😌 *ధ్యానమార్గ*
నా పూర్వజన్మ గురించి నాకేమీ జ్ఞప్తి లేకుండడానికి కారణమేమిటి? మానస సాగరానికి కేవలం ఉపరి భాగమనీ, మన ఆ సాగర గర్భంలో ఉన్నాయని దీని వల్ల తెలుస్తుంది. తీవ్రంగా ప్రయత్నిస్తే అవి పైకి రావడంతోపాటు మీ పూర్వజన్మను కూడా మీరు తెలుసుకోగలరు. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 45)
శక్తి ఉన్నప్పుడు చెడ్డపనులకు దానిని వెచ్చించితే చాలా దారుణమైన బాధలకు లోనుకావలసి ఉంటుంది. ఉన్నతమైనవి ఏమి సాధించలేరు. అదేశక్తిని తనకు తానుగా శిక్షణను ఇచ్చుకొని, మానవునిలోని ఆరు శత్రువులను జయించాలి.
ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టే అలవాటు చాలా
హీనమయింది. చాలా మంది దానిని, దీనిని, వీడిని, వాడిని ఎప్పుడూ తప్పు పడుతుంటారు. దానివల్ల వారు, కోపంగాను, ఇతరులపట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నీ అయిష్టాన్ని ప్రకటిస్తూ పోవడమే అలవాటు అయినట్లయితే మనస్సు అంతా అయిష్టంగానే మారి తనకు తానే పెద్ద శత్రువవుతాడు. ఎందుకు అయిష్టాలన్నీ పోగుచేసుకొని మనస్సులో పెట్టుకుంటావు? అప్పటికప్పుడే పరిశీలించుకొని పారవెయ్యవచ్చుకదా! అయితే మరి శత్రువు ఎవరు నీకు ? నీకు నీవే శత్రువువి.
ఇంద్రియాల బానిసత్వాన్ని దాటినవాడు యోగి. అతని వస్తు పరిజ్ఞానం,మన వస్తు పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసంగా ఉన్నట్లు ఉంటుంది. సహజంగా మనం వస్తువుల విలువను ఇంద్రియ ఆకర్షణనుంచి, ఇంద్రియ తృప్తి నుంచి లెక్కకడుతుంటాం. కానీ యోగికి ఇంద్రియ ఆకర్షణ లేని కారణంగా అతని వస్తు అవగాహన వేరుగా ఉంటుంది. 'సమలోష్టాశ్మకాఇ్చనః' అతనికి రాయి, మన్ను, బంగారం అన్నీ ఒకేవిధంగా కనిపిస్తాయి. అది అతని మనోవైఖరి. ఇంద్రియా అన్నీ వాటి కోర్కెలను తృప్తి పరచుకోవడమే గొప్పగా భావిస్తాయి. కానీ వాటినిదాటి వెళ్ళగలిగినప్పుడే సమత్వబుద్ధి వస్తుంది.
No comments:
Post a Comment