Monday, December 30, 2024

 🔱 అంతర్యామి 🔱

# ప్రేమను పంచిన మహర్షి

🍁పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్ధిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమయ్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్ధరించాలన్న తాపత్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ద్రమైన చూపులు, అన్ని జీవరాశులపై కురిపించే దయ మరువలేనివి.

# నిరంతరం ఆత్మానందంలో ఓలలాడుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనాతీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్టనష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ద చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.

# రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా కూరగాయలు తరుగుతున్నా- సదా సంతోష భరితులై, ఆత్మనిష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్తవానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరికలు, భావాలు- ఇవే దుర్భలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటువంటి మనసు • భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మనసుకు ఆహారం. వాటిని నిలిపేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగినవారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు.

# అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.

# శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.🙏

✍️- బి. సైదులు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

5:56

AP Jai Shri Rama Jaya Ra... POST

* Introspection

# Sage who spread love

* Sage Ramana Maharishi reached Arunachalam with great dispassion at the age of sixteen. For nearly twenty years on the holy mountain, the meditator engaged in austere practices. He blessed the devotees by making Arunagiri Odin as his spiritual field for half a century. Ramana did not like to preach to anyone. Arrogance that he is in a high position, and the desire to elevate someone, are not seen in the sage. His greatest weapon is silence! But their closeness radiated to everyone who visited. Maharshi's calmness, mind like a still ocean, compassionate gaze and grace showered on all living beings are unforgettable.

# The love showered on the devotees and Ramanas, who are constantly swaying in self-enjoyment and in silence, is indescribable. He would listen patiently if the dependents talked about the hardships in their families. Householders used to be moved when they told their sorrows and shed tears. Maharishi said that 'caring for others is the first step to spiritual life'. Everyone feels that they have value in the presence of that great person.

# Ramanu was alone in silence, correcting copies, reading magazines or chopping vegetables - he was always happy and self-confident. If someone is suffering from self-deprecation, 'The biggest mistake a man makes is to think he is weak. In fact, everyone is divine wealth. Strong! His thoughts, habits, desires, feelings - these are bad. These are not the natural characteristics of man'. Are fasts necessary? When asked by a disciple, 'If you stop all the distractions of the senses, the mind will become concentrated. If such a mind •

is fixed on God, it is the real fast. Desires are food for the mind. Just stop them. Those who can do without food for the mind, need not deny food to the body. They say that physical fasting is for those who do not fast in mind.

# With a devotee who is worried that things are not happening, 'Mankind is being guided by a great power. What happens will happen. He advised that what does not happen will not happen.

# The less we love the body, the closer we get to the soul, they say. Illusion of the body is an obstacle to the spiritual elevation of man. 'A wise man carries this body like a laborer carries his weight. They used to say that one waits for the destination to come, but after making some efforts one does not want to carry that burden. Even that Maunarshi himself renounced his body with a smile when his goal of birth was fulfilled.🙏

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment