Monday, December 30, 2024

 డిసెంబర్ 13 , 1705 సంవత్సరం.
ఈ భూమ్మీదే అత్యంత విలువైన భూమి కొనుగోలు లావాదేవీ జరిగిన రోజు.
నాలుగు గజాలు కేవలం నాలుగు గజాల భూమిని 7800 తులాల బంగారంతో కొన్న రోజు. ఈ రోజు ధరతో లెక్కిస్తే 4 గజాలు 180 కోట్లు.
ఒక్కో గజం 45 కోట్లు.
ఒక్కొక్క తులం బరువు బంగారు నాణేన్ని భూమిమీద పరుచుకుంటూ తన దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని వెచ్చించి ఒక ' ముగ్గురు మహావీర సిక్కు వీరుల ' మృతదేహాలను ఖననం కోసం ఒక హిందూ వ్యాపారి ముస్లిం మతోన్మాదుల దగ్గర నాలుగు గజాల భూమిని కొన్న రోజు.
గురు గోవింద్ సింగ్ కుమారులు 9 సంవత్సరాల ఫతే సింగ్..6 సంవత్సరాల జొరావర్ సింగ్ లను ఇస్లాం లోకి మారని కారణంగా సజీవంగా సమాధి చేసి ఊపిరి ఆడకుండా చంపేసిన దుర్మార్గ జీహాడీ ఔరంగజేబ్ కు ఎదురుతిరిగిన ఒక హిందూ వ్యాపారి తోడర్ మల్ సవాల్ చేసిన రోజు.
తన మనవల భయంకర మరణాలకు తల్లడిల్లిన నాయనమ్మ మాతా గుజరీ గుండె ఆగి మరణించారు.
ఇంకా కక్ష తీరని నరరూప రాక్షసుడు ఔరంగజేబ్ ఆ ముగ్గురి పార్ధివదేహాలకు అంత్యక్రియలు జరగకుండా మృత దేహాలను అలా వదిలేశాడు.
ఆ చిన్నారుల మృత దేహాలనూ. వృద్దమాత గుర్జరీ దేవి మృతదేహాలను అలా కుళ్లిన స్తితిలో చూడలేక తల్లడిల్లిన నాటి ప్రజలు ఆ పవిత్రదేహాలను ఖననం చేయడానికి ప్రయత్నిస్తే వాటిని ఖననం చేయాలంటే ఎవరైనా ముస్లిం దగ్గర మాత్రమే స్థలం కొనాలని జీహాడీ ఔరంగజేబ్ రాజశాసనం చేశాడు.
స్థానిక జీహాడీ పాలకుడు వజీర్ ఖాన్ దగ్గర స్థలం కొనడానికి నాటి ప్రజలు ప్రయత్నం చేస్తే ' మృత దేహాలను ఖననం చేయడానికి ఎంత స్థలం ' కావాలో అంతమేరకు బంగారం పరిచి ఆ స్థలం తీసుకోవచ్చని దుర్మార్గమైన ప్రతిపాదన చేశాడు.
నాటి సమాజంలో అంత డబ్బులేక తీవ్ర వేదనకు గురయ్యారు.
ఈ పరిస్తితిలో పాటియాలా లో వ్యాపారం చేసుకునే ఒక మధ్య తరగతి వ్యాపారి తోడర్ మల్ ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారు.
తన ఆస్తి మొత్తం బంగారం నాణేలుగా మార్చారు..కట్టు బట్టలతో మిగిలిన రాజా తోడర్ మల్ స్థానిక నవాబు వజీర్ ఖాన్ దగ్గరకెళ్ళి ఆ నాణేలను నేలమీద పరిచారు. సరిగ్గా నాలుగు గజాలకు సరిపోను బంగారంతో ఆ నాలుగు గజాలు కొని..ఆ అమరవీరులకు అంత్య క్రియలు నిర్వహించారు.
ఆ కట్టడాన్ని ' జహజ్ హవేలి ' అంటారు.
ఇంత త్యాగం చేసిన హిందువులను నేడు తమకు శత్రువులుగా భావిస్తున్న సిక్కు సమాజం మీద జాలి.
నిజానికి నాడు ప్రతి హిందూ కుటుంబంలో పెద్ద కొడుకు ' సిక్కు ' అవుతాడు.
నేడు ఆ సాంప్రదాయం కుట్రపూరితంగా కాలంలో కప్పెట్టబడింది.
హిందూ సమాజంలోని పెద్దకొడుకు సిక్కులను అదే హిందూ సమాజంలోని చిన్న కొడుకులమీదకు నాటికి నేటికీ హిందూ  సమాజానికి సహజ శత్రువులైన వ్యక్తులు రెచ్చగొడుతున్నారు.
సమాధులు నిజాలే మాట్లాడతాయి. ఒకసారి జహజ్ హవేలి గోడలకు చెవులు ఆనించి వినండి. మాతా గుజరీ. అమరవీరులు ఫతే సింగ్. జొరావర్ సింగ్ ల గొంతులు నిజమైన త్యాగాలను మీకు గుర్తు చేస్తాయి.
హరహర మహాదేవ్. బోలో సో నిహాల్ సత్ శ్రీ అకాల్ ..🙏

No comments:

Post a Comment