Tuesday, December 31, 2024

 అతిగా అడ్రినలిన్ ఉత్పత్తిని ప్రేరేపించే పని ఆరెస్సెస్ చెయ్యదు....

ఈ సంస్థది వందేళ్ల అత్యంత జాగరూకతతో కూడిన అనుభవం...

వేల సంవత్సరాల చరిత్రను సూక్ష్మ పరిశీలనతో అర్థం చేసుకున్న నైపుణ్యం....

ఈ జాతికి జీవ నాడి అయిన సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఏకత్వం...రాజకీయ భౌగోళిక ఏకాత్మతగా కూడా పరిణమించడానికి ఏర్పడిన సంఘటనా రూపం ఇది...

అది ఈ ప్రపంచానికి అవసరం...నిజానికి విశ్వానికే అవసరం...

ఎక్కడ తగ్గాలో... ఎప్పుడు నెగ్గాలో...లభించిన విజయాన్ని ఎలా నిలుపుకోవాలో తెలిసిన వ్యవస్థీకృత రూపం ఈ ఆరెస్సెస్...

ముస్లిములకో... క్రైస్తవులకో వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ కాదు ఇది....

ఈ అడ్రినలైన్ హార్మోన్ ఉత్తేజితం చేసి యుద్ధం చేయించవచ్చు...కానీ...

అదే అతిగా శరీరంలోకి ప్రవేశిస్తే...నిద్ర లేమితో కృంగి పోవచ్చు..గుండె ఆగిపోవచ్చు.... 

పోరాడ వచ్చునన్నది ఎంత నిజమో...అస్త్ర సన్యాసం చేసి పారిపోనూ వచ్చునన్నది అంతే నిజం...

ఈ జాతి... ఈ దేశం అనేక పరివర్తనా సంధి కాలాలను చూసింది...

భయానక...భీతావహ రాక్షస దాడులను ఎదుర్కొంది...

శివాజీ కాలం నాటి పరిస్థితుల కంటే భిన్నమైనవి కావు..ఇప్పటి పరిస్థితులు...

కేవలం తాత్కాలిక ఉద్రేకాలకి లోనైన కొంత హిందూ సమాజం...మరింత తాత్కాలికమైన...స్వల్పకాలిక రాజకీయ విజయాలను మాత్రమే...చూసి మురిసిపోతోంది...

కొంత కాలం శివాజీ ...శ్రీ కృష్ణ దేవరాయలు వంటి వారు ఈ సమాజానికి ధర్మ స్థాపన అనుభూతిని కలిగించినప్పటికీ ...తిరిగి ఏమయ్యింది...

ఎంతలో ఎంత పతనాన్ని చవిచూసింది...

ఇంత సుదీర్ఘ సంఘర్షణల చరిత్ర కాలంలో...ఇప్ప్పుడు కనిపిస్తున్న హిందూ వాసనలు కలిగిన ప్రభుత్వం ఎంత చిన్న ఏర్పాటు...

దీన్ని చూసే...ఇంత తాత్కాలిక విజయాలను చూసే...వీరంగాలు వేస్తే...15 నిమిషాలు టైమిస్తే...లేపేస్తానని వాగిన వాడికీ..మనకీ తేడా ఏముంటుంది...

అయోధ్య ఉద్యమం ఎంతటి పెద్ద ఉద్యమం...దాని తర్వాత కూడా... దశాబ్దాల పాటు కోర్టు తీర్పులకు వేచి చూసే కదా ఆ భవ్య నిర్మాణం చేసుకున్నది....

ఆ సంయమనం...ఆ ఓపికా మాత్రమే లభించిన విజయాలను శాశ్వతం చేస్తుంది...

లేకపోతే...తెచ్చుకున్న కాస్త విశ్వాసం మట్టిలో కలిసిపోతుంది....

ఇప్పుడు హిందూ సమాజం జాగృతమయిన మాట నిజమే...

ఆరెస్సెస్ కంటే ఎక్కువ సమాచారం...ఆలోచన సాధారణ వ్యక్తి దగ్గర కూడా ఉంది...

సోషల్ మీడియా వల్ల మరింత లోతుగా విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి...

హిందువు తనను తాను తెలుసుకుంటున్నాడు...

కానీ...అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే...ఈ సమాచారంతో మెదడు ఉద్రేక పరుచుకున్న హిందువు...యుద్ధం చేస్తాడా...పారిపోతాడా  అన్నది జాగ్రత్తగా అంచనా వెయ్యవలసిన స్థితి...

అందుకే...ఇప్పుడు ఆరెస్సెస్ కృష్ణుడి తరహా లౌక్యం..యోజన...వ్యూహం పాటిస్తున్నది...

ఒక శివాజీ తీరులో వ్యవహారాలు సాగిస్తున్నది...

ఇది సగటు భారతీయుడ్ని మోసం చెయ్యడం కాదు...అర్థం చేసుకుని నడుస్తున్న తీరు...

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు గతంలో ప్రతి మసీదు క్రింద ఆలయం వెతకద్దు అని చేసిన సూచనను..ఈ నేపథ్యం లోనే అర్థం చేసుకోవాలి...

మోడీ గారు మనకి కలుగుతున్న ఉద్రేకాన్ని...బంగ్లాదేశ్ మీద చూపకుండా ఆగుతున్నది కూడా అలాగే అర్థం చేసుకోవాలి...

ప్రజల మధ్య వైషమ్యాలు కాదు...భౌతికంగా కొందరిని నిర్మూలించేస్తే సరిపోతుంది అనుకునే ఎడారి మనస్తత్వం కాదు మనది...

ఇప్పుడు వస్తున్న సాంస్కృతిక జాతీయవాద చైతన్యం నీటి బుడగ కారాదు...

అసలైన సంఘటనా శీలుర యొక్క ఆలోచన అనవసర భావోద్వేగాలకు దూరంగా ఉండాలి...

అలాంటి చైతన్యవంతమైన....ఉత్తమ సమాజాన్ని మనం నిర్మించుకోవాలి...

హృదయం రగిలినా...మెదడు ఆలోచన శాంతంగా చెయ్యాలి...

అటువంటి వ్యవస్థలోనే భారత్ విజయం సాధించగలుగుతుంది..

అదే ఆరెస్సెస్ ఇస్తున్న శిక్షణ....

భారత మాతకు జయమగు గాక!

No comments:

Post a Comment