🍁 *తల్లికి సరైన నిర్వచనం* 🍁
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఒకామె వీసా అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడి అధికారి అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తూ .....
Q .... మీరేం పని చేస్తూ ఉంటారు ? అని అడిగాడు .
A ..... "తల్లిని" అన్నది
అధికారి కొంచెం అయోమయంగా, "ఇక్కడ ‘తల్లి’ అన్న ఆప్షన్ లేదు మేడమ్.
Q .... మీ వృత్తి ఏమిటి ? అని అడిగాడు.
A .... "పిల్లల అభివృద్ది అనే అంశం పై నేను రీసెర్చ్ స్కాలర్ని" అని సమాధానం ఇచ్చింది.
అధికారి మరింత అయోమయంతో ....
Q .... "మీరు ఈ రీసెర్చ్ ఎక్కడ చేస్తున్నారు ?" అని ప్రశ్నించారు.
A .... "మా ఇంట్లో" అన్నది తల్లి. అధికారి మరింత అయోమయంతో చూసారు .
👉 "ఈ రీసెర్చ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజుకి పద్నాలుగు గంటలు పని చేసినా పూర్తి అవ్వదు.
👉 దీనికి నాకు మార్గ దర్శకులు నా భర్త. సీనియర్ రీసెర్చ్ గైడ్, స్కాలర్స్ మా అమ్మ. ..! మా తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ. వీళ్ళందరూ నా యూనివర్సిటీ డైరెక్టర్లు.
👉 మా అత్తగారు అప్పుడప్పుడు నా పేపర్స్ దిద్దుతూ ఉంటుంది.
👉 ఇప్పటికే నాకు రెండు డిగ్రీలు వచ్చాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి" అంటూ ముగించింది.
*అధికారి ఆమెతో పాటూ గుమ్మం వరకు వచ్చి, కరచాలనం చేసి సాగనంపుతూ ....*
👉 "తల్లికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు మేడమ్. థాంక్స్" అన్నాడు
మాతృదేవోభవ...
🙏🙏🙏
No comments:
Post a Comment