Friday, December 27, 2024

 *🌹🌿చిన్ననాటి పాఠ్య పుస్తకంలోని…📖* 
 *"క్షణిక ఆవేశం"😠*
🕉️🌞🌎🏵️🦢🔱🚩             

 *🍁భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు.* 

 *ఒకసారి పక్కఊరి పని మీద భాస్కరశర్మ అడవి మార్గం గుండా పోతుంటే ఒక ముంగీస ఆయన తోటే వచ్చింది! సరే అని ఆ ముంగీసను సంచిలో వేసుకొని ఇంటికి తెచ్చాడు. కమలమ్మకి ముంగీసను చూపి ఇది మనతోనే వుంటుంది. మనచిన్నబిడ్డకి తోడుగా వుంటుంది అని ఆహారం పెట్టి సాకుతూ వున్నారు.* 

 *ఒకనాడు కమలమ్మ బావిదగ్గరకు నీళ్ళ కోసం పోతూ ఉయ్యాలలో బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని ముంగీసకు చెప్పి వెళ్లింది.* 

 *ఇంతలో ఒక నల్లత్రాచు ఉయ్యాల దగ్గరికి రావడం ముంగీస చూసి దానితో పోరాటం చేసి చంపివేసింది.* 

 *ఇంతలో కమలమ్మ బిందె నీళ్ళతో ఇంట్లోకి వచ్చింది ముంగీస మూతికి అంటిన రక్తం చూసి తన బిడ్డను తినేసింది, ఇంకేముంది అని నీళ్ళ బిందెని దాని మీదకి వేసి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తింది. ఉయ్యాలలో బాబు క్షేమంగా నిద్రిస్తున్నాడు. పక్కన నల్లత్రాచు పాము చచ్చిపడి వుంది.* 

 *‘అరె!’ ఆవేశం లో అనాలోచితంగా పాపం ముంగీసను చంపివేసానే అని బాధపడింది.* 

 *ఇది జస్ట్ మనకు పెద్దలు చెప్పేకధ!ఆవేశంతో తీసుకొనే నిర్ణయాలు బాధని మిగులుస్తాయి.*

*మనిషి ఆవేశంతో క్షణంలో చేసే హాని అది ఇతరుల జీవితాన్ని బలి తీసుకుంటుంది.* 

 *క్షణిక కోపంతో ఆవేశంతో అనాలోచిత నిర్ణయం వలన ఎంతోమంది జీవితం జైలుశిక్ష పడి ఎందుకు ఆవేశపడ్డామా అని కుమిలిపోతుంటారు!* 

 *మార్కులు తగ్గినాయి అని, ప్రేమ విఫలమైందనీ..* 

 *ప్రేమ నిరాకరించింది అని..* 
 *క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలు వలన ఎంతోమంది జీవితం ముగిసిపోతుంది!!* 

 *“మనిషికి ధనం,సంపదలు, లగ్జరీలు, విలువైన దుస్తులు ఆభరణాలు కాదు కావలిసినది.. మనిషికి కావలిసింది.. ఆత్మధైర్యం ఆత్మవిశ్వాసం, సముద్రం కంటే విలువైన సహనం, ఓర్పు!!* 

 *ఇవి లేనప్పుడు ఎంత ధనమున్నా క్షణికంలో తీసుకునే ఆవేశంతో జీవితం నిరర్దకం అవుతుంది!* 

 *మనిషి ఎంతసేపటికి భగవంతుని ముందు కోరికలు అడుగుతాడు కాని కోరికలు నేరవేరిన తరువాత వచ్చే అనర్దాలకి, క్షణిక కోపం,ఆవేశం వలన జీవితం కోల్పోతాము.* 

 *ఆపద సమయంలో క్రిటికల్ సమయం ఎదుర్కొనే ఆత్మ స్తైర్యం ధైర్యాన్ని ప్రసాదించమనీ దైవాన్ని ప్రార్ధించాలి…ప్రతిరోజూ!* 

 *మనఃశాంతి లేని జీవితం వ్యర్దం కదా! అందుకే శాంతి కావాలనీ, ప్రశాంతంగా జీవితం సాగాలనీ ఆ పరమేశ్వరుని వేడుకోవాలి.* 

 *ఒక మంత్రం వుంది “ఓం ఐం హ్రీం శ్రీం శాంతిమతినే నమః!” అనే మంత్రం వేల వేల సార్లు అ జగన్మాత మంత్రాన్ని జపించడం వలన మనసు శాంతినిపొందుతుంది! శాంతి తో వున్న మనసు విజయం సాధిస్తుంది!!* 

 *ఎప్పుడైనా సరే జీవితంలో సహనానికి శాంతికి ఓర్పుకి శక్తి వుంది.* 

 *అవేశానికి కోపానికి ఎప్పుడైనా ఆనర్దమే వుంటుంది!!*  
 
  *-సేకరణ.⛳* 

🕉️🦚🌻🌹💎🔱🚩

No comments:

Post a Comment