ప్రేమంటే.... ఆశా?
ఆరాధనా?....... ఆవేదనా?
ఎంతకు తనివితీరని
అంతు తెలియని... హద్దు తెలియని మధురిమా?
చెలియలికట్ట తెగిన
సాగరం లాంటి భావన,
పెదవులతో పలుకని
కళ్ళతో పలికి.... కళ్ళలోనే కదిలే భాష.
చలికాలంలో.... ఎండాకాలం
కాలమేతెలియని.... కాలానికి అందని... కలల అలలపై తేలే... కడలి.
ప్రతిక్షణం... ఒక యుగం
ఒక్కొక్క యుగం.. క్షణ మాత్రం,
నిరీక్షణ.... నిరీక్షణ
నిరీక్షణతో నివేదన.
నీమీలిత నేత్రాలు,
హృదయంలో పలికే
కోటివీణాల రాగాలు.
విప్పారిన నేత్రాలు...
వణుకుతున్న పెదాలు
కళ్ళతోనే పలికే... కమనీయ పదాలు... కనిపించి కనిపించని
వలపు విరుపుల... అర్థాలు.
ఆకారణ.. అకాల.. నైరాశ్యం
అంతలోనే... ప్రేమావేశం
ప్రేమంటే... ఇదే కదూ
మనసులో కదిలి
మనసుకే తెలిసే... ఆగుపడే
ఓ... మరీచిక..... ఔనా?
మాడ భూషి శ్రీనివాసన్...
No comments:
Post a Comment