Sunday, November 22, 2026

ఒళ్లు చూపించుకోవడం.. ఫ్యాషన్ ఎందుకైంది? | Fashion Explained |Out of COVERAGE

ఒళ్లు చూపించుకోవడం.. ఫ్యాషన్ ఎందుకైంది? | Fashion Explained |Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1Ob1nNgUZU4





Title: ఒళ్లు చూపించుకోవడం.. ఫ్యాషన్ ఎందుకైంది? | Fashion Explained |Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: Behind the world of fashion lies a complex network of marketing strategies, advertising techniques, consumer psychology, and social influences. This video explores how the fashion industry has evolved and how businesses use fashion trends and advertising to influence consumer choices.

Why are women models used to advertise products that have little or no connection to women's clothing? How did the use of female models in advertising evolve? Are fashion trends influenced by corporate marketing strategies? How do celebrity influence, attraction psychology, and social pressure shape our shopping habits?

This video also discusses women's personal freedom, self-respect, equality, women's safety, male responsibility, and the importance of changing social attitudes.

The purpose of this video is not to impose restrictions on women's clothing choices or personal freedom. It is only to explain the marketing strategies, psychological factors, and social influences behind the fashion industry.



DESCLAIMER : 👇
This video does not aim to impose restrictions on women's clothing choices. It is intended only to explain the marketing strategies, psychological factors, and social influences behind the fashion industry.

Watch the complete video and share your thoughts in the comments. Healthy and respectful discussions are always welcome.



DESCLAIMER : 👇
Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#womensafety
#fashion
#marketingstrategy
#outofcoverage

Transcript:
(00:01) చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెప్పేది అది చాలా కారంగా ఉంటది అందుకే నేను కాస్త మార్చి తీవ్రత తగ్గించి చెప్తా ఒక వ్యక్తి డ్రైనేజీ దుర్వాసన కన్నా దరిద్రంగా కంపుకొట్టే ఒక పెంటకుప్ప పక్కన కూర్చొని దోసకాయ తింటున్నాడట ఓ పెద్దాయన అటుగా ముక్కు మూసుకొని వెళ్తూ అరే బాబు ఇలాంటి చండాలని ప్లేస్ లో కూర్చొని తింటున్నావ ఏంది అని అడిగాడట దానికి వాడు నా ఇష్టం నీకెందుకు ముక్కు మూసుకొని నీ దారు నువ్వు అన్నాడంట దానికి ఆ పెద్దాయన ఏదో పిల్లగాడు తెలియక అన్నాడులే అనుకొని అది కాదు బాబు కాస్త ముందుకు మంచి పార్క్ ఉంది.
(00:34) అక్కడ కూర్చొని తినొచ్చు కదా అంటే వాడు కోపంగా చూస్తూ ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఏమని అన్నావ అంటే ఆ పెంటలో ముంచుకొని తింటా ఏం చేస్తావ్ అన్నాడట దీనికి ఈ వీడియోకు లింక్ ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆడవాళ్ళ బట్టలు అనగానే అవతలి వాడు ఏం చెప్తున్నాడు వాడి ఉద్దేశం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా నోరేసుకొని పడిపోతున్నారు కొందరు.
(00:56) అందుకే చాలా మంది దీని గురించి మాట్లాడాలంటే మనకఎందుకు వచ్చిన పెంట అనుకొని సైలెంట్ గా ఉంటున్నారు. కానీ రెండే రెండు విషయాలు చెప్పడం నా బాధ్యతగా భావించాను అందుకే ఈ వీడియో చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అది మీ ఇష్టం. మీ వ్యక్తిగతం దాన్ని కాదనే రైట్ ఎవ్వరికీ లేకపోవచ్చు. అయితే నేను చెప్పాలనుకుంటున్న ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి వల్లు కనిపించే బట్టలు మీరే వేసుకుంటున్నారా లేదంటే మీకు తెలియకుండా మీతో ఇండైరెక్ట్ గా ఎవరైనా వేయిస్తున్నారా రెండోది ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల మీకు కలిగే ప్రమాదం ఏమైనా
(01:30) ఉందా? ఇవి రెండిటికీ మీకు ఆన్సర్ తెలిస్తే హ్యాపీగా ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోవచ్చు. తెలియదు అంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 2026 నుంచి ఒక 100 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. లేదంటే కనీసం ఒక 50 60 ఏళ్ళు వెనక్కి వెళ్లి చూద్దాం. ఆ సమయంలో భారతదేశంలో బయట తిరిగేది మగాళ్ళ మాత్రమే బయట పని చేసేది మగాళ్లే సంపాదించేది వాళ్లే డబ్బు ఖర్చు పెట్టేది కూడా మగాళ్లే.
(01:56) ఈ ఖర్చు పెట్టడం అనే ఆఖరి పాయింట్ ఉంది చూసారా ఇక్కడి నుంచే మొదలైంది అసలు కథ. వ్యాపార సంస్థలకు కస్టమర్ మగాడే. ఆ కస్టమర్ ను తన షాప్ కు రప్పించాలంటే తన వస్తువు కొనిపించాలంటే మొదట్లో ఆ వస్తువు క్వాలిటీ గురించి చెప్పేవారు కానీ ఆ తర్వాతనే బిజినెస్ మాస్టర్ మైండ్స్ బుర్రలో ఒక మెరుపు లాంటి ఐడియా తట్టింది. ఎక్కడ కొడితే ఒక మొగాడు పడతాడో పడిపోయి గిలగిలా కొట్టుకుంటాడో అక్కడ టార్గెట్ చేశారు.
(02:21) అలా వ్యాపారులకు దొరికిన అతి పెద్ద ఆయుధం స్త్రీ. నేచర్ లో అపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ అనేది అత్యంత సహజమైన విషయం. అది మనలాంటి సాంప్రదాయ దేశాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అనాదిగా ఆడవాళ్ళు ఒల్లు కనపడనేయకుండా నిండుగా బట్టలు కట్టుకుంటారు. ఆరు గజాల చీరను ఎంతో హుండాగా చుట్టుకుంటారు. అలాంటి ఒక సాంప్రదాయ సమాజంలో ఒక్కసారిగా ఆడవాళ్ళకు మిడ్డీలు చెడ్డీలు స్కట్టులు వేసి చూపిస్తే ఎలా ఉంటుంది అప్పటివరకు నిండుగా బట్టలు కట్టుకున్న స్త్రీలను మాత్రమే చూసిన మగాళ్ళకు ఇలా పొట్టి బట్టల్లో స్త్రీని చూస్తే ఒక్కసారిగా మతి పోద్ది.
(02:53) అలా వాళ్ళు స్త్రీ అంగాల ప్రదర్శనకు ఆకర్షితులై చొంగ కార్చుకుంటూ వచ్చి మన సరుకులు కొంటారు. ఇది కాకలు తీరిన బిజినెస్ పర్సనాలిటీల స్ట్రాటజీ అలా మొదటిసారిగా తమ సరుకులను స్త్రీలతో మార్కెటింగ్ చేయించడం మొదలు పెట్టారు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్నది కుమారి జేసుద గారు. అప్పట్లో మగాళ్ళు కట్టుకునే లుంగీల్లో శంకు మార్కు లుంగీలు అనేవి ఒక బ్రాండ్.
(03:16) ఈ లుంగీలు కట్టుకునేది మొగాళ్ళ కదా మరి ఒక స్త్రీకి చుట్టూ ప్రమోట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఆ తర్వాత కాలంలో ఇలాంటి లుంగీలను ఆడవాళ్ళతో కట్టించి మోకాళ్ళ పైకి చుట్టించి తొడలు కనిపించేలా ఫోటోలు తీసి హోర్డింగ్ లో పెట్టి మార్కెటింగ్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి మగాళ్ళ కట్టుకునే లుంగిని ఆడవాళ్ళకు చుట్టి యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ లుంగి క్వాలిటీ బాగుందని చెప్పడానికి దాని రంగు పోదు అని చెప్పడానికి మా లుంగునే కట్టుకోండి అని చెప్పడానికి ఒక మగాడికే ఆ లుంగి కట్టి చూపించొచ్చు కదా కానీ అలా చేయలేదు.
(03:44) ఎందుకు మగాడికి లుంగి కడితే ఇంకో మొగాడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. కానీ అదే ఒక వయసులో ఉన్న ఆడపిల్లకు ఆ లుంగి కట్టి కాస్త కాళ్ళు కనిపించేలా నిలబెడితే రోడ్డు మీద వెళ్ళే ప్రతి మగాడు ఆగి ఆ పోస్టర్ ను చూస్తాడు. ఆ పోస్టర్ ను చూసినప్పుడు ఆ బ్రాండ్ వారి మెదడులో ముదిరించుకుపోతుంది. రేపు దుకానానికి వెళ్ళినప్పుడు అదే బ్రాండ్ లుంగి కొంటాడు.
(04:05) ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది మన దేశంలో మన తెలుగులో జరిగిన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలా మగాళ్ళను టెంప్ట్ చేయడం కోసం ఆడవాళ్ళకు సంబంధం లేని వస్తువులను కూడా సగం సగం బట్టలు వేయించి వాళ్ళతో అడ్వర్టైజింగ్ చేయించడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి విదేశాల్లో మనకంటే వందేళ్ల ముందే మొదలైంది. 1920 30 ఏళ్ల కాలంలోనే సిగరెట్ కంపెనీలు కార్ల కంపెనీలు షేవింగ్ బ్లేడ్ల కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మహిళలను వాడుకోవడం మొదలు పెట్టాయి.
(04:32) సిగరెట్ తాగేది షేవింగ్ చేసుకునేది మగాడు కానీ ఆ ప్రకటనలు అన్నింటిలో సగం సగం బట్టలతో ఒంటిని చూపించుకునే మహిళల బొమ్మలే ఉండేవి. అంటే స్త్రీ శరీరాన్ని ఆశ చూపి మగాడిని తమ బుట్టలో వేసుకోవడం అనే ఒక పక్కా మార్కెట్ బజార్ వ్యూహం ఒక బరితెగింపు వ్యాపార సూత్రం ఇది. సోషల్ మూవింగ్ అంటూ ఆడ మగ చట్టా పట్టాలు వేసుకొని తిరిగే వెస్టరన్ కంట్రీస్ లోనే సక్సెస్ అయిన మార్కెట్ మంత్ర ఇది.
(04:55) అలాంటిది సిగ్గును చీరకట్టులో దాచేసే మనలాంటి సాంప్రదాయ దేశాల్లో ఈ మంత్రదండం ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో బిజినెస్ మైండ్ కు తెలిసినంత బాగా సాధారణ బ్రెయిన్లకు తెలియదు. వాళ్ళ బిజినెస్ ఐడియాకు తిరుగే లేదని మొదటి మార్కెటింగ్ సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతిక్షణం నిరూపితం అవుతూనే ఉంది. ఈరోజు మీరు టీవీ ఆన్ చేసిన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన రోడ్డు మీద పెద్ద పెద్ద హోల్డింగ్లు చూసిన ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తుంది.
(05:19) ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఒక సోఫా కంపెనీ వాడు తన సోఫా మంచిది అని చెప్పడానికి అమ్మాయి మాత్రం ఎందుకు కావాలి సరే అమ్మాయితోనే చెప్పించనవండి. అలా చెప్పే అమ్మాయి తొడలు కనిపించేలా ఎందుకు బట్టలు వేసుకోవాలి మా సిమెంట్ బస్తా కొనండి అని చెప్పడానికి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎందుకు ఇది 90స్ వరకు సాగిన మార్కెటింగ్ మాయలోని మొదటి మెట్టు ఆ తర్వాత సెకండ్ ఫేజ్ మొదలైంది.
(05:41) ఆడవాళ్ళకు సగం బట్టలు వేసి చూపిస్తూ తమ వస్తువులు అమ్ముకున్న కంపెనీలు కాలం మారే కొద్దీ మరో సరికొత్త ఆలోచన చేశయి. మనం వేరే వస్తువులను అమ్మడానికి ఈ బట్టలను ఒక సాధనంగా వాడుకుంటున్నాం కదా అసలు ఈ సగం సగం బట్టల్నే ఒక ఫ్యాషన్ గా మార్చేస్తే అప్పుడు ఈ బట్టలనే నేరుగా కోట్లాది మంది మహిళలకు అమ్ముకోవచ్చు కదా అని ఆలోచించారు. అంతే అక్కడితో ఆటం మొత్తం మారిపోయింది.
(06:02) ఒళ్ళు కనిపించే బట్టలను అమ్ముకోవడమే వేల కోట్ల రూపాయల బిజినెస్ గా మారిపోయింది. ఇందులోనే ఇంకో విచిత్రమైన మార్కెటింగ్ లాజిక్ ఉంది. గమనించారో లేదో బట్టల సైజు తగ్గే కొద్దీ వాటి ధర పెరుగుతూ ఉంటుంది. నిండుగా కట్టుకునే ఒక మంచి కాటన్ చీర ₹1000 రూపాయలకు వస్తే కనీసం సగం వంటిని కూడా కప్పలేని ఒక చిన్న మోడరన్ డ్రెస్ ధర 5000 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది.
(06:23) అంటే తక్కువ పట్టతో ఎక్కువ లాభం మరి ఇలాంటి మార్కెట్ మాయలో మన ఇంటి ఆడవాళ్ళు ఎలా పడ్డారు ఎలా పడుతున్నారు అనేది మరో కీలకమైన విషయం. దీని వెనుక ఒక అత్యంత శక్తివంతమైన హ్యూమన్ సైకాలజీ సైలెంట్ గా పనిచేస్తుంది. అదే అట్రాక్షన్ సైకాలజీ. ఒక మనిషి మెథడ్ ఎలా పని చేస్తుందో ఈ పొట్టి బట్టలు కొనే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాటిని అమ్ముకునే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం సంపూర్ణంగా తెలుసు.
(06:46) టీవీ యాడ్స్ లో వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఆడవాళ్ళు ఎవరు సినిమా హీరోయిన్లు మోడల్స్ ఉంటారు. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అలాంటి అందమైన హీరోయిన్లను చూసి నేను కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో అనే కోరిక కలగడం మానవ సహజ లక్షణం. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా కాబట్టి వారు వేసుకున్నటువంటి బట్టలు వేసుకోవడం ద్వారా పరోక్షంగా ఆ కోరికను తీర్చుకునేందుకు మనిషి మెదడు తాపత్రేయ పడుతూ ఉంటుంది.
(07:11) ఈ ఆలోచన టీనేజ్ నుంచి 40 ఏళ్ల వరకు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పాతికేళ్లకు అటు ఇటుగా ఉండేవాళ్ళలో పీక్ స్టేజ్లో ఉంటుంది. షాపింగ్ కి వెళ్తే గంటల తరబడి బట్టల దుకానాల్లో తిరిగిన వందల కొద్ది డ్రెస్సులు చూసిన ఒక పట్టాన ఏది నచ్చకపోవడానికి సెలెక్షన్ పూర్తి కాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా ఈ ఆకర్షణే నేను ఈ డ్రెస్ వేసుకొని బయటకి వెళ్తే చూసే వాళ్ళకి బాగా కనిపిస్తానా లేదా అనే ఒక అదృశ్యమైన పోటి ఒక తపన రాను రాను ఎక్కువైపోతుంది.
(07:37) ఇక్కడ అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా వాళ్ళు కావాలని చేయరు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఒక మోడల్ వేసుకున్న బట్టలను ఒక హీరోయిన్ వేసుకున్న దుస్తులను ఎవరో చూసి ఎవరో కొంటారు. ఆమెను మరెవరో చూస్తారు. అలాంటిదే కావాలంటూ ఇంకెవరో దుకానానికి పరిగెడతారు. ఇలా ఒక ఫ్యాషన్ అనేది శర వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది.
(08:00) ఇది కింది స్థాయికి చేరేసరికి మరొకటి పైనుంచి వస్తూనే ఉంటుంది. ఇలా ఇదొక విష వలయంగా మారిపోతుంది. ఎవరో సెట్ చేసిన ట్రెండ్ లో పడి మిగిలిన వాళ్ళంతా కొట్టుకుపోతూ ఉంటారు. మనం బట్టల షాప్ కి వెళ్తే ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందండి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ ప్రపంచంఅంతా దీన్నే వేసుకుంటుంది అనగానే దాన్ని పట్టుకుంటారు. మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వాళ్లే అబ్బే ఈ ట్రెండ్ పాతది అయిపోయిందండి ఇప్పుడు ఇది ఓల్డ్ ఫ్యాషన్ ఇది వేసుకుంటే జనం నవ్వుతారు అనగానే అవునా ఛి అన్నట్టుగా పక్కన పెడేస్తారు.
(08:30) అంటే నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా వేసుకున్న బట్టలు ఎవరో ఒపీనియన్ తో పనికి రాకుండా పోతున్నాయి. అలా మళ్ళీ కొత్త బట్టల కోసం పరుగులు పెడుతున్నారు. మార్కెట్ మనల్ని ఎంత దారుణంగా బకరాలను చేస్తుందో ఇంతకన్నా ప్రూఫ్ కావాలా ఈ విధంగా ఫ్యాషన్ ప్రపంచం అనే సాలెగడులో చిక్కి జనాలు గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు.
(08:48) ఇంట్లో డబ్బు ఉన్నా లేకున్నా సంబంధమే లేదు నేను కోరుకున్న బట్టలు కావాల్సిందే అనే పరిస్థితిలో పడిపోతున్నారు. అందుకే ఒల్లు కనిపించే బట్టలు కొనే ముందు వేసుకునే ముందు ఒక్కసారి ఇలా ఆలోచించండి. అసలు మనం ఈ ఫ్రీ షో ఎవరికి చూపిస్తున్నాం? రోడ్ల మీద తిరిగే పోరంబోకులకు కొదవే లేదు కదా అలాంటి వాళ్ళకు ఒంటిని చూపెట్టుకోవడం ఏంటి సినిమాలో నటించే హీరోయిన్లు ఐటం గర్ల్స్ తమ ఒంటిని చూపిస్తే వాళ్ళకు లక్షలు కోట్ల రూపాయలు ఇస్తారు.
(09:14) మరి సాధారణ జనానికి ఎవరు ఇస్తారు ఏమఇస్తారు. ఈ ఆకర్షణ మౌజులో పడి ట్రెండ్ అనే పేరు వెనక పరిగెత్తే వాళ్ళు అందులో ఉన్న కనిపించిన పెద్ద ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఒక తాగుబోతు ఫుల్ గా లిక్కర్ తాగాడు. ఇది కూడా బాధ్యత గల ప్రభుత్వమే అమ్ముతుంది. ఫుల్ గా తాగిన వాడి బ్రెయిన్ లో మంచి చెడు నిర్ణయించే ప్రీఫంటల్ కార్టెక్స్ అనేటువంటి భాగం పనిచేయదు.
(09:35) అంటే విచక్షణ కోల్పోతాడు. అప్పుడు వాడు సినిమా చూసి అందులో సగం బట్టలు వేసుకున్న హీరోయిన్ మీద కోరిక కలిగింది అనుకోండి వాడు ఏం చేస్తాడు సోయిలేని ఇలాంటి సోంబేర్ గాళ్ళు చేతి కంద్రలను పట్టుకుంటారు. దిశ నిర్భయ లాంటి ఎన్నో దారుణ సంఘటనలు జరిగింది ఇలాంటి పరిస్థితుల్లోనే అని మనం మర్చిపోకూడదు. పొట్టి బట్టలు వేసుకొని సినిమాల్లో కనిపించిన వాళ్ళు సాధారణ రోడ్ల మీద నడవరు. మన ఇంటి ఆడబిడ్డలే నడుస్తారు.
(09:57) అలాంటి సమయంలో నేరగాళ్లకు తాగుబోతులకు చిక్కేది వీళ్లే కోరుకున్నది దక్కే అవకాశం లేనప్పుడు ఈజీ టార్గెట్ పైన వీళ్ళు దాడి చేస్తారు. అలాంటి ఈజీ టార్గెట్ ఎవరు మన ఇంటి మన పక్కింటి అమ్మాయిలో రోడ్డు మీద నడిచే అభాగ్యులు అవుతారు. ఈ విషయాన్ని మెజారిటీ జనం కనీసంగా కూడా ఆలోచించరు. ఆలోచించేంత అవగాహన కూడా ఉండదు. అందుకే ప్రముఖ స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మ గారి లాంటి వాళ్ళు నేరుగానే ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచాన్ని అత్యంత ఘాటుగా ప్రశ్నిస్తారు.
(10:25) రంగనాయకమ్మ తన రచనల్లో ఇంటర్వ్యూలో అత్యంత కఠినమైన పదాలు వాడారు. అవి నేను ఇక్కడ చెప్పలేనంత తీవ్రంగా ఉంటాయి. ఆ మాటల సారాంశం ఏంటంటే ఫ్యాషన్ పేరుతో ఆడవాళ్ళు ఎందుకు తమ శరీర భాగాలను ప్రదర్శిస్తున్నారు అలా అందరికీ చూపించుకోవాలనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు బట్టలు వేసుకోవడం ఎందుకు మొత్తం విప్పేసుకోవచ్చు కదా అన్నంత తీవ్రంగా ఆవిడ విమర్శించారు.
(10:46) ఒక మహిళ అది కూడా జీవితాంతం స్త్రీల హక్కుల కోసం స్త్రీ సమానత్వం కోసం పోరాడిన ఒక మహిళ రచయిత అంత ఘాటుగా స్పందించారంటే ఈ ఫ్యాషన్ మాయాజాలం మహిళల ఆత్మగౌరవాన్ని ఎంతలా దెబ్బదీస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలను అర్థం చేసుకోలేని వాళ్ళు సోషల్ మీడియాలో స్త్రీ స్వేచ్ఛ అంటూ పోస్టులు పెడుతుంటారు. వీళ్ళలో చాలా మందికి స్వేచ్ఛకు స్వాతంత్రానికి తేడా తెలియదు.
(11:06) ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. వేల ఏళ్లుగా మగాడు స్త్రీని వంటింటికే పరిమితం చేశారు అనేది ఎవ్వరూ కాదనలేని విషయం. స్త్రీపై ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతుంది అనేది వాస్తవం. దాన్ని ఓవర్కమ్ చేయాల్సిందే కానీ అది ఎలా సగం సగం బట్టలు వేసుకోవడం ద్వారానా కాదు కదా మన స్వాతంత్రాన్ని నిరూపించుకునేది కేవలం బట్టలా అది కూడా పరోక్షంగా మనకు ప్రమాదం కలిగించేవి.
(11:26) అది సరైంది కాదని నేను భావిస్తున్నాను. మీరు కోరుకున్న రంగంలో పైకి ఎగరాలి ఎదగాలి మీ టాలెంట్ తో మీ పనితో మగాడి గర్వాన్ని లెఫ్ట్ లెగ్ తో తనండి. మీకన్నా మేము ఎందులోను తక్కువ కాదు మీకన్నా మేమే తోపు అని మీ మేదస్సుతో మీ శ్రమతో గర్వంగా చాటి చెప్పండి. అది వదిలేసి ఒల్లు చూపించుకునే బట్టల్లో మాత్రమే స్వేచ్ఛ వెతుక్కోవడం సరైన పద్ధతి అవుతుందా? గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు ఏ ఉద్దేశంతో ఇలాంటి మాటలు అంటున్నారో మనం గమనించాలి.
(11:51) ఇలాంటి వారు మరో మాట కూడా అంటారు మగాడి ఆలోచన విధానం మారాలి అని స్త్రీలు చూసే దృష్టికోణం మారాలి అని ఈ స్టేట్మెంట్ కూడా ఒకవైపు మాత్రమే చూసేవారు ఇస్తుంటారు. మగాడు కడ్డయర్ వేసుకొని రోడ్డు మీద నిలబడి స్నానం చేస్తున్న తప్పు కాదు కానీ ఆడవాళ్ళు మాత్రం నిండుగా బట్టలు కప్పుకోవాలనే సమాజంలో పుట్టాం మనం. ఈ సంగతి మర్చిపోవద్దు కదా ఈ పద్ధతిని మార్చాలంటే ఈ ఆలోచన విధానం మారాలంటే రాత్రికి రాత్రి జరిగిపోదు కదా ఈ మార్పు రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఎవరికీ తెలియదు.
(12:18) ప్రతి ఇంటి నుంచి స్కూల్ నుంచే మొదలవ్వాలి. ఒక అమ్మాయిని ఎలా చూడాలి అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి స్త్రీని ఎలా గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచే ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు నేర్పించాలి. మరి మన స్కూల్లలో ఇలాంటి హ్యూమన్ బిహేవియర్ గురించి కనీసం [గొంతు సవరించుకోవడం] ఒక్క లెసన్ ఉందా? పరీక్షల్లో మార్కులు గీకోవడానికి ర్యాంకుల కోసం బట్టీలు పట్టించడం కోసం తప్ప అసలు మన విద్యా వ్యవస్థలో ఈ సాంప్రదాయం ఉందా? ప్రతి ఇంట్లో ఎంతమంది మగపిల్లలకు ఇలాంటి విషయాలు నేర్పుతున్నారు.
(12:43) సెక్స్ గురించి మాట్లాడడమే తప్పుగా భావించే ఈ సమాజంలో ఇలాంటి మార్పులు ఏమి చేపట్టకుండా మనిషి ఆలోచన విధానం మారాలి అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేసి చేతులు దులుపుకుంటే పనియపోతుందా సినిమాలో మినీస్ కట్టు వేసుకొని ఆ డ్రెస్ తో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న హీరోయిన్ చూసిన 18 ఏళ్ల టీనేజర్ మనసులో ఎలాంటి కోరిక కలుగుతుంది ఆ ఉమ్మిరుతో ఏదైనా అగాత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు వీటికి సమాధానం ఉండదు.
(13:07) కాబట్టి ఇంటి చుట్టూ పకట్బంది రక్షణ గోడలు నిర్మించుకొని జనాల్లోకి వస్తే చుట్టూ బౌన్సర్లను వెంటేసుకొని దుస్తుల్లో స్వేచ్ఛ గురించి మాట్లాడే వారి మాటలను జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలి. అలాంటి వాళ్ళను ఒక రోడ్ సైడ్ రూమ్ టచ్ చేయలేడు. రోడ్డు మీద తిరిగే సాధారణ అమ్మాయిలే ఈజీ టార్గెట్ అవుతారు అని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది పూర్తిగా మహిళల భద్రత కోణంలో చేసిన వీడియో ఇంకా మహిళల శరీరాన్ని ఆత్మాభిమానాన్ని బిజినెస్ అడ్వర్టైస్మెంట్లు ఎలా వాడుకుంటున్నాయో సామాన్యులు తమకు తెలియకుండానే అందులో ఎలా పావుగా మారిపోతున్నారో తెలియచెప్పే ఒక ప్రయత్నం ఇది. ఇలా ఒక పాజిటివ్ కోణంలో చేసిన
(13:39) ఆర్గ్యుమెంట్ ఇది. అర్థమైతే అర్థం చేసుకోగలిగితే ఆరోగ్యకరమైన చర్చ చేయండి. నచ్చకపోతే మీ బాటలో మీరు ముందుకు సాగిపోండి. సెలవు

No comments:

Post a Comment