Monday, December 30, 2024

 *అదృష్టం* అంటే *ఆస్తులు* ఉండటం ఒక్కటే కాదు, *కడుపారా* తినగల్గటం *కంటినిండా* నిద్రపోగల్గడం, *కష్టపడి* పని చేసుకో గల్గడం *కష్టసుఖాలు* పంచుకొనే వ్యక్తులు కల్గివుండటం,

 *ఈ ప్రపంచం* *చెడ్డవారి* వల్ల చెడిపోలేదు,*చెడుని* ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న *మంచివారి* వల్ల చెడిపోయింది 

.  *దైర్యంగా* అడగలేని *పిరికివారి * వల్ల, *మనకెందుకులే* అనుకునే *స్వార్థపరుల* వల్ల చెడిపోయింది .

       *అవసరం అవకాశం* లేనప్పుడు *నువ్వు ఎలా ఉన్నావో* అవసరం అవకాశం వచ్చినప్పుడు *కూడా* అలా మారకుండా ఉండటమే *నిజమైన వ్యక్తిత్వం* 

.  ఎవరో నిన్ను *బాధ* పెట్టారని, వాళ్ళు *తిరిగి బాధ* పడాలని ఎప్పుడూ *కోరుకోకు* తెలియక బాధ పెడితే వారిని *క్షమించు* తెలిసి బాధ పెడితే *ఆ తీర్పు కాలానికి* అప్పగించు .

        మనిషి చుట్టు *మంచి చెడు కష్టం నష్టం ప్రేమ స్నేహం* అన్నీ ఉంటాయి దేన్ని *వదిలేస్తాం* దేన్ని *తీసుకుంటాం* అన్నదాన్ని బట్టి మన *సంతోషం* ఆధారపడి ఉంటుంది ,   

.      నవ్వించే *వందమంది* స్నేహితులు లేకపోయినా పర్లేదు కాని కష్ట కాలంలో *నీ కన్నీళ్ళు* తుడిచే మనసెరిగిన నేస్తం *ఒక్కరు* ఉన్నా చాలు .
         
       బాదలు అనేవి ఆకాశంలో *చందమామ* లాoటిది , ఒక రోజు *ఎక్కువగా* ఉండవచ్చు ఒక రోజు *తక్కువగా* ఉండవచ్చు మరోక రోజు *కనపడకపోవచ్చు* అందుకే మనం *సంతోషంగా* ఉండాలి *బాదలున్నాయని* బాదపడుతూ *కాలం వృదా* చేసుకోరాదు .

🌹🙏🪔🌴🪔🙏🌹

No comments:

Post a Comment