Thursday, June 19, 2025

 


పువ్వులో మకరందం ఉంటే
భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది.
మనలో ఆర్తి ఉంటే
ఆత్మ దానికదే వచ్చి ఆవహిస్తుంది!

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

మీకు నిజమైన మేలు చేసేవాడు
మీ అంతరంలోనే ఉన్నాడు.
అతన్ని పట్టుకోవాలంటే
మీరు ప్రయాణించాల్సింది
బాహ్యం వైపు కాదు...అంతరంలోకి!

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

ప్రపంచాన్ని యధావిధిగా చూడు
ఇలా ఉండకూడదనో, అలా ఉండాలనో
నిర్ణయించవద్దు.
దైవ సృష్టిని నీవు పనిగట్టుకుని
సంస్కరించవలసిన పనిలేదు!
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

రమణుడు దేహానికి పరిమితమై
ఎప్పుడూ ఉండలేదు.
మనం రమణుణ్ణి దేహాన్ని మించి
ఎప్పుడూ చూడలేదు!

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

No comments:

Post a Comment