Thursday, June 19, 2025

 అన్ని తానై జగత్ మొత్తం తానుగా సర్వం ఖలిత్వం బ్రహ్మ అంటూనే... నిన్ను నీవు తెలుసుకో అని బుజ్జగించి, తత్వమశి అంటూ లాలి పాడి, ప్రారబ్దం  అనే ఇనుప సమ్మెటలతో మోది, నేను సత్యం జగత్ మిధ్య అని లేపనంతో మానని గాయాలకు లేపనం రాసి..
 
ఏదో వెతుకుతున్న నాకు.. నేను ఎవరు, నేను ఎందుకు.. అనే సందిగ్ధంలో ఉన్న నాకు కర్మయోగివి కమ్మంటూ, అన్నమయ్య బాటలో నడుస్తూ.. నన్నే స్మరించమంటూ.. 

ఇదే నిన్ను నీకు పరిచయం చేసే జీవనగీత అని నన్ను ..... నేనుగా.... ఆవిష్కరింప చేసుకుని, తామరాకు పై నీటిబొట్టులా నిలిచిపొమ్మని చెప్పి..

నీ ఆత్మీయ ఆలింగనంలో  నన్ను పొదివి పట్టుకున్న నీకు నేను ఏమివ్వగలను?

అన్ని వదలి... నేను.... గా మిగిలిన నీకు నేను ఏమివ్వగలను? 

ఈ తుచ్ఛమైన ప్రాణం ఇవ్వాలన్నా... ఇది కూడా నీ భిక్షే కదా..ఈ పాత్రలో ఒదిగి ఉన్న నీకు ఏమివ్వగలను?

🦢🪷

No comments:

Post a Comment