Monday, December 30, 2024

 *ధ్యాన మార్గ*
ఎక్కువగా భుజించేవాడు యోగికాదు. ఉపవాసముండేవాడు యోగికాదు.  అన్నo తినడం, ఎక్కువ కాలం ఉపవాసాలుండే వ్యక్తి యోగి కాలేడు. అదే విధంగా, ఎక్కువగా నిదురించే వారు, ఎప్పుడూ పగటికలలుకంటూ ఉండేవారు. ఎప్పుడూ మేలుకొని వుండేవాడు యోగి కాలేడు.
❤️🕉️❤️
దుఃఖంతో ఏకమయి పోక దాని నుంచి దూరం కావాడాన్నే' విద్య అంటారు. దుఃఖాలు, బాధలు కలిగినా వాటికి ఏమి సంబంధం లేకుండా ఉండడం యోగం.
❤️🕉️❤️
యః మామ్ పశ్యతి సర్వత్ర.. ఎవరైతే అన్నిటియందు నన్నే చూస్తారో,
అవతారపురుషుడు, దైవం రెండూ ఒక్కటే. వేరు వేరు కాదని, కృష్ణ, విష్ణువు,
ఒక్కరేనని భావిస్తారో తస్యాహం న ప్రణశ్యామి' వారిని నేను ఎప్పుడూ వదలను.
'సః చ మే న ప్రణశ్యతి' వారూ నన్ను ఎప్పుడూ వదలరు.
🕉️❤️🕉️
భయం మరియు దురాశ మనస్సును దుర్వినియోగం చేస్తాయి. మనస్సు యొక్క సరైన ఉపయోగం ప్రేమ, జీవితం, సత్యం, అందం యొక్క సేవలో ఉంది.      

No comments:

Post a Comment