Friday, November 27, 2026

Episode 65 💔 గొడవ తరువాత భర్త ఎలా నిద్రపోతాడు?

Episode 65 💔 గొడవ తరువాత భర్త ఎలా నిద్రపోతాడు?

Author Name:Sahami Bharosa

Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IPo3o1LliA0





Title: Episode 65 💔 గొడవ తరువాత భర్త ఎలా నిద్రపోతాడు?

Author Name: Sahami Bharosa

Description: భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన తర్వాత ఒక వింతైన మార్పు కనిపిస్తుంది—భర్త ఏమీ జరగనట్లు హాయిగా నిద్రపోతే, భార్య మాత్రం తెల్లవార్లు ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుంది. ఇది కేవలం నిర్లక్ష్యం లేదా ప్రేమ లేకపోవడం వల్ల కాదు, దీని వెనుక పురుషులు మరియు స్త్రీల మెదడు పనిచేసే విధానం (Brain Biology & Psychology) ఉంది.

గొడవ సమయంలో కలిగే ఒత్తిడికి (Stress) మగవారి మెదడు త్వరగా "షట్ డౌన్" అయి రిలాక్స్ అవ్వడానికి నిద్రను ఒక రక్షణ కవచంలా వాడుకుంటుంది. కానీ ఆడవారి మెదడులో ఎమోషనల్ సెంటర్లు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటం వల్ల, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారు దాని గురించే లోతుగా ఆలోచిస్తూ (Overthinking) ఉంటారు. ఈ తేడాను అర్థం చేసుకోకపోవడం వల్లే "నా బాధ అర్థం చేసుకోకుండా నిద్రపోతున్నాడు" అని భార్య, "చిన్న విషయాన్ని సాగదీస్తోంది" అని భర్త ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ సైకలాజికల్ సత్యాన్ని తెలుసుకుని గొడవలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా విశ్లేషించాము.

Keywords: husband sleeps after fight wife cries telugu, male vs female brain psychology after argument, overthinking after fight in marriage telugu, relationship psychology telugu, husband wife fight psychology, emotional differences between men and women telugu, marriage counseling telugu.

Hashtags: #RelationshipPsychology #TeluguRelationshipAdvice #MarriageDynamics #HusbandWifeFight #MaleVsFemaleBrain #Overthinking #MentalHealthTelugu #MarriageCounseling

Transcript:
(00:06) మనము ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్ళేదానికంటే ముందు ఒక చెల్లి మనకి చిత్తూరు దగ్గర ఒక గ్రామం నుండి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్నయ్య నా పేరు తులసి చిత్తూరు దగ్గర ఒక చిన్న గ్రామం నుండి నేను మెసేజ్ చేస్తున్నాను. అది మొన్న శనివారం మా ఆయనకు ఎంతో ఇష్టమని చికెన్ కర్రీ వండాను. రాత్రి ఎనిమిది న్నర ఆ టైం కి ఇద్దరం భోజనం చేస్తుంటే ఆ వంట ఏదో పెంటలా ఉందని నా ముందే విసిరినట్లు అన్నాడు.
(00:35) నా కష్టం ఎవరికీ పట్టదా అనిపించి నేను కూడా ఎదురు మాట్లాడాను. దాంతో మాట మాట పెరిగి పెద్ద గొడవ అయ్యింది. ఆవేశంలో ఆయన నన్ను పని రాదని నేను పొగరుబోతుని అని నాకు అసలు భర్త అంటే గౌరవం లేదని మా అమ్మ నాకు సరిగ్గా పని నేర్పలేదని నా కన్నతల్లిని కూడా ఎన్నో మాటలు అన్నాడు. ఆ అవమానకరమైన మాటలు తలుచుకొని ఆ రోజు రాత్రంతా నా గుండె పగిలిపోయింది.
(00:58) ఆ రాత్రి నాకు నిద్ర లేదు. ఎప్పటికో మూడు న్నరకు నాకు నిద్ర పట్టింది. కానీ ఆయన ఏమో పది న్నరకే హాయిగా గురక పెట్టి నిద్రపోయాడు. ఇంత పెద్ద గొడవ జరిగిన కూడా ఆయన మనసు ఎంతగా ప్రశాంతంగా నిద్రపోయిందో అని ఆశ్చర్యం వేసింది. నాకు మాత్రం అసలు నిద్ర పట్టలేదు. కానీ భర్త మాత్రం శుభ్రంగా నిద్రపోయాడు. మగవాళ్ళు ఎలా అలా నిద్రపోగలుగుతారు? వారి దాని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? కొంచెం వివరించి చెప్పండి.
(01:26) ఆ మెసేజ్ లో ఆ చెల్లి అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంతో గొడవ జరిగిన కూడా మగవాళ్ళు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతారు? ఆడవాళ్ళు ఎందుకు నిద్రపోలేరు అని ఒక ప్రశ్న అడిగింది. సో మొట్టమొదటి క్వశ్చన్ భార్య ఎందుకు నిద్ర పోలేకపోతుంది? ఎందుకంటే భార్య భార్య మెదడు అనేది కొంచెం ఎమోషనల్ గా ఆలోచిస్తుంది. ఆడవారి మెదడు కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది.
(01:54) వారు ఓవర్ థింక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గొడవ జరిగినప్పుడు వారు అన్న మాటలన్నీ కూడా ఆ మెదడులో రిపీట్ అవుతుంటాయి. నన్ను అంతమాట అంటాడా? నాకు పనిరాదు అంటాడా? నేను పొగరుబోతునా? నేను కుళ్ళుబోతునా? నేను మంచిదాన్ని కాదా? నా తల్లి నాకు పని నేర్పించలేదా? అని తనని అన్న మాటలు అన్నీ కూడా తన బ్రెయిన్ లో రిపీట్ అవుతూ ఉంటాయి.
(02:19) తన బ్రెయిన్ లో కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అయినప్పుడల్లా తను హర్ట్ అవుతుంటుంది, తను ఫీల్ అవుతుంటుంది. అవే రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెదడులో ఆ ఒక కంటిన్యూస్ గా ఆ ఓవర్ థింక్ చేస్తూ ఉంటుంది. దానివలన తన బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి తనకి నిద్ర రాదు. [గురకలు] ఇంక రెండవ పాయింట్ గొడవ జరిగిన తర్వాత ఆ భార్య ఏం చేస్తుందంటే భర్త నుంచి క్షమాపణను కోరుకుంటుంది.
(02:48) భర్త నుంచి కొంచెం సారీ లాంటి పదాలు కోరుకుంటుంది. భర్త నుంచి నాదే తప్పైంది, ఆవేశంలో అన్నాను అనే మాటలను తాను ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇవేమీ జరగకుండా కేవలం ఆ తన పని తాను చూసుకుంటూ భర్త అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతే భార్య బ్రెయిన్ ఇంకా ఇంకా ఓవర్ గా థింక్ చేసేస్తుంది. అండ్ ఇంక మూడవ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తన బ్రెయిన్ ఓవర్ థింక్ చేస్తుంది.
(03:16) ఆల్రెడీ తన బ్రెయిన్ ఆ ఎమోషనల్ గా బాగా ట్రిగ్గర్ అయిపోయి ఉంది. ఆల్రెడీ తన బ్రెయిన్ విపరీతంగా స్ట్రెస్ లో ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఆ భర్త నిద్రపోతున్నాడు అనేది భార్యకి ఇంకా హర్టింగ్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మండుతున్న దాంట్లో కొంచెం పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. ఆల్రెడీ తన మైండ్ విపరీతంగా డిస్టర్బ్డ్ గా ఉంది.
(03:36) ఆల్రెడీ తన మైండ్ విపరీతంగా స్ట్రెస్ లో ఉంది. ఆల్రెడీ తన మైండ్ తన భర్త మీద విపరీతంగా కోపంగా ఉంది. కానీ ఇంత కోపంలో కూడా తను వచ్చి కనీసం క్షమాపణ చెప్పట్లేదు అని తన భార్య యొక్క బ్రెయిన్ మరింతగా కోపగించుకుంటుంది. తను ఎలా నిద్రపోగలుగుతున్నాడు? నన్ను ఒక్కదాన్ని వదిలేసి, నా మీద ప్రేమ లేకుండా, నా మీద జాలి లేకుండా, అయ్యో ఇన్ని మాటలు అన్నానే ఆ వ్యక్తిని అని కొంచెం కూడా జాలి, కరుణ లేకుండా, కొంచెం కూడా ప్రేమ లేకుండా, కొంచెం కూడా కన్సర్న్ లేకుండా పక్కన నిద్రపోతున్నాడే అనేది భార్యకి మరింతగా కోపం తెప్పిస్తుంది.
(04:11) సో ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. భర్త ఎలా నిద్రపోగలుగుతున్నాడు? ఆడవారి బ్రెయిన్ ఇందాక ఎమోషనల్ గా ఆలోచిస్తుందని చెప్పాను కదా, మగవారి బ్రెయిన్ కూడా ఎమోషనల్ గా ఉంటుంది కానీ ఆడవారికి ఉన్నంత ఎమోషనల్ గా ఉండదు. వారు ఓవర్ థింక్ చేసినంత ఓవర్ థింకింగ్ మగవారి బ్రెయిన్ చేయదు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ఓకే గొడవ జరిగింది.
(04:35) ఇప్పుడు నేను పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళాలి, నేను రెడీ అవ్వాలి, ఇప్పుడు నా నిద్రను అంతా నేను పాడు చేసుకుని ఇప్పుడు ఈ రాత్రంతా కూర్చోవడం వృథా అనే విధంగా వారి బ్రెయిన్ ఆలోచిస్తుంది. అండ్ ఇంకోటి కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ఇప్పుడు నేను బతిమాలుతాను, తనని బుజ్జగిస్తాను. బుజ్జగించిన తర్వాత తాను ఇంకా ఇంకా బిట్టు చేస్తుంది. ఇంకా ఇంకా బిట్టు చేస్తుంది.
(04:55) తాను ఆ క్షమాపణని, ఆ సారీని యాక్సెప్ట్ చేయదు. నన్ను ఇంకా బతిమాలించుకుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు శుభ్రంగా నిద్రపోతే పోయింది కదా. చల్లారిన తర్వాత ఇద్దరికీ ఎలాగో మాటలు కలుస్తాయి. ఇంత మాత్రానికి ఇప్పుడు నేను నిద్రను అంతా నేను పాడు చేసుకుని ఆమెను బతిమాలాలా లేక ఆమెను బుజ్జగించాలా అనేది వారికి అది ఒక బర్డన్ లా అనిపిస్తుంది.
(05:18) సో ఆ బర్డన్ లో ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఇంకా ఎఫర్ట్ పెట్టాలని కానీ, బతిమాలాలని కానీ ఆలోచించరు. శుభ్రంగా వెళ్లి ఆ బెడ్ మీద పడుకుంటారు. సో ఇంక మూడో విషయానికి వద్దాం. భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి? భర్త తాను నిద్రపోతున్నాడు అని అర్థం అవుతుంది. తనని కొంచెం కూడా ప్రేమగా చూడకుండా, కన్సర్న్ చూపించకుండా నిద్రపోతున్నాడు అని తాను అర్థమైంది అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? సో ఒక భార్యగా నువ్వు ఏం చేయాలంటే ఇది సర్వసాధారణమైన విషయం.
(05:48) దీంట్లో ఒక నేను ఎక్కువగా థింక్ చేయాల్సిన విషయం లేదని ఆలోచించాలి. మగవారి బ్రెయిన్ అలానే ఉంటుంది. వారు ఎన్ని గొడవలు పడిన కూడా ఆ రోజు వాళ్ళు నిద్రపోతారు. దాన్ని మనం మార్చలేము. ఒక ఆడదానిగా నా బ్రెయిన్ ఇలా వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను. ఇంక నేను ఎంత తాను మెలుకువగా ఉండాలని ఆశించినా కూడా అది జరగని పని.
(06:09) జరగని దానిని గురించి నేను ఆలోచించి నా మైండ్ని, నా ప్రశాంతతని పోగొట్టుకోవడం ఎందుకని నువ్వు అనుకోవాలి. నువ్వు కూడా దానిని ఓవర్ థింకింగ్ చేయకుండా సాధ్యమైనంత వరకు దాన్ని కట్ చేసుకోవడానికే ప్రయత్నించు. ఉదయాన్నే లేచిన తర్వాత కచ్చితంగా నువ్వు రాత్రి ఏ విషయం గురించి అయితే గొడవ పడ్డావో ఆ విషయాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వారికి నేను చెప్పదలచుకుంది ఏంటంటే ఒకవేళ నీ భర్త నిద్రపోయినా కూడా నువ్వు దాని గురించి అతిగా రియాక్ట్ అయ్యి ఆ ఓ స్ట్రెస్ తెచ్చుకునే కంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఆ ఇష్యూ ని క్లియర్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్.

No comments:

Post a Comment