Tuesday, January 14, 2025

 శ్రీ మూక పంచశతి:
శ్రీ మూకశంకర విరచిత 
మూక పంచశతి
శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన
స్తుతి శతకం
🙏🌸🙏🙏🙏🌸🙏
 
శ్లోకము:-
*యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజామ్*
*యస్యాః పీఠీ సతతశిశిరా శీకరైర్మాకరందైః|*
*యస్యాః పేటీ శృతి పరిచలన్ మౌళిరత్నస్య కాంచీ*
*సా మే సోమాభరణ మహిషీ సాధయేత్కాంక్షితాని||77||*
 
భావము:
యోగులయొక్క హృదయకమలము ఎవరకు పుష్పములకు సంభందించిన ఉధ్యానమో! ఎవరియొక్క పీఠము ( సహస్రారము) తేనెకు సంభందించిన తుంపరలతో ఎల్లప్పుడూ చల్లనైనదో! వేదములపై చరించు శిరోరత్నమైన ఎవరకు కంచి పేటికయగునో! చంద్రుడాభరణముగాగల పట్టమహిషియగు కామాక్షి నాయొక్క కోరికలను సాధించుగాక!
 
శ్లోకము:-
*ఏకా మాతా సకలజగతాం ఈయుషీ ధ్యానముద్రామ్*
*ఏకామ్రాధీశ్వరచరణయోః ఏకతానాం సమింధే|*
*తాటంకోద్యన్మణిగణరుచా తామ్రకర్ణప్రదేశా*
*తారుణ్యశ్రీ స్తబకితరుచా తాపసీ కాపి బాలా||78||*
 
భావము:
చెవుల ఆభరణముల అతిశయించిన సముదాయము యొక్క కాంతితో ఎర్రబడిన చెవుల ప్రాంతము కలిగినట్టియు యౌవనశోభతో పుంజీభూతమైన కాంతిగలిగిన తపస్వినియైన ఒకానొక నవయువతి (కామాక్షి) సమస్త జగత్తులకు ఒకే ఒక తల్లియై ధ్యానముద్రను పొందినదై ఏకామ్రనాధుని పాదములందు ఏకాగ్రత కలదిగా ప్రకాశించుచున్నది;
 
🔱 ఆ తల్లి 
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 
🙏🌸🌸🌸🌸🌸🙏.            

No comments:

Post a Comment