Thursday, June 19, 2025

 " రామ్తా "గురించి పరిచయం 

" రామ్తా "ఒక కొత్త దేవుడు కాదు, కొత్త మతం కాదు. మానవుడు గుర్తించే చరిత్ర కన్నా ముందే, అంటే సుమారు 35 వేల సంవత్సరాల క్రితమే మానవుడిగా జన్మించి, అనేక కష్టనష్టాలకు గురై, ఒక యోధుడుగా, ఒక చక్రవర్తిగా జీవితాన్ని కొనసాగించి, చిట్ట చివరకు ఒక కఠోర సాధన ద్వారా తనని తాను తెలుసుకొని, తనని తాను గెలుచుకొని, తన శరీరాన్ని సైతం తనలో ఇముడుచుకొని, ఈ భూతలం నుంచి నిష్క్రమించిన తొలి విజేత " రామ్తా ".

తగు సమయం ఆసన్న మవ్వగానే, మరణాన్ని జయించడానికి తనకి ఏ జ్ఞానం, ఏ సత్యం తోడ్పడిందో, ఆ జ్ఞానాన్ని ఆ సత్యాన్ని మనందరికీ అందివ్వడానికి ఒక స్త్రీ లోకి ప్రవేశించి, ఆమె ద్వారా తన ప్రబోధనలని కొనసాగిస్తున్నారు. మానవుని ఊహకి కూడా అందని ఎన్నో నిగూఢమైన దివ్య రహస్యాలని 
" రామ్తా "స్పష్టం చేశారు. అందులో భాగంగానే మనకి " DEFINING THE MASTER"అనే అద్భుతమైన దివ్య గ్రంధాన్ని అందించారు
" రామ్తా ". ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని మన గురువైన 
" రామ్తా " భావాలని మన అందరికీ అర్థమయ్యే  రీతిలో వ్యక్తీకరించటం జరిగింది. అదే
 ' మాస్టర్ "
అనే గ్రంథం గా ఇప్పుడు మీకు బోధించబడుతుంది. 

ఈ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, ' మాస్టర్ ' గురించి సరైన అవగాహన పెంచుకొని, మాస్టర్ అంటే ఏమిటో మాస్టర్ కి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటో, మాస్టర్ ఎంత శక్తివంతుడో తెలుసుకొని మరింతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారని ఆకాంక్షిస్తున్నాను. 
శుభం! 

ఈ సందర్భంగా " రామ్తా "ని గురువుగా ఎంచుకున్న అందరికీ ఇవే నా శుభాకాంక్షలు శుభాభినందనలు. 

" It is our common thought is what we really are - that is going to determine our life "

" మన అతిసాధారణ ఆలోచనాసంవిధానమే మన జీవితంలో జరిగే నిజాలను సృష్టించేది ".

మన అసాధారణమైన 
 ' గమ్యాన్ని ' కూడా 
అతి సాధారణమైన 
ఆలోచనాసంవిధానమే ఎన్నుకుంటుంది.

              ' మాస్టర్ '

నా ప్రియాతి ప్రియమైన, నాలోనున్న దైవమా, నేను సజీవంగానే ఉన్నాను, నేను దివ్య స్వృహలోనే ఉన్నాను, నేను పూర్తి ఎరుకలోనే ఉన్నాను, నా అంతరాత్మ అభిరుచులకు తగిన జీవితాన్నే జీవిస్తున్నాను, మళ్లీ ఎప్పుడూ అజ్ఞానంలో, అజ్ఞాత జీవితంలో నన్ను నేను కోల్పోను, ఎంతో సాహసంతో, నా సంకల్ప స్వేచ్ఛను సైతం వేడుక చేసుకుంటున్నాను, 
అనంతమైన జీవితాన్నే నేను అనుభవిస్తున్నాను, నా ప్రతి కదలికలో, ప్రతి చేష్టలో, ప్రతి క్షణంలో ఆ దివ్య ఆశీస్సులు పొందుతూనే ఉన్నాను
' శుభం'
' తధాస్తు'.

ప్రతిరోజు ఈ ప్రార్థనను మీ వీలును బట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేస్తూ పొండి.... దివ్యానుభూతిని తప్పక పొందుతారు. మరియు అన్ని విషయాలలో ఆ దివ్య మార్గదర్శకం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.

No comments:

Post a Comment