గాజుకుప్పెలోన గడఁగుచు దీపంబ
దెట్టు లుండు జ్ఞాన మట్టులుండు
దెలిసినట్టి వారి దేహంబులందును
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: గాజు బుడ్డిలో ఏవిధముగా దీపము నిలకడతో వెలుగుతుందో అదే విధముగ తెలివిగల వారియందు జ్ఞాన దీపము ప్రవేశిస్తుంది.
అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేమి యేన్నఁబోరు
అన్న మెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.
ఇహరంబులకును నిది సాధనంబని
వ్రాసి చదివిన విన్నవారికెల్ల
మంగళంబు లోనరు మహిలోన నిది
నిజము విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.
No comments:
Post a Comment