Monday, December 30, 2024

 🦚🌻🌹💎💜🌈

 *🔅నాణేనికి బొమ్మా బొరుసులు ఉన్నట్లే,ప్రతి మనిషిలోనూ మంచీ,చెడూ ఉంటాయి.మనం ఎటు పక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది.వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది.* 

 *మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది. ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్రా మన జడ్జిమెంట్లో ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం.అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్టు శిఖరం ఎక్కారే అనుకోండి. అతన్ని మనసారా అభినందించ డానికి కూడా నోరు పెగలదు.* 
 *ఆ ఇందులో గొప్పేముంది మాస్టారూ!* 

 *ఈరోజుల్లో ఆర్నెల్లు ట్రైనింగ్ తీసుకుంటే నేనూ,మీరూ ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకీ గొప్పల అంటూ ఆ పర్వతాన్ని ఎక్కి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగింజంత చేసి మాట్లాడడానికీ వెనకాడం!ఇదంతా మన మనసు చేసే మాయ.మన మనసు దేంతో నిండి ఉంటుందో..మన చూపు,ఆలోచనలు,పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య,ద్వేషం, అసూయ, పగ,ప్రతీకారమా లేక ప్రేమ,దయ, జాలి,కరుణా అనేది మన ఆలోచనను బట్టే ఉంటుంది.* 

 *మనం ఇచ్చే కమాండ్లోనే కంప్యూటర్ పనిచేసినట్లు..మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి.స్వచ్ఛమైనపాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టు కుంటామో...చెంచా పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో...అంతా మన చేతుల్లోనే ఉంది!* 

 *🌄శుభోదయం 💥*

🦚🌻🪷💎🌹💜🌈

No comments:

Post a Comment