Friday, May 26, 2023

ధనం - ధర్మం ఏది గొప్పది?

 https://chat.whatsapp.com/K9DI6jBkFqc6nH7pSwRTSL


*💸ధనం - ధర్మం ఏది గొప్పది?💰*
              

💸 *అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని పంచతంత్ర వాక్యం. ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.* 

 💰 *డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.* 

💸 *ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. తిరిగి వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు?' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది.* 

💰 *అప్పుడా పండితుడు… అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.* 

💸 *1. తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది.*

💰*2. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం.* 

💸 *3. సోదరుడినుంచి వచ్చినది అధమం.* 

💰 *4. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం.* 

💸 *5.విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశ పడకూడదు.* 

💰*6.సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు.* 

💸 *7.ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి.* 

💰 *8. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు.* 

💸 *9. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు.* 

💰*10. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం.*.

క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం

 చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదంటూ  బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి పడింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి పడింది  ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸అన్నదమ్ములది కావచ్చు!
🔸అక్కాచెల్లెళ్ళది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు !
🔸మన దగ్గర పని చేసే వారిది కావచ్చు! 
🔸మన మంచిని కోరే స్నేహితులది కావచ్చు!     
🔸మన శ్రేయస్సు కాంక్షించే బంధువులది కావచ్చు!

మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము🌹🙏🌹
 🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

     *మనందరిలోనూ* చెడు *తలంపులు* ఉంటాయి... *కానీ* మనలో *కొందరే* చెడు *చేసే* వారు *ఉంటారు*.. అలాగే *మనందరం* మంచి *చేయగలం*.. కానీ *మనలో* కొందరే *మంచి* పనులు *చేసేవారు* ఉంటారు..
     *గెలవాలన్న* తపన, *గెలవగలను* నమ్మకం, *నిరంతర* సాధన, *ఈ* మూడే *నిన్ను* గెలుపుకు *దగ్గర* చేసే *సాధనాలు*..
     *కడుపు* నిండిన *వాడికి* పెట్టిన *అన్నం*.. *సముద్రం* లో *కురిసిన* వర్షం.. *ధనవంతుడు* ఇచ్చిన *బహుమానం*.. *పగలు* వెలుగుతున్న *దీపం*.. *బందనాలు* లేని *బంధం*.. *అసమర్థులు* తో *వ్యాపారం*.. *హద్దుల్లేని* స్నేహం... *నిజాయితీ* లేని *ప్రేమ* .. *వ్యర్థం వ్యర్థం వ్యర్థం*..
     *ప్రేమగా* పలకరించే *పిలుపులో* వెలకట్టలేని *సంతోషాలు* దాగి *ఉంటాయి*..
     *ప్రతి* ప్రయాణానికి *గమ్యం* ఉంటుంది, *ప్రతి* పరిచయానికి *ఒక* కారణం *ఉంటుంది*..
     *జ్ఞానమనేది* సంపాదిస్తే *వచ్చేది* కాదు... *మనలో* ఉన్న *అజ్ఞానాన్ని* విడిచిపెడితే *వచ్చేది*..!!

        *విద్య మరియు వైద్యం ఉచితం చేయండి చాలు..!  ఇంకే ఉచితాలు అక్కర్లేదు*..!!🖊️✍️
🙏😷 *శుభ శుభోదయం* 😷🙏


సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!

 *సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!*

స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. 
ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి...

సుమారుగా 2500 ఏళ్ల కింద‌ట గౌతమ బుద్ధుడు మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కు, స‌రైన జీవ‌న విధానానికి కొన్ని సూచ‌న‌లు చేశాడు...
*కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని చెప్పాడు.*
కానీ వాటిని మ‌న నిత్య జీవితంలోకి అన్వ‌యించుకుని వాటిని పాటిస్తూ..

సుఖ‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.
 మ‌రి మ‌న జీవ‌నం కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మితిమీరిన కోపం ప‌నికిరాదు. కోపం నిన్ను శ‌త్రువును చేసి నిన్ను నాశ‌నం చేస్తుంది. నీ ప‌త‌నానికి నీ కోప‌మే కార‌ణ‌మ‌వుతుంది, క‌నుక కోపం ప‌నికిరాదు, శాంతంగా ఉండాలి.

2. జీవిత ప్ర‌యాణం సాఫీగా సాగుతుంద‌నుకున్న‌ప్పుడు నువ్వు స్వ‌త‌హాగా ఆకాశం కేసి చూసి న‌వ్వుకుంటావు.

3. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రిలాగే నువ్వు కూడా ఇత‌రుల నుంచి ప్రేమ‌, అనురాగం పొందేందుకు అర్హుడివి.

4. నిజం ఎన్న‌టికీ దాగ‌దు. సూర్య‌, చంద్రులు ప్ర‌కాశించకుండా ఉండ‌లేరు.

5. మ‌న‌స్సులో ఎలాంటి క‌కావిక‌ల‌మైన ఆలోచ‌న‌లు లేకుండా నిర్మ‌లంగా ఉన్న‌వారే శాంత‌మూర్తులు అవుతారు.

6. త‌ప్పు చేసిన వారిని క్ష‌మించండి. వారిని అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

7. ఎవ‌రి జీవితంలో అయినా అతి పెద్ద ఓట‌మి అంటే.. నిన్ను న‌మ్మిన వారికి నిజం చెప్ప‌క‌పోవ‌డ‌మే.

8. ఎలాంటి దారి లేనిచోట నువ్వు న‌డిచే తోవ‌నే దారి అవుతుంది.

9. మంచి మాట‌లు ఎన్ని చెప్పినా, ఎన్ని చ‌దివినా.. వాటిని ఆచ‌ర‌ణలో పెట్ట‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.

10. శ‌త్రువుల‌ను చూస్తే చ‌క్క‌గా మొరిగే కుక్క‌నే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మ‌నిషి మంచిగా మాట్లాడితేనే మంచి మ‌నిషి అవుతాడు.

11. మ‌న‌స్సుంటే మార్గ‌ముంటుంది. 

12. స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి.

13. మంచి మాట‌తీరు, జాలి గుణం, సేవా త‌త్ప‌ర‌త అనేవి మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌లు.

14. ఎట్టి ప‌రిస్థితిలోనూ భ‌య‌ప‌డ‌కూడ‌దు. నీలో ఉండే భ‌యాన్నిఎప్పుడూ పార‌ద్రోలాలి. నువ్వు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌దు. నువ్వు చ‌క్క‌గా ఉంటే ఇత‌రుల నుంచి స‌హాయం అర్థించ‌కూడ‌దు. అదే నీ స్వేచ్ఛ‌కు చిహ్నం.

15. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా.. మ‌న‌కు వ‌చ్చే క‌ష్టాన్ని, స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని వేచి చూడ‌కూడదు.

16. ఏ ప‌ని చేసినా అంకిత భావంతో, మ‌న‌స్సులో ఎలాంటి చెడు భావాలు లేకుండా చేయాలి.

17. స‌మ‌స్య‌ల‌ను నీకై నువ్వు ప‌రిష్కరించుకో. ఇత‌రుల‌పై ఆధార ప‌డ‌కు.

18. మ‌నం ఏదైతే ఆలోచిస్తామో.. అదే ఆచ‌ర‌ణ‌లో చేస్తాం. క‌నుక ఆలోచ‌న‌లు స‌క్రమంగా ఉండాలి. స‌క్ర‌మ‌మైన ప‌నులు చేస్తాం.

19. నిన్ను న‌వ్వు జ‌యించు. ఆ తరువాత ఇత‌రుల‌ను జ‌యించ‌డం సాధ్య‌మ‌వుతుంది.

20. గొడ‌వ‌లు సృష్టించే 1000 ప‌దాల క‌న్నా శాంతిని తెచ్చే ఒకే ఒక్క ప‌దం మాట్లాడ‌డం ఉత్త‌మం.

21. ఇత‌రుల‌ను ప్రేమించ‌లేని వారు వారి క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేరు.

22. మానసికంగా దృఢంగా ఉంటేనే శారీర‌కంగా ఆరోగ్యం బాగుంటుంది.

23. మ‌నిషి త‌న‌కు వ‌చ్చే రోగాల‌కు తానే బాధ్య‌త వ‌హించాలి.

24. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వుత్తుల‌ను వెలిగించ‌వ‌చ్చు , అలాగే సంతోషాన్ని  ఎంత మందికి పంచినా త‌ర‌గ‌దు.

25. గ‌తం గురించి ఆలోచిస్తూ విచారించ‌కు. భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌ని ఆందోళ‌న చెంద‌కు. వ‌ర్త‌మానంలో జీవించు.

మిత్రమా...వదిలెయ్....

 .
మిత్రమా...వదిలెయ్                        
ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం* 
        _*👉వదిలెయ్*_

పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, 
వారి వెనుకాల పడక 
        _*👉వదిలెయ్*_

కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి.  ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, 
అటువంటి వాళ్లను
        _*👉వదిలెయ్*_

ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోక పోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా 
        _*👉వదిలెయ్*_                                   

మనచేతుల్లో ఏమీ లేదు... మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
        _*👉వదిలెయ్*_

మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను 
         _*👉వదిలెయ్*_

ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చుకోకుండా
        _*👉వదిలెయ్*_

నేను మంచి స్నేహితుడిగా నీకనిపిస్తే సరేసరి, లేదంటే 
_*👉వదిలెయ్*_

వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకు పోయిన ఖర్చుల గురించి చింతించక
        _*👉వదిలెయ్*_

ఈ సందేశం మీకు నచ్చితే సరి. లేకుంటే లైట్ 😄 తీసుకో 
        *_👉శ్రీవారి నామ స్మరణ మాత్రం ప్రతి క్షణం మననం మాత్రం వదలకు_* ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/?isi=1598954409

Thursday, May 25, 2023

మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.

 మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.
                                               
                      
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.

"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి. మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.

ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.

"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి

విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి."

వారిద్దరూ కౌంటర్ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే, జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళ్తుండగా భర్త చెప్పాడు."ఓ పెద్ద హోటల్ని నడిపే సామర్ధ్యం గల వ్యక్తివి నువ్వు, నీకోసం ఓ హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ని చేస్తాను."

అది జోక్ అన్నట్లుగా ముగ్గురూ నవ్వు కున్నారు. రెండేళ్ళ తర్వాత పోస్టులో జార్జికి వచ్చిన ఓ ఉత్తరంలో, ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ, తన మాట ప్రకారం ఓ హోటల్ని కట్టానని, ఓసారి. న్యూయార్కి రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం ఉంది. దానికి ఫిలడెల్ఫియా నించి న్యూయార్కి రిటర్న్ టిక్కెట్ కూడా జత చేసి ఉంది. జార్జ్ అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు కాని, టిక్కెట్ ఉండటంతో వెళ్ళిరావడంలో తప్పు లేదనుకుని వెళ్ళి విలియంని కలిసాడు. విలియం అతన్ని న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూ, తర్టీ ఫోర్త్ స్ట్రీట్లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని చూపించి చెప్పాడు.

"జార్జ్  నీ కోసం కట్టిన హోటల్ ఇదే. నిన్ను దీనికి మేనేజర్ని చేస్తున్నాను."

అది హోటల్ వాల్డ్రోఫ్ . అదే నేటి న్యూయార్క్ లోని నాలుగు వందల గదులు, వెయ్యి మంది ఉద్యోగస్థులు గల ఫైవ్ స్టార్ హోటల్ వాల్ డ్రోఫ్ ఆస్టర్ హోటల్. ఓ చిన్న హోటల్లో మేనేజర్ గా పని చేసిన జార్జ్ ఓ వర్షం రాత్రి చేసిన ఓ నిస్వార్ధ సేవ ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది. అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ వాయిదా పడదు.

త్వరలోనో లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నించి వచ్చిన పైరుని మనం తప్పక కోసుకుంటాం అని,  ప్రేమని నాటితే ప్రేమని, మంచితనాన్ని నాటితే మంచితనాన్ని, ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని, సహాయాన్ని నాటితే సహాయాన్ని కోసుకుంటాం అని ఆనాటి ఈ రెండు సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. అవునో కాదో ఆలోచించండి మిత్రులారా!

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

మనలోని మానవత్వాన్ని ప్రదర్శింప చేసి సన్మార్గం*లో పయనించాలి . అది ఎలాగో చదవండి

 మనలోని మానవత్వాన్ని  ప్రదర్శింప చేసి సన్మార్గం*లో పయనించాలి . అది ఎలాగో చదవండి

మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తాయి. స్వయంకృతాపరాధాలు కొన్ని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని, మానసిక రుగ్మతల వల్ల కొన్ని, సామాజిక కుటుంబ ఆర్ధిక సమస్యల వల్ల కొన్ని... వీటికి - ఆసహజంగా పెరిగిపోతున్న దానవత్వం, తరిగిపోతున్న మానవత్వం, కరిగిపోతున్న దైవ చింతనలే కారణాలని శంకర భగవత్పాదులు అనేక సందర్భాల్లో బోధించారు. మనిషి తనలో మానవత్వం మీదుగా ఆధ్యాత్మికోన్నతి సాధించడానికి తన బుద్ధిని, జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. ఇది అంత సులభమైనది కాదు. ఎందుకంటే అడుగడుగునా స్వార్ధం అడ్డుపడుతూనే ఉంటుంది.

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో- మనిషి దేన్నైనా ప్రేమిస్తున్నాను అన్నాడంటే అది తన ఆనందం కోసం, కోరికలు తీరడం కోసమే అన్నాడు. తన స్వార్థానికి విఘాతం కలిగినప్పుడు మనిషిలోని దానవత్వం ప్రకోపిస్తుంది. స్వార్థాన్ని, అహాన్ని జయించలేనివారు తమతోపాటు ఇతరుల సుఖశాంతులను, సంతోషాన్ని హరిస్తారు.

కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మత్స్య న్యాయం (చిన్న చేపను పెద్ద చేప మింగడం) ప్రబలిపోతోంది. బలవంతుడు బలహీనుణ్ని అణచివేస్తాడు. చివరికి లోకవినాశనానికి దారితీసే స్వార్ధప్రవృత్తికి తోడు హింసాప్రవృత్తి పెట్రోగిపోతోంది. ఎల్లలులేని స్వార్ధం, అహంకారాలు అంతం కావాలంటే సన్మార్గ దర్శనం కావాలి. అందుకే దైవం మానుష రూపంలో అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. తన శక్తిసామర్ధ్యాలను కొందరు మహాపురుషుల్లో ప్రవేశపెట్టి ప్రక్షాళన కావిస్తుంటాడు.

సుగుణాలకు మూలం సౌశీల్యం, సత్ స్వభావాలేనని భర్తృహరిఅన్నాడు. సద్గుణాలను కలిగి ఉండటమే సచ్చీలత. అదే మనిషిని. సన్మార్గంలో నడిపిస్తుంది. సత్సాం గత్యం, సచ్చీలత, సద్ధంథ పఠనం, సద్వాక్కు సేవాతత్పరత, సత్ప్రవర్తన, సమత్వం, సమయపాలన... ఇవన్నీ సద్గుణ సంపదలు. ఆదికావ్యమైన రామాయణం, ధర్మశాస్త్రమైన మహాభారతం, భగ వద్గీత వంటి ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లో విభిన్న పాత్రల ద్వారా రకరకాల మానవ నైజాలను వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. సద్గంధ పఠనం వల్ల మనిషి ఉత్తమ వ్యక్తిగా, కుటుంబంలో ఉత్తమ సభ్యుడిగా, మంచి కొడుకుగా, మంచి సోదరుడిగా, మంచి మిత్రుడిగా చివరకు మంచి శత్రువుగా కూడా ఎలా మెలగాలో తనను తాను తీర్చిదిద్దుకోగలుగుతాడు. సభ్రంధ పఠనం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, అనుక్షణం అండగా నిలిచే ఆప్తమిత్రుడు, విజయానికి దిక్సూచి, సన్మార్గపు రహదారి.

అమ్మ జన్మనిస్తుంది. నాన్న జీవితాన్నిస్తాడు. స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు. కానీ సద్ధంథ పఠనం... వారెవరూ ఇవ్వలేని తరగని గనిలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్నా ఓటమిని, భయాన్ని దరిచేరనివ్వని సన్మార్గంలో నడిచే మనోధైర్యాన్నిస్తుంది.

సేకరణ మీరామిరెడ్డి మానస సరోవరం👏

ముఖ్యంగా తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచనా ధోరణి గురించి తెలియచెప్పే అద్భుతమైన కథ.

ముఖ్యంగా తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచనా ధోరణి గురించి తెలియచెప్పే అద్భుతమైన కథ.

“ విరిగిపోయిన ఈ బక్కెట్టు తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి ఇచ్చెయ్” అంది అమ్మ  రవికి  ప్లాస్టిక్ బకెట్ అందిస్తూ. తొమ్మిదో తరగతి చదివే రవిలో తెలివి, సృజనాత్మకత శాతం ఎక్కువ. 

 ఆకుపచ్చ రంగున్న బకెట్ మీద రంగు రంగుల్లో పువ్వులున్నాయి. విరిగినదే అయినా సరే అందంగా కనిపిస్తోందది. దాన్ని పాత సామాన్ల  వాడికివ్వడం   రవికి నచ్చలేదు.   కాసేపు ఆలోచించాడు రవి.  వాడికో ఆలోచన వచ్చింది. 

 ఒక కత్తెర తీసుకుని బకెట్ అంచు నుండి విరిగిన భాగం వరకు  క్రమ పద్ధతిలో కత్తిరించి. అడుగున ఒక   రంధ్రం చేసి, మట్టితో నింపాడు. పెరట్లోని  గులాబీ మొక్కల్లో ఒకటి తెచ్చి మట్టిలో  పాతాడు. దాని మీద  నీళ్లు  పోసాడు. ఇప్పుడది పూల కుండీ అయింది. దాన్ని తీసుకెళ్లి ప్రహరీ గేటు ప్రక్కన అలంకరణగా  పట్టేసి  అమ్మకి చూపించాడు.

 “ఇదెప్పుడు కొన్నాము?” అని ఆశ్చర్య పోయిందావిడ.  జరిగింది  అమ్మకి చెప్పాడు రవి. వాడి ఆలోచనకు మెచ్చుకుని,  వాళ్ళ నాన్నతో  చెప్పబోయింది. “చదువుకోవాల్సిన  సమయాన్ని ఇలా  వృధా చేయవద్దు.  చదువుకోమను” అన్నాడు నాన్న.    
 మరొక రోజు వీధిలో అందరికీ కరెంట్ పోయింది. రవి గదిలో మాత్రం విద్యుత్ బల్బు వెలుగు కనబడింది. 

వీధిలో వాళ్లకు రవి వాళ్లింట్లో మాత్రం వెలుగు కనబడడం ఆశ్చర్యమేసింది. 
“మీకు కరెంట్ పోలేదా? లేకపోతే ఇన్ వర్టర్ దా?” అని అడగడానికి వచ్చారు కొందరు.  

రవి అమ్మా నాన్నలు కూడా  ఆశ్చర్యపోయి “మాకూ కరెంట్ పోయింది. ఇన్ వర్టర్  లేదు” అని చెప్పారు.  

“మీ ఇంట్లో  లైట్ వెలుగుతోంది” అని వాళ్లు చెబితే ఆశ్చర్యపోయి లోపలకు వెళ్లారు.  అక్కడ విద్యుత్ వెలుగులో చదువుకుంటూ కనబడ్డాడు రవి. 
“ఇదెలా సాధ్యం?” అని అడిగారు రవిని.
“ పనిచెయ్యని కారు బ్యాటరీలను ఒక అంకుల్ పారెయ్యబోతుంటే అడిగి తీసుకున్నాను. మనింట్లో కరెంట్ రిపేరు చేసినప్పుడు మిగిలిపోయిన రాగి వైర్లు   నా దగ్గర దాచాను. ఆ పాత బ్యాటరీలో మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్), కాస్టిక్ సోడా ,  పరిశ్రమల్లో  ఉపయోగించే స్ఫటికాకార ఆమ్లం ఉపయోగించి ఛార్జింగ్ చేశాను.  దానికి  కొత్త జీవితం వచ్చింది. ఇన్ వర్టర్ లాగా పనిచేసి వెలుగు ఇస్తోంది” అన్నాడు రవి. 

వీధిలో వాళ్లంతా రవి తెలివిని అభినందించి వెళ్ళిపోగా, నాన్న మాత్రం ఇలాంటి వాటికి సమయం వృధా చేస్తున్నాడని గొణుక్కున్నాడు. 

 ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన రవితో ‘దోమతెర  చినిగిపోయిందని,  కొత్త దోమతెర  కట్టడానికి సాయం  రమ్మని’  పిలిచింది వాళ్ళమ్మ.  పాత   దోమతెరలో  కొన్నిచోట్ల  రంధ్రాలు పెద్దవయ్యాయి. పనయ్యాక  పాత తెరని  బయట పడెయ్యమంది. 

దాన్ని చూసిన  రవి  మనసులో బయట పారేయడం కంటే  వడియాలు, పిండి, నువ్వులు  ఆరబోసేటప్పుడు  పక్షులు ఎత్తుకు పోకుండా  వల లాగా  వాడాలన్న ఆలోచన కలిగింది.  ఆ మాటే వాళ్ళమ్మకి చెప్పగా  భలే ఆలోచన అంటూ మెచ్చుకుంది ఆమె.   

సరిగా అప్పుడే వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తూ ఆ మాటల్ని  విన్నాడు.  “ అదే పనిగా మెచ్చుకుని వాడిని పాడు చెయ్యకు” అని కసిరాడు. 

రవి  మీద వాళ్ళ నాన్నకి ప్రేమ ఉంది. ఇలాంటి పనులతో చదువుకి ఆటంకం వస్తుందని  భయపడుతుంటాడు.  తరగతి  పుస్తకాలు చదవాలి తప్ప ఇలాంటి  పనులు చేయొద్దంటాడు. ఏదైనా కొత్తగా  ఆలోచించి రవి చెప్పగానే వాటిని  మొగ్గలోనే తుంచి పారేసేవాడాయన. కొడుకుని ప్రోత్సహించాలని ఉన్నప్పటికీ భర్తకి ఎదురు చెప్పలేక పోయేది వాళ్ళమ్మ. 

ఒక  రోజు ఉదయం  కూరగాయలు కోసం  వెళ్లిన రవి నాన్నకి సైన్సు మాస్టారు కనిపించారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రవి తెలివిని , సృజనాత్మకతని     మెచ్చుకున్నారు మాస్టారు. 
  రవి నాన్న  సంతోషించలేదు సరికదా   “నాకూ అదే  భయం. వేరే ఆలోచనల్లో పడిపోయి  చదువుని  నిర్లక్ష్యం చేస్తాడేమోనని ” అన్నాడు.    

“ అందులో భయపడాల్సిందేముంది?   వాళ్ల కొచ్చే  ఆలోచనలను స్వాగతించాలి.  రవిలా సృజనాత్మకత  ఉన్నవాళ్లు మాత్రమే దేన్నైనా   కొత్త కోణంలో చూస్తారు.  బడిలో పిల్లలకు వచ్చే కొత్త  ఆలోచనలను మేం స్వాగతిస్తుంటాం.  వాటిని నూతన ఆవిష్కరణలుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాము. విజ్ఞాన ప్రదర్శనలప్పుడు ప్రదర్శిస్తుంటాం”  అన్నారు మాష్టారు. 

రవి ఇంట్లో చేసిన  పనుల గురించి  మాష్టారికి చెప్పి “వీటివల్ల ఏం ప్రయోజనం ఉంది?” అనడిగాడు   రవి నాన్న. 

మాష్టారు “ఎన్నో ఏళ్ళు పిండి విసిరిన తిరగలి అరిగిపోతే కొందరు పారేస్తారు. మరికొందరు గార్డెన్లో మెట్టుగా వాడతారు. టీ  కప్పు పగిలితే  కొందరు పారేస్తారు. మరికొందరు బడ్ వేజ్ గా వాడతారు . ఇందులో డబ్బు  ఎంత మిగిలిందన్నది ప్రశ్న కాదు. కొత్త రూపంలో పాత వస్తువుని చూసినప్పుడు కలిగే  మానసిక ఆనందం  వేరు. అందులో  ఉన్న కొత్త కోణాన్ని. సృజనాత్మకతను చూస్తే  ఆ పని ఎంతో గొప్పదని తప్పక అర్ధమవుతుంది.  రవిలో చురుకైన బుద్ధి ఉంది.  తెలివిగా, వేగంగా  ఆలోచిస్తాడు. అందువల్ల చదువుల్లో కూడా ముందుంటాడు  తప్ప నష్టం జరగదు” అన్నారు  నమ్మకంగా. 

 రవి నాన్నకి అంతవరకూ ఉన్న  అపోహలన్నీ తొలగిపోయాయి.  రవిని చదువుకే పరిమితం చేయకుండా మిగతా విషయాల్లో కూడా  ప్రోత్సహించాడు. తన మీద అమ్మానాన్నలకు ఉన్న   నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రవి.  
ఈనాటి కాలంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించే నేటి బాలకులకు ఈ కథ అంకితం.
నారంశెట్టి ఉమామహేశ్వరరావు

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

Wednesday, May 24, 2023

మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే

 మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే

సాధన ఏం చేయాలి...?
అని తరచూ పృచ్ఛకులు అడిగే ప్రశ్నకు...
రమణులు ఇచ్చిన బ్రహ్మాస్త్రం లాంటి ఉపదేశం-

"నిన్ను నీవు విడవకుండా ఉండు...."

అనే మాట నన్ను విడవకుండా ఉందికాబట్టే-
నేను ఉన్న చోటే...నేను అన్న చోటే...
అదే అత్యాశ్రమమై...ప్రశాంతంగా...ఆనందంగా ఉన్న నేను...

"మాతో గురువాయూర్ కు రా మావా...!"
అన్న మా మరదలు కోరికపై...వారి కుటుంబంతో కలిసి...
గురువాయూరుకు బయలుదేరాల్సి వచ్చింది...

* * *

భవానీశ్వరిని చూశాను...
కాలడిశంకర జన్మస్థానాన్ని చూశాను...
గురువాయూరప్పను చూశాను...
అనంతపద్మనాభుణ్ణి చూశాను...
కన్యాకుమారిని చూశాను...
భారతీయభవితవ్యం కోసం... 
వివేకానంద చేసిన సంకల్పానికి సాక్ష్యంగా నిలచిన...
'వివేకానంద రాక్' ను చూశాను...

* * *
మా గురువుగారనేవారు-
ఇన్ని గొప్ప క్షేత్రాలను మోస్తోంది భూమి...అది ఇంకెంత గొప్పది!
మన కాళ్లక్రింద ఉండేది కూడా ఆ భూమే... మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే...అని అన్నారు.

* * *

ఎక్కడైనా-
"ఇప్పుడు-ఇక్కడ- ఇలాగు..."
అనే సద్గురు సూక్తి గుర్తుకొస్తోంది...

ఎవరి దర్శనం చేసుకున్నా-
"ద్రష్ట లేక దర్శనం సున్నా..."
అనే రమణుని సూక్తి గుర్తుకువస్తోంది...

ఏ ప్రదేశానికి వెళ్లినా-
"అవే గోడలు, అవే చెట్లు..."
అనే యోగిరాజారాం సూక్తి గుర్తుకువస్తోంది...

నపుంసకునికి కామశాస్త్రంతో పనిలేనట్లు...
తనలో తాను రమించేవానికి యాత్రలతో పనిలేదు అనిపించింది...

నా అంగట్లో కూర్చున్నట్టే... 
కార్లోనూ కూర్చున్నాను...
"ఉండటం" ఎక్కడైనా "ఉండటమే"గా...
దృశ్యం మారుతుంటుందే గాని ద్రష్ట మారడుగా...

దృశ్యంలో భాగంగా ఉండడం - లౌకికం.
ద్రష్టగా ఉండడం - ఆధ్యాత్మికం.

దృశ్యం - లీల.
ద్రష్ట - నిత్యం.

లీల క్రీడగా అనిపిస్తే దృశ్యంలో ఉండు.
లీల గోలగా అనిపిస్తే ద్రష్టగా ఉండు.

లీలలో- 
ద్వంద్వాలు త్రిపుటాలు తగులుకొని వుంటాయి...

నిత్యంలో- 
ద్వంద్వాలు త్రిపుటులు విడివడి వుంటాయి...

వెలుపల - లీల.
లోపల - నిత్యం.

మెలకువ - లీల.
గాఢనిద్ర - నిత్యం.

* * *

పిల్లలకు మనం చాక్లెట్ ఇచ్చి సంతోషపెట్టినట్టు...
మనమూ సంతోషిస్తున్నట్టు...
వ్యాసం వ్రాస్తూ ఉండగా...
జ్ఞానాంబ ఒకరి ద్వారా నాకు దక్షిణ పంపి నన్ను సంతోషపెట్టింది...
మరి నేనూ (జ్ఞాన)శిశువునే కదా!

మా జ్ఞానాంబ శివుని భార్య కాదు...
మా జ్ఞానాంబ శివునికి కూడా అమ్మే...
మా జ్ఞానాంబ పరబ్రహ్మస్వరూపం...

జ్ఞానం - జ్ఞానప్రసూనాంబ(పార్వతి)
మౌనం - దక్షిణామూర్తి(శివుడు)

జ్ఞానాంబను అమ్మా...! అని సంబోధించడమేకాదు,
ఒక్కోసారి ప్రేమ మితిమీరినప్పుడు-
ఒసే పిచ్చిమాలోకం...! అని...సంబోధించడం కూడా కద్దు.

అంతగా తన ఇష్టదైవాన్ని స్వంతం చేసుకున్నప్పుడే
ఉపాసన ఫలించేది...

భక్తి అనేది ప్రయత్నపూర్వకంగా 
ఎవడికివాడు పండించుకుని తినవలసిన పంట లాంటిది.

జ్ఞానం అనేది అప్రయత్నంగా 
చెట్టు నుండి రాలి నీ చేతిలో పడే పండు లాంటిది. 

భక్తిని మనం పొందాలి.
జ్ఞానం మనల్ని పొందుతుంది.

భక్తి అనేది రసాత్మకం...చలిస్తుంటుంది...
జ్ఞానం అనేది శిలాత్మకం...అచలంగా ఉంటుంది...

* * *

యాత్రకెళితే పాత్రకొనాలి...అంటారు.
నేను మాత్రం-
ముందుగా 'బాబు' అనే పాత్రను ఎన్ను'కొన్నాకే'
'నా' ఇహలోకయాత్ర మొదలయ్యింది...

* * *

ఇహలోకం ఎలా ఉంది? అని ప్రశ్నించింది 
మా సోదరి...

నేను అన్నాను-

ఉండేది ఒక లోకమే....        
ఒకడికి అదే ఇహలోకంగా ఉంటుంది.  
మరొకడికి అదే పరలోకంగా ఉంటుంది...అని.

"నేను"గా ఉంటే పరలోకం...
"బాబు"గా ఉంటే ఇహలోకం...
అర్థమైందా పిచ్చిమాలోకం...?

 * * *

12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు

 *12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు*

కాశీలో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం. అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు .

 అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్ ముక్తిభవన్ ఒకటి. మిగతా రెండూ ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్ .

 1908లో కాశీలాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది.

44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజరుగా పనిచేసిన భైరవనాద్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను.

1. Resolve all conflicts before you go

 (అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు):

 శ్రీరాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న తమ్ముడు అంటే ఇష్టం. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది.

ఆయన తన అంత్యకాలంలో కాశీలాభ్ ముక్తి భవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు. తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున ఆయన తన తమ్ముడికి కబురు పెట్టాడు.

 “40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది. నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు .

తమ్ముడు 16వ రోజు నాటికి వచ్చాడు. తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు. అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు. తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న .

భైరవనాద్ శుక్లా ఇలా అంటున్నారు “ఇటువంటి కధలు నేను ఎన్నో చూశాను. ఇక్కడకి వచ్చే వాళ్ళు బోల్డంత లగేజీతో వస్తారు. అందులో ఏదీ కూడా తీసుకువెళ్ళలేరు. జీవితంలో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు. కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. అంత సంతోషం పొందుతారు”

2. Simplicity is the truth of life

 (సాధారణంగా జీవించడం) : చనిపోతాము అని తెలిసిన దగ్గరనుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది. అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు.

 “సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చుపెట్టడం. 

ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం. ఎక్కువ తాపత్రయపడటం కన్నా తక్కువలో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందంగా జీవించవచ్చు” అంటారు భైరవనాద్ శుక్లా.

3. Filter out people’s bad traits 

(ప్రజలలో ఉన్న చెడు లక్షణాలను మాత్రమే చూడకు):

 భైరవనాద్ శుక్లా ఇలా అంటారు “ప్రతీ మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి . మనం ఎదుటివ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము. వారిలోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమే కాదు, వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం”

4 Be willing to seek help from others 

(ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో) : 

మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు . ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయంలో తాను ఇతరులకు సహాయపడడంతో పాటు ఇతరుల సహాయం అర్దించే ధైర్యం కూడా ఉండాలి.

భైరవనాద్ శుక్లా 80 లలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నారు. ఒక రోజు వర్షం కురుస్తూ ఉంటే కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకుని వచ్చారు. వాళ్ళు ఆమెను జాయిన్ చెయ్యడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు. 

తర్వాత పోలీసులు వచ్చారు. ఆమెను తీసుకుని వచ్చినవారు నక్సలైట్లు అని చెప్పారు పోలీసులు. మర్నాడు వాళ్ళు వచ్చినపుడు నేను అడిగాను “మీరు ఒకేసారి చాలా మందిని షూట్ చేసి చంపగలిగినపుడు ఆ ముసలామెను కూడా అలా చెయ్యొచ్చు కదా! మీరె ఆమెను సమాధి చెయ్యొచ్చు కదా! నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు ?” 

అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళపై కూలబడి అన్నాడు. “మాలో ఎవరమూ ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము. ఇక్కడ ఉంటే ఆమె తప్పక మోక్షం పొందుతుంది అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము. మమ్మల్ని క్షమించండి”

5 Find beauty in simple things 

(చిన్న చిన్న విషయాలలో అందం ఉంది):

మా ముక్తిభవన్ లో ప్రతీ రోజూ మూడు సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందంతో కీర్తనలు పాడతారు. దారిన పోయే వారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంత సేపు అక్కడ చేరుతారు. కానీ కొందరు అది తమ ఏకాంతానికి ఆటంకం అనుకొంటారు.

6. Acceptance is liberation

 (సమస్యలనుండి పారిపోకు):

కొందరు తాము ఉన్న స్థితిని అంగీకరించలేరు. ఇలా అంగీకరించలేక పోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి ఒత్తిడి పెంచుతుంది. నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే సమస్యల నుండి నీవు బయట పడడం నేర్చుకోగలవు. లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు. సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు, దానిని ఎదుర్కోగలవు . అపుడు నీవు శక్తి మంతుడవు అవుతావు

7.Accepting everyone as the same makes service easier

 (అందరి పట్ల సమభావంతో ఉండు):

ముక్తి భవన్లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధంగా కాకుండా వారి కులమూ, మతమూ, డబ్బూ, సాంఘిక, ఆర్ధిక స్థితి గతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు. ఎదుటి వ్యక్తులను సమభావంతో నీవు చూసిననాడు నీకు ప్రశాంతత ఉంటుంది. నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు .

8. If/When you find your purpose, do something about it

 (నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు. సాధించే ప్రయత్నం చెయ్యి):

 నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం మంచిది. చాలా మందికి ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు.

9. Habits become values 

(నీ మంచి అలవాట్లు విలువలుగా మారతాయి):

 మంచి అలవాట్లను చేసుకో! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది. మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి. సత్యమూ, దయా, సానుభూతీ, నిజాయతీ ఇవేవీ నీ ప్రయత్నం లేకుండా వాటంత అవి రావు.

10. Choose what you want to learn

 (నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో):

 ఈ ప్రపంచంలో ఎంతో విజ్ఞానం ఉంది. అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో! పెద్దవారి సూచనలు పరిగణనలోకి తీసుకో. ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు. నడవలేరు, మాట్లాడలేరు. అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు. వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు.

11. You don’t break ties with people; you break ties with the thought they produce 

(నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకు , వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో):

 నీవు ప్రేమించిన వ్యక్తులు, నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్ని విషయాలలోనూ ఏకీభవించకపోవచ్చు. మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు. నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు. వారి పట్ల కఠిన హృదయం కాదు.

12. 10 percent of what you earn should be kept aside for dharma 

(నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో):

 ధర్మం అంటే మత సంబధం కాదు. మంచిని చెయ్యడం. ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో! చాలామంది జీవిత అంత్య కాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు. 

ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో, అపరిచితుల ప్రేమను పొందుతారో, వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు.

 నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు. కొంత ఇతరులకు మిగుల్చు

ఇది ప్రతీ ఒక్కరూ చదవవవలసిన పోస్ట్. ఒరిజినల్ ఇంగ్లీష్ లో చాలా బావుంది
-- రాఘవానంద్ ముడుంబ

Sunday, May 21, 2023

******అష్టావక్రుడు సందేశం

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --1*🌸

🌿 ఈనాడు భారీ ఎత్తున వినాశనం అనేది ప్రపంచంలో ఒకచోట కాకపోతే మరోచోట జరగటం సర్వ సాధారణమైపోతోంది. ప్రపంచంలో ప్రతీదీ తిరోగతిలో ఉంది. భూమి మీద జీవ రాసులలో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి త్వరితంగా. మనుష్యులు స్వార్థంగా తయారవ్వటమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారు గానీ, స్నేహితులు గానీ మానసికంగా ఆర్థికంగా ఎలాంటి కష్టాలలో ఉన్నా అసలు పట్టించుకోవటం లేదు.

🏵️ అదేమిటో ఈ మనుష్యులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సమయం సరిపోవటం లేదు. ప్రతి ఒక్కడూ తీరిక లేకుండా పరిగెడుతున్నారు - వారికి కావలసిందల్లా డబ్బు, డబ్బు, డబ్బు. అదేం చిత్రమో డబ్బును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆడ గానీ, మగ గానీ పనుందంటూ పరుగులు. కుటుంబానికి ఇంకా తెచ్చిపొయ్యాలని ఆరాటం పాపం. వాళ్ళను చూస్తే నాకు జాలి వేస్తుంది. సంఘంలో *'హెూదా'*, ఆర్థికంగా *'పరపతి’* అంటూ ఆ ముసుగుల్లో తమ అసలు తత్త్వాన్ని చాలా చాలా లోతున పూడ్చి పెట్టేశారు. 

🍀 ప్రతి చోట బలి అయిపోతున్న వాళ్ళు ఎవరంటే చిన్న పిల్లలు, వారి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు. వాళ్ళు ఎంతసేపూ తమ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకూ, సమయా సమయాలకు అనుగుణంగా సర్దుకుపోతూండాల్సిందే. మనమంతా ఒక వయస్సు వచ్చాక, అంటే కాస్త పెద్ద వాళ్ళమయ్యాక, జీవితంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. పుట్టినప్పటి నుంచే *“టైము”, “తల్లిదండ్రులు అఫీసుకు పరిగెత్తటం”* లాంటివి వాళ్ళకు ప్రతి రోజు అలవాటవుతున్నాయి. *"అమ్మా నాన్న ఇంట్లో ఉండటం”* అనేది వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, అది అర్ధం చేసుకోవటం చాలా కష్టమవుతోంది. 

🍁మనలో సహజంగా ఉండే ఆడుకోవటం, ముద్దాడటం, బిడ్డతో గడపటం లాంటివన్నీ ఏమైపోతున్నాయి? కుటుంబ సభ్యులందరితో కలసి కూర్చుని ఆనందించాలనే కోరిక ఎటుపోయింది. ప్రపంచమే చిన్ని చిన్ని ముక్కలైపోతూంటే మనందరం ఏం చేస్తున్నాం? ప్రతి చోటా ఎంతెంత భీభత్సం జరుగుతోందో మీరంతా చూడటం లేదా? దేవి కోసం ఎదురు చూస్తున్నారు మీరు? మీరు ఎందుకీ ప్రపంచంలో పుట్టారు? ఇలా పరుగులు పెట్టడానికేనా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా తాము సంతోషంగా ఉన్నామని మనస్సు విప్పి మీకు చెప్పుకున్నారా? లేదు... పందెం కాస్తాను. ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. 

🌹 మీరంతా సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈ *"సమాజం కోసం, మీ చుట్టూ ఉండే ఈ బుద్ధిలేని మనుష్యుల కోసం, మీ మీద మీరే రుద్దుకున్న పనికిమాలిన ప్రమాణాల కోసం, మీ అసలు సిసలైన స్వభావాన్ని మీరు గాలికి వదిలేశారు. సరేలెండి. మీ అందరి కోసం నా దగ్గర ఒకానొక మాస్టర్ ప్లాన్ వుంది. అది అవడానికి చిన్నదే అయినా అద్భుతాన్ని సృష్టిస్తుంది. అయితే మీ నుంచి నాకో అభయం కావాలి. అదేమిటంటే ఈ ప్లాన్ ఆచరించటం మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. లేదా అసలు దాని జోలికే రావద్దు. దీని కోసం మీకు రోజుకు అయిదు నిమిషాలు మాత్రమే పడుతుంది. మీకు ఇంకా ఎక్కువసేపు గడపాలనిపిస్తే దానివల్ల మీరు మరింత ముందుకు సాగుతారు.

------------------

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --2*🌸

💠 మీ అందరిలోనూ *"అంతర్భావన"* అనేది ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? 

🔸 1) మీ మనోభావాలను గమనించండి. ఒక్కో పరిస్థితికీ, ఒక్కో పరిసరానికి మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించండి, అంతే. 

🔷 2) మనుష్యులనూ, వాళ్ళ భావావేశాలనూ గమనించండి. మీ భావాలకూ, వాళ్ళ భావాలకూ ఏదన్నా తేడా గమనించారా మీరు?చూసుకోండి. ఒకవేళ తేడా ఉందనిపిస్తే మీరు ఎందుకలా వేరే రకంగా ఫీలవుతున్నారో చూసుకోండి. 

🔶3) పిల్లలు మనకు అద్భుతమైన వరాలు. వాళ్ళను ఈ ప్రపంచంలోకి మీరు తెచ్చారని గర్వపడకండి. మీకు పిల్లలుగా పుట్టాలని వాళ్ళే ఎంచుకున్నారన్న సంగతి అర్థం చేసుకోండి. వాళ్ళు మీకంటే ఎంతో ముందున్నారు. వాళ్ళకు ఏమైనా అధ్యాత్మిక ప్రశ్నలు అడగండి - *"నాయనా! ఒక మాట చెప్పు. జంతువులు, మొక్కల జన్మల గురించి ఏమనుకుంటున్నారు?”* లాంటి వన్నమాట. అయితే, దయచేసి మీరు చాలా ఓర్పుగా ఉండండి. వాళ్ళకే మీకంటే బాగా తెలుసునని వాళ్ళకు చెబుతూ వాళ్ళ అంతరాళాలలో వున్న జ్ఞానాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి.

🌿 మొదట, టీవీ చూస్తూనో, ఆడుకుంటూనో మీ బిడ్డతో కొంత సమయం గడపడం నేర్చుకోండి. వాళ్ళు అందులో నిమగ్నమైపోయి ఉండగా మీరు వాళ్ళ దగ్గరుండండి. ఆ ఆట ఆడటమో ఆ టీవీ చూడటమో పూర్తికానివ్వండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. అయితే, మీ ప్రశ్న స్పష్టంగానూ, ఆ బిడ్డ పట్ల ఎలాంటి విమర్శ సంధించకుండానూ ఉండాలి. ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి. ఎంజాయ్ చేయ నివ్వండి. పుట్టుక మొదలుగా పెరగటం, క్రమంగా వచ్చే శారీరక మార్పులు, జట్టు కట్టడం - శారీరికం గానూ మానసికం గానూ కూడా చివరికి చనిపోవటం వరకు అన్నీ తెలుసుకోనివ్వండి.

🌳 మీరు చేయవలసిన మరొక పని ఏమిటంటే తాను పుట్టిన విధానాన్ని అంటే తన శరీరం, మనస్సులను - ఆ బిడ్డ ప్రేమించేలా చేయాలి. మీ సమయాన్ని వాళ్ళ కోసం కొంత వెచ్చించి ఓర్పుగా ఉండి మీ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. వాళ్ళిప్పుడు ఏదైనా చేయలేకపోతే, విఫలమైతే దయచేసి వాళ్ళని విమర్శించి తిట్టకండి. మీరే తన బహిర్ ప్రాణమనీ, తన వైఫల్యాలను పక్కన పెట్టి మీరు తనకు ఏదైనా సరే ఇస్తారనీ ఆ బిడ్డ ఫీలయ్యేలాగా మీరు ప్రవర్తించాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆ బిడ్డ తన భావాలను మీతో పంచుకునేలా చేసుకోవాలి మీరు. వాళ్ళ పరిస్థిథుల్లో మీరు కూడా వాళ్ళలాగా ఒక బిడ్డగా మారిపోండి. వాళ్ళల్లో ఒకరుగా మాట్లాడండి. మీరు వాళ్ళకి తల్లిదండ్రులుగా పుట్టింది కర్ర పుచ్చుకుని వాళ్ళను చావగొట్టడానికి కాదు. ఉజ్జ్వలమైన రేపటి కోసం వాళ్ళని మెత్తబరచి మలచడానికి. 

🌷 ఇవాళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు. తరచు ఏదో మానసికంగా ఒత్తిడికి లోనవుతూండవచ్చు. పక్క తడుపు తుండవచ్చు, మాట్లాడకుండా ఎవ్వరితో కలవకుండా ఉండవచ్చు. ఆడుకోకుండా ఉండవచ్చు - అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లనే. గంటల తరబడి టీవీ చూస్తూనే కూర్చునే బదులు రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక గంటసేపు వాళ్ళల్లో ఒకళ్ళుగా గడపండి. 

🌼 కనుక, ఫ్రెండ్స్! మిమ్మల్ని నేను కోరేదేమిటంటే మీ జీవిత కాలంలో మీకు కలిగే ప్రతి భావమూ ముఖ్యమే. దానిని అర్థం చేసుకోండి. ఈనాటి పిల్లలకు ముఖ్యంగా కావలసింది ప్రేమ. మీకు అవసరమైనవి భద్రత, మానసిక సుఖం. అది మీకు సాధ్యపడేది ఎలాగంటే - మీకు ఎలా కూర్చుంటే సుఖంగా హాయిగా ఉంటుందో అలా కూర్చుని, రెండు చేతుల వ్రేళ్ళూ కలుపుకుని, కళ్ళు మూసుకుని, నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ గమనించండి. ఇదే ధ్యానం అంటే! ఒక్క అయిదు నిమిషాల పాటు చేయలేరా మీరంతా దీనిని? చూడండి ఫ్రెండ్స్! ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు కూడా మీరిది చేయవచ్చు. టాక్సీలో గానీ, రైల్లో గానీ, బస్సులో గానీ ఆఫీసుకు పోతూ కూడా చేయవచ్చు. మీకు ఎక్కడ బుద్ధిపుడితే అక్కడ చేయగలరు. దీనికి రూల్సు అంటూ ఏమీ లేవు.

-----------

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --3*🌸

☘️ గమనిస్తూ గాలి పీల్చి వదలటం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మీకు చెబుతాను. చూడండీ. మన చుట్టూ ఉండే ప్రతీదీ చాలా కలుషితమై పోయి ఉంది. మనమంతా విషపుగాలి పీలుస్తున్నాము. దానితో మన శరీరాన్నే కాదు మన ఆలోచనల విధానాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాము. అయితే ఇలా గమనిస్తూ గాలి పీల్చటం వల్ల బహు స్వచ్ఛమైన విశ్వ శక్తిని మన శరీరంలోకి ప్రశమించనిస్తున్నాము. ఈ శక్తితో మీరు *“పూజ"* చేసే మాస్టర్స్ అందరూ చేసే అద్భుతాలు మనందరం కూడా చేయగలుగుతాము. ఈ చిన్న ప్రక్రియను అనుసరించటం ద్వారా మీరందరూ కూడా వాళ్ళంత సంతోషంగా ఉండగలుగుతారు. బ్రతికున్న మిగిలిన మాస్టర్స్ నుంచి కూడా మీకు ఎప్పుడూ సహాయం లభిస్తూనే ఉంటుంది. దాని కోసం మీరు చేస్తున్న బహు చిన్న ప్రక్రియ గమనిస్తూ గాలి పీల్చటం, వదలటం.

🌸 అద్భుతాలు అనేవి మొట్ట మొదట మీ వ్యక్తిగత అవగాహనలో జరుగుతాయి. తర్వాత మీ కుటుంబంలో అద్భుతమైన మార్పులూ, సహకారాలూ మీరు గమనిస్తారు. తర్వాత నెమ్మదిగా ఆనందమూ, పరమానందమూ, బ్రహ్మానందమూ మీలోనూ, మీ చుట్టు ప్రక్కలా చోటు చేసుకుంటాయి. ఇదంతా ఈ చిన్ని ప్రక్రియ ద్వారానే. 

🏵️ ధ్యానం అనేది, తపస్సు అనేది, కేవలం సన్యాసులకు మాత్రమేనేమోనని చాలా మంది అనుకోవచ్చు. కానీ అది సరికాదు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి కోసం. మీరు నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నందు వల్ల మీ సంసార బంధాల నుంచీ, ఉద్యోగ బాధ్యతల నుంచీ మీరు విడిపోవలసిన అవసరం లేదు. ఈ రెండు పనులూ ఆప్యాయంగా, మనస్ఫూర్తిగా చేయండి. కానీ రోజూ అయిదు నిమిషాల పాటు ధ్యానం చేయండి. మీకు దానిలో ఉత్సాహం కలిగితే సమయాన్ని ఇంకొంచెం పెంచుకోండి. ఎందుకంటే మీరెంత ఎక్కువగా చేస్తే అనతి కాలంలోనే మీరు అంత సంతోషంగా చైతన్యవంతంగా తయారవుతారు. 

💠 కనుక ఫ్రెండ్స్! మిమ్మల్ని నేను రెండు కోరికలు కోరుతున్నాను. 

🔸1) మీ బిడ్డను ప్రేమించండి. మీకు ఎన్ని ఒత్తిడులున్నా సరే కొంచెం సేపు వాళ్ళతో గడపండి. 

🔹2) ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేర్చుతుంది. అంతే. 

🍀 ఏ ధ్యాని కోసం కూడా నా దగ్గర వ్యక్తిగతమైన సందేశం ఏమీ లేదు. మీ జీవితాన్ని చూడండి. అందులో మీకు ఎదురయ్యే ప్రతీదీ నేర్చుకోండి. ముందుగా దేనినీ ఊహించ వద్దు. ఆశించ వద్దు. మీలో చాలా మందికి ధ్యానం పిచ్చిపట్టుకుంది. దానిలో సగం సమయాన్ని ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన, పుస్తక పఠనాలకు వినియోగించండి. మీ బృందంలో చాలా మంది జ్ఞానాభివృద్ధి పట్ల నాకు చాలా చాలా  అసంతృప్తి ఉంది. ప్రతి బృందంలో ఎంతలేదన్నా 80% మందికి నిజమైన జ్ఞానం లేదు. కేవలం 20% మంది మాత్రమే చక్కని జ్ఞానంతో ఉన్నారు. మంచి ధ్యాన మాస్టర్లు - అవగాహనలో నా స్థాయికి సరిపోయే వాళ్ళు వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నాను. మీరు మీ మాస్టర్ ని అడిగి వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళను చూసి నేర్చుకోండి. దయచేసి ఈ సందేశాన్ని ప్రతి బృందంలోని అందరు ధ్యానులకూ అందించండి. ఆయనకు తెలుసు అని ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో.

🍁 గుడ్ లక్. అరుణా! మూర్తీ(అరుణ భర్త)! మీ బృందంలో చాలా మందిలో లేని అవగాహన, జ్ఞానం మీలో ఉన్నందుకు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని అర్ధం చేసుకునేలా చేయండి. బై అరుణా! నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *మహా జ్ఞానం పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

నానుడి కథ - 8* *యమ గండం*

 *నానుడి కథ -  8*


*యమ గండం*

     ఈ నానుడి ఓ కథ ద్వారా వాడుకలోకి వస్తున్నట్టు తెలుస్తుంది. యముడి ద్వారా వచ్చే గండంనే యమ గండంగా చెప్పుకోవొచ్చు. ఈ గండంను  ఎవరు తప్పించలేరని ఆర్యోక్తి. ఆ గండం ఏమిటో?, యమగండం నానుడి ఎలా వాడుకలోకి వచ్చిందో , ఆ కథ ఏమిటో  తెలుసుకుందాం.
     పూర్వం దేవతలంతా శివుని పూజించటానికి పాడుబడిన శివాలయానికి వెళ్లారు. ముందుగా విగ్నేశ్వరుడు తన వాహనం ఎలుకను బయట నిలబెట్టి లోపలికి వెళ్ళాడు. అలాగే కుమారస్వామి వచ్చి తన వాహనం నెమలిని బయట ఉంచి లోపలికి వెళ్లాడు. కాసేపటికి యముడు వచ్చాడు. తన వాహనం దున్నపోతును బయట ఉంచి లోపలికి వెళుతూ  చెట్టుపైన కిచకిచమంటూ శబ్దం చేస్తూ సంతోషంగా ఉన్న పిచుకను చూసాడు. క్షణ కాలం అలాగే చూసి నవ్వుకుంటూ గుడి లోపలికి వెళ్ళాడు. యముడు నవ్వటంతో పిచుకకు భయం పట్టుకుంది. ఆయన ఎందుకు నవ్వాడో అర్థంకాక అతడి వాహనం దున్నపోతును అడిగింది. తనకు తెలియదని అది తల అడ్డంగా ఊపింది.  పిచ్చుక ప్రాణ భయంతో గడగడా వణకుతుంది.
         ఇంతలో గరుడ పక్షి పై వచ్చిన విష్ణు మూర్తి గరుడపక్షిని  బయట  వదిలి లోపలికి వెళ్ళాడు. వెంటనే పిచ్చుక  పక్షి రాజు వద్దకు వెళ్ళింది.  యముడు నవ్విన సంగతి చెప్పింది. తన భయం బయట పెట్టింది.  గరుత్మంతుడు ఆ పిచుకను వీపుపై ఎక్కించుకుని వాయు వేగంతో ఏడేడు సముద్రాల ఆవల ఉన్న మర్రి చెట్టు తొర్రలో దాచింది. ఇంకేమి భయంలేదు అని చెప్పి అదే వేగంతో వచ్చింది. 
     అప్పుడే యముడు గుడిలో నుండి బయటకు వస్తున్నాడు. పక్షిరాజు ఆయన వద్దకు వెళ్లి వినయంగా అడిగింది. పిచుకను చూసి ఎందుకు నవ్వావు అని. యముడు మళ్ళీ నవ్వి " ఏమీలేదు గారుడా! ఆ పక్షికి గడియ కాలంలో  చావు రాసుంది. అది ఇక్కడ కాదు ఏడేడు సముద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలో నివాసం  వుండే ఒక పాము దాన్ని చంపి తింటుంది. ఇదెలా సాధ్యం. గడియ కాలంలో ఆ పాము ఇక్కడికి రాలేదు. ఈ పక్షి అక్కడికి పోలేదు.  ఆ విధిరాత ఎలా ఉంటుందో అని నవ్వాను అంతే" అన్నాడు. పక్షిరాజు గరుత్మంతుడు కుప్పకూలి పోయాడు. యమ గండాన్ని ఎవరూ తప్పించలేరని తెలుసుకుంది ఆ పక్షి.
   ఇలా ఈ యమ గండం అనే నానుడి వాడుకలోకి   వచ్చింది. యముడి నుండి వచ్చే ఆపదను తప్పించటం ఎవరివల్లా కాదని చెప్పటానికి ఈ  యమగండం నానుడి ఉపయోగిస్తారు.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*
 అన్నింటి కన్నా అతి కష్టం అయినది మనసును కట్టడి చేయడం.... మనసుని అదుపులో ఉంచే అద్భుతమైన అతి తేలికయిన మార్గం శ్వేస మీద ద్యాస ద్వారా శ్వేసా మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం... ఇక్కడా మనసు మాయ పని చేస్తుంది... కోతి లాంటి మనసుకు ఏరే ఆలోచన లేకుండా చెట్టు ఎక్కడం దిగడం చేయమనాలి... ఆద్యాత్మిక తలో దానినే శ్వాస మీద ధ్యాస గా చెప్పబడింది... నమ్మకం,విశ్వాసం, దృధ సంకల్పంతో శ్వేస మీద ద్యాస పెట్టడమే... అది కూడా బ్రహ్మ ముహూర్తంలో... ముహూర్తం అనగా 48 నిమిషాలు గా నిర్ణయించి అందులో సగం 24 నిమిషాలు ముహూర్తం నిర్ణయిస్తారు... అనగా 24 నిమిషాలు ముందు వెనుక కూడా 24 నిమిషాల వ్యవధి ముహూర్త బలం ఉంటుంది... సూర్యోదయం నకు ముందు తర్వాత 24 నిమిషాల మధ్య సాధన చేయవచ్చు...3.35 సమయంలో చెస్తే అధ్బుతంగా సాధన కుదురుతుంది... ఆ సమయానికి నిద్ర లేవడం గొప్ప మహా మహత్తర సంఘటన... రాత్రి నిద్ర పోయేముందు సబ్కోన్సియస్ మైండ్ కి పలనా సమయానికి నిద్ర లేవాలి సాధన మొదలు పెట్టాలి అని చెప్పండి... సాధన చేసేటపుడు కూడా నేను ధ్యానం చేస్తున్నా... ఈ సాధన లో శ్వేస మరియూ అలోచనలు లేని స్థితికి చేరుకొని అనంతమైన విశ్వశక్తి పొంది నాడీమండం శుద్ధి జరిగి ఆత్మ జ్ఞానం పొందాలి అని sub conceous mind కి చెప్పుకొని సాధన మొదలు పెట్టండి.. అనుభవ పూర్వకంగా అద్భుతమైన ఫలితాలను పొందండి.
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616

ఆహారాన్ని వృధా చేయకూడదని " అని చాలా చక్కగా చెప్పాడు.నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు చిన్న పిల్లల నుంచి కూడాచాలానేర్చుకోవచ్చు.

 🙏🙏🙏🙏🙏*హృదయాన్ని కదిలించే కథ*   ###########
ఒక స్కూల్లో  చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు.ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న
అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. 
అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, 
క్రింద పైన వేసుకుంటూ తినేవారు.
మరికొందరైతే గొడవపడుతూ కోపంతో 
ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.
కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.
ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు 
ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని
ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. 
అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని
ఎగతాళి చేసేవారు.
 " అరే! వీడొక తిండిపోతు రా! 
ఒక్కమెతుకు కూడా  
వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా 
ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు,
ఒకరోజు తన  మిత్రున్ని ఇలా అడిగాడు.
నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా
  ఇంత చక్కగా తింటున్నావు కదా! 
 మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా
  నీకు బాధ అనిపించదా? "  దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం
ఇచ్చాడు. ఏదో వారికి తెలియకుండా 
నన్ను ఎగతాళి చేస్తున్నారు. 
నాకేం బాధలేదు.
  ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే
 లేచి నాకు ఇష్టమైన పదార్థాలను 
వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,
 వండటానికి కావలసిన వస్తువులను 
నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి
తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి 
కష్టంకూడా నా భోజనంలో ఉంది.
అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును 
వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!
అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.
అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరునవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .అంతేకాదు ఎంతోమందికి
రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల
పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "
అని చాలా చక్కగా చెప్పాడు.నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు చిన్న పిల్లల నుంచి కూడాచాలానేర్చుకోవచ్చు.ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పివారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
🙏🙏🙏🙏🙏

భాష : "తెలుగులో పదాలకు ఉన్న అసలు అర్ధాలే మారుతూవుంటాయ్!"

 భాష :

"తెలుగులో పదాలకు ఉన్న అసలు అర్ధాలే మారుతూవుంటాయ్!"

ఒక మాటకి 'ఇదే అర్థం' అని కచ్చితంగా చెప్పలేం. సంస్కృతం జనం భాష కాదు   కాబట్టి, పూర్తిగా వ్యాకరణ బద్ధంగా నడిచేది కాబట్టీ భాష పదాలకు ఆట్టే మార్పు ఉండదు. 

  తెలుగు లాంటి జీవద్భాషలో  కాలాన్ని బట్టి   పదాలకు అర్థాలు మారిపోతుంటాయ్.  ఒక ప్రాంతంలో వాడే  మాటకి ఒక అర్థం వుంటే, దానికి   మరో ప్రాంతంలో మరో అర్థం వుంటుంది. కుల,  వృత్తి, మత, ఇతరేతర భాషల ప్రభావాల, రాజకీయ,  ఆర్థిక, భౌగాళికాది ప్రాతిపదికల మీదా అర్థాలలో మార్పులు చోటుచేసుకోవడం ( విపరిణామం ) సహజ క్రమ పరిణామమే. భాష విస్తృతికి ఒక మంచి సూచిక కూడా. 

 'చెంబు' అనే పదాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఎఱ్ఱని రాగితో చేసిన 'పాత్ర' ని చెంబు అనాలి నిజానికి. రాగిది కాని పాత్రనూ 'చెంబు' అనేస్తున్నాం. 'స్టీలు - చెంబు, ప్లాస్టిక్ చెంబు' అనీ వాడేస్తున్నాం. 

'నేను రాత్రిపూట భోజనం చెయ్యను, టిఫిన్ చేస్తా ' అనటం వింటుంటాం కదా!  భోజనం అంటే  మీల్స్ అనే కాదు, భుజించేది ఏదైనా 'భోజనమే అవుతుంది. 

అట్లాగే ' సంతర్పణ ' అన్న పదానికి ఉన్న అసలైన అర్ధం ' సంతృప్తి పర్చటం' . ఆ అర్ధం మరుగున పడి, సమారాధనల్లో పెట్టే భోజనానికే ' ' సంతర్పణ ' పదం స్థిరపడిపోయింది. 

' తద్దినం ' అనే పదాన్ని చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన భ్రష్టార్థలో  వాడేస్తున్నాం . కానీ, తత్ +  దినం = తద్దినం ; అంటే ఆరోజు . ఆరోజు పుట్టినరోజైనా కావచ్చు, పెళ్లిరోజైనా కావచ్చు  .. నిజానికి! 

 ధర్మం' అంటే న్యాయం, విధి, కర్తవ్యం.  ధర్మాసుపత్రి, ధర్మ దర్శనం, ధర్మం చెయ్యండి. . అన్నప్పుడు అర్థాలు మారుతున్నాయి కదా మరి! 

'కోక' అంటే  'చీర' అని మాత్రమే చెప్తారు ఇప్పుడైతే. శ్రీనాథుడనే కవి కూడా 'కోక' ధరించాడు ఆయన రోజుల్లో మరి! అప్పట్లో కోక అంటే ఏదో ఒక వస్త్రం ..   పంచ, చీర, తుండు ఏదైనా కావచ్చన్నమాట!

 ఒక్కోసారి  పదం పూర్తిగా వూతిరేకార్థంలో వాడటం జరుగుతుంటుంది. 

'బియ్యం నిండుకున్నాయి' అంటే   బియ్యం అయిపోయాయి  అని అర్థం . 

అట్లాగే ఆరిపోయిన దీపాన్ని 'దీపం కొండెక్కింది' అంటుంటాం. 

సభ్యతగా చెప్పాలని అనుకోవటం వల్ల అసలైన అర్థం పోయి  మరో అర్థం వచ్చేలా పరోక్షంగా చెప్పే పద్ధతి కూడా ఉంది. . ఆవిడ నీళ్ళు పోసుకుంది; ఉత్త మనిషి కాదు; నెల తప్పింది వంటి వాటికి అసలైన అర్థాలు కాక 'గర్భవతి, కడుపుతో వుంది' అని అర్థం ఉంటుంది. 

కైంకర్యం - అనే మాటకు ' సేవ ' అసలు  అర్థం అయితే - కాజేయడం అనే అర్థంలో వాడేస్తున్నాం. 

నిజానికి, ఛాందసుడు అంటే ' ఛందస్సు తెలిసిన వాడు' అని అర్థం.  కాని, ఇప్పుడు చాదస్తుడు, లోకజ్ఞానం లేనివాడు అనే నిందార్థంలో వాడటం చూస్తున్నాం . 

చాలా మంది తెలీకుండా చేసే పెద్ద పొరపాటు ఒకటుంది. సభలో హాజరైన వాళ్లందర్నీ ఉద్దేశించి ' సభికులు ' అంటారు పెద్ద పెద్ద వక్తలు కూడా! కాని, సభికులు అనే పదానికి  ' జూదం ఆడేవాళ్లు ' అన్నదే అసలైన అర్థం. 

అట్లాగే ' శ్రాద్ధం ' కూడా. శ్రద్ధగా చేసే పని ' శ్రాద్ధం ' అయితే .. చచ్చిపోయినవాళ్లకు చేసే కర్మకాండ మాత్రమే శ్రాద్ధమనే  పదంగా  స్థిరపడిపోయింది  . 

ఆగ్రహం అంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నట్లు ' కోపం ' కానే కాదు సుమా . ' పట్టుదల ' అన్నది అసలైన అర్థం.
 ప్రతి రోజూ అంతరాత్మతో మాట్లాడం అలవాటు చేసుకో... నీకున్న సమస్యలు చెప్పండి.. ఆ సమస్యలకు పరిష్కారం అడగండి.... వర్తమానం భవిష్యత్ ఆనందంగా ఉండాలని చెప్పండీ.. అంతరాత్మ తో మాట్లాడాలి అంటే ముందుగా నీవు అంతరాత్మ లోకి ప్రవేశించండి సరైన సాధన ద్వారా... అద్భుతమైన అపూర్వమైన పాజిటివ్ ఆలోచనలే నిత్యానంద కర జీవితానికి పునాదులు.. పునాదులు గట్టిగా ఉంటే దేహం అనే ఇల్లు పటిష్టంగా ఉంటుంది.  అందుకొరకు బ్రహ్మ ముహూర్తంలో శ్వాస మీద ధ్యాస పెట్టీ సాధన మొదలు పెట్టు... శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరు కొండి...అనంతమైన విశ్వ శక్తిని పొందండి.
మానవ శరీరంలో హెడ్స్ ఆన్ని హెడ్ లోనే ఉన్నాయి... వినే చెవులు, చూసే కళ్ళు, మాట్లాడే తినే నోరు, శ్వాస తీసుకునే ముక్కు వీటన్నింటి గురించి ఆలోచించే మెదడు.
అనవసర మాటలు వినకుండా మాట్లాడ కుండా వ్యర్థమైన తిండి తినకుండా ఆవేశంతో శ్వాసల ను తీసుకోకుండా, మనసును కట్టడి చేసే అలోచనలు ఇలాంటివి అన్నింటినీ అదుపులో పెట్టేది పెట్టగలిగే ది సరయిన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.. ప్రతి మంచి పనికి మంచి ముహూర్తం కావాలీ, అపుడే సరైన ఫలితాలు వస్తాయి.. సరైన సాధన కు బ్రహ్మ ముహూర్తమే సరైన ముహూర్తం.
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616

Mind your mind!

 *🌹🙏శుభోదయం*🌹🙏

*Mind your mind!*
    ----------------------

ఇది చదవండి...కాదు, కాదు... ఆచరించండి 
మీ జీవితంలో మార్పుకోసం !

"కొద్దిగా నీరసంగా ఉంది...

కొద్దిగా బద్దకంగా ఉంది...

కాసేపు పడుకోవాలనిపిస్తోంది..

కాసేపాగి పని చేసుకోవచ్చులే...

ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవట్లేదు కదా.." 

నీకు నువ్వు ఇచ్చుకునే ఈ auto suggestions ని నువ్వు ఎప్పుడైనా గమనించావా?

~ హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప executor.

 మీరు అనుకున్నవన్నీ,,,,,,
 తు..చ .. తప్పకుండా అమలు చేస్తుంది.

నిద్ర వస్తోంది అనుకోండి...

 అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.

ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పని చేద్దాంలే అనుకోండి..
వెంటనే సాకులు వెదికిపెట్టి, మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.

బ్రెయిన్ ప్రోగ్రామింగ్.. ఓ గొప్ప సబ్జెక్ట్.

ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ 
మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ 
outputని సమీక్షించుకుంటూ  చేయాల్సిన పని!

ఒక్క క్షణం కమిట్ అవ్వు...
"నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"! 

Next మినిట్ నీ చావు రాసిపెట్టి ఉన్నా... 
మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు.

అది మన గొప్పదనం కాదు, మన బ్రెయిన్ గొప్పదనం.

నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది.

అందుకే ఎప్పుడూ...

గొప్పగా ఆలోచించు....    

నువ్వు  ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే....
   
నీ ఆవలింతలను,,,,,,,
నీ నిద్రనీ,,,,,,, 
నీ బద్ధకాన్నీ,,,,,,
నీ జలుబునీ,,,,,,,, 
నీ జ్వరాన్నీ,,,,,,

నీ చుట్టూ ఉండే అన్నీ,,,,, అన్నీ,,,,,

 డిజప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి,
 నీ బ్రెయిన్....
నీ పని మీద ఫోకస్ చెయ్యడం 
మొదలుపెడుతుంది.

గుర్తుంచుకో,, నీ బ్రెయిన్‌కి...
feed ఇవ్వాల్సింది,,,,.......
.............నువ్వే!

నీ లైఫ్..నీ గమ్యం కోసం 
నీ బ్రెయిన్‌ని సిద్ధపరుచుకో !

"చుట్టూ చెత్త ఉంటే....
నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను" అనకు.

బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే
 దాని విలువ మాటల్లో చెప్పలేం.

అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే...
నువ్వేంటి....ప్రతీ ఒక్కరూ సాధించగలరు.

నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని,
 నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం.

ఇంకొక (మనందరి) చిన్న అనుభవం.

ఏదైనా ముఖ్యమైన పని కోసం 
మనం అలారం పెట్టుకుంటే.....

అలారం కొట్టక ముందే 
రెండు మూడు సార్లు మనలని నిద్ర
లేపుతుంది నిద్రావస్థలో ఉన్న మన మెదడు.

అంటే... తాను.... 24×7
అంత అలర్ట్ గా ఉంటుంది, 
మనల్ని ఉంచుతుంది.

ఎటొచ్ఛీ... మనమే దాన్ని జోకొట్టేస్తుంటాం !

ఇంకొక ఆశ్చర్య కరమైన విషయం విన్నాను.

ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి,
మెదడు బయటకి వచ్చి ఉన్న స్థితిలో....
హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగే లోపు...

అతని మెదడుకి డాక్టర్లు 
"నీకేమీ కాదు, నువ్వు బాగుంటావు, బాగుంటావు"

అని positive suggestions ఇస్తూనే ఉన్నారట.

ఆ మెదడు ఆ positive suggestions వల్లనే కోలుకుని, operation success అయి, అతను ఇప్పటికీ బాగానే ఉన్నాడట  !!!

ప్రమాదం జరిగిన మెదడే కొలుకోగా లేనిది....

ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు...

రోజూ మనం positive suggestions ఇస్తుంటే...

 బ్రహ్మాన్డంగా  పనిచేయవా ?

"బుర్ర" పెట్టి ఆలోచిద్దాం....

"యద్భావం....తద్భవతి"

అనే సూక్తి  అంతరార్ధం ఇదే....

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Friday, May 19, 2023

హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. *హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?.*

 *అబ్దుల్*: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను.
 
 *తల్లి*: సరే

 *పీటర్:* అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను.

 *తల్లి:* సరే, సహకారం కోసం ₹10 తీసుకోండి.
---------------------------------------------------------

 *రమేష్*: *అమ్మా, నాకు గుడికి వెళ్లాలని ఉంది.  దయచేసి నాకు కొంతడబ్బు ఇవ్వండి.*

 *అమ్మ:* ఎంత?.

 *రమేష్:* 
1. వాహన పార్కింగ్ ₹  30.
2. చప్పల్ టోకెన్     ₹     5.
3. సెల్ ఫోన్ టోకెన్  ₹  10.
4. దర్శనం టికెట్     ₹100.
5. పూజా టోకెన్      ₹  10.
6. ప్రసాదం              ₹  50.
7. హరతి పళ్ళెంలో ₹   20.
8. హుండీలో          ₹   20

   మొత్తం.              *₹245.*
హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది.
*హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?.*

 ఏ రాష్ట్ర/కేంద్రం ప్రభుత్వ యంత్రాంగం ఒక్క ఆలయాన్ని కూడా నిర్మించలేదు.  దేవాలయ నిర్వహణకు తమ ఖజానా సొమ్మును ఖర్చు చేయడం లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి హుండీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?.

*ఆలోచించండి.*
*ఆచరణకు మార్గాలు వెదకండి!.*
 🙏

లవ్ జిహాద్ అంటే పచ్చ జెండాలు,జాలి టోపీలు,కళ్ళకి కాటుక పెట్టుకొని చేస్తారు అనుకుంటున్నారేమో ??

 లవ్ జిహాద్ అంటే పచ్చ జెండాలు,జాలి టోపీలు,కళ్ళకి కాటుక పెట్టుకొని చేస్తారు అనుకుంటున్నారేమో ?? 

క్లీన్ షేవ్,మంచి హెయిర్ స్టైల్,మంచి బట్టలు,బైక్ తో అత్యంత ప్రియమైన మాటతో ప్రారంభం అవుతుంది

లవ్ జిహాద్ లో ముందు వాళ్ళు హిందూ అమ్మాయి మనసును ,తర్వాత శరీరాన్ని గెలుస్తారు

వాడు వేసుకున్న చెడ్డీ మొదలు అన్నీ కిరాయివే,దీని వెనక పెద్ద వ్యవస్థ ఉంటుంది

లవ్ జిహాద్ అంటే ఎక్కడో కేరళ,హైదరాబాద్ లోనే జరుగుతుంది ఆముకునేరు ???

మన ఊర్లో కరెంట్,ప్లంబింగ్,మెకానిక్ ఇలా సొంతవృత్తులు చేసుకునే వాడే ప్రారంభిస్తాడు,ఒక్కడే 5 మందిని టార్గెట్ చేసి మరీ చేస్తాడు

ముస్లిం యువకులే లవ్ జీహాద్ చేస్తారు అనుకోకండి 70 ఏళ్ల వృద్దుడు కూడా 10 ఏళ్ల హిందూ మహిళ నుంచి మొదలు 70 ఏళ్ల స్త్రీ దాకా ఎవ్వరినీ వదలరు


90% హిందూ పురుషులు 40 ఏళ్ల తర్వాత తన భార్యకు కూడా శారీరక సుఖాన్ని ఎవ్వలేరు ఎందుకంటే మనమంతా మందు,సిగరెట్,పాన్,తాంబకు,ఇతర మత్తుకు బానిసలైపోతాం 

కానీ....వాళ్ళు 80 ఏళ్ల దాకా పిల్లల్ని కూడా కనేంత శరీర దారుఢ్యాన్ని కలిగివుంటారు

మీరు నమ్మరు 50% పైగా లవ్ జిహాద్ కేసుల్లో కారణం కేవలం శారీరక సుఖమే,ఆ సుఖం వీడు ఇవ్వలేడు, వాడు పుష్కలంగా ఇస్తాడు అందుకే వాటికోసం మన స్త్రీ ఏం చేయడానికైనా సిద్దపడుతుంది

డ్రైవర్లు గా ఇంట్లో చేరి తల్లిని,బిడ్డని ఒకరికి తెలియకుండా ఒకరిని లొంగదీసుకున్న సంఘటన ఇందూరు లో ఉంది,

ఇలా కొన్ని వందల లవ్ జిహాద్ కేసుల్లో విచారిస్తే వాడు డ్రైవర్ గా నో,లేక ఇంట్లో వాచ్ మెన్ గానో ఆ ఇంట్లోకి చేరిన వాడే అని తెలుస్తున్నది

ఆటో డ్రైవర్లు చేసిన లవ్ జిహాద్ కేసులకైతే అసలు లెక్కే లేదు, పండ్లు అమ్మేవాడు 4 గురిని ట్రాప్ చేయడంటే నమ్ముతారా ?? అది కూడా ఇందూరు లోనే

ఇందూరు లో లవ్ జిహాద్ చేసే ముస్లిం యువకులకు ఉచితంగా బట్టలు,బైకులు, లాడ్జి లో రూం, 5 స్టార్ భోజనం,పాకెట్ మనీ ఉచితంగా ఇచ్చే దాతలు వందలాది మంది ఉన్నారంటే మీరు నమ్ముతారా ?? 

హిందూ అమ్మాయిని హోటల్ కి తీసుకువస్తే మొత్తం ఫ్రీ,సినిమాకి తీసుకెళ్తే టికెట్స్ ఫ్రీ,షాపింగ్ కి తీసుకువస్తే బట్టలు ఫ్రీ,లాడ్జి కి వస్తే రూమ్ ఫ్రీ,వేరే రాష్ట్రాలకు విహార యాత్రలకి తీసుకొస్తే సర్వం ఫ్రీ ....ఇదంతా కేరళ లో కాదు ఇందూరు లోనే

దాదాపు అన్ని జిమ్ సెంటర్లో ట్రైనర్ వాడే,కుమార్ గల్లీ లో మన హిందూ స్త్రీ లకు చేతికి మెహేంది పెట్టేది వాడే,

కొన్ని వందల గ్రామాల్లో ఈ రోజుకీ మన మహిళలకి గాజులు తొడిగేది వాడే,హోటళ్లు,జోమాటో లు,క్యాబ్ లు,ఆటో డ్రైవర్లు ఇలా ఒక్కటేమిటి మన నిత్యజీవితంలో సగానికి పైగా పనులకు మనమే వాళ్ళకి మార్గం సుగమం చేశాం,మన ఇంట్లో ఆడవాళ్ళని వాడికి అప్పనంగా అప్పజెప్పేసాం....

ఈ తప్పు ఎవరిది ? మనది కాదా ???

ఇంకా ఈ మధ్య దారుణం ఏంటంటే మన హిందూ ఇళ్ళల్లో ఫంక్షన్లు,పెళ్లిళ్లు అయితే మన ఆడవాళ్లకు చీరలు కట్టేది వాడు,వాళ్ళని మేకప్ తయారు చేసేది వాడు

ఈ పనులు చెయ్యడం కోసం మనమే వాళ్ళని బుక్ చేసుకుంటున్నాం,మన ఇంట్లో స్త్రీ లను వాడికి బుక్ చేసి ఇచ్చేస్తున్నాం

నగరాల్లో అయితే మన హిందూ మహిళలకు మత్తును అలావటు చేసేది వాల్లే,చివరికి మత్తుకి బానిసలుగా మార్చేది వాళ్లే, మత్తులో మదించేది వాల్లే


డేటింగ్ యాప్స్, ఫ్రెండ్షిప్ యాప్స్ పేరుతో,ఇన్స్టా గ్రామ్ ఇలా మొత్తం సోషల్ మీడియాలో హిందూ అమ్మాయిలు,మహిళలే టార్గెట్ గా పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది

అఫ్తాబ్ చేతిలో హతమై ఫ్రిజ్ లో 32 ముక్కలైన శ్రద్ధ తో సహా లక్షలాది మంది హిందూ మహిళలు ఈ యాప్స్ ద్వారానే లవ్ జిహాద్ వలలో పడుతున్నారు,అఫ్తాబ్ ఒక్కడికే శ్రద్ధ కాకుండా మరో 23 మంది హిందూ మహిళలతో డేటింగ్ యాప్స్ ద్వారా సంబంధం ఉంది అనేది పోలీసులు వెల్లడించిన వాస్తవం, ఈ యాప్స్ రొచ్చులో కోట్ల మంది హిందూ మహిళలు ఉన్నారంటే మీరు నమ్ముతారా ???

ముఖ్యంగా బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వారి భార్యలు,కూతుర్లు

ఒంటరి మహిళలు వీళ్ళ టార్గెట్ లో ముందుంటారు

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో అందంగా కనిపిస్తూ లక్షల మంది హిందూ అమ్మాయిలను చేరిచేశారు,

లవ్ జిహాద్ కి కారెవరూ అనర్హం.....10సం రాల అమ్మాయి నుంచి 50 ఏళ్ల మహిళ దాకా అందరూ వారికి కావాలి

ఇదంతా చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది అనే అనుమానం మనకి రావచ్చు...

సింపుల్ ..హిందువుల సంఖ్య తగ్గుతుంది,ఈ హిందూ మహిళ ముస్లిం అవుతుంది కాబట్టి ఆవిడకి కలిగే సంతానము ముస్లిం అవుతారు,హిందూ పురుషులకు భార్యలు ఉండకూడదు,దొరకకూడదు అలా దొరకని స్థితిలో వాడు భార్య కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు

హిందువుల కూతుర్ల,భార్యల ఆస్తులు,సంపాదన వాళ్ళ సొంతం అవుతుంది

హిందువుల జన సంఖ్య తగ్గాలంటే ముందు హిందూ ఆడవాళ్ళ సంఖ్య తగ్గాలి,ఆ హిందూ ఆడవాళ్లను లొంగదీసుకున్న అనంతరం వాళ్ళతో కలిసి వీళ్ళు కనే సంతానమమతా ముస్లిం లవుతారు తద్వారా ఏ దేశంలో హిందు జాతి లేకుండా చేయాలనేది వాల్ల లక్ష్యం

హిందు పురుషులు జీవితం అంతా కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు, వాడు కేవలం మన ఇంటి పిల్లని చేసుకొని ఈ ఆస్తిని అప్పనంగా అనుభవిస్తాడు,చివరికి నిన్నే తన్ని తరిమేస్తాడు, ఇది నిజం,ఇదే నిజం .....

చదువు కోసం గ్రామాల నుంచి నగరాల్లో హాస్టళ్లలో ఉంటున్న అమ్మాయిలు,తండ్రి లేని అమ్మాయిలు,నలుగురు కలిసి రూం తీసుకొని ఉంటున్న అమ్మాయిలు,చిన్న చిన్న సమస్యల్లో ఉన్న మహిళలు 

ఇలా ఒక్కటి కాదు అన్ని కోణాల్లో వాళ్ళ నెట్వర్క్ ఉంది,ఉంటుంది, దీన్ని ఆషామాషీగా తీసిపారేస్తే రేపు నీ కొంప కొల్లేరవుతుంది, నిద్ర పోతున్న హిందువులరా లేచి సావండి, లేకపోతే ఇక నిజంగా చావే దిక్కు

అంబానీ కూతురు,భార్య దగ్గర్నుంచి అడుక్కుతినే వాడి కూతురు,భార్య దాకా అందరూ వాళ్ళ టార్గెట్ లే...

ఎవడి స్థాయిలో వాడు ప్రయత్నించి,పడేస్తాడు

నువ్వు జీవితమంతా నా నా తప్పులు చేసి సంపాదించినదంతా ఒక్క రాత్రిలో నీ కూతురే వాడికి దోచి పెట్టేస్తుంది, ఈ బాధ భరించలేక నీ గుండె ఆగిపోతుంది, అప్పుడు నీ కథ సుఖంతం అవుతుంది

కేవలం హిందూ మహిళలే వీళ్ళ టార్గెట్ ఆ ?? కాదు హిందువులు మొదటి ప్రియరిటీ, క్రైస్తవులు, నాస్తికులు, సిక్కులు, జైనులు, పార్శీలు ఒక్కరేమిటి ముస్లిం లు కాని వారందరూ వాళ్ల టార్గెట్లే...

కాబట్టి మన ఇళ్ళల్లో ఆడవాళ్లకు ఈ కుట్రను అర్థం చేయించండి, అర్థం కాకపోతే ది కేరళ స్టోరీ సినిమా చూపించండి, ఇది ఈరోజే ఇప్పుడే చేయాల్సిన పని లేకపోతే ఇక అంతే

ఓ హిందూ ....మేలుకో
నీ తల్లి నుంచి మొదలు పెట్టి  నీ తోబుట్టువులు,కూతురు,బంధువులు అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పు, అర్థం చేయించు ,అర్థం కాకపోతే ది కేరళ స్టోరీ సినిమా చూపించు నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో. 

లేకపోతే ఫ్రిడ్జ్ లోనో ,
సుటుకేస్ లోనో రేపటి రోజు చూడాల్సి వస్తుంది.

జై. శ్రీ. రామ్....

యదార్థంగా జరిగిన సంఘటన

 నేలతల్లి 

"నాన్నా ! పొలం సంగతి ఎప్పట్నుంచో అడుగుతున్నాం కదా..ఇదిగో చూద్దాం..అదిగో చేద్దాం..అంటున్నారు కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు..మీకా వయసు మీద పడుతుంది.. మా పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది..అందుకని..? అంటూ చెప్పటం ఆపాడు గురవయ్య 

వింటున్న వెంకటయ్య ఒక్కసారి చుట్టూ చూసాడు 

నలుగురు కొడుకులూ.. కోడళ్లు ఆయనేం చెప్తారా అని ఆత్రంగా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నారు 

కానీ వెంకటయ్యలో ఏ భావమూ లేదు 

"ఊ..అందుకని..? నిర్లిప్తంగా అడిగాడు 

" అందుకని ఆ పొలం అమ్మేసి మా నలుగురికీ పంచేస్తే మాకు చేతికింద  సాయం అవుతుంది " వెంటనే చెప్పాడు పెద్ద కొడుకు గురవయ్య 

వెంకటయ్య క్షణం పాటు ఏం మాట్లాడలేదు 

వెంకటయ్య మౌనం వాళ్లలో అసహనం పెంచింది 

" అవును నాన్నా ! అన్నయ్య చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్..ఇంకెంతకాలం ఈ ఊరిని ఆ పొలాన్ని పట్టుకుని బతుకీడుస్తారు ? మాకూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు.. డబ్బుకు ఇబ్బందిగా ఉంది..అందుకే పొలం అమ్మి నలుగురికీ పంచేస్తే బాగుంటుంది " రెండో కొడుకు కల్పించుకుని అడిగాడు 

దానికి అవునన్నట్టు మిగిలిన ముగ్గురు కొడుకులు తలాడించారు 

" ఒరేయ్ ! నాకిప్పుడు తొంభై ఏళ్ళు..నాకు ఇద్దరు అమ్మలు..ఒకరు నా కన్నతల్లి..ఇంకొకరు ఈ నేలతల్లి.. నా కన్నతల్లి చిన్ననాటే కన్నుమూస్తే ఈ నేలతల్లే నన్ను సాకి పెంచింది..అంతెందుకు మీ అమ్మ దాటిపోయినతర్వాత ఒంటరివాడినైన నాకు మిమ్మల్ని ఓ దారిలో పెట్టటానికి  చేయూత ఇచ్చింది కూడా ఈ నేలతల్లే..ఆ బంధం అంత తేలిగ్గా తెంచుకునేది కాదురా..మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయేది..ఉన్న నాలుగు రోజులు ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగనివ్వండ్రా " వెంకటయ్య కల్లోలోనుంచి కన్నీటి బొట్లు రాలి నేలను తడిమాయి 

"అంటే మీకు మీ కొడుకులకన్నా ఈ మట్టే ఎక్కువా..అవతల మేము ఎలా అడుక్కుతిన్నా మీరు మాత్రం హాయిగా పొలంలో కాలక్షేపం చేస్తారు..అంతేగా ? విసురుగా అంది పెద్ద కోడలు 

" అమ్మా ! నన్ను అపార్థం చేసుకోకు తల్లీ..ఈ నేలతో నాకున్న అనుబంధం చెప్పాను..అంతేకానీ నా కొడుకులకు అన్యాయం చెయ్యాలని కాదమ్మా..ఏదో ఈ నాలుగు ఎకరాల పొలం చేతిలో ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరినీ చేయి చాచి అడక్కుండా రోజులు నెట్టుకొస్తున్నా..నా తర్వాత ఈ భూమి నా కొడుకులదే కదమ్మా " ఆర్ద్రంగా చెప్పాడు వెంకటయ్య 

" అదేంటండీ..ఎంతసేపూ మీ గురించే ఆలోచిస్తారు..కొడుకుల గురించి ఆలోచించరా? ఉన్నన్నాళ్లు అని పదేళ్లబట్టి చెప్తున్నారు..మీరు తేల్చేసరికి మా ప్రాణాలు పోయేట్టున్నాయ్"ఘాటుగా అందుకుంది రెండో కోడలు 

"అదికాదమ్మా..ఉన్న ఆ కాస్త పొలం అమ్మేస్తే నేను మీకు భారం అవుతానేమో అని ఆలోచిస్తున్నా తల్లీ..అప్పుడు నా భారం మీలో ఎవరో ఒకరు మోయాలి.." వెంకటయ్య మాటలు బాంబులా పేలాయి 

ఒక్క క్షణం అక్కడంతా నిశ్శబ్దం 

కొడుకులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు 

కోడళ్లకు అయితే గొంతులో పచ్చి వెలక్కాయ పడింది 

ఇదేంటి ఈ ముసలాడు పొలం పంచమంటే నన్నెవరు చూస్తారు అంటాడు ?

"అదేంటి మామయ్యా.. ఉన్న నలుగురిలో పెద్దబావగారి పొజిషన్ బావుంది కదా..మిమ్మల్ని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటారులే " వెనకనుంచి చిన్న కోడలు గొణిగింది 

" ఏంటమ్మో బావుండేది..పిల్ల పెళ్ళికొసం మా ఆయన చేసిన అప్పు ఇంకా తీరలేదు..అంత ఇదిగా ఉంటే మామయ్యని మీ ఇంట్లో ఉంచుకోవొచ్చుగా..అయినా మీరిద్దరూ మాట్లాడరే ? మిగిలిన ఇద్దరినీ చూస్తూ కసురుకుంది పెద్దకోడలు 

" ఆ..ఇక్కడెవరి పరిస్థితి బాగుందిలే..అంత బావుంటే ముష్టి పొలం కోసం ఇక్కడ అడుక్కోవాల్సిన ఖర్మ మాకేం పట్టింది..? వంత పాడారు మిగిలిన ఇద్దరు 

" అబ్బాబ్బా..మీరుండండీ.. ఒకళ్లకోకళ్ళకి అస్సలు పడిచావదు..ఇలా కాదు కానీ ఓ పని చేద్దాం.."కసురుకుంటూ చెప్పాడు పెద్దవాడు 

ఏంటన్నట్టు చూసారు మిగిలినవాళ్ళు 

" ఏముంది సింపుల్..సోమవారం మంగళవారం నాన్న  ఆదిలాబాద్ లో మా ఇంట్లో ఉంటారు.. బుధవారం..గురువారం..నిజామాబాద్ లో రెండో తమ్ముడి ఇంట్లోనూ..శుక్రవారం శనివారం మెదక్ లో మూడో తమ్ముడి ఇంట్లోనూ ఆదివారం ఆఖరి వాడింట్లోనూ ఉంటారు"

" అదేంటి ఆఖరాయన ఇంట్లో ఒక్క రోజేనా ? ముఖం మటమట లాడిస్తూ అంది పెద్ద కోడలు 

"పోనీలేవే..మా నలుగురిలో వాడే చిన్నవాడు కదా..అందుకే వాడికి డిస్మౌంట్ " నవ్వుతూ అన్నాడు పెద్ద కొడుకు 

ఆ మాటతో మిగిలిన వాళ్లకు కూడా నవ్వొచ్చింది 

అందరూ నవ్వుతున్నారు

నవ్వులపాలైపోయిన తన జీవితాన్ని తల్చుకుని వెంకటయ్యకు ఏడుపొచ్చింది 

ఆయన కళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నాయ్ 

ఇకపై నలుగురు కొడుకులూ వంతులు వేసుకుని నన్ను చూసుకుంటారన్నమాట 

రెండ్రోజులు ఒక ఊర్లో ఉంటే ఇంకో రెండ్రోజులు ఇంకో ఊర్లో ఉండాలన్నమాట 

తొంభై ఏళ్లపాటు కన్నతల్లిలా సాకిన నేలతల్లిని ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్లాలా ? 

ఈ ప్రాణం ఈ మట్టిలోనే కలిసిపోవాలని ఆశ పడ్డాను కదా..ఇప్పుడది ఆడియాస అవుతుందా ? 

" ఏంటి మామయ్యా..ఆలోచిస్తున్నారు..? తలకు మించిన భారం అయినా మీ అబ్బాయిలు వంతులు వేసుకుని అయినా మిమ్మల్ని చూసుకుంటాం అంటున్నారుగా? ఇంకెందుకాలస్యం..ఆ పొలమేదో నలుగురికీ పంచెయ్యండి" కంక్లూజన్ అన్నట్టుగా చెప్పింది పెద్ద కోడలు 

అప్పటికే బాగా చీకటి పడటంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు 

 వెంకటయ్య ఒంటరిగా మిగిలిపోయాడు 

ఏడ్చి ఏడ్చి అతడి కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది 

నలుగురు కొడుకుల  పేరున పొలాన్ని పంచుతున్నట్టు రాసి కాగితం బల్లమీద పెట్టాడు 

చాలసేపటి తర్వాత అర్ధరాత్రి లాంతరు తీసుకుని పొలానికి బయలుదేరాడు 

పొలంలో నేల మీద కూర్చుని ఆ మట్టిని ముద్దాడాడు 
ఇప్పుడు అతడి మనసు తేలికైంది  
ప్రశాంతంగా అనిపించింది 

అక్కడే గుట్టమీద పడి ఉన్న ఎండు పుల్లలను ఆకులను చితిలా పేర్చి నిశ్శబ్దంగా దానిమీద పడుకుని అగ్గిని రగిల్చాడు 

నిమిషాల్లోనే 90 ఏళ్ల వెంకటయ్య శరీరాన్ని  నేలతల్లి తన ఒడిలోకి తీసుకుంది !!

*   *  *

ఇది కథ అనుకుంటున్నారా ? 
కాదు యదార్థంగా జరిగిన సంఘటన 
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడు కొడుకులు వంతులు వేసుకుని తనను పోషిస్తారన్న మాట విని తట్టుకోలేక  నిన్న చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త చదివి కన్నీటితో రాసిన కథ లాంటి నిజం !

పరేష్ తుర్లపాటి

అందుకే... *"అమ్మ"* కు పాదాభివందనం.

 *"అమ్మ"* 
   
అందరికి ఒక ప్రశ్న...రెండు కిలోల రాయిని నడుముకు కట్టుకుని ఓ వారం ఉండగలరా..?

రెండు నుంచి మూడు కిలోల పసికందును కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ.

*ఆమెను మించిన శ్రామికులెవరు..?*

శరీరం 45 డెల్‌ (నొప్పికి కొలత) యూనిట్ల నొప్పినే భరించగలదు...మరి 57 డెల్‌ యూనిట్ల నొప్పిని భరించగలరా ఎవరైనా..? భరించలేరు...

20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుంది అమ్మ.

*ఆమెను మించిన కార్మికులెవరు..?*

ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమంటేనే వేలకు వేలు డబ్బులడుగుతారు...లాలపోసి... సాంబ్రాణి వేసి... బట్టలు తొడిగి... ఊయల ఊపి... జోల పాటతో నిద్రపుచ్చేది అమ్మ.

*ఆమెను మించిన శ్రమ జీవులెవరు..?*

రైల్వేస్టేషన్లో లగేజీని కొద్దిదూరం మోయమంటేనే రూ. వందలు అడుగుతారు కూలీలు...
అలాంటిది,
270 రోజులు కడుపులో...
1095 రోజులు భుజాల మీద...
బతికినన్ని రోజులు మనల్ని గుండెల్లో...
*ప్రేమతో* మోసేదే అమ్మ..!

*ఆమెను మించిన కూలీలెవరు..?*

కార్మికుడు...రక్తాన్ని స్వేదంగా మలిచి సమాజాభివృద్ధికి కృషి చేస్తే...
అమ్మ...రక్తాన్ని పాలగా మలిచి ఆ సమాజాన్నే తయారు చేస్తుంది...
ఏమిచ్చినా సరితూగని ప్రేమ
సాయం చేయమంటే ! ఎవరో ఒకరు చేయొచ్చు...ఏదో ఒకటి ఆశించవచ్చు... మన కోసం బాధను భరించమంటే మాత్రం ఎవరూ ముందుకు రారు...అమ్మ అలా కాదు... మనల్ని ఈ లోకంలోకి తేవడానికి ఎంత బాధ పడుతుందో తెలుసా ? కడుపులో నలుసు పడ్డప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 

ఏమి తిన్నా వాంతులు...నీరసం అయినా ఆనందంగానే సహిస్తుంది... కడుపులో బిడ్డ కాస్త కుదుట పడ్డాక...దాదాపు ఆరు నెలల పాటు కంటి మీద కునుకు లేక, కంటి నిండా నిద్రపోక    ఎంతగానో ఇబ్బంది పడుతుంది...బిడ్డ కలలతోనే సంతోషం పొందుతుంది... ఆపైన పురిటి నొప్పులు, బాలింత కష్టాలు...అన్నీ మన కోసమే. 

మనం పుట్టడం కోసమే...మరి వీటన్నింటినీ ఎంత జీతమిస్తే చేయించుకోగలం ? ఆమె అడిగే జీతం ప్రేమ.

*వెలకట్టలేని శ్రమ*

సెప్టిక్‌ ట్యాంకు క్లీన్‌ చేయడానికి వేలకు వేలు డబ్బులడుగుతారు...మరి మన మలమూత్రాలను ఎత్తేయమంటే ఎవరైనా చేస్తారా ? ఎంత కూలీ ఇచ్చినా ఈ పనికి ఎవరైనా అంగీకరిస్తారా ? అమ్మ ఇవన్నీ చేస్తుంది...మనం పాడుచేసే దుస్తులన్నింటినీ ఉతుకుతుంది... మనకు ఆరోగ్యం బాగోలేకపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది...మనకు గాయమైతే తను ఏడుస్తుంది...నిద్ర రాకపోతే జోలపాటవుతుంది...మనం ఆడుకోవడానికి మోకాళ్ల మీద గుర్రం అవుతుంది...మనతో చిన్నపిల్లలా తోడు పరుగెడుతుంది... ఏడిస్తే ఓదారుస్తుంది... నవ్వితే సంతోషిస్తుంది...
ఇన్ని పనులకు ఎంత కూలీ ఇస్తే చేస్తారు ?
ఆమె అడిగే కూలీ *"ఆప్యాయత"*

*స్వేదామృతం*
మనకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు ఎత్తుకొని నిలబడుతుందో అమ్మ...నడిపించడానికి ఎన్నిసార్లు వడివడిగా నడుస్తోందో..?పరిగెడుతుందో..?వచ్చీరాని మన మాటలకు దుబాసీలా మారి ప్రపంచానికి చెబుతుంది... ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది...
బడిలో విడిచి వెళ్లడానికి ఆమెగుండె ఎన్ని సార్లు పగిలిపోతుందో ?
ఎక్కడికైనా వెళ్లి ఆలస్యంగా వస్తే,
ఎన్నిసార్లు ఆ కళ్లు గడియారాన్ని చూస్తాయో ?
ఆ మనసు ఎంతగా నిరీక్షిస్తుందో ?
పరీక్ష పాసైతే పండగ చేసేది...
ఉద్యోగం తెచ్చుకుంటే విజయ పతాకం ఎగరవేసేది... అమ్మ...కన్నీళ్లు వస్తే కొంగుతో తుడుస్తుంది...
తప్పు చేస్తే కొంగుచాటున దాస్తుంది...
తన ఆయుష్షూ మనమే పోసుకోవాలని జీవితాంతం దీవిస్తుంది.

*"ఇంతటి స్వేదజీవికి ధన్యజీవికి ఎంత వేతనం ఇవ్వాలి"..?*
❤️ ❤️ ❤️ ❤️ ❤️

*"ఆమె మనస్సుతో కోరే వేతనం...మన ఎదుగుదల"*👍

అందుకే... *"అమ్మ"* కు పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక విషయం (చాడి) వినే ముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

 ఒక సారి చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి "నీకు తెలుసా నీ మిత్రుడు గురించి. నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను 'మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)' అంటాను" అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ “నిజం”: “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు “లేదు ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ “మంచి:” 
” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా?” అని అడిగాడు చాణక్యుడు.
“కాదు” అన్నాడు చాణక్యుని స్నేహితుడు .

“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు. అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం. "

"సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణక్యుడు.

మూడో జల్లెడ “ఉపయోగం” : 
“నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా? ” అని చాణక్యుడు అడిగాడు.
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణక్యుడు.

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినే ముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

*స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే  ఈకథ!* 
                🙏

Thursday, May 18, 2023

 [5/17, 19:32] +91 92473 43585: భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!

 యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!


[5/18, 19:26] +91 92473 43585: ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.

 నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..

Sunday, May 14, 2023

 *మనం ఆహరం కోసం మూగ జీవాలను పెంచి పోషించటం వాటిని నరకడం చూస్తున్నాం, అడవులను ద్వంసం చేస్తున్నాం, ఇవే అడవులు carbon dioxide, methane, nitrous oxide వంటి విష వాయువులను గ్రహించి  మనకు ప్రాణవాయువు ను అందిస్తున్నాయన్న విషయం నాకు కొన్నేళ్ళకి గాని అర్ధం కాలేదు, ప్రస్తుతం మన భూమి పై జరిగే వాతావరణ మార్పులకు మనం చేసే ఈ తప్పులే కారణం అని తెలుసుకున్నాను. యోగ మరియు ధ్యానంతో నా జీవితాన్ని మార్చుకున్నాను, శాకాహారి గా మారి జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నాను. ఇలా మన జీవితంలో మనం ఎంచుకొనే ప్రతి దానికి ఒక ప్రాధాన్యం ఉంటుంది, మీరు కూడా మీరు ఎంచుకొనే ఎంచుకొనే విషయాల్లో ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. - శిల్పాశెట్టి, బాలీవుడ్ హీరోయిన్*

అమ్మకు వందనం

 అమ్మకు వందనం


అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ,గౌరవం ఉంటాయి.అమ్మ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒకే రకమైన భావన వ్యక్తం చేస్తారు.అయితే ప్రపంచీకరణ పేగు బంధాన్ని దూరం చేస్తుంది.అలాగనీ కొత్త తరాన్ని పూర్తిగా నిందించలేము.తాము చదువుకున్న చదువుకు తాను నివసించే ప్రాంతంలో సరైన అవకాశాలు లభించనప్పుడు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళతారు. అవసరమైతే విదేశాలకు వెళతారు.మానవ జీవన గమనంలో ఇది ఒక ప్రక్రియ.

బంధాలు దూరమయినప్పుడే దినోత్సవాల ఆవశ్యకత తెలుస్తుంది. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వరకు మన దేశంలో మాతృ దినోత్సవం యొక్క అవసరం పెద్దగా రాలేదు.ఇప్పటికీ మన దగ్గర చాలా కుటుంబాలలో పిల్లలు 15 నుంచి 20 ఏళ్ల వరకు తల్లి తండ్రుల వద్దే పెరుగుతుంటారు.

ఎక్కడైనా తల్లిదండ్రులను గౌరవించాల్సిదే. ఎందుకంటే వారి
ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామా అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు. నవమాసాలు మోసి కష్ట పడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తయితే... రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్ట పడేది అమ్మ. ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా తక్కువే అవుతుంది.ప్రతి ఏటా మే రెండవ ఆదివారం మాతృ దినోత్సవం జరుపుతారు.

గ్రీస్ దేశంలో ‘రియా' అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్'గా భావించి సంవత్సరానికి ఒకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో బ్రిటన్లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే' పేరిట ఉత్సవాన్ని నిర్వహించేవారు. ‘జూలియవర్డ్ హోవే' అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది.
మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంత గానో ప్రచారం చేయడం జరిగింది.

అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి కూడా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోయి చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి.సంప్రదాయ వృత్తుల స్థానంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరిగింది.ఇందుకు ఆధునిక విద్య అవసరం అయింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు కోసం వలసలు పెరిగాయి. అందువల్ల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలను అక్కడ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి.స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలి.వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి. మేధో వలసని ఆపాలి.విద్య,వైద్యం లో నాణ్యత పెంచాలి. అప్పుడే బంధం  ఒక సామాజిక సమస్య అవకుండా ఉంటుంది.


యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836
 *సత్యం అంటే తెలుసుకోవలసినది, ధర్మం అంటే ఆచరించవలసినది, సత్యం తెలియకపోతే మనకి ధర్మాన్ని ఆచరించే విధివిధానం అర్ధం కాదు, దాంతో యుద్ధ రంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాం. ఎప్పుడయితే మన శరీర ధర్మం, మన కుటుంబ ధర్మం మరి సంఘ ధర్మానికి చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో, అప్పుడు మళ్ళీ ఈ భూమి మీద కి నేర్చుకోవటానికి రావలసిన అవసరం మనకి ఉండదు. అందుకు చెయ్యాల్సినది నిరంతర ధ్యానసాధన, అదే మనకి ఉన్న ఒకేఒక్క అద్భుతమైన బాట*
💫✨🦚🧘🔺🧘🦚✨💫

✍🏼 నేటి కథ ✍🏼* *పిసనారి కాదు* *- రచన : తమిరిశ జానకి*

 *✍🏼 నేటి కథ ✍🏼*


*పిసనారి కాదు*

*- రచన : తమిరిశ జానకి*

 
రాజారావుకి తన పక్కింట్లో ఉండే శ్రీధర్ అంటే చాలా చిన్నచూపు. తనలాగా జల్సాలు చెయ్యడని లెక్కలేనట్టు డబ్బు ఖర్చు పెట్టడనీ లోకువగా చూస్తాడు.

ఉన్నదానికి నాలుగు రెట్లు ఖర్చుపెడుతూ ఆడంబరంగా బతికే రాజారావుని చూస్తుంటే శ్రీధర్ కి జాలి అనిపిస్తుంటుంది. ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అతనికి. వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవు. సొంత ఇల్లు కాదు.అద్దె ఇల్లే.

తనకీ ఇద్దరు పిల్లలున్నారు. సొంత ఇల్లు కాదు. అద్దె ఇల్లే. వెనక ఆస్తులేమీ లేవు. గొప్పలకోసం అక్కర్లేని అనవసర ఖర్చులు పెట్టడం తన పద్ధతి కాదు.ఇంట్లో ఎవరికీ ఏ లోటూ లేకుండానే గడుపుకొస్తున్నాడు. రాజారావు తనని చిన్న చూపు చూస్తాడని తెలిసినా తేలిగ్గానే తీసుకుంటాడు తప్ప అతని పట్ల కోపం లేదు.

"మీ నాన్న పిసినారి వాడు కదూ!" ఆ రోజు అర్జున్ని అడిగాడు రాజారావు కొడుకు పవన్. చూసిన సినిమాకే మళ్ళీ మూడోసారి చూడటానికి వాళ్ళనాన్న తనూ వెళ్తున్నారు.

శ్రీధర్ కొడుకు అర్జున్ కి రాజారావు అంకుల్ లాగా తన తండ్రి కూడా ఉంటే బావుండుననిపించింది.ఇప్పుడనిపించడం ఏమిటి గానీ ఎప్పుడూ అలాగే అనిపిస్తుంటుంది. తను ఎప్పుడూ మనసులో అనుకునేదే పవన్ అన్నాడు.....కానీ ఎందుకో వాడు అంటే మాత్రం ఉడుకుమోత్తనంగా అనిపించింది. తలొంచుకుని ఇంట్లోకెళ్ళిపోయాడు.తల్లి దగ్గిరచేరి నసగడం మొదలుపెట్టాడు.
నవ్వింది శ్యామల" ఏవిట్రా నీ బాధ?""
“అది కాదమ్మా! అసలు....నాన్నెందుకు డబ్బు ఖర్చుపెట్టడానికి ఎంతో ఆలోచిస్తాడు?చక్కగా ఆ రాజారావు అంకుల్ చూడు తనకీ పవన్ కీ ఎన్ని రకాల బూట్లో ఉండగానే ఇంకా ఇంకా కొంటూనే ఉంటాడు.జీన్స్ ప్యాంట్లు ఎన్ని ఉన్నా అస్తమానం కొని తెస్తూనే ఉంటాడు.ఎప్పుడూ హోటళ్ళకీ సినిమాలకీ తీసికెళ్తుంటాడు.మొన్న నేను జీన్స్ ప్యాంటు కొని తెమ్మంటే కిందటి నెల్లోనే కదా కొన్నాను మళ్ళీ అప్పుడే ఏమిటి అన్నాడు నాన్న. సినిమా అంటే...టీవీ లో చూస్తూనే ఉన్నావుకదా అస్తమానం బయటకెళ్ళి చూడాలంటే ఎంత డబ్బవుతుందో తెలుసా అంటాడు. నాన్నెందుకమ్మా అంత పిసినారిగా ఉంటాడు ?"

"పొదుపరికీ పిసినారికీ తేడా తెలుసుకోరా నువ్వు ముందు. మనకేవన ్నాఇంట్లో ఎందులోనన్నా లోటు చేస్తున్నారా? లేదు కదా! నీకు కావలసినన్ని బట్టలున్నాయి. ఎవరినో చూసి..." తల్లి మాటలు పూర్తికాకుండానే కోపంగా లేచి వెళ్ళిపోయాడు అర్జున్ "నువ్వంతే ఎప్పుడూ నీతి పాఠాలు చెప్తావు" అంటూ.

........ ..................
ఎప్పుడూ తమ ఇంటివైపే చూడని రాజారావు అంకుల్ ఆ రోజు పొద్దున్నేకళ్ళల్లో నీళ్ళతో రావడం నాన్నచేతులు పట్టుకోడం వింతగా ఉంది అర్జున్ కి.

"ఇలా కూచోండి ముందు. ఏంజరిగింది?" శ్రీధర్ నెమ్మదిగా ఆయన్ని కూచోపెట్టాడు.
"శ్రీధర్ గారూ మీరే నాకు సాయం చెయ్యాలి. కొంచెం డబ్బు కావాలి... అప్పుగానే... జీతాలు రాగానే తిరిగి ఇస్తాను. మా బావమరిదికి యాక్సిడెంట్ అయ్యిందిట. పక్కింటివాళ్ళు ఫోన్ చేశారు.
మేము వెంటనే వెళ్ళాలి. మేము తప్ప ఎవరూ లేరతనికి. కానీ... కానీ... ఒకటో తేదీ జీతం వచ్చే దాకా నాదగ్గిర డబ్బు లేదు.
ముగ్గురు నలుగురిని అడిగాను. ఎవ్వరూ ఇవ్వలేదు. వాళ్ళదగ్గిర ఇప్పటివరకూ తీసుకున్న అప్పులు తీర్చకుండా మళ్ళీ అడిగితే వాళ్ళు మాత్రం ఎలా ఇస్తారు? నాకు భగవంతుడు మంచి గుణపాఠం నేర్పించాడు."

అర్జున్ అంకుల్ వైపు చూశాడు జాలిగా... నాన్న పిసనారి కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు... ఔను... మొన్న తనకి జీన్స్ ప్యాంటు బూట్లు కొనలేదుగా! నిన్న హోటల్ కి తీసికెళ్ళమని అడిగితే పదిహేను రోజులే కదా అయ్యింది హోటల్ కి వెళ్ళి వొచ్చేనెల్లో చూద్దాం అన్నాడు. అలాంటి నాన్న అంకుల్ కి సాయం చేస్తాడా!

"రాజారావు గారూ కంగారు పడకండి.... తప్పకుండా సాయం చేస్తాను." అంటూనే లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు.

అర్జున్ నమ్మలేనట్టుగా చూశాడు. రాజారావు వెళ్ళిపోయాక కొడుకుని దగ్గిరకి పిలిచాడు శ్రీధర్.
"అనవసరపు ఖర్చులు పెట్టకుండా కాస్త ఆలోచించి నడుచుకుంటే ప్రతిరోజూ అప్పులు చెయ్యడం.... అత్యవసరం వొచ్చినప్పుడు ఎవరూ అప్పు ఇవ్వకపోవడం జరగదు.... ఔనా కాదా..."

ఔను అన్నట్టుగా తల ఊపాడు అర్జున్.

"ఒప్పుకుంటావా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేసేందుకు వెనకాడని స్వభావం మీ నాన్నగారిదని... పొదుపుగా ఉండే మనస్తత్వమనీ....." అమ్మ మాట పూర్తి కాకుండానే అందుకున్నాడు అర్జున్ "పిసనారి కాదని కూడా ఒప్పుకుంటాను."

అంటూనే నాన్నని వాటేసుకున్నాడు. ఆ ముఖంలో చెప్పలేనంత సంతోషం వెల్లివిరిసింది.

ఈ రోజు మదర్స్ డే సందర్బంగా కవిత...

 ఈ రోజు మదర్స్ డే సందర్బంగా నేను రాసిన కవిత...

అమ్మ లాలన...!

"అ" అంటే అమ్మ  అని ఉగ్గుపాలతో నేర్చిననాడే నేను అమ్మ ఒడిలో హాయిగా నిద్రించి కలల ప్రపంచాన్ని చుట్టూముట్టితిని...
మరింకేమైనా చల్లని సేద దొరుకుద్దని...ఎతికితిని ?
ఇహ లోకంలో అమ్మకు సాటైనా సంధ్యగుడు ఎక్కడ దొరుకును? అందంతా పై పై పుతాలే....!

అమ్మ తనం అనుభవిస్తే తెలుస్తుంది...
అక్కరకు రాని ఆలోచనలతో
అక్షరం అద్దని ఆవేశంతో
అమ్మను కొలిస్తే ఆయుష్షు రాదు..!

అమ్మ ప్రేమ మూర్తి..
అమ్మ విలువకు ఈ ప్రపంచంలో
రేటు లేదు...ఎందుకంటే...
రక్తాన్ని రణ అన్వేషణ గాంచి
నవమాసాలకు ప్రాణాన్ని ఫణంగా పెట్టి..
ఈ భూమితల్లిలో చరా చర జాతులకు జీవం పోస్తుంది...
జనని జ్యోతి అవుతుంది...!

అందుకే....
అమ్మాతో మాట్లాడాలని
అమ్మతో ఆడాలని
ఎంతెత్తు ఎదిగినా ఆ జ్ఞాపకాల మది తోలుస్తూనే ఉంటుంది...
త్యాగల తల్లి ఎడబాటు యాదికొరకు....💐

కళ్ళు తెరిస్తే కదలాడే అమ్మ..
తన తనువును ప్రసాధించిన దివ్య రూపం అమ్మ..
తన రక్తాన్ని పాలుగా మార్చి ప్రాణం పోసిన ప్రాణ దేవత అమ్మ..
మన చిరునవ్వును తన శ్వాసగా మలుచుకునే మాతృమూర్తి..!

చివరి శ్వాసలో సైతం నిన్ను చూస్తూ..
నీ ఒడిలో ఒదిగి పోవాలని కోరుకునేది అమ్మ....
అమ్మ అమూల్యమైనది...
అనంత శక్తిగలది...
దేవతా మూర్తి.....
మరువకు...
విడువకు....
ఏడువకు....
అమ్మ మన అమ్మే....
ఆత్మశుద్దిని ఆవరిస్తూ...
ఆలనా పాలనా చూస్తుంది...
ఎల్లప్పుడూ....!ఎక్కడైనా....!
ఓ విశ్వ రూపిణి..
నీ పాదాలకు వందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

మదర్స్ డే శుభాకాంక్షలతో....

మీ....
ఎల్. ఉపేందర్..
            టీచర్

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు.

 *ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు.* 

1. ప్రకృతి యొక్క మొదటి నియమం:

 *పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీ, గాదంతో నింపేస్తుంది.*  
అదే విధంగా మనసును *మంచి ఆలోచనలతో* నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

 *2. ప్రకృతి యొక్క రెండవ నియమం :*  

*ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు.* 
 *సుఖం* కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. 
 *దుఃఖం* కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. 
 *జ్ఞానులు* జ్ఞానాన్నే పంచగలరు. 
 *భ్రమలలో* ఉన్నవారు భ్రమలనే పంచగలరు. 
 *భయస్తులు* భయాన్నే పంచగలరు.

 3 *ప్రకృతి యొక్క మూడవ నియమం.* 

*మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి.* 
ఎందుకంటే *భోజనం* అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
 *ధనం* అరగకపోతే బడాయి పెరుగుతుంది.
 *మాటలు* అరగకపోతే *చాడీలు* పెరుగుతాయి .
 *ప్రశంస* అరగకపోతే *అహంకారం* పెరుగుతుంది.
 *నిందలు* అరగకపోతే *దుర్మార్గం* పెరుగుతుంది.
 *అధికారం* అరగకపోతే *ప్రమాదం* పెరుగుతుంది.
 *దుఃఖం* అరగకపోతే *నిరాశ* పెరుగుతుంది. 
 *సుఖం* అరగకపోతే *పాపం* పెరుగుతుంది.

 *విషయం చేదుగా ఉన్నా ఇది నిజం. ఇదే నిజం* 

- *సర్వే జనః సుఖినో భవంతు.* 🔥🇮🇳❤️

దేవుడు_కానుకలు_ఆశిస్తాడా

 🌹🌿 #దేవుడు_కానుకలు_ఆశిస్తాడా...!!🌺
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
మానవుడు కానుకలతో దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం మూర్ఖత్వమే అవుతుంది

భగవంతుడు చిత్తచోరుడే కానీ విత్తచోరుడు కాదు! ఆయనను ప్రేమ, భక్తి , విశ్వాసాల ద్వారా మాత్రమే సాధించుకోవాలి.

💥  సత్యభామ తన అహంకారంతో తన సంపద ద్వారా కృష్ణుడిని తనవైపు తిప్పుకోవాలని ఆశించింది. ఆమె తన వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారాన్ని తూకం వేసి విఫలమైంది.

🌹🌿 రుక్మిణి నిజమైన భక్తితో సమర్పించిన ఒకే ఒక్క తులసి ఆకు తన సంపదను మించిందని నిరూపించడం ద్వారా సత్యభామ తన మూర్ఖత్వాన్ని గ్రహించింది.

 💥 సత్యభామ కోరికకు ప్రతీక. అయితే రుక్మిణి భక్తికి ప్రతీక. ఆకు, పువ్వు, పండు లేదా నీటిని సమర్పించడం పట్ల తాను సంతోషంగా ఉంటానని కృష్ణుడు చెప్పాడు. దీన్ని కేవలం అక్షరాలా తీసుకోకూడదు.

☑ మన శరీరమే ఆకు.

☑ మన హృదయమే వికసించిన పువ్వు.

☑ మన మనస్సే ఫలం,

☑ మన కన్నీళ్ళే తోయం (నీరు).

ఇవి దేవునికి ఆమోదయోగ్యమైన అసలైన సమర్పణలు. వీటి ద్వారానే దేవుడు సంతృప్తి చెందుతాడు.

 🌹🌿 మనలో ప్రేమ ఉంటే నిత్యమూ భగవంతుడు మనతోనే ఉంటాడు.
 ఆయన మనతో ఉంటే జీవితంలో మనకు లోటు అంటూ ఏదీ ఉండదు.

సేకరణ 

🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏
🌾🌾🌾🌾🌾