Monday, December 30, 2024

 *సోమావతి అమావాస్య,*

🌸కార్తీక సోమావతి అమావాస్య..ఈ రోజున అమావాస్య పూజ ఇంట ముగించి.. శివాలయాన్ని సందర్శించాలి. అలాగే శివాలయంలో వుండే.. రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

🌿సోమవారం వచ్చే ఈ అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అదీ కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

🌸అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం.

🌿ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి.

🌸కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది. 

🌿సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి..

🌸సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్యను మౌని అమావాస్య , శని అమావాస్య అని కూడా పిలుస్తారు.

🌿సోమావతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

🌹సోమావతి కథ🌹

🌸ఒకానొక ఊరిలో.. ఒక సాదువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తు వుండే వాడు అయన ఒకనాడు వచ్చినప్పుడు ఆమె ముఖం చూసి దీవించకుండానే వెళ్ళిపోయాడు ఆ సాదువు దివించకుండా వెళ్లాడానికి కారణం తెలియక అ కుటుంబం చాల బాధపడింది.

🌿చివరికి పురోహితున్ని పిలిచి కారణం అడుగగా ఈమెకు జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అనతికాలం లోనే మరణిస్తాడు అని అన్నాడు.

🌸ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు అది విని దిగ్బ్రాంతి చెందిన కుటుంబ సబ్యులు పరిష్కారం చెప్పమని పురోహితున్ని అడిగారు అయన శిన్కలి ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని అయన చెప్పారు.

🌿వర్తకుడు ఆ అనివయతమైన కన్యను తన చిన్న కొడుకుని అక్కడికి పంపుతారు. మార్గ మద్యం లో ఒక నదిని దాటాబోతుండగా వారికీ ఒక దృశ్యం కనిపించింది. అప్ప్పుడే పుట్టిన గ్రద్ద పిల్లల్ని ఒక పెద్ద పాము చంపుకు తినడానికి చూస్తుంది.

🌸నిత్యం అక్కడ అదే జరుగుతుంది గ్రద్ద పిల్లలు పుట్టగానే వచ్చి తిని వెళ్లి పోయేది ఆరోజు అదే జరుగుతుంది కానీ ఆరోజు ఆ యువతీ దైర్యంగా అ పాముని చంపి అ గ్రద్ద పిల్లలని కాపాడింది.

🌿తన పిల్లలను కాపాడినందుకు ఆ గ్రద్ద ఆ చాకలి స్త్రీ ఇంటికి దరి చూపిస్తుంది. కొన్ని నెలల పాటు అ చాకలామెకు సేవలు చేయగా ఒకానొక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమని ఇచ్చింది.

🌸ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షణలు చేసింది ఆమె జాతక దోషం అంతటి తో తొలిగి పోయింది అలాగే సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివున్ని ప్రార్థిస్తే..

🌿రావి చెట్టుకు ప్రదక్షణలు చేసి ఈ కధను ఒక సారి గుర్తుకు చేసుకుంటే ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలిగి పోతాయి అని పండితులు వినిపిస్తున్నారు.

🌹సోమవతి అమావాస్య అంటే ఆ రోజు ఏం చేయాలి🌹

🌸శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. 

🌿శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…

🌸దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే ! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది.

🌿సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

🌸సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు.

🌿అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.

🌸అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

🌿నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు.    

No comments:

Post a Comment