*:::::::::భరించ లేక పోవడం:::::::::*
ఈ శరీరం సుఖాన్నిఇస్తుంది.
అలాగే బాధ/నొప్పి ని కూడా ఇస్తుంది.
సుఖం కావాలంటాం, సుఖానుభూతి కోసం వెంట పడతాం. మరింత సుఖం కోసం , అత్యంత సుఖం కోసం ఉవ్విళ్ళూరుతాం.
ఈ శరీరం పెట్టే బాధ వద్దు అంటాం. కలిగే పరిస్థితి ని నివారిస్తాం. కలుగు తున్నప్పుడు అడ్డుకుంటాం. వ్యతిరేకిస్తాం.
ఈ సందర్భంగా భరించలేక పోవటం అంటాం. ఇది నిజంగా వుందా???
భరించ లేక పోతే కోమాలోకి వెళ్తాం.లేదా మరణిస్తాం.
బ్రతుకు తున్నాము అంటే భరించ కలుగు తున్నామనే అర్థం.
భరించ లేక పోతున్నాను అనేది శరీరం కాదు మనస్సు.
*ఈ మనస్సు కి ఓర్పు,సహనం ఇచ్చే శిక్షణ పేరే ధ్యానం.*
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment