*ఒక శిష్యుడు ఎప్పుడూ తన గురువు దగ్గరికి వెళ్లి అడుగుతుండేవాడు.*
*శిష్యుడు: “గురువర్యా! నాకు జ్ఞానం కావాలి. మీరు వెంటనే బోధించండి. నా మనసు ప్రశ్నలతో నిండిపోయింది. వాటికి సమాధానం చెప్పండి.”*
*గురువు చిరునవ్వు చిందించి...*
*"సరే, రేపు ఉదయాన్నే నీకు బోధిస్తాను కానీ రేపు వచ్చేప్పుడు ఒక ఖాళీ బిందె మరియు ఇంకాస్త పెద్ద నిండు నీళ్ళ బిందె తీసుకురా... వెళ్ళిరా"... అన్నాడు*
*రెండవ రోజు శిష్యుడు వచ్చాడు. గురువు ముందుకు ఒక ఖాళీ పాత్రను మరియు నిండు బిందెను పెట్టి "తెచ్చాను గురువుగారు" అన్నాడు...*
*గురువు:*
*“ఈ పాత్రలో నీరు పోస్తాను. నువ్వు జాగ్రత్తగా గమనించు.”*
*గురువు నీటిని పోస్తుండగా పాత్ర నిండిపోయింది. ఆపై గురువు ఇంకా నీరు పోస్తూనే ఉన్నాడు. నీరు పొంగిపొర్లింది.*
*శిష్యుడు:*
*గురువర్యా! ఆపండి. పాత్ర నిండిపోయింది. ఇక దానిలో ఏమీ పోసినా నిలవదు అన్నాడు.*
*గురువు* *శాంతంగా చూశాడు.*
*“ఇదే నీ స్థితి. నీ మనసు ఇప్పటికే నీ సొంత అభిప్రాయాలు, పుస్తకాల జ్ఞానం, అహంకారంతో నీ మనసు నిండిపోయింది. నీ మనసు ఖాళీ కానంతవరకు నా జ్ఞానం నీలో ప్రవహించదు.”*
*శిష్యుడు కళ్ళలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.*
*"గురువర్యా! ఇప్పటివరకు నేను నన్ను నేనే జ్ఞాని అనుకున్నాను. కానీ నిజానికి నా మనసే నిండిన పాత్రలా ఉంది. ఇకపై నేను ఖాళీ పాత్రలా అవుతాను. మీ మాటలు నాలో ప్రవహించేలా చూసుకుంటాను.”*
*గురువు ప్రేమగా అతని భుజంపై చేయి వేసి అన్నాడు:*
*"ఖాళీ కావడం నేర్చుకో. అప్పుడు సత్యం నీలో నిండిపోతుంది. నిజమైన జ్ఞానం అనేది ఇచ్చేది కాదు, స్వీకరించేది.”*
*మనసు అహంకారంతో, అభిప్రాయాలతో నిండిపోయి ఉంటే జ్ఞానం అందదు.*
*ఖాళీ పాత్రలా, వినమ్ర హృదయంతో ఉంటేనే నిజమైన బోధ మనలో ప్రవహిస్తుంది.*
*నేర్చుకోవడానికి మొదటి అర్హత “నాకు తగినంత ఏమీ తెలియదు” అనే వినయం.*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌹🙇♂️🌹 🙏🕉️🙏 🌹🙇♂️🌹
No comments:
Post a Comment