💥వంద మంది గురువులకు శిష్యుడిగా ఉండు.,
💥ఒక్క శిష్యుడికి కూడా గురువుగా ఉండొద్దు.
💥పునర్జన్మ అంటే ...
పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం.
💥శకునాలు అనేవి ట్రాఫిక్ సిగ్నల్ లాంటివి. అవి మనకు మంచే చేస్తాయి.
💥 పిల్లి ఎదురు పడితే అశుభం అనుకుంటాము.
💥 'కాసేపు ఆగి వెళ్ళు నీకు శుభం కలుగుతుంది' అని అది నీకు చెప్పడం.
💥అందరిలో ఉండి, అందరి గా నటించే మహానటుడు శివుడు.
అందుకే ఆయనకు 'నట'రాజు అని పేరు వచ్చింది.
💥బయటి నుండి ఇంట్లోకి వెళ్ళేందుకు కాలింగ్ బెల్ అవసరం.,
అలాగే బహిర్ముఖం నుండి అంతర్ముఖానికి వెళ్లేందుకు ధ్యానం అవసరం.
💥 ఎప్పటికప్పుడు తెలివిగా నిర్ణయాలు వాయిదా వేయడము
- తమోగుణ లక్షణం
💥 సరైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం
- రజోగుణ లక్షణం
💥 శాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం
- సత్వగుణ లక్షణం
ఇక చివరగా,
💥 ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న
వాటి పర్యవసానాలు గురించి ఏమాత్రం చింతించని వారు
- నిర్గుణులు.
No comments:
Post a Comment