Saturday, July 16, 2022

మంచి మాట....లు (15-07-2022)

 ఈరోజు AVB మంచి మాట....లు

15-07-2022:-శుక్రవారం
చదువు కున్న ప్రతీ వారూ సంస్కారులు కారు . చదువు లేని ప్రతి వారూ సంస్కారం లేని వారూ కారు . పేద , ధనిక , బేధం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు .

మన చుట్టూ ఎంత మంది ఉన్న సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుంటాయి . ఎందుకంటే వాళ్ళస్థానం మన మనసులో కాబట్టి .

ఒక్క రోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళయినా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది . వ్యక్తిలో లోపాలను చూఢడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనమూ ఒక అద్భుతమే అవుతాం .

ఈ సమాజంలో కొంతమంది ఈ ముర్కులతో మనకెందుకులే అని మౌనంగా వుంటారు,, అలా మౌనంగా ఉన్నవారు అందరూ చేతకాని వారు అనుకోవడం పొరపాటు,, ఒక్కసారి అ మౌనం విడితే సునామీ కంటే భయంకరంగా ఉంటుంది, రిజల్ట్,,,,

జీవితం ఒకటి గుర్తుపెట్టుకో,, మిత్రామా,, ఎప్పటికైనా 
అరణ్యవాసం చేసిన పాండవులే గెలిచారు కానీ, అంతపురం లో ఉన్న కౌరవులు కాదు,, మంచితనం తో బ్రతికే వారు ఏరోజుకైనా సమాజంలో గుర్తించబడతారు,, చెడుతనం తో బ్రతికే వారు ఎన్నటికైనా సమాజంలో శిక్షించబడతారు,, ఇది పక్కా,,,రాసిపెట్టుకోండి ,

సేకరణ ✍️
మీ ... AVB సుబ్బారావు *🌷💐🌹🥭🍇🤝🕉️🙏

No comments:

Post a Comment