమని అంటే అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ రోజు చెప్తే ఆ రోజు వెళ్ళిపోవాలి అనేవారు. అలా అయితే ఇంకోసారి పంపిస్తారు అనేవారు. అలాగే అక్కడ అన్నీ మోసుకొచ్చి ఇంట్లో చెప్పకూడదు అనేవారు. కానీ అండి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోని ఉంటాయి.
(03:46) మనం వింటే అందులో ఏది చెప్పుకునేదో ఏది చెప్పుకోలేదో మనం చెప్పగలం అనుభవంతో ఉన్న వాళ్ళం. అప్పుడు మనమే చెప్పొచ్చు పిల్లలకి కానీ కష్టాలు ఏమన్నా పడితే ఆ అమ్మాయి ఏమైనా చెప్పుకోలేని బాధలు పడితే అప్పుడు మనం అండగా నిలబడాలండి. చెప్పితే మనం వినాలి ఓర్పుగా ఉండాలి. ఆ అమ్మాయి చెప్పుకునే సమస్యల్లో మనం ఏదైనా పరిష్కరించగలిగిందింటే తప్పకుండా పరిష్కరించాలి.
(04:06) నీకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలండి. పుట్టిల్లు అండంటే ఆ అమ్మాయి ఎలాగైనా నెట్టుకొని వచ్చేస్తుంది. ఎప్పుడైతే పుట్టింటి అండ లేదు అని తెలిసిందో అత్తవారు కూడా విజ్రంభిస్తారండి ఎందుకంటే ఇలాంటివి నేను చూస్తూ ఉన్నాను. చాలా మంది ఇళ్లల్లో పుట్టింటి అండ లేని అమ్మాయిని ఎలా చూస్తారో నాకు తెలుసు. అదే పుట్టిల్లు ఉంది ఎవరు ఊరుకోరు వాళ్ళ అన్నదమ్ములు ఆ తల్లిదండ్రులు ఎవరు ఊరుకోరు మనల్ని అంటే చూసే విధానం వేరుగా ఉంటుంది.
(04:32) పూర్و పద్ధతుల్లో చెప్తున్నానండి నేను ఇప్పుడు కూడా అంతే అండ అనేది ఎప్పుడైనా ఒకటేనండి. ఉద్యోగం చేసినా అండ ఉండాలి పెళ్లైన కొత్తల్లో అండ ఉండాలి దేనికైనా అండ అనేది ఉండాలండి పుట్టింటి అండ ఉంటే ఆ పిల్ల జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది. అలాగే ప్రెగ్నెంటు అవుతుందండి కొత్తగా పెళ్లైన అమ్మాయి ప్రెగ్నెంటు అయితే అప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్లి పిల్లని చూస్తూ ఉండాలి తనకి ఏ అవసరమో వండి పెట్టగలగాలి.
(04:56) అక్కడుండి వండలేకపోయినా ఇక్కడి నుంచి వండైనా తీసుకెళ్లాలండి ఎందుకంటే కడుపుతో ఉన్న అమ్మాయికి తల్లి చేత్తో ఏదో ఒకటి తినాలి అని ఉంటుంది అన్నమాట. వాళ్ళు పంపించారా సరేనండి పంపించలేదు అనుకోండి ఇక్కడి నుంచి పట్టుకెళ్లి అయినా సరే ఆ పిల్ల తినేలా చూడాలి ఆ ఆశలు కూడా మనం తీర్చాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు అండి ఇవన్నీ కూడా.
(05:15) పురుడు పోయడం ఒకటే బాధ్యత కాదు కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా ఆ పిల్ల ఆనందంగా ఉండేటట్టు మనం ఉండాలి అత్తవారి సమస్యలు ఏమన్నా చెప్తుందా అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళదే తప్పు వీళ్ళది ఏమీ లేదు అని సమర్థించకూడదు తప్పొప్పులు మనం ఆలోచిస్తాం మనకు తెలుసు అనుభవం మీద ఉంటాం కదా మనకు తెలిసినట్టు పిల్లలకు తెలియదు కాబట్టి తప్పు నీది ఉందమ్మ తనది ఉంటే తనది ఉంది ఇలా సరిదిద్దుకోవాలి అని చెప్పాలి.
(05:39) అత్తవారిది ఉందనుకోండి అప్పుడు కూడా వాళ్ళు అలా తప్పు చేసినప్పుడు మనం ఎలా మసలుకోవాలి అని చెప్పాలి అంతే గాని వీళ్ళు వెళ్లిపోయి అక్కడ వేధినం చేసి మా అమ్మాయిని బాధలు పెడుతున్నారు మా అమ్మాయి కష్టపடுகிறது అని మాత్రం చేయకూడదు అలా చేస్తే కాపురాలకి చాలా భేదాలు వస్తాయండి చాలా గొడవలు అయిపోతాయి కాపురాలు నిలబడవు కాబట్టి వీళ్ళు చొరకోకూడదండి అమ్మాయి ద్వారానే అమ్మాయి ఇలా ఉంటే నువ్వు అలా నడుచుకోవాలి అలా ఉంటే ఇలా నడుచుకోవాలి అని చెప్పుకోగలగాలి అన్నమాట అప్పుడు కాపురాలు చాలా అలాగేనండి పుట్టిల్లు అనేది ఎప్పటికీ నాకుంది అనే భరోసా మనం కల్పించగలగాలి. నాకు
(06:12) పుట్టిల్లు లేదు అనే బాధ ఆ అమ్మాయికి లేకుండా ఎప్పటికీ ఉందమ్మా నీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము అనే భరోసా కల్పించగలగాలి. అలా కల్పిస్తే ఆ అమ్మాయి జీవితం చాలా బాగుంటుందండి. అంతే కాదండి కూతురికి అల్లుడికి సమస్యలు వచ్చినా పరిష్కరించగలగాలి. ఇద్దరినీ పిలిచి మాట్లాడాలి. పరిష్కరించగలగాలి. కుటుంబ సభ్యులతో వచ్చినా సరే సర్దుకుపోవడం నేర్పాలి ఈ అమ్మాయికి అంటే సర్దుకుపోయేంత వరకు నేర్ నేర్పాలండి.
(06:37) భరించలేనప్పుడు ఆ అమ్మాయే తనే మాట్లాడుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అనుభవం వస్తుంది. మనం సపోర్ట్ గా ఉండి అటు గొడవలు రాకుండా ఇటు గొడవలు రాకుండా మంచిగా మాట్లాడి పరిష్కరించగలగాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు కడుపులో పెట్టుకోగలగాలండి. ఏ కష్టం వచ్చి చెప్పుకున్నా నేనున్నాను నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అలాగే అన్నదమ్ములు ఉన్నారు, ఇంత కుటుంబం ఉందమ్మా నువ్వు ఏ కష్టం వచ్చినా జడవద్దు అనే భరోసా అయితే కచ్చితంగా ఇవ్వాలండి.
(07:04) ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుంది చెప్పండి? ఈ విధంగా కూతురికి పెళ్లి చేయడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత కాదండి. పెళ్లైన తర్వాత కూడా అండగా ఉండడం, అవసరానికి ఆదుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే అల్లుడిని గౌరవించాలి. అల్లుడిని గౌరవించాలి, కూతురి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి. కష్టాల్లో సుఖాల్లో నేనున్నాను అనే బాధ్యతని అన్నదమ్ములకు కూడా నేర్పాలండి.
(07:25) మా తర్వాత నువ్వే చూసుకోవాలి ఆడపిల్లలకు ఏదైనా కష్టం వస్తే పెళ్లి అయిపోతే వెంటనే వాళ్లే కాదు మొత్తం మనం కూడా ఉన్నాము. రెండు కుటుంబాలు కలిసాయి ఇప్పుడు. ఒకే కుటుంబం కాదు అనే అనే ఇది చూపించాలి పిల్లలకి. అప్పుడు ఆడపిల్ల అండి అత్తవారింట్లో చాలా హాయిగా కాపురం చేసుకుంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాకు నా వాళ్ళు ఉన్నారు అనే ఆలోచన ఆడపిల్ల జీవితంలో చాలా సంతోషాన్ని ఇస్తుందండి.
(07:52) ఏ సమస్య వచ్చినా నా వాళ్ళున్నారు. అలాగే అత్తంటి వాళ్ళు కూడా తన వాళ్లే. ఆ విధంగా కూడా మనమే చెప్పాలండి. ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే అక్కడే పరిష్కరించుకునేటట్టు మనమే నేర్పాలి. వాళ్ళని శత్రువుల్లా మనం నేర్పకూడదు. వాళ్ళు కూడా తన కుటుంబమే అనే అనే ఇది నేర్పాలండి మనం. తర్వాత వాళ్ళ ఇంట్లో సమస్యలకు మనం దూరిపోయి ఆ మనదే పెద్ద ఇది, మా అల్లుడు, మా కూతురు అని బిహేవ్ చేయకూడదు.
(08:17) ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అండి. వాళ్ళు ఎంత కని పెంచి పెద్ద చేస్తే కోడలు వచ్చింది ఈ రోజున. కోడలు అనేసరికి కొన్ని కొన్ని భావాలు వస్తాయండి ఆటోమేటిక్ గా. వాటిని కూడా మన అమ్మాయి విషయంలో సరిపెట్టి వాళ్ళని సమర్ధించి వాళ్ళు చక్కగా ఉండేలా చెప్పాలన్నమాట. అంతే గానీ ఆడపిల్లని పెళ్లి చేసేసాం ఇక వదిలేయొచ్చు మనకి ఏ బాధ్యత లేదు అనే ఆలోచన మనం చేయకూడదు.
(08:39) ఆడపిల్ల తల్లిదండ్రులుగా చాలా బాధ్యతలు ఉంటాయండి. ఎన్నో నెరవేర్చాలి. ఎన్నో కష్టాలకు ఎదురీత గానీ ఆ అమ్మాయి జీవితం బాగుండదు. పూర్వపు కాలం పద్ధతి అయితే ఇప్పుడైతే నువ్వెంత నువ్వెంత అనుకుంటున్నారు వాళ్ళ గురించి మనకు అక్కర్లేదండి. ఆడపిల్లగా తన తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తుందో మనం అది ఇవ్వగలగాలి. అది నా ముఖ్యమైన ఉద్దేశం అండి.
(08:58) ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాలి గానీ పుట్టింటి బంధాన్ని అయితే తెంచేయకూడదండి. ఆస్తులు ఇవ్వక్కర్లేదు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం నేర్పితే చాలు. ఆస్తులు కూడా ఇంపార్టెంట్ కాదండి. తన ఆత్మగౌరవంతో నెట్టుకుంటూ వస్తుంది అత్తంట్లో. పుట్టింటి బంధం పెళ్లి అవ్వగానే తెంపేయడం మాత్రం కరెక్ట్ కాదు. కాపురం నిలబడాలని కోరుకోవడం మంచిదే. కానీ ఆమె కన్నీళ్ళను పట్టించుకోకపోవడం కూడా మంచిది కాదు.
(09:21) ఇవండీ నేను చెప్పాలనుకున్న విషయాలు. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేయగానే అయిపోయింది మన బాధ్యత అనుకునే తల్లిదండ్రులకి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నానండి నాకు తెలిసినంత వరకు. మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో ఇంతవరకు ఓర్పుగా చూసినందుకు చాలా థాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ.

No comments:
Post a Comment